వసుధ కు పురస్కారం

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అబ్బాయ్ పెళ్ళెప్పుడు

Inline image 1
Inline image 2

 
 
Inline image 3
 
 
Inline image 4
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆవు ఆరోగ్య వాయువు -హెబ్బార్ – నిప్పుల కుంపటి పై నేపాల్

Inline image 1
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పురస్కారాల తిరస్కారాలు సబబేనా ? ఆధ్యాత్మ గురువు అవసరమా

Inline image 1
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెగిన సంకెళ్ళు -కేసి ఆర్ కౌరవం తో ధర్మ యుద్ధం గెలిచిన జ్యోతి కృష్ణుడు

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాలమంతా కుక్కలాడే బ్రదర్ -కవిత నేనైతే వెనక్కివ్వను -కమల్

Inline image 1   Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 2-భాషా శాస్త్ర వేత్త, న్యాయ విద్యా ప్రవీణ,వేదా౦తా చార్య శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రి

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4

2-భాషా శాస్త్ర వేత్త, న్యాయ విద్యా ప్రవీణ,వేదా౦తా చార్య  శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రి

శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి 15-8-1955న కృష్ణా జిల్లా పెదపారు పూడి మండలం ఎలమర్రు గ్రామం లో జన్మించారు .తండ్రి శ్రీ గబ్బిట మేధా దక్షిణా మూర్తి శాస్త్రి గారు ,తల్లి శ్రీమతి భ్రమరా౦బ గారు .కొవ్వూరు ఆంద్ర గీర్వాణ విద్యా పీఠంలో చదివి ఆంద్ర విశ్వ విద్యాలయం లో చేరి 1980లో ఏం ఏ చదివి పాసైనారు . 1979లో శ్రీమతి పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు .వీరికి నలుగురు కుమారులు –శ్రీ గోవర్ధన సుందర దాస్ ,సీతా రామ శర్మ ,జయ మాణిక్య శాస్త్రి ,శ్రీ యజ్ఞేశ్వర దక్షిణా మూర్తి శాస్త్రి .82లో గుంటూరు విద్వత్ పరిషత్ ,గౌరవ డాక్టరేట్ నిచ్చి గౌరవించింది తిరుపతి .కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం 1985లో గౌరవ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పురస్కారమిచ్చి సన్మానించింది .   .

గుంటూరు లో డాక్టర్ శ్రీ కొలచల వెంకట కృష్ణ శాస్త్రి గారి సంస్కృత కళాశాలలో 1977నుండి 83వరకు లెక్చరర్ గా పని చేసి  1983-88 కలం లో  తిరుపతిలోని న్యాయ సంస్కృత విద్యా పీఠంలో సేవలందించి ,తర్వాత బెనారస్ లోని  న్యాయ వైదిక దర్శన సంస్కృత కళాశాలలో రీడర్ గా ఉన్నారు .1988నుండి బెనారస్ హిందూ సంస్కృత విశ్వ విద్యాలయం లో సంస్కృత శాఖాధ్యక్షులుగా పని చేశారు .

శాస్త్రి గారి గీర్వాణ రచనలు -1982లో మాణిక్య ప్రభ రాశారు .1995మాదూర్ గడాధరో మత భేద విమర్శ ,రచించారు .1987 లో’’ పంచలక్షణ శత కోటి’’కి సంపాదకత్వం వహించారు .రామ రుద్రీయ వ్యుత్పత్తి వాద౦ మొదలైన వాటిపై  ధారా వాహికం గా 1978నుండి 1981వరకు నాలుగేళ్ళు రేడియో ప్రసంగాలు చేశారు .

ఆంజనేయ శాస్త్రిగారు 1984-88వరకు తిరుమల తిరుపతి దేవస్థాన ఉపన్యాసకులుగా ఉన్నారు .వారణాసి కే కే డిలో ,హైదరాబాద్ లోని డివైన్ లైఫ్ సొసైటీలో సభ్యులు వక్తలు గా ఉన్నారు .సంప్రదాయ న్యాయ మీమాంస శాస్త్రాలను బోధించటమే శాస్త్రిగారి ముఖ్య అభిరుచి .

1670కాలపు వాడైన నాగేశ భట్టు భట్తోజీ దీక్షితుల భారతీయ పంచాంగం  ప్రకారం  కాల ,తిది నిర్ణయం పై సంస్కృత రచన చేశారు .మాణిక్య ప్రభు తర్కామృతం పై సంస్కృతం లో శాస్త్రిగారు ‘’సంస్కృత వ్యాఖ్యా విభూషితం తధా మణిప్రభ హిందీ వ్యాఖ్య సంవలితం ‘’రాశారు దీనిని వారణాసి శారదా సంస్కృత సంస్థానం 2012లో ప్రచురించింది .ఇది న్యాయ తత్వ శాస్త్రం పై మహా వ్యాఖ్యానం .జ్యోతిశ్శాస్త్రం పై కాళిదాసు ని ‘’కాలామృతం ‘’కు చింతలపాటి వెంకట యజ్వ తో కలిసి వ్యాఖ్యానం రాశారు .దీన్ని తిరుపతి వేద విశ్వ విద్యాలయం ముద్రించింది .16౦౦ కాలం వాడైన మధురానాద తర్క వాగీశుని ‘’మాధురి ‘’17,18శతాబ్దాలకు చెందిన గదాధర భట్టాచార్య రాసిన ‘’గదాదరి ‘’,13వ శతాబ్దికి చెందిన గణేశుని ‘’తత్వ చింతామణి ‘’వ్యాఖ్యానాలను తులనాత్మకంగా పరిశోధించి శాస్త్రిగారు ‘’మాధురి గదాధర్యో మత భేద విమర్శ ‘’అనే ఉద్గ్రంధాన్ని రాశారు .దీన్ని తిరుపతి పద్మావతీ ప్రకాశన సంస్థ  ప్రచురించింది .రామరుద్రి రాసిన నవ న్యాయ సిద్ధాంతం పై రామ రుద్ర భట్టు రాసిన వ్యాఖ్యానం పై ‘’వ్యుత్పత్తి వాదః –రామ రుద్రీయ వ్యాఖ్యన సహితః ‘’రాశారు. దీనిని న్యు ధిల్లీ సంస్కృత సంస్థానం ముద్రించింది .ఆదిత్యాచార్య వైదిక కర్మకా౦డలపై రాసిన ‘’షడా సితి ‘’పై నంద పండిత వ్యాఖ్యాన పరామర్శ రాశారు .దీన్ని వారణాసి లోని ఇండలాజికల్ రిసెర్చ్ సంస్థ ముద్రించింది .

‘’న్యాయ విద్యా ప్రవీణ ‘’ మరియు వేదా౦తాచార్య ‘’బిరుదులు  శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి న్యాయ, మీమాంసా శాస్త్ర పాండిత్యానికి  ,వేదాంత ప్రతిభకు సార్ధకతను చేకూర్చాయి .

మరో ప్రముఖునితో కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-15-ఉయ్యూరు

 

 

‘

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –4 1-శ్రీ పన్నాల రాధా కృష్ణ శర్మ

నాలుగవ గీర్వాణం

 

సాహితీ బంధువులకు నమస్సులు –‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’శీర్షికతో మొదటిభాగం లో 146,రెండవ భాగం లో 254,మూడవ భాగం లో 118మంది అంటే మొత్తం 518 మంది సంస్కృత కవుల గురించి అంతర్జాలం లో రాసిన సంగతి మీకు తెలుసు .ఇంకారాయవలసిన కవులు  చాలామందే ఉన్నారు .శ్రీ తూములూరి శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి సౌజన్యం తో నాలుగైదు రోజులక్రితం శ్రీ మేళ్ళ చెరువు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు(తెనాలి ),శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ గారు పరిచయమై వారికి మన పుస్తకాలు పంపగా తమ గురించి తమ రచనల గురించే కాక ఇంకా లబ్ధ ప్రతిష్టి తు లైన కవుల గురించి వారి రచనల గురించి వివరాలు తెలియ బరుస్తామని చెప్పారు .శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ గారూ శ్రీ దక్షిణామూర్తి శాస్త్రిగారు,శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారి ద్వారా పరిచయమై అక్టోబర్ 19న హైదరాబాద్ లో నేను వారిని సందర్శించి ఇంటర్వ్యు చేసి రికార్డ్ చేశాను .వీరిని గురించి రాయాలి .నిన్న మా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు అమెరికా నుండి ఆచార్య శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి(ఎలమర్రు )గురించి విలువైన సమాచారం నెట్ ద్వారా పంపారు .కనుక’’ నాలుగవ గీర్వాణం’’   ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాను .ఎవరి గురించి వివరం లభిస్తే వారి గురించి ఇందులో రాస్తాను .దీనికి మళ్ళీ ఒకటో నంబరు తో మొదలు పెడతాను .చదివి స్పంది౦చ వలసినదిగా మనవి .-మీ దుర్గాప్రసాద్

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –4

1— శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మ

శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ గారు 1932మర్చి 22న కృష్ణాజిల్లా నూజివీడు దగ్గర నరసాపురం లో జన్మించారు .నూజి వీడు జమీందారు గారు వీరి తండ్రిగారిని ఆహ్వానించి  తీసుకెళ్ళారు .ఎలిమెంటరీ స్కూల్ చదువు లేదు .లెక్కలు వచ్చేవికావు .మేస్టార్లు కొడతారని బడికి వెళ్లేవారుకాదు. తలిదండ్రులు శ్రీ కానాది భట్ల సూర్యనారాయణ, కోటమ్మగార్లు ,చిలకలూరి పేట పన్నాల వెంకట సుబ్బయ్య గారికి దత్తత వెళ్ళారు .అక్కడా చదువు సాగలేదు పెంపుడు తండ్రి స్వేచ్చ నిచ్చేవాడుకాడు ..బంధువుల ఇళ్ళల్లోఏదో పని చేస్తూ ఉండేవారు   చదువు లేదు చట్టుబండలు లేదని ఆక్షేపించారు .పట్టుదల వచ్చింది .కృష్ణా జిల్లా గొడవర్రులో 1945సంస్కృత పాఠ శాలలో చేరారు .దీన్ని త్రిలింగ విద్యా పీఠం ఆధ్వర్యం లో .చుండూరి వెంకట రెడ్డి నిర్వహించేవారు .సుమారు రెండేళ్ళు కావ్యాలు చదివారు .గురువు శ్రీవెల్లంకి సత్యనారాయణగారు   .ఇక్కడి నుండి గురువుగారి బావగారు పైడిమర్రి చంద్రమౌళి శాస్త్రిగారి దగ్గర నేలకొండపల్లి లో చేరి వ్యాకరణం మొదలైనవి చదివారు .గొప్ప పునాది ఏర్పడింది ఇక్కడే అని గర్వంగా చెప్పారు ..సంస్కృతం మీద అభిమానం బాగా కలిగింది .శ్రీమతి కాత్యాయని ని వివాహమాదారు కుమారుడు, కుమార్తె కలిగారు .

గుంటూరు జిల్లా పరిషద్ హైస్కూల్స్ లో తలుగు పండితులుగా పని చేస్తూ 1969లో తెలుగు ఏం ఏ ,72లో సంస్కృతం ఏం ఏ సాధించారు . రామాయణం ,రామాయణం ఆధారంగా వచ్చిన వివిధ ప్రక్రియలలో  ‘’శ్రీరామ శీలాను శీలనం’’ విషయమ౦  గా గ్రహించి పరిశోధన చేసి 1977లో పిహెచ్ డి పొందారు .బరోడాకు చెందినఒక పరీక్షకుడు ‘’రాముడు దేవుడైతేఏం  కాకపొతే ఏం’’అని వ్యాఖ్యానించి నందుకు  మనసు నొచ్చుకొని శ్రీ రాముడినే శంకి౦చి నందుకు బాధ పడి డాక్టరేట్ పొందినా ఎక్కడా ‘’డాక్టర్ ‘’అని రాసుకోలేదని చెప్పిన  మహోన్నత వ్యక్తిత్వం పన్నాల వారిది  .  .ఆంధ్రా యూని వర్సిటీ లో లెక్చరర్ పోస్ట్ కు ప్రయత్నించారు .అది తీవ్ర పోటీగా మారి వీరికి అందలేదు .అప్పటికే ఎన్నో గ్రంధాలు సంస్కృత ఆంధ్రభాషలలో రాసి ఉన్నందున వీరి పేరు విశేష వ్యాప్తి చెంది .ధర్మపురి సంస్కృత కళాశాలలో ఇంటర్వ్యు లేకుండానే వీరి ప్రతిభ గుర్తించి ప్రిన్సిపాల్ పదవినిచ్చారు .అంతకు ముందు నాలుగు నెలలు గూడూరు దగ్గర విద్యానగరం కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు .

జిల్లెళ్ళమూడి సంస్కృత  కాలేజి లో’’ అమ్మ’’ ఆహ్వానం తో చేరి  1971 నుండి 1987 వరకు  ప్రిన్సిపాల్ గా పని చేసి,అమ్మ చరణార విందమధు మత్త  భ్రుంగమై,ఆమెపై స్తుతి ,స్తోత్రాలుఎన్నో  రాస్తూ ,ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ ,కళాశాలకు సేవలందించారు . 1978లో స్వచ్చందంగా పదవీ విరమణ చేశారు .మధ్యలో డెప్యుటేషన్ పై1981నుండి 86వరకు   తిరుపతి దేవస్థానం తరఫున వ్యాసభాగవతం శుద్ధ ప్రతి(క్రిటికల్ ఎడిషన్ )  ప్రచురించే ప్రాజెక్ట్ లో వీరిని పరిష్కర్తగా తీసుకొన్నారు. ఎన్నాళ్ళైనా అది నత్త నడక నడుస్తుంటే విసుగెత్తి మానేసి హైదరాబాద్ లో స్థిరపడ్డారు .వీరికి ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు కుమారుడు బి టెక్ పాసై అమెరికాలో ఉద్యోగిగా ఉంటున్నాడు .కుమార్తె బెంగుళూరులో ఉంటున్నది

పోతుకూచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రిగారమ్మాయి శ్రీమతి ఝాన్సీ   పన్నాల వారి ‘’పావక ప్రభ’’ కు ప్రతిపదార్ద తాత్పర్యాలను రాశారు . పావక ప్రభ ను శ్రీ ఏం దినకర్ ఇంగ్లీష్ లోకి ‘’The Sojourn “’గా అనువదించారు  ..డాక్టర్ శ్రీమతి సుగుణ పన్నాలవారు ‘’జిల్లెల్ల మూడి అమ్మ ‘’గారిపై వ్రాసిన  గ్రంధాలపై రిసెర్చ్ చేసి పి హెచ్ డి పొందారు                                         .పన్నాల వారు ‘’యోగ వాసిష్ట సారం, . రామదాసు చరిత్ర ,శృంగార లహరి ,అంబికా సహస్ర నామ స్తోత్రం ,అంబికా సుప్రభాతం ,అంబికా స్తవ కదంబం ,అంబికా కరావలంబ స్తోత్రం ‘’మొదలైన రచనలు చేశారు .అమ్మ ఆశ్రమానికి దాదాపు ఇరవై దాకా పుస్తకాలు రాసి అందజేశానని ,తన వద్ద ఒక్క కాపీ కూడా లేదని తాను ప్రచారం కోరుకోలేదని ఆ’’ జ్ఞాన పండు’’అతి వినయంగా నాతొ అన్నారు . దీనికి నిదర్శనం వారి రచనల్లో వారి పేరు తప్ప ఏ విధమైన వివరాలు, విశేషాలు ఉండక పోవటమే .తనది ఒక భాషా సేవగా, అమ్మ పద సేవగా వారు భావించి జీవించారు .సంతృప్తి వారి జీవితం లో స్పష్టంగా కనిపిస్తుంది .భేషజాలు లేని వ్యక్తిత్వం, డబ్బ పండు లాంటి ఛాయా మనల్ని ఆకర్షిస్తాయి .,రమణ మహర్షి రాసిన ‘’ఉమా సహస్రం ‘’ కావ్యాన్ని  అనువాదం చేశానని చెప్పారు  .యోగ వాసిష్ట సారం ఇటీవలే రాశారు  83 ఏళ్ళ జ్ఞాన వయో వృద్దు శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మగారిని వారింట్లో అక్టోబర్ 19 సాయంత్రం  సందర్శించి మాట్లాడి ధన్యుడనయ్యాను .

ఇప్పుడు వారి గీర్వాణ వాణీ విలాసాన్ని చూద్దాం –ముందుగా ‘’శృంగార లహరి’’లో స్నానిద్దాం .పన్నాలవారికి సర్వం జిల్లెల్ల మూడి అమ్మ గా దర్శనమిస్తుంది .ఆమెయే ఆయన శృంగార లహరి  .

మొదటి శ్లోకం ‘’యయా శక్త్యా బ్రహ్మా కమల నయనః ఫాలనయనః –జగత్ స్రస్టు౦ పాతుం ప్రళయ ముపనేతు  చ కుశలాః

యాయా వ్యాప్తం విశ్వం వసతి ఖలు యస్యాం జగదిదం –నమామాద్యాం దేవీం ముకుళిత కర స్తా మభ య దా౦ ‘’ మరొకటి –

‘’నమే సంధ్యో పాస్తి .ర్నచ విహిత కర్మ స్వభిరతి –స్త్వదీయా౦ఘ్రి ద్వంద్వం విధి వదసి నాభ్యర్చిత మహో

కిమాలోక్య వ్యర్దే మయి సదయ భావా సి జనని – తవైత ద్వాత్సల్యం వదతి భవతీం విశ్వ జననీం ‘’

సంస్కృత కవితాప్రవాహం శంకరాచార్యుల సౌందర్య లహరిని తలపింప జేస్తుంది .జిల్లెళ్ళమూడిని ‘’అర్క పురి

‘’అన్నారు.అమ్మ దివ్య చరిత్రయే ఈ లహరి .ఆమె హంసత్వాని వర్ణిస్తూ చెప్పిన శ్లోకం పరమ గభీరంగా ఉంది .

‘’భజంతే హంసా స్తంవిధి మపి నిషేవ్యోదక పయో –విభాగ ప్రాశస్త్యం తవ తు చరణౌ సేవిత వతాం

క్రుతార్దానాం నీరం భవతి విమల క్షీర మహ-ప్రభవం క స్తోతుం ప్రభవతి  శుభే తావక మిహ ‘’

చివరగా ఒక శ్లోకం

‘’క్వణన్మంజీరం  భో జనని విచారంత్యాం త్వయి భ్రుశం –నటంత స్సానందం సరభస ము౦ దృశ్యా  దివి షదో

ముదాభ్య్గ్డ ద్గచ్చంతో విదరతి నుతిం తే శివ కరీం –క్రుతార్దా కృత్వా యాం దదతి పరమానంద లహరీం ‘’

‘’అమ్మ ‘’శ్రీ లలితా పరా భట్టారికను దర్శించి పులకించి అనుభూతి తనుపొంది మనకు ఆ ఐశ్వర్యాన్ని కలిగించారు పన్నాల మహాశయులు .

వీరి రెండవ కావ్యం ‘’పావక ప్రభ ‘’ఇదీ అమ్మ మీద రాసినదే .దీనికి డా ధూళిపాల అర్క సోమయాజులుగారు ముందుమాట ఆంగ్లం లో రాశారు .జగన్మాతను స్తుతించే అద్భుత స్తోత్రం అన్నారు .ఇందులో ‘’భ్రూ మధ్యే నవ కు౦కు మం ‘శ్లోకం పరమ రామణీయకం అన్నారు .ఇందులో సాక్షాత్తు శ్రీ రాజ రాజేసశ్వరి అమ్మవారిని జిల్లెళ్ల మూడి అమ్మవారిలో తాదాత్మ్యంగా చూసిన ‘’లో చూపు’’ ఉందన్నారు .అలాగే ‘’యతో విద్యా అవిద్యా ..శ్లోకం ,66వ శ్లోకం 71 వ శ్లోకం కవిగారి భావుకతకు ,భక్తీ తాత్పర్యాలకు పరాకాష్ట అన్నారు .

రెండవ శ్లోకం చూద్దాం

‘’ఏకాకితా ముపగతే జన మండలీనాం –మధ్యే చరన్నివ వినిర్మల శాంతి సౌదే

కల్లోలితః పరమ పుణ్య పదే చ పాపం –చిన్వన్ సచిత్ర మనుజో విలపత్సజశ్రం ‘’

చివరగా

‘’అనవరత ముపాసే తాం సముద్రాంబు పూరా-కరుణ కిరణ లక్మఖేలయా పీయ భూయే

నవ జలధరం లాలీలయా భూత దాత్రీ –రచయితి నవ సస్య స్యమాలాంయా సావిత్రీ ‘’అని ముగించారు అణువణువునా ప్రత్యక్షరం లో అమ్మ ప్రేమామృతమే కనిపిస్తుంది. ఆమెది పావక ప్రభ అంటే అగ్ని కాంతి అనగా పవిత్రం ,పుణ్య లోక ప్రాప్తికరం .తాదాత్మ్య భావన తో శర్మగారు రాసి చిరకీర్తి నార్జించారు .వారు రాసిన స్తోత్రాలు సుప్రభాతాలు అన్నీ నిత్యం జిల్లేళ్ళ మూడి అమ్మ గుడిలో గానం చేస్తారు .అంతకంటే వారికి ఇంకేం కావాలి .ఆ మాటే వారు స్వయం గా చెప్పారు నాతొ .

అలాగే అమ్మ సుప్రభాతం ,అంబికా ప్రపత్తి ,శ్రీ చక్రేశ్వరీ స్తవం  ,అంబికా నవ మాలికా స్తవం రాశారు .దీనితోబాటు రాసిన ‘’అంబికా కరావ లంబ స్తోత్రం ‘’కూడా ప్రసిద్ధి చెందింది .అందులో నుంచి మచ్చుకు కొన్ని. ఇది అర్ధ తాత్పర్యాలతో ఉండటం విశేషం .మొదటి శ్లోకం

‘’ఏకైక మిత్రమితిమాం కలుషా స్సమస్తాః-కర్షంత్య ధీరమతి దుర్బల చిత్త మేనం

నైరాశ్య భార నిహతస్య శివేనసూయే –మాతర్భవామి మామ దేహి కరావలంబం ‘’

భావం –అనసూయా మాతా శ్రేయస్కరీ !దైన్యం తో దుర్బల మనసుతో ధైర్యం చెడి ఉన్న నన్ను మిత్రునిగా భావించి పాపాలన్నీ వశ పరచుకొంటున్నాయి .నిరాశ తో కుంగిపోయా .నాకు చేయూతనిచ్చి ఆదుకో .మరో శ్లోకం

‘’త్వత్సన్నిదౌ ప్రశమితైరపి తే పరోక్షే-క్రోదోద్యతై ర్భయద సంశయ సర్ప రాజైః

దస్టోప్యనన్య శరణ్యస్యశివే నసూయే –మాతర్భవాని ౧మమ దేహి కారావ లంబం ‘’

భా –నీపాదాల దగ్గరున్నప్పుడు నా అనుమానాలన్నీ తీరి నట్లే ఉంటాయి .వదిలి పెట్ట గానే పాముల్లాగా బుసలు కొడుతూ నన్ను కాటు వేస్తాయి .అలాంటి స్థితిలో నువ్వు తప్ప నాకు వేరే శరణు లేరు. కాపాడు తల్లీ

‘’బంధూక పుష్ప రుచి కుంకుమ శోభి తాస్యే –సిందూర రాగ రమణీయ కపోల దేశే

నాసావరీణ కనక ప్రసవే నసూయే –మాతర్భవాని ౧మమ దేహి కారావ లంబం .’’

తా-మంకెన పువ్వురంగు కుంకుమ బొట్టుతో నీముఖం శోభిస్తోంది చెక్కిళ్ళు సిందూరం రంగుతో అందంగా ,నాసిక సంపెంగ పువ్వును పరిహసిస్తున్నట్లున్నాయి .దివ్య తేజో విరాజమానమైన ఓ పరమేశ్వరీ నాకు చేయూత నివ్వు .

ఈ విధంగా శకరాచార్యులవారి కరావ లంబ స్తోత్రానికి దీటుగా దీన్ని పన్నాల వారు ,ఆపన్న శరణ్య ‘’అమ్మ ‘’ చేసాయం కోరారు .చివరి శ్లోకం లో

‘’అంబా పదాబ్జ మధుపాన రతేన రాదా –క్రిష్ణాఖ్య మత్త మధుపేన కృతం మనోజ్ఞం

స్తోత్రం భవేదిద మనుత్తమ సౌఖ్య దాయి –తేషాం సదా సుకృతి నామిహ ఏ పఠంతి’’

భా-అంబిక చరణ కమలాల సేవ అనే మధువును తృప్తిగా గ్రోలి మత్తెక్కిన తుమ్మెద వంటి వాడు ,రాదా కృష్ణుడు(పన్నాల రాదా కృష్ణ శర్మ )అతనిచేత మనోహరమైన ఈ స్తోత్రం రచింప బడింది దీన్ని చదివిన పుణ్యాత్ములు సర్వోత్తమ సుఖాలను పొందుదురు గాక .

మనోజ్ఞం ,అనుత్తమం  .అనే పదాలను స్తోత్రానికి విశేషణాలుగా పన్నాల వారు వాడారు .ఇంతకంటే సుఖం లేనిది ,సర్వోత్తమమైన సుఖాన్ని ఇచ్చేది అని భావం .ఆ సుఖం మామూలు సుఖం కాదు. మనోజ్నమైనది .అంటే మనసుతో మాత్రమే తెలియ బడేది .అనగా సచ్చిదానంద మైన సుఖం .నిర్మలమైన మనస్సు అంటే ఆత్మ.ఆత్మ యొక్క సుఖం ఆత్మకే తెలుస్తుంది .ఇతరులకు తెలియదు .కనుక ఈ స్తోత్రాన్ని సవిమర్శనంగా పఠించే వారికి రాగ ద్వేష రహితమైన శుద్ధమైన ఆత్మగా మనస్సు ఉంటుందని ఫలశ్రుతి చెప్పారు ,వివరణ కూడా వారే ఇచ్చారు ..అందరం చదివి శుద్దాత్ములవ్వాలని పన్నాలవారి అభీష్టం .

చివరగా’’ శ్రీ అంబికా నవ రత్న మాలిక ‘’లోని చివరి శ్లోకం తో సెలవు తీసుకొందాం –

‘’అంబా దివ్య పదార వింద భజనా –నందామృతా స్వాదినా-రాదా కృష్ణ మధు వ్రతేన కలితం బృందం స్తుతీనామిదం

ఆమోదం జనయత్సమస్త సుమన-స్సంఘస్య పృధ్వీ తలే –జీయాదా రవి చంద్ర తార మమలం –మాత్రా శిషాపోషితం ‘’

పన్నాల వారి ఫోటో జత చేశాను చూడండి

మరో కవితో కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-15-ఉయ్యూరు

‘

 

 

‘’

Posted in రచనలు | Tagged | Leave a comment

కళ్యాన్ బీహారు కు సంకేతాలు – ప్రభ – ఈ వ్యతిరేకత పరమార్ధం ఏమిటి ?వెంకయ్య

Inline image 1
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”భావ సంబంధం సున్నితమైనది ”

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గురువు వెలుగు శుద్ధ స్పటికం ,చిత్రమైన ముంగిస -పరమాచార్య – శిఖ ఎందుకు

Inline image 1
Inline image 2  Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘అయితే ఒకే ”తో” కొండంత” హాస్యాన్ని పండించిన ” లక్ష్మణరావు” అవతలి తీరాలకు ”వలస ”పోయాడు

Inline image 1
Inline image 2
 
Inline image 3
 
 
Inline image 4
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -86

37-ఫ్రెంచ్ సంగీతానికే కాక ప్రపంచ సంగీతానికీ కొత్త ఇంప్రెషనిస్ట్ వెలుగులు అద్దిన –క్లాడ్ ఏషిలీ డెబూసీ-3(చివరి భాగం )

నలభై లలో సంగీత విమర్శకుడిగా ఎన్నో పత్రికలకు డేబూసీ రాసేవాడు  .ఇవన్నీ ఆయన చనిపోయిన తర్వాత ‘’మాన్శార్ క్రోచ్ –యాంటి డిలేటేంటీ’’పేరుతొ ప్రచురితమైనాయి .’’ఐబీరియా ‘’ను చూసి విన్న తర్వాత ఆయన ప్రతిభ తెలుసుకొని విమర్శనాస్త్రాలు సంధించటం మానేశారు .స్పానిష్ సంగీతాన్ని స్పెయిన్ వారికంటే డెబూసీయే చాలా గొప్పగా రాశాడని మెచ్చారు .నలభై రెండేళ్లకే బాగా అలసిపోయాడు .శారీరక మానసిక౦గా  క్లేశం పొందాడు. ఈ వయసులోనే ‘’ప్రిల్యూడ్స్’’తో బాటు 12అసాధారణ ‘’ఎట్యూడ్స్ ‘’ రాశాడు. ఇవి శాశ్వత కీర్తిని తెచ్చాయి .మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయిన తర్వాత ఇక సంగీతం చేయటం మహా కష్టం అనిపించింది .కాని మిలిటరీ జర్మనీ దాస్టీకాన్ని,సంస్కృతీ వ్యతిరేకతను  నిరసిస్తూ కొద్దిగా రచనలు చేశాడు .ఆయన సంతకాన్ని ‘’క్లాడీ డేబూసీ ,మ్యుజీషి యన్ ఫ్రాన్కైస్ ‘’అని చేసేవాడు .1916తర్వాత రాయటం మానేశాడు .చాలాకాలం బాధను ఒంటరిగా సహించాడు .కాని’’నడుస్తున్న శవం ‘’గా అయిపోయినప్పుడు మాత్రం ఆయనకు కేన్సర్ సోకిందని తెలిసింది .జర్మన్ సైన్యం పారిస్ మీద బాంబుల వర్షం కురిపించినప్పుడు దాక్కో టానికిసురక్షిత ప్రాంతానికి  వెళ్ళే ఓపిక కూడా ఆయనకు లేదు .చివరికి తప్పని పరిస్తితులలో అత్యవసరంగా ’’మలాశయం(రెక్టం)కు  ఆపరేషన్ చేయి౦చు కొన్నాడు .కాని కోలుకోలేకా పోయాడు .25-3-1918న విపరీతమైన విమాన దాడులు బాంబుల వర్షం సమయం లో సంగీత జ్ఞాని  క్లాడే అషిలీ డెబూసీ 52 ఏళ్ళకే మరణించాడు .

డెబూసీ సంగీతం నిరసన ,మిరుమిట్లు గొలిపే ఆశ్చర్యంతో కలిసి ఉంటుంది .సంగీత మార్గ దర్శి అనిపిస్తాడు .శబ్దం  లో స్వచ్చతను ఆయన సాధించాడు .మాధుర్యం చాలా సున్నితంగా,పారదర్శకంగా  ఉంటుంది .వెండి జలతారు మిరుమిట్లు గోచరిస్తాయి .ఎక్కడా ఆగటం ఉండదు. నిరంతర సంగీత స్రవంతి గా ఉంటుంది .’’దిఆర్గాన్ ట్యూనర్ స్కేల్ ‘’ను ఉపయోగించటం అతని ప్రత్యేకత .అందులో ఆరు నాదాలు దర్శనమిస్తాయి .ఎక్కడా క్రమం తప్పదు .సాంకేతికత లో ఎన్నో అద్భుతాలు కనిపెట్టాడు .అవి సంగీత చరిత్రలో మైలు రాళ్ళు గా నిలిచి పోయాయి .ఆయన చూపిన ‘’సమాంతర శ్రేణులు ‘’అంతంత మాత్రం గా వినేవారిని తట్టి లేపి స్పూర్తి కలిగిస్తాయి .జెట్ స్ప్రింగ్ లాగా నాట్యమాడి ఉర్రూత లూగిస్తాయి .ఆస్కార్ థామ్సన్  ‘’the determining factor in the  musicof atleast the first third of the twentieth century because of the doors he opened and the restraints he cast aside ‘’ అన్నమాటలు అక్షర సత్యాలే .

డెబూసీ తో సంగీత హోరు ఆగిపోయింది .జిగి బిగి మిశ్రమ వాద్యాల రణగొణ ధ్వనులకు మంగళం పాడాడు .శృంగార అ౦గారాన్ని ఆర్పేశాడు .అనుభూతి వాదానికి (ఇమ్ప్రేషలిజం) తేర తీశాడు .మానసికానందాన్ని సమకూర్చాడు .అది తర్వాత వారికి మార్గ దర్శనం చేసింది .సంగీతం లో ఇమ్ప్రేషనిస్ట్ అవతారం ఎత్తినవాడు డెబూసీ .ఇతని ప్రభావం రావెల్ డ్యూకాస్ , రస్సెల్ పై అధికం .ఫ్రాన్స్ లో ఒక కొత్త ఉద్యమ యుగం ఆరంభమై విశ్వ వ్యాప్తమైంది .దీనికి పారిస్ ప్రధాన కేంద్రమై నిలిచింది .కాని ఇమ్ప్రేషనిజం అనే పదాన్ని గుణాన్ని తన సంగీతానికి పెట్టటం ఆయనకు నచ్చేదికాదు .

మద్య యుగపు సంగీతం నుంచి డెబూసీ ఎన్నో విలువైన విషయాలను ఏరికోరి తెచ్చుకొన్నాడు .ఫ్రెంచ్ క్లేరియన్ సంగీతకారులైన కూపెరిన్, రామూ ల సంగీతం అంటే మహా ప్రేమ .బాష్ ,చోపిన్ ,లిసాజీల ప్రభావమూ ఈయనపై ఎక్కువే .ఆయనకు ‘’పాశ్చాత్యేతర ‘’సంగీతం అభిమానమైంది .ప్రాచీనమైనది ప్రాత్య సంబంధమైనది అయిన సంగీతాన్ని ఆరాధించాడు .జావా వారి సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చాడు .వాళ్ళ గాంగ్స్,మెటల్లో ఫాన్స్ వాద్యాలపై మోజు .ఆయనకు సాహిత్యం విజువల్ ఆర్ట్(ద్రుశ్య కళ) లపై ఆసక్తి ఎక్కువ .మొదట్లో ఫ్రెంచ్ సింబాలిజం ఉద్యమ  ప్రభావం లో ఉన్నాడు .వాళ్లకు వాస్తవికత ప్రక్రుతిలపై మోజు లేక పోవటాన్ని జీర్ణించుకోలేక పోయాడు .వచన కవిత్వ ప్రభావం ఉండేది .స్టీఫెన్ మలార్మే గొప్ప ప్రభావం కలిగించాడు .సంగీతానికి తన కవిత్వానికి దగ్గర సంబంధం ఉందని మలార్మే చెప్పేవాడు .దీనితో మలార్మే కవిత ‘’ఆఫ్టర్ నూన్ ఆఫ్ ఏ ఫాన్ ‘’కు సంగీత కూర్చాడు డెబూసీ.

తర్వాత నేచర్ కు దగ్గరయ్యాడు .తనమతం నేచర్ అన్నాడు .గూఢ మైన ప్రక్రుతి (మిస్టీరియస్ నేచర్ )నా మతం , దైవం అని చెప్పాడు .ఆచారాలుపాటిస్తూ పూజలు చేస్తూ కూర్చునే దానికన్నా ప్రకృతిని ఆస్వాదించటం వల్లనే మానసిక తృప్తి ఆనందం అనుభూతి లభిస్తాయని అన్నాడు. సముద్రం దగ్గర ఉండి సూర్యోదయ సూర్యామయాలను అవి పొందే అందమైన మార్పులు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది అన్నాడు .సమకాలీన పైంటర్-జేమ్స్ ఆబాట్ మెక్ నెల్ డెబూసీ పై పెద్ద ప్రభావాన్ని కల్గించాడు .

20వశతాబ్దాన్ని అత్యధిక ప్రభావితం చేసిన కంపోజర్ లలో డేబూసీ మొదటి స్థానం లో ఉంటాడు .’’his innovative harmonies were influential to almost every major composer of the 20th century particularly Mauris Ravel  ,Igor travensky ,bela Bartok etc’’.జపానీస్ క౦పోసర్ ‘’టోరు టేకమిస్కి’’బాగా ప్రభావితుడైనాడు .జాజ్ సంగీతం లో మైల్స్ డేవిస్ ,డ్యూక్ ఎలి౦గ్ టన్  లను ప్రభావితం చేశాడు .సమకాలీన సౌండ్ ట్రాక్ కంపోజర్ జాన్ విలియమ్స్ వగైరాలపై ప్రభావం అధికం .

Inline image 1  Inline image 2  Inline image 3

మరో ప్రముఖునితో కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-11-15-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ కారా మాస్టారు గారికి శ్రీ మైనేని వారి జన్మ దిన కానుక

సాహితీ బంధువులకు ఆంద్ర ప్రదేశ్ అవతరణ శుభాకాంక్షలు

 మహా కధకులు ,శ్రీ కాకుళం పట్టణం లో ”కదా నిలయ0 ”రూపకర్త శ్రీ కాళీ పట్నం రామా రావు (కా రా మాస్టారు )గారి 9-11-15నాడు  91వ జన్మ దినోత్సవ సందర్భంగా ‘ ,సరసభారతి ఆప్తులు అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ”కదా నిలయం ”కు 15,000 (పది హేను వేల రూపాయలు )

విరాళంగా ”సరస భారతి ”ద్వారా అందజేశారని తెలియ జేయటానికి ఆనందం గా ఉంది . మాస్టారు మరింత  ఆరోగ్యంగా  శత వసంతాలు పైగా ఆరోగ్యం తో వర్ధిల్లి సాహితీ సేవలో తరించాలని కోరు కుంటున్నాను .. సరస భారతి ద్వారా విరాళం అందజేసిన ఆప్తులు శ్రీమైనేని వారి దంపతులకు కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగ జేయాలని బగ వంతుని ప్రార్ధిస్తున్నాము .-దుర్గా ప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -84

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -84

37-ఫ్రెంచ్ సంగీతానికే కాక ప్రపంచ సంగీతానికీ కొత్త ఇంప్రెషనిస్ట్ వెలుగులు అద్దిన –క్లాడ్ ఏషిలీ డెబూసీ

సంగీతం పతనమై పోయిందని అనుకోవటానికేమీలేదు .  ఆధునిక సంగీతం లో నాలుగు విభిన్న జాతీయ స్రవంతులున్నాయని తెలుసుకోవాలి .అందులోరిచార్డ్ వాగ్నర్  తీవ్రమైన వాద్య ఘోషతో దద్దరిల్లే జర్మనీ సంగీతం ఒకటి .ఆ తర్వాత దీన్ని మరీ బలోపేతం చేసిన రిచర్డ్  స్ట్రాట్ ధోరణి తోబాటు ‘’ట్వెల్వ్ నోట్’’పద్ధతిలో ప్రసిద్ధమైన ఆర్నాల్డ్ స్కూన్ బెర్గ్ సంగీతం .  రెండవది   రష్యాకు చెందిన ‘’ఇగార్ స్ట్రావెన్ స్కి బూర్జువా సెంటి మెంట్ ను కాదని ’ ప్రాధమిక ,క్లాసికల్ లతో  సమ్మేళనమైన సంప్రదాయం .దీనితోబాటు డిమిట్రి  స్టాస్ట కోవిస్కి మరియు సెర్జీ ప్రోకోఫీవ్ ల సి౦ ఫనీలు .అమెరికా సంగీతం జానపదం  ,జానపద నాట్యం  నీగ్రో స్పిరిట్యు వల్స్ ,ప్రాంతీయ జాజ్ మొదలైన స్థానిక విషయాలనుండి ఆవిర్భవించింది .సంగీతం సౌందర్య సౌరభాన్ని తెచ్చిన ఘనత ఎరిక్ స్టేటీ,మారిస్ రావెల్ దక్కితే దాన్నినిర్దుష్టంగా సుసంపన్నం చేసిన ఖ్యాతి ఫ్రెంచ్ సంగీత కారుడు క్లాడ్ ఏషిలీ డెబాసి కి లభించింది .డేబాసీ సంగీతానికి కొత్త రంగులు ,హంగులు పొంగులు సోయగాలు ,సున్నితత్వం అద్ది ఫ్రెంచ్ సంగీతానికే కాక ప్రపంచ  సంగీతానికీ కొత్త వరవడి సృష్టించాడు  .

డేబాసీ ప్రభావం ఒక్క సారి  ఏర్పడినది కాదు ..క్రమానుగతంగా వచ్చింది .22-8-1862 నఫ్రాన్స్ దేశం లోని పారిస్ కు దగ్గరలో ఉన్న  సెయింట్ జేర్మాన్ లేయీ లో పుట్టాడు .క్లాడ్  ఏషిలీగా చర్చ్ లో పేరు నమోదైంది .కాని యవ్వన దశలో తానే ‘’డేబాసీ ‘’తగిలించుకొన్నాడు .దీనికి కారణం తన వంశం చాలా ఉన్నతమైనదని తెలియ జేయటానికే .ఏషిలీ అనేదాన్ని 30వ ఏడాది వరకు ఉంచుకున్నాడు .పేరుకే గొప్ప కాని ఊరు దిబ్బ .సాధారణ రైతు కుటుంబానికి చెందినవాడు .తరతరాలుగా చిన్న వ్యాపారస్తులు .అయిదుగురు సంతానం లో మనవాడు పెద్దోడు .కుటుంబం నడిపే చైనా షాప్ లో ఒక చిన్న గదిలో పుట్టాడు ఈ భవిష్య సంగీత సామ్రాట్ .తండ్రి మాన్యువల్ డేబాసీ కి ఒపేరా సంగీతం అంటే బాగా ఇష్టం,ఎందరో సంగీత కర్తలతో మంచి పరిచయాలున్నాయి . .ఇది కొడుకుకు కూడా అబ్బాలని ఆరాట పడేవాడు

కుర్ర డేబాసీ పియానో వాయించటం లో ఘటికుడని తెలిసి ,ఇక అతని చదువు సంగతి పట్టించుకోకుండా వదిలేశాడు .స్కూల్ కు పంపకుండా అతడు ‘’బాల మేధావి ‘’అని భావించి  తనతోబాటు ధియేటర్లకు సంగీత కచేరీలకు వెంట బెట్టుకొని తిప్పేవాడు .దీనితో చాలా ఏళ్ళు ఆతను సంగీతం కూరుస్తున్నా అందులో పరిపూర్ణత సాధించలేక పోవటం తరచూ తప్పులు చేయటం జరిగాయి .గురువు వద్ద నేర్చిన విద్యలేకపోవటమే కారణం .తప్పు తెలుసుకొని మొదటిసారిగా పియానో పాఠాలు నేర్పించాడు .దీనికి ఫీజు అతని కుటుంబ స్నేహితుడు అంటోనీ ఆరోసా చెల్లించేవాడు .ఈయనే మనవాడి ‘’గాడ్ ఫాదర్ ‘,ఆంట్ గారి  ప్రేమికుడు కూడా . కాని ఆరోసా ఆమెను తిరస్కరించటం తో స్పాన్సర్ షిప్ కోసం వేరొక అండను వెతుక్కోవాల్సి వచ్చింది.అదృష్ట వశాత్తు మన కుర్రాడు మేడం మాట్ డీ ఫ్లార్విల్ ద్రుష్టి లో పడ్డాడు .ఈమె చోపిన్ శిష్యురాలేకాక డేబాసీ కి ఆరాధనీయుడైన కవి పాల్ వేరలీన్ కు అత్తగారు కూడా .ఆమె మూడేళ్ళు మనవాడికి సంగీత పాఠాలు చెప్పింది .ఆమె నేర్పిన సంగీత విద్యలో పరిపూర్ణుడై ,11వ ఏట నే ‘’పారిస్ కన్సర్వేటరి’’  లో చేరటానికి అర్హత పొందాడు  .

ఈ కన్సర్వేటరి  లో 11 సంవత్సరాలున్నాడు .కొంత అసంతృప్తి ,కొంత సంతృప్తి తో ఇక్కడ గడిపాడు .హార్మానిక్ ప్రోగ్రేషన్స్ లో స్వేచ్చగా ప్రవర్తిస్తూ పాతవాటి బదులు తేలికైనవి కని పెడుతూ ,,సంగీత సంప్రదాయ విరుద్ధమైన వాటికి   స్వర రీతులను రాస్తూ ఉన్నాడు .  ఆతను చేసే ప్రయోగాలన్నీ తప్పుల తడకలన్నారు సంప్రదాయజ్నులు .అతనిలో ప్రతిభ ఉంది కాని పెడ దారి పడుతోంది అన్నారు .శబ్దాలను సృష్టించటం లో అప్పటిదాకా ఉన్న పాత పద్ధతులపై విభేదించాడు .మూల సిద్ధాంతమే తప్పు అన్నాడు .పియానో కళాకారుడిగా గొప్ప ప్రవీణుడు ,సాంప్రదాయానికి వ్యతిరేకి ,నవీన ద్రుష్టి ఉన్నవాడు .అతని సహచర విద్యార్ధి గేబ్రియల్ పీర్నీ ‘’డెబాసీ అద్భుత కళాకారుడు .అందర్నీ ఆశ్చర్యం లో ముంచేస్తాడు ,కాని వికారం అనిపిస్తుంది .దీనికి కారణం భయమో ఏదో ఉందని పిస్తుంది ‘’అన్నాడు .పియానోను చాలా ఫ్రీగా ముతకగా వాడేస్తాడు .కష్టమైన స్వర సమ్మేళనం వచ్చినప్పుడు చాలా గట్టిగా శ్వాస పీల్చేవాడు .బీతోవెన్ ఇతన్ని తప్పించుకోనేవాడు .ఎవరేమన్నా 14 ఏళ్ళకే అద్భుత ‘’చాపిన్ ప్లేయర్ ‘’అని పించుకున్నాడు డెబాసీ.పదిహేనవ ఏట పాటలకు  సంగీతం సమకూర్చాడు .ఇవి సాంప్రదాయ సెలూన్ ధోరణిలో ఉండేవి .

17 వ ఏట సంగీత విద్య కు తాత్కాలికం గా అంతరాయం కలిగి౦ది .సంగీత గురువు శిష్యుడికి   రష్యాలో ని సంపన్న గృహిణి నదేజా వాన్ మెక్ నుండి ఆహ్వానం వచ్చేట్లు సిఫార్సు చేశాడు .ఆమె టేకై కోస్కికి ఎన్నో ఏళ్ళుగా అతన్ని చూడకుండానే  ఆర్ధికం గా సాయ పడుతోంది .ఆమెతో బాటు సంగీత త్రయం ఉంటారు .ఆమె ఎక్కడికి వెడితే వీరినీ తనతో బాటు తీసుకొని వెళ్ళేది .రష్యా రావటం తో డెబాసీ సంగీత ప్రపంచం అకస్మాత్తుగా విస్త్రుతమైనది .మాస్కో లో మనవాడు బోరోడిన్ కూర్చిన ఆటవిక డాన్స్ ట్యూన్లు ,రిమ్ స్కి కోర్సకోవ్ కూర్చిన ఆకర్షణీయ స్వరాలు ,టకై కో విస్కీ ఆత్మ వేదనా రాగాలు,తూర్పు దేశాలకు చెందిన అపరిపక్వ ధోరణులు విన్నాడు .గ్రీకుల ఆరు మూల స్వరాలు ,ఇంపు చెడని చైనా నిరంతర సంగీతం ఆస్వాదించాడు .వెనిస్ లో తన నాహ్వానించిన మెక్ గారి సౌజన్యం తో ప్రఖ్యాత సంగీతనిది’’ రిచార్డ్ వాగ్నేర్’’ ను కలుసుకొనే అదృష్టం పొందాడు .వియన్నాలో ‘’ట్రిస్టాన్ అన్డైసోల్డీ’’సంగీతానికి పరవశించి పోయాడు .

తిరిగి ఫ్రాన్స్ చేరి కన్సర్వేటరిలో ఒక చెవితో ప్రయోగాత్మక హార్మనీలు ,రెండవ చెవితో ‘’ప్రిక్స్ డీ రోమ్’’కు సంగీతం సమకూర్చాడు .సంగీత ప్రదర్శనాకారుడిగానే  పొగడ్తలు పొందుతున్నాడు .సహకార వాద్యానికి మొదటి బహుమతి అందుకొన్నాడు .కాని సృజనకు దూరమై పోతున్నానేమో ననే అనుమానం ఉండేది .’’హార్మని పరీక్ష లో డజను తప్పులు చేశాడని ఇన్ స్ట్ర క్టర్లు వేలెత్తి చూపారు .అవి కావాలనే చేశానని సమాధానం చెప్పాడు .’’శృతి విరుద్ధ స్వరాలను ఎందుకు వదిలెయ్యాలి ?వాటికీ స్థానం కల్పించవచ్చు కదా ? తప్పేమిటి ’’అని ప్రశ్నించాడు డెబాసీ.అకాడెమీ వాళ్ళ గుండెల్లో బాంబు పేల్చాడు .తర్వాత ఒక న్యాయ నిర్వహణాధికారి ఇతని వ్రాత ప్రతులను రెండిటిని పరిశీలించి అంతటి ప్రతిభావంతుడు ఇలాంటి  తప్పులు చేయరాదన్నాడు .డెబాసీ ఏంతో సంతోషించాడు .చివరికి బిగ్గరగా ‘’నేను నా స్వంత సృజన చేశాను ‘’అని అరిచాడు .డేబాసీ  మొదటి సారిగా ప్రచురితమైన తన సంగీత రచన ‘’నూటిస్ డీ ఎటాలిస్’’ను  మేడం మేరీ సైంటీ  కు అంకితమిచ్చాడు .ఇప్పటినుంచి డెబాసీ ఆర్టిస్ట్ ల, బోహీమియన్ ల సర్కిల్ లో చేరాడు . ఇందులో మేడం వాస్నిర్ ప్రముఖ పర్షియన్ ఆర్కి టెక్ట్ భార్యకూడా ఉంది .అందం చందం కోయిల స్వరం ఉన్న ఆమెతో మన 19ఏళ్ళ డ్రీం బాయ్ ప్రేమలో పడ్డాడు .తలిదండ్రులకు గుడ్ బై చెప్పి , వాస్నిర్ సన్నిధానం లో కి ప్రవేశించాడు ఈప్రేమ పిపాసి .

సశేషం

 

Inline image 1

ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-11-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -56 గూడూరు మైకా వ్యాపారం చేసిన వేగ రాజు వారు

ఊసుల్లో ఉయ్యూరు -56

గూడూరు మైకా వ్యాపారం చేసిన వేగ రాజు వారు

గూడురు  మైకా గనులు ,వ్యాపారం అంటే చప్పున గుర్తోచ్చేవారు కృష్ణా జిల్లా మానికొందలోని గోగినేని వారి కుటుంబం .అక్కడి మైకా గనులపై తిరుగు లేని ఆధిపత్యం సంపాదించి పుష్కల౦ గా  డబ్బు సంపాదించి అపర కుబేరులయ్యారని అందరూ చెప్పుకొనే విషయమే .సరుకు ఒకటే కాని దాని లోని లోతులుపాతులు తెలిసి వ్యాపారం చేస్తే కలిసొస్తుంది .లేక పొతే నష్టాల్లో ఆ గని లోతుల్లోకి కూరుకు పోతారు .దీనికెంతో లౌక్యం చాకచక్యం ,ధీమా, వ్యవహార దక్షత,అవతలి వాడిని ఎదుర్కొనే సత్తా ,సామర్ధ్యం ఉండాలి ,.దీనికి తోడూ అదృష్టమూ కలిసి రావాలి  .మైకా పైకి కనిపించే తళతళలతో ఊరించి బుట్టలో వేసు కొంటుంది. దిగితెనేకాని లోతు తెలియదుకదా .తెలీకుండా దిగితే ,అంచులు పట్టుకొనే తెలివి తేటలు లేకపోతె పెట్టిన సొమ్మంతా గనిపాలే .మిగిలేది అప్పులూ, తిప్పలే    .ఈ రెండవ రకానికి చెందినా వాళ్ళే మా ఉయ్యూరు లోని వేగారాజు వారు .పూర్తిగా మునిగిపోయారు .ఇప్పటిదాకా  ఉయ్యూరు వారు మైకా వ్యాపారం చేశారని నాకు తెలీదు  మా ఉయ్యూరు వాడు ,హైస్కూల్ లో నాశిష్యుడు ,కే సి పిలో పని చేసి రిటైరై  బెంగుళూర్ లో స్థిర డ్డవాడు  ,ఏ దేశం లో ఉన్నా సరసభారతి ని చదివి స్పంది౦ చేవాడూ ,వేగరాజు రాజేంద్ర ప్రసాద్ ,ఏదో పని మీద ఉయ్యూరు వచ్చి నాలుగు రోజుల క్రితం మా ఇంటికొచ్చి మాటల సందర్భంగా తమ తాతగారు స్వర్గీయ వేగ రాజు వెంకట సుబ్బయ్య గారు గూడూరు మైకా గనుల వ్యాపారం చేశారని ,అందులో నష్టపోయారని సవివరంగా తెలిపాడు .నేను రాసేదంతా ఆతను నాకు చెప్పిన విషయాలే .

          శ్రీ వేగరాజు వెంకట సుబ్బయ్య గారిల్లు ఉయ్యూరు లో విష్ణాలయం వెనక బజారులో ఉంది .ఆయన్ను నా చిన్నప్పుడు చూశాను .అప్పటికే బాగా ముసలివారు .వాకిట్లోదిగాలుగా  కూర్చుని ఉండేవారు.ఆయన భార్య సుందరమ్మగారినీ చూశానని గుర్తు . మేము విష్ణాలయానికి మా ఇంటి నుంచి ఈ వెనక దారిలోనే వెళ్ళేవాళ్ళం .ఇప్పటికీ అలానే వెడతాం.అప్పటికి ఆయన గురించి నాకేమీ పెద్దగా తెలియదు .కాని అయన తమ్ముడు వేగ రాజు సీతారామయ్య గారు ఇంకా వయసులోనే ఉన్నారు .బాగా స్థితిపరులని పేరు పొందారు .ఈయన ఇల్లు గుండు పద్మావతమ్మ గారింటికి వెళ్ళే దారిలో ఎడమ ప్రక్క ఎత్తైన స్థలం లో ఉండేది .సంతానం లేదు .అన్నగారి పిల్లలే వారింట్లో పిల్లలు .సీతారామయ్యగారు వేగ రాజు వారికే దత్తత వెళ్లారట .అందుకే ఆస్తి బాగా కలిసివచ్చిందట .వీరి ద్దరి మధ్య వెంకటేశ్వర రావు గారు౦౦ డేవారట .ఈయన్ను నేను చూసిన గుర్తు లేదు .ముగ్గురికి పిత్రార్జితమైన ఇల్లు ,పొలాలు ,స్థలాలు బాగానే ఉండేవట .వీరి పొలాలు తోటల వల్లూరు రోడ్డుకు ,పుల్లేరుకాలువకు ఎదుటి వైపు రోడ్డును ఆనుకొని ఉండేవట .ఉయ్యూరులో వేగరాజు వారి కటు౦ బానికి మంచి పలుకు బడి ఉండేదట .ఇక్కడి ఆస్తి అజమాయిషీ వెంకటేశ్వరరావు గారు చేసేవారట .

            ఈ అన్నదమ్ములలో పెద్ద వారైన వెంకట సుబ్బయ్యగారు గూడూరు వెళ్లి  మైకా గనులకొనుబడి , అమ్మకం  సుమారుగా 1940నుండే చేసేవారట .కొంతకాలం బాగా కలిసోచ్చిందట .విధి వైపరీత్యం వలన వీరి  గనులు కొన్ని కూలిపోయాయి .వ్యాపారం మొత్తం దివాలా తీసిందట .పది వేల రూపాయల అప్పులలో కూరుకు పోయారట .దిగాలుపడి గూడూరు నుంచి ఉయ్యూరు వచ్చేశారు .ఆ అప్పులు తీరిస్తేకాని ఆయన తల ఎత్తుకొలేని స్తితి .అప్పుడు తమ్ముడు వెంకటేశ్వర రావు గారు అన్నగారి పేర ఉన్న స్థలాలు ,పొలాలు   అయినకాడికి అమ్మేసి ,ఆ పది వేలు తీర్చేసి ,తానూ బొక్కాల్సింది బొక్కేసి రాజమండ్రి వెళ్లిపోయారట .ఊళ్ళో కరణం సీతం రాజు సాంబశివ రావు గారు ఈ వెంకటేశ్వర రావు గారికి బాగా వత్తాసు పలికి వెయ్యి రూపాయలు కిమ్మతు ఉన్నదాన్ని వందరూపాయలే వాల్యూ గాచూపించి సుబ్బయ్య గారిని ఈ ఇద్దరూ నిలువునా ముంచారని రాజేంద్ర ప్రసాద్ మొన్న ;లబో దిబో మన్నాడు. ఆతను చెప్పేదాకా నాకు అసలే విషయమూ తెలియనే తెలియదు .ఇలా ఉయ్యూరు వేగ రాజు వారి గూడూరు మైకా గనుల వ్యాపారం ముగిసిన అధ్యాయమే అయింది .కాని అదృష్టం బాగుండి ఆయన అల్లుడు మైకాలో పిచ్చ పిచ్చగా  సంపాదించాడట .ఆ కద తెలుసుకొందాం .ఎవరి అదృష్టం ఎలాంటిదో ?

        సుబ్బయ్యగారు సుందరమ్మగార్లకు శ్రీ వెంకట నాగేశ్వర రావు ,శ్రీ సాంబ శివరావు ,శ్రీ గోపాలకృష్ణ మూర్తి ,శ్రీ విశ్వేశ్వర రావు ,శ్రీ సూర్య నారాయణ ,శ్రీ విజయ రామారావు  అనే 6గురు కుమారులు .ఒక్కతే శ్రీమతి దుర్గాంబ ఆడపిల్ల .ఇందులో విస్సు ,సూరి మాకు సీనియర్లు .విజయ రామారావు నాకు హైస్కూల్   లో క్లాస్ మేట్.

   దుర్గాంబ గారిని కడప జిల్లా రాజం పేట కు చెందిన శ్రీ గోటేటి వెంకటేశ్వర రావు గారికిచ్చి వివాహం చేశారు .అప్పటికే ఆయన మైకా గనుల యజమాని. దుర్గాంబ గారి పాణి గ్రహణం తో ఆయనకు అంతా బాగా కలిసొచ్చింది. మైకా సామ్రాజ్యాధిపతి అయి ఇబ్బడి ముబ్బడిగా సంపాదించి వ్యాపారం ఎలా చేయాలో నిరూపించి మామగారికి ఊరట కలిపించాడు మామగారిది ‘’బాపన వ్యవసాయం ‘’లా వ్యాపారం ఉంటె అల్లుడుగారు ‘’వైశ్య దృక్పధం ‘’తో గొప్ప సంపాదనా పరులయ్యారు .ఎదురులేని వ్యాపారి అనిపించారు రాజేంద్ర చెప్పిన దాన్ని బట్టి ఇప్పటకీ గోటేటి వారికి 14లారీలు ,జీపులు కార్లూ ఎన్నో ఉన్నాయి .

            సుబ్బయ్య గారి సంతానం లో శ్రీ సాంబశివరావు గారు ఉయ్యూరు కెసీపి లో ఉద్యోగం చేశారు .మంచి పలుకుబడి సంపాదించారు .అందరికి తలలో నాలుకగా ఉండేవారు .ఏడాది క్రితమే సుమారు 90ఏళ్ళు జీవించి చనిపోయారు .ఆయన భార్య చనిపోయి సుమారు 40ఏళ్ళు అవుతుంది .వీరికుమారులు –శ్రీ సురేష్ బాబు  ,శ్రీ రాజేంద్ర ప్రసాద్ ,,బాబ్జీ అనే శ్రీ శంకర్ .ఇతను అకస్మాత్తుగా తండ్రి మరణానంతరం పదినెలల క్రితం చనిపోయాడు .బాబ్జీ ఐ టి ఐ ఇంస్ట్రక్తర్ గా పని చేసి రిటైర్ అయి ఉయ్యూరు చేరి ‘’వేగ రాజు మాన్షన్ ‘’అనే అపార్ట్ మెంట్ సముదాయం నిర్మించి తాతగారి పేరు నిలబెట్టాడు .సురేష్ ,రాజేంద్ర ,బాబ్జీ లు హైస్కూల్ లో నా శిష్యులే .ఉయ్యూరు బ్రాహ్మణ సంఘం లో క్రియా శీలక పాత్ర వహించిన వారే .క్రిందటి కార్తీకమాసం లో కొత్తగా  ఏర్పడిన బ్రాహ్మణ సంఘం లో బాబ్జీ కీలల పాత్ర పోషించాడు .పేదబ్రాహ్మణ విద్యార్ధులకు తండ్రి సాంబశివరావు గారి పేర పది వేల రూపాయల స్కాలర్ షిప్ లను అందజేసిన వదాన్యుడు .సా౦బశివరావుగారి కి ఇద్దరమ్మాయిలు శ్రీమతి బేబి జ్యోతి ,శ్రీమతి రాణీ సుజాత .ఇందులో జ్యోతి హైస్కూల్ లో నా శిష్యురాలే .

   ఉయ్యూరు వీరమ్మ తల్లికి ,వేగ రాజు వారి కుటుంబానికి సాన్నిహితం ఉంది. మాఘ మాసం లో శుద్ధ ఏకాదశి నాడు అమ్మవారు ఊరేగింపుగా బయల్దేరేటప్పుడు ముందుగా వేగ రాజు వారింటికి వచ్చిచీ, సారే, హారతి తీసుకొన్న తరువాతనే బయాల్దేరుతుంది అని ,వీరమ్మ తిరునాళ్ళు  11వ రోజు జరిగే  సిడి బండీ ఉత్సవం  రోజున  తాటి మాను సిడిబండీకి మొదట వేగరాజువారే గుమ్మడికాయ కట్టి  కొబ్బరికాయ కొట్టి ,హారతిస్తారని ఆ తర్వాతే మిగిలిన వారు చేస్తారని అప్పుడే సిదిబండీ బయాల్దేరుతుందని ,ఇది అనాదిగా ఆనవాయితీగా వస్తోందని  రాజేంద్ర చెప్పాడు .

             మరో విషయం తో కలుద్దాం

సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-10-15-ఉయ్యూరు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

అమరావతి అందాలను చిత్రించిన ప్రబంధం -ఉదయనోదయము

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

మధ్య యుగాలనాటి ఆదోని కోట

Inline image 1

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాలకులు ధర్మజ్నులై ఉండాలి -టాగూర్ ,త్రి సంధ్యలు

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇకపై ఇద్దరు పిల్లల చైనా , వట్టి కోట కాదు గట్టి కోట

Inline image 1
Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ధిల్లీ బాలాజీ సన్నిధిలో ఆద్వాని -బీహార్ హోరా హోరీ

 

Inline image 1
 
 

బిహార్.. హోరాహోరి

  • 01/11/2015
  •  -ఎస్.కె.రామానుజం

దేశ రాజకీయాలపై ఆసక్తి ఉన్న అందరి దృష్టీ ఇప్పుడు బిహార్‌పైనే ఉంది. అక్కడి శాసనసభకు ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆ పోరులో గెలుపెవరిది..? ఇప్పుడు అందరి ప్రశ్న ఇదే. రాజకీయంగా దసరాకు ముందు ఉన్న పరిస్థితికి, ఆ తరువాత పరిస్థితికి చాలా తేడా వచ్చేసింది. రోజురోజుకూ మారుతున్న పరిణామాలతో అంచనాలు మారుతున్నాయి. ఇప్పటికైతే సమఉజ్జీల మధ్య సమరం ఇది. రాజకీయాల్లో ‘ఒకరి బలహీనతే మరొకరి బలం’ అన్న సంగతి అందరికీ తెలిసిన రహస్యం. కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు మాటను బట్టి ఓటరు మనసు మారిపోయే సన్నివేశాలు రాజకీయాల్లో మామూలే. బిజెపి పరివారం కీలక సమయంలో నోరుజారి కష్టాలు కొని తెచ్చుకుంటూంటే, ‘మహాకూటమి’ నేతలు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని బలం పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు కాస్తంత పైచేయిగా కన్పించిన ఎన్డీఎ కూటమికి ఇప్పుడు తత్వం బోధపడుతోంది. బిహార్ అసెంబ్లీలో 243 స్థానాలకు నిర్వహిస్తున్న ఐదు దశల పోలింగ్ ప్రక్రియ మరో నాలుగురోజుల్లో పూర్తవుతుంది. అక్కడికి మూడురోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయి. అంతవరకూ ఓపికగా ఉండేది ఎవరు? ఈలోగానే ఎవరు గెలుస్తారు? ఎవరి ప్రభుత్వం వస్తుంది? అన్న ఆసక్తి ప్రతిఒక్కరిలో సహజంగానే కనిపిస్తుంది. ఇక మీడియా హడావుడి చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు వచ్చిన ‘ముందస్తు పోలింగ్ సర్వేలు’ చెబుతున్నమాట కూడా ఇరు కూటముల మధ్య హోరాహోరీ పోరు ఉందని, ఒకటీ అరా తప్ప ఎవరికీ పెద్ద ఆధిక్యం ఉండదని తేల్చిచెబుతున్నాయి. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బిజెపి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఆ తరువాత పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఒక్క దిల్లీ మినహా చెప్పుకోతగ్గ ఫలితాలనే రాబట్టింది. చివరకు జమ్మూ- కాశ్మీర్‌లోనూ అద్భుత ఫలితాలు సాధించి దేశ రాజకీయ యవనికపై సరికొత్త అవతారం ఎత్తింది. ఈ పరిణామాలు విపక్షాలను బెంబేలెత్తించాయి. బిహార్ శాసనసభ ఎన్నికల్లో బిజెపి దూకుడుకు ముకుతాడు వేయకపోతే భవిష్యత్ రాజకీయాల్లో కష్టాలు తప్పవన్న భయం వాటిని వెన్నాడింది. ఆ భయం మొదలవగానే విపక్షాలు ఏకమయ్యే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇక్కడ ఎవరి అవసరాలు వారివి. ఎవరి అంచనాలు వారివి. అవసరం కొద్దీ అంతా ఏకమయ్యారు. విడివిడిగా పోటీచేస్తే బిజెపి బృందం సులువుగా అధికారంలోకి వస్తుందన్న అంచనా వారిని ఒక పంచన చేర్చింది. జనతా పరివార్ పేరిట ఆరుపార్టీలు ఏకమైనా ములాయం సింగ్ అలకతో అది అభాసుపాలయ్యింది. ఆ తరువాత మరో రెండు పార్టీలు ఆ తాను నుంచి విడిపోయాయి. చివరకు జనతాదళ్ (యు), ఆర్‌జెడి, కాంగ్రెస్ పక్షాలతో కలిసి మహాకూటమి సీట్లు పంచుకుని పోటీ చేస్తున్నాయి. వీటికి దీటుగా బిజెపి మరికొన్ని పార్టీలతో కలసి బరిలోకి దిగింది. ప్రధానంగా వీరి మధ్యే పోటీ నెలకొంది. ఇక బిఎస్‌పి, ఎస్‌పి, లెఫ్ట్‌కూటమి, తొలిసారిగా ఒవైసీ సారథ్యంలోని ఎంఐఎం పార్టీ రంగంలోకి దిగాయి. బిజెపికి అనుకూలంగా ఒవైసీ పార్టీ వ్యవహరిస్తోందన్న సరికొత్త విమర్శల జడివాన మొదలైన నేపథ్యంలో బిజెపి నేతల అనూహ్య వ్యాఖ్యలు తేనెతుట్టెను కదిపాయి. బిహార్‌లో పదేళ్లుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మధ్యలో చేసిన ‘మాంజీ’ ప్రయోగం వికటించి మళ్లీ సింహాసనం ఎక్కారు. మోదీతో విభేదించి, లోక్‌సభ ఎన్నికల్లో భారీగా నష్టపోయిన నితీష్ ఒంటరిపోరుతో ఒనగూడేదేమీ ఉండదన్న సత్యంతో లాలూతో సఖ్యత కుదుర్చుకున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న సామెతకు బిహార్ రాజకీయాలు సరైన ఉదాహరణ. సరే, రాజకీయ ఉద్దండుల అంచనాలన్నీ నిజమవుతాయా? ఓటర్ల నాడి ఏమిటన్నది అంతుబడుతోందా? అంటే ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమే. అయితే తాజా పరిణామాలు, బిహార్‌లో కొత్తగా వచ్చిన ఓటర్లు, తొలిమూడు దశల్లో మహిళా ఓటర్లు పెద్దసంఖ్యలో ఓటువేయడంవంటి అంశాలనుబట్టి కొంతవరకు పరిస్థితిని ఊహించవచ్చు. కులమే మూలం.. దేశంలోని వెనుకబడిన రాష్ట్రాల్లో బిహార్ ఒకటి. అక్షరాస్యతలో వెనుకబడి ఉన్న ఈ రాష్ట్రంలో అన్నింటికన్నా కులాల ప్రభావమే అధికం. అన్ని పరిణామాలూ ఈ అంశం ఆధారంగానే సంభవిస్తూంటాయి. ‘మండల్ వివాదం’ రాజుకోకముందు వరకు అది అంతర్లీనంగానే ఉన్న వ్యవహారం. ఆ తరువాత అది విచ్చలవిడిగా, విశృంఖలంగా మారిపోయింది. కులం ప్రస్తావన లేని విధానం లేదు. ఎన్డీఏతో జతగట్టి నితీష్ అధికారంలోకి వచ్చాక ఆ రాష్ట్రం తొలిసారిగా అభివృద్ధి మార్గాన పయనించడం మొదలైంది. ఇది తిరుగులేని నిజం. యాదవులను ఏకతాటిపై నడిపి చాలాకాలం పాటు అధికారంలో ఉన్న రాజకీయ చతురుడు లాలూప్రసాద్ యాదవ్ అవినీతి కారణంగా ఎన్నికలకు దూరమయ్యాక ఆ వర్గం వెనుకబడింది. యాదవుల కారణంగా ఎన్నో కష్టాలు పడిన కొన్ని వర్గాలు నితీష్ పంచన చేరి ఎన్డీఏకు అద్భుతమైన విజయాలు అందించాయి. మారిన పరిణామాల్లో నితీష్ యాదవుల మద్దతుకోసం లాలూతో చేయిచేయి కలపడం రాజకీయంగా కలసివస్తుందని భావిస్తున్నా కొన్ని సందేహాలు జెడియును భయపెడుతున్నాయి. యాదవుల పొడగిట్టని కొన్ని వెనుకబడిన వర్గాలు, అగ్రకులాలు వారికి దూరమవుతారన్న అంచనాలున్నాయి. సరే..ఎన్నికల వేళ బిహార్‌లో కులాల పాత్ర ఏమిటో చూద్దాం. ఓటర్లు 6.6 కోట్లు బిహార్‌లో ఎన్నికల్లో ఓటుహక్కు కలిగినవారి సంఖ్య 6.68 కోట్లు. వీరిలో పురుషులు 3.56 కోట్లు, మహిళలు 3.11 కోట్లమంది. మొత్తం ఓటర్లలో మహిళల సంఖ్య 30శాతం. కొత్తగా ఓటుహక్కు వచ్చినవారి సంఖ్య 20 లక్షలమంది. వీరంతా తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈసారి ఎన్నికల్లో మహిళలు, తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోబోయే కొత్తఓటర్లు ఫలితాలను నిర్దేశిస్తారని అందరూ భావిస్తున్నారు. ఇదీ కులాల లెక్క.. బిహార్ ప్రత్యేకతే కులాలు. ప్రజాస్వామ్యం, నీతివంతమైన రాజకీయాలు వంటి పడికట్టు పదాలు ఆ రాష్ట్రంలో పనిచేయవు. రాజనీతి వేరు, రాజకీయం వేరని బిహార్ రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది. లౌకికవాదం, మతవాదం అన్నమాటలు అక్కడి కులాలు, మతాల అంశాల వారీగానే మాట్లాడతారు. రాజకీయ పరమపద సోపానపటంలో సింహాసనం అధిష్ఠించాలంటే కులం,మతం ఆనుపానులన్నీ తెలుసుకోవాలి. ఆ లెక్కల్లో ఇప్పుడు ఎవరు ‘బెస్ట్’ అన్నది త్వరలో తేలిపోతుంది. ఇప్పటికిప్పుడు వారు వేసుకున్న రాజకీయ లెక్కలకు మూలం ఇలా ఉంది. విభజన తరువాత పూర్వ ప్రాభవం కోల్పోయిన బిహార్ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యతను ఈసారి దక్కించుకున్నాయి. అందుకే అక్కడ ఉన్న వందలాది వర్గాల్లో ఎక్కువమంది మద్దతుకోసం రాజకీయ పక్షాలు అడుగులు వేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఒబిసి వర్గాలు 50శాతం మేరకు ఉన్నాయి. వీరిలో యాదవుల వాటా 15శాతం. కుర్మీ, కొయిరి, కుశవహ వంటి కులాల వాటా దాదాపు 11శాతం. బాగా వెనుకబడిన వర్గాలు (ఇబిసి)లు 20 శాతం. రాష్ట్రంలోని కనీసం 30 నియోజికవర్గాల్లో ప్రభావం చూపే ముస్లింలు 17 శాతం. అగ్రకులాలు 15 శాతంమంది ఉన్నారు. వీరిలో రాజపుత్రులు 5, భూమిహార్ 4, బ్రాహ్మణులు 5, కాయస్థులు 1శాతం ఉన్నారు. వీరుకాక మహాదళితులు 16శాతం మంది ఉన్నారు. మహాదళితుల్లోకి రాని దళితులు 4శాతంమంది ఉన్నారు. కులం వారీగా లెక్కలోకి రాని ఓటర్లు 2శాతంమంది ఉన్నారు. కులాలు, మతాల వారీగా ఇదీ అసలు స్వరూపం. ఎవరి పక్షాన ఎవరు? చాలాకాలం పాటు అధికారంలో ఉన్న లాలుప్రసాద్ యాదవ్ అంటే యాదవులకు చాలా ఇష్టం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా, ఆయన కొన్నాళ్లుగా క్రియాశీలంగానే వ్యవహరిస్తున్నారు. పెద్దసంఖ్యలో ఉన్న యాదవులు పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండటం, తన ఇద్దరు కొడుకులు, కుమార్తె రాజకీయంగా ఇంకా ఎదగకపోవడం, తనవర్గాన్ని ఇప్పటికైనా కాపాడుకోకపోతే భవిష్యత్ లేదన్న సత్యం తెలిసిన లాలూ నితీష్‌కు స్నేహహస్తం చాటారు. మోదీతో విభేదించి లోక్‌సభ ఎన్నికల్లో నష్టపోయిన ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని యాదవుల మద్దతు పొందేందుకు ఓ అడుగువేశారు. నితీష్‌కూడా ఓబిసియే. ఆయన కుర్మీ కులస్థుడు. అవినీతి మకిలి లేని నాయకుడు. అభివృద్ధిని అలవాటు చేసిన నేత. ముస్లింలు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలకు ఆదర్శంగా ఉన్న నాయకుడు. అయితే, ప్రధాని మోదీతో ఢీకొట్టి చతికిలపడ్డారు. మోదీకి గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడంత ప్రభ లేదని నితీష్ అంచనా. పైగా లోక్‌సభ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలకు చాలా తేడా ఉందని, దిల్లీ ఎన్నికలే అందుకు నిదర్శనమని భావిస్తున్నారు. మోదీని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఎలాగూ చేసేదేమీ లేదు. అందుకే లాలూ, నితీష్‌లతో చేతులు కలిపింది. మోదీ భయం ఆ రెండు పార్టీలకన్నా కాంగ్రెస్‌కే ఎక్కువ. నితీష్ ఓడితే అతడికన్నా తమపార్టీకే ఎక్కువ కష్టాలని భావిస్తోంది. అందుకే సోనియా, రాహుల్ బిహార్ బరిలోకి దిగి మోదీపై విరుచుకుపడుతున్నారు. ములాయం దూరం జరిగాక, లెఫ్ట్‌పార్టీలు ఓ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. లోపాయికారీగా అవి నితీష్ వర్గానికి సహకరించే సూచనలు కన్పిస్తున్నాయి. ఇక తొలిసారిగా ఎంఐఎం రంగంలోకి దిగింది. జాతీయ పార్టీగా విస్తరించడానికి బిహార్ ఎన్నికలను ఒవైసీ ఉపయోగించుకుంటున్నారు. బిజెపికి పరోక్షంగా సహకరించడానికి ఒవైసీ ప్రయత్నిస్తున్నారని, ఓట్ల చీలికవల్ల నితీష్ కూటమి నష్టపోయి, బిజెపి కూటమి బలపడుతుందని వారంతా భయపడుతున్నారు. ఈలోగా అనుకోని పరిణామాలు సంభవించి పరిస్థితుల్లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ఇక దిల్లీలో గుణపాఠం చెప్పిన ఆప్, గుజరాత్ తాజా హీరో హార్థిక్ పటేల్ వంటివారి సన్నాయినొక్కులు బిజెపిని ఎంతోకొంత నష్టపరిచే అవకాశం ఉంది. ఎన్డీయే కూటమి పరిస్థితి… ఇక ఎన్డీయే కూటమిలో బిజెపి ప్రధాన పార్టీ. రామ్‌విలాస్ పాశ్వాత్ లోక్‌జన్‌శక్తి, మాజీ ముఖ్యమంత్రి మాంజీ సారథ్యంలోని హిందుస్తాన్ అవామ్ మోర్చా, మరికొన్ని పార్టీలు ఇందులో ఉన్నాయి. మోదీ ప్రభావం, అభివృద్ధి నినాదం వల్ల తమకు మేలు జరుగుతుందని ఆ కూటమి భావిస్తోంది. మహాదళిత వర్గానికి చెందిన మాంజీ, దళిత వర్గానికి చెందిన రామ్‌విలాస్ పాశ్వాన్, ఒబిసిల్లోని యాదవ వ్యతిరేక వర్గాలు, అగ్రవర్ణాలు తమకు అండగా నిలుస్తాయని ఆ పార్టీలు అంచనావేస్తున్నాయి. మహాకూటమి పరిస్థితి ప్రీ పోల్ సర్వేలు, అక్కడి వాస్తవ పరిస్థితులను అంచనావేస్తే రెండు కూటములు సమఉజ్జీలుగా ఉన్నాయి. అప్పటికప్పుడు ఫలితాలు అంచనావేస్తే కొద్దిగా ఎన్డీయే పైచేయి సాధించింది. మూడోదశ పోలింగ్ జరిగాక మహాకూటమికి పరిస్థితి అనుకూలంగా మారిందని అర్థమవుతోంది. బిజెపి, పరివార్ నేతల అసందర్భ, అనుచిత వ్యాఖ్యల వల్ల ఆ పరిస్థితి ఏర్పడింది. ఐదారు స్థానాలు ఆధిక్యత సాధించనుందన్న ఎన్డీయే కూటమికి గట్టి దెబ్బ తగిలిందన్న ప్రచారం సాగుతోంది. దీంతో ఆ కూటమి దిద్దుబాటు చర్యలకు దిగింది. నితీష్ ఎత్తుగడ ఎన్నికల ప్రచారంలో మహాకూటమి తరపున నితీష్‌కుమార్, లాలూప్రసాద్ యాదవ్‌లు ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తున్నారు. బిజెపి బృందం తప్పిదాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నెమ్మదిగా పైచేయి సాధించేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించుకుంటున్నారు. ప్రచారం ప్రారంభమైన వెంటనే ‘బిహారీ..బాహరీ’ నినాదంతో బిజెపికి నితీష్ చెక్ చెప్పారు. బిజెపి తరపున రాష్ట్రం నుంచి పనిచేస్తున్న ఏకైక వ్యక్తి సుశీల్ మోదీ. ఆయన కూడా కొన్ని సంవత్సరాల క్రితం బిహార్‌కు వచ్చి స్థిరపడిన వ్యక్తి. ప్రధాని మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర నాయకులు బిహార్‌కు చెందినవారు కాదు. ఎన్డీయే కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. దీంతో నితీష్ ఓ విమర్శ చేశారు. బిహార్‌కు చెందిన తనను గెలిపిస్తారా..? బయటినుంచి వచ్చి వెళుతున్నవారిని గెలిపిస్తారా? అంటూ గళమెత్తారు. పైగా ఎన్డీయే ప్రచార సామాగ్రిలో ఉండే నేతల్లో ఎక్కువమంది గుజరాతీయులే. రాష్ట్రానికి చెందిన నేతలకు సరైన స్థానం లేదు. ఈ విషయాన్ని కూడా నితీష్ వదిలిపెట్టలేదు. దీంతో బిజెపి తన ప్రచార వ్యూహాన్ని మార్చుకోవలసి వచ్చింది. దేశంలో రిజర్వేషన్లను పునః పరిశీలించాలన్న ఆర్‌ఎస్‌ఎస్ అధినేత భగవత్ చేసిన వ్యాఖ్యలో నిజానిజాలు, సహేతుకత పక్కనపెడితే నితీష్‌కూటమికి అది పెద్ద ఆయుధమైపోయింది. మండల్ తరువాత బిహార్‌లో తీవ్రమార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో, వెనుకబడిన, అతివెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో సహజంగా ఆయన వ్యాఖ్యలు ప్రభావం చూపుతాయి. ఈ విషయాన్ని లాలూ-నితీష్ జంట తమకు అనుకూలంగా మార్చుకుంది. బిజెపి ఇప్పుడు కక్కలేని, మింగలేని స్థితిలో ఉంది. అయితే ఈ వ్యాఖ్యల వల్ల అగ్రవర్ణాలు సంపూర్ణంగా బిజెపికి సమర్థించవచ్చు. ఈ వర్గంలో ఓట్ల చీలిక ఉండకపోవచ్చు. దళితుల హత్యపై కేంద్రమంత్రి వికె సింగ్ చేసిన తాజా వ్యాఖ్యలు, దాద్రీ సంఘటన, బిజెపి పరివారంలో కొందరు చేసిన వ్యాఖ్యలు ముస్లింలు, దళితుల్లో ప్రతికూలతకు కారణమయ్యాయి. గొడ్డుమాంసంపై నిషేధం వంటి నిర్ణయాలు ముస్లింలను ఎన్డీయే కూటమికి దూరం చేసాయి. అయితే బిజెపి అంచనా వేరుగా ఉంది. బీఫ్, దాద్రీ సంఘటనల వల్ల హిందువుల మద్దతు తమకు గరిష్టంగా ఉంటుందని, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఈ భావన తమకు ఉపకరిస్తుందని అంచనావేస్తోంది. కాకపోతే రిజర్వేషన్లపై వ్యాఖ్య మాత్రం ఆ పార్టీని కలవర పెడుతోంది. కమలం కల మోదీపైనే ఆశలన్నీ పెట్టుకున్న బిజెపి బిహార్‌లో గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. దిల్లీతరహా అనుభవం ఎదురవకూడదని భావిస్తోంది. అగ్రకులాలకు, వెనుకబడిన వర్గాలకు మధ్య పోటీ అన్న లాలూ ప్రచారాన్ని ఆసరా చేసుకుని బిజెపి మొదట నితీష్ కూటమికి చెక్ చెప్పింది. బిహార్‌లో వెనుకబడినవర్గాల్లో యాదవులదే అగ్రస్థానం. వారి ఆధిపత్యంతో నలిగిపోయిన ఇతర ఒబిసిలు బిజెపిని ఆశ్రయిస్తారని ఆ పార్టీ అంచనావేసింది. నితీష్‌పై ఆయా వర్గాలకు ఎంతో నమ్మకం ఉన్నప్పటికీ యాదవులను నమ్మే సాహసం వారు చేయకపోవచ్చు. లాలూ అధికారంలో ఉండగా వారు పడిన ఇబ్బందులను ఇప్పటికీ వారు మరిచిపోలేకపోతున్నారు. ‘జంగిల్‌రాజ్’ మళ్లీ వద్దన్న మోదీ మాటలు పనిచేస్తాయని ఆశతో ఉంది. అభివృద్ధి, భారీ ప్యాకేజీ, ఆ ప్యాకేజీని వద్దన్న నితీష్ వైఖరిని ఆ కూటమి తూర్పార పట్టి ఓటర్లకు చేరవయ్యింది. కాస్త పరిస్థితులు అనుకూలిస్తున్న తరుణంలో బీఫ్ నిషేధం, దానిపై మంత్రుల వ్యాఖ్యలు, రిజర్వేషన్ల వివాదం, దాద్రి సంఘటనలు కష్టాలను తెచ్చిపెట్టాయి. నితీష్ అభివృద్ధి చేసినా, అది అంతంతమాత్రమేనని ఆ పార్టీ చెబుతోంది. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ పేరు ప్రకటించడం, లాలూ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా నితీష్‌కే మద్దతిస్తామని స్పష్టం చేయడం వారికి లాభం చేకూర్చే అంశాలు. ఎన్డీయే కూటమికి ఆధిక్యం వస్తే ముఖ్యమంత్రి ఎవరన్నది చెప్పలేదు. మాజీ ముఖ్యమంత్రి మాంజీ వల్ల మహాదళితులు, పాశ్వాన్ వల్ల దళితులు, అగ్రవర్ణాల్లోని రాజపుత్రులు, భూమిహార్, కాయస్థ, బ్రాహ్మణులు తమకు పట్టం కడతారన్న ఆశతో ఉంది. మహిళలు, యువకుల్లో మోదీని అభిమానించేవారే ఎక్కువని బిజెపి ఆశపడుతోంది. ఉత్తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్‌కే ఎక్కువమంది మద్దతిచ్చినా స్థానిక రాజకీయాలను ప్రభావితం చేసే ఇతర అంశాలు, కులాల లెక్కలు ఓటువేయడానికి కారణమవుతాయి. ఇప్పటికే జరిగిన పొరపాట్ల వల్ల వచ్చే ప్రమాదాన్ని పసిగట్టిన బిజెపి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. పట్టణ ఓటర్లను ఆకర్షించడం, మహిళలు, యువ ఓటర్లను తమవైపు మళ్లించడం, స్ధానిక నేతలను ప్రచారంలోకి దించడం, ప్రధాని మోదీ ప్రచార సభలు భారీగా నిర్వహించడంవంటి చర్యలు చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో యువకులు, మహిళలు, ఒబిసిల్లో కొన్ని వర్గాలు బిజెపి పంచన చేరాయి. ఈసారి అలాంటి పరిస్థితి లేదని నితీష్ కూటమి భావిస్తోంది. నితీష్ కుర్మి వర్గానికి (ఒబిసి) చెందిన వ్యక్తి. ఒబిసిల్లోని కొయిరి వర్గానికి చెందినవారు, కుశవహ వర్గానికి చెందినవారు బిజెపిని ఆదరిస్తారని, మోదీకూడా ఒబిసి వర్గానికి చెందినవారేనని ఆ పార్టీ భావిస్తోంది. నితీష్ తన కుటుంబానికి, బంధువర్గానికి ఎన్నికల్లో ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. ఇది ఆయనకు లాభించే అంశం. కాగా, లాలూ తన ఇద్దరు కుమారులు తేజ్, తేజస్విలను ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇది ఆయనకు నష్టం కలిగించే అంశం. వ్యక్తిగతంగా ఆ ఇద్దరూ గెలిచినా యాదవులను వ్యతిరేకించే ఇతర వర్గాలు తమకు రక్షణ కల్పించే బిజెపి కూటమివైపు మళ్లవచ్చు. నితీష్‌పై వారికి అభిమానం ఉన్నా, ఆయన లాలూ పక్షాన ఉండటంవల్ల తమకు మేలు జరగదని వారు భావించడమే అందుకు కారణం. అందువల్ల ఎవరు ఎన్ని అంచనాలు వేసుకున్నప్పటికీ స్థానికంగా భద్రత, అభివృద్ధి అంశాల ప్రాతిపదికన ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. ఏతావతా బిహార్ ఎన్నికల్లో బిజెపి కూటమి గెలిస్తే- అది మహాకూటమి రాజకీయ అవకాశవాదం ఓటమిగా భావించాల్సి వస్తుంది. ఎన్డీయే కూటమి ఓటమిపాలైతే అది స్వయంకృతమనే అనుకోవాలి. నిజానికి అంతిమ విజేత ఓటరే కదా! ఎందుకంటే అందరి అంచనాలను తలకిందులు చేసే శక్తి అతడికే ఉంది. * నవ, యువ ఓటర్లు కీలకం బిహార్‌లో మొత్తం 6 కోట్ల 68 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉంది. వీరిలో 30శాతం మంది 18నుంచి 29 ఏళ్లలోపువారు. తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోవలసినవారి సంఖ్య దాదాపు 20 లక్షలమంది. నిజానికి గత ఎన్నికల్లో బిహార్‌లోని నియోజికవర్గాల్లో ఒక్కో అభ్యర్థికి సగటున వచ్చిన ఆధిక్యం 15వేలు. ఈసారి కొత్తగా నమోదైన, తొలిసారి ఓటుహక్కును వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య నియోజికవర్గాల వారీగా విభజిస్తే అంతకంటే ఎక్కువే. అందువల్ల ఫలితాన్ని శాసించే స్థితిలో వీరున్నారు. అయితే రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో పేరు నమోదు చేసుకున్నా వారు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారని, వీరు ఎన్నికలకు రారని అంటున్నారు. బిజెపి ఇలాంటివారిపై ఓ కనే్నసి, వారిని ఎన్నికలవేళకు రప్పించాలని పనిచేస్తోంది. బలం…బలగం ఎవరెన్ని చెప్పినా, ఎంత ప్రచారం చేసినా, ఎన్ని విమర్శలు చేసినా అంతిమంగా నిర్ణయాన్ని చెప్పవలసినది ఓటరు. అతడు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటువేస్తేగాని అది తేలదు. తమకు అనుకూలమైనవారిని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటువేసేలా చేయడంలోనే సగం గెలుపు ఉంటుంది. అలా చేయాలంటే సరైన బలం, బలగం ఉండాలి. బిజెపికి బిహార్‌లో 6 లక్షలమంది సుశిక్షుతలైన కార్యకర్తలు ఉన్నారు. వీరిలో సగం మంది బిజెపి కూటమికి అనుకూలంగా ప్రచారం చేస్తారు. మిగతా సగం మంది మహాకూటమికి సానుకూల అంశాలపై సమాచారం సేకరించి వాటికి తగ్గట్లు వ్యూహాలు అమలు చేస్తారు. టీస్టాళ్లు, రచ్చబండల వద్ద వీరంతా తమ పనిచేసుకొస్తూంటారు. ఇక, 70వేల మంది ఆర్‌ఎస్‌ఎస్ వలంటీర్లు రంగంలోకి దిగారు. తమ సంస్థ అధినేత భగవత్ వ్యాఖ్యల అనంతరం వీరు తమ వ్యూహాన్ని మార్చారు. ఇక 80 లక్షలమంది సభ్యులు ఆ పార్టీకి ఉన్నారు. జెడియుకు లక్షమంది కార్యకర్తలు ఉన్నారు. మరో పదివేలమంది ఆర్‌జెడి పక్షాన కార్యకర్తలు ఆ పార్టీకి పనిచేస్తున్నారు. ఇక మాంజీ, ఒవైసీ, లెఫ్ట్ పార్టీల తరపున పెద్దగా బలగం లేదు. కాంగ్రెస్ పక్షాన పదివేలమంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. సంస్థాగత నిర్మాణం గట్టిగా ఉన్న బిజెపికి ఈ విషయంలో లాభం చేకూరే అవకాశం ఉంది. మహిళలే నిర్ణేతలా? తొలి మూడు దశల్లో 57శాతం పైగా మహిళా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తం ఓటర్లలో వారిసంఖ్య 3కోట్లపైమాటే. అంటే దాదాపు 45శాతం. గత లోక్‌సభ ఎన్నికల్లో వీరిలో ఎక్కువమంది మోదీకి పట్టంగట్టారు. ఈసారి వారిమొగ్గు ఎవరివైపో కచ్చితంగా తెలియడం లేదు. నితీష్ పాలనపై వారికి సంతృప్తి ఉన్నా ఆయన కూటమిలోని మిగతా పక్షాలపై వ్యతిరేకత ఉంది. వెనుకబడినవర్గాలకు మంచి విద్యావకాశాలు, విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు ఇవ్వడంవంటి పథకాలు నితీష్‌కు అనుకూలమైనా మోదీ ఆకర్షణనూ తక్కువ అంచనా వేయలేని పరిస్థితి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఫాశాన్లలో ఫ్రాన్స్ ను తలదన్నిన తెలంగాణా -ఈమని శివ నాగి రెడ్డి -నీలీల పడేద దేవా పాట పుట్టు

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బహులత్వమే మన బలం -ప్రణబ్ – శాంతి ఐక్యత ,పార దర్శకత మా మంత్రం

Inline image 1


 
 
Inline image 2
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆత్మ కధకు ఆద్యుడు స్వర్గీయ వెన్నెల కంటి సుబ్బా రావు -అక్కిరాజు రమాపతి రావు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గొంతెమ్మ కోరికలు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కూలిన 220 ప్రాణాలు,అమరావతిలోపటేల్ విగ్రహం

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మద్రాస్ మెరీనా బీచ్ లో 25 గంటల కవి సమ్మేళన సమీక్ష

m b k sammelanam 3 001 marina beach kavi sammelanam 1 001 marina beach kavisammelanam 2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -83

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -83

36-చిన్న కధకు ప్రాణం పోసిన రష్యన్ కధకుడు అంటోన్ చెకోవ్-3(చివరి భాగం )

కొత్త భావాలను మనసులో ఉంచుకొని వుడ్ డెమన్ ను ,అంకుల్ వాన్యా లను మార్చి రాశాడు చెకోవ్ .వాన్యా బాగా ఆదరణ పొందింది .నిజాలను స్పష్టంగా చూడగలిగాడు .అప్పటి నుండి దియేటర్ తో ఎక్కువ సంబంధాలను కొన సాగించాడు .మాస్కో ఆర్ట్ దియేటర్ లో సభ్యురాలైన ఒల్గానిప్పర్ ను ప్రేమించాడు ఆమె కూడా వలచింది .కాని పెళ్లి విషయం చెప్పటానికి సందేహించాడు .అనారోగ్యం వలన ప్రదేశాలు తిరుగుతూ ఉత్తరాల ద్వారానే ప్రేయసికి వలపు వార్తలు తెలియ జేసేవాడు .ఒక ఇంటిలో ఆతిధ్యం పొందుతూ తీవ్ర జబ్బు తో బాధ పడ్డాడు ఇక తన రోజులు దగ్గర పడ్డాయని తెలుసుకొన్నాడు .అయితే ఓల్గా అతనిని ఒంటరిగా బాధ పడకుండా కానీ పెట్టి ఉంది .అతాన్ని ఒప్పించటానికి రెండేళ్ళు తీవ్రంగా ప్రయత్నించింది .చివరికి 25-5-1901 న అతన్ని ప్రపోజ్ చేసింది ఇద్ద్దరూ పెళ్లి చేసుకున్నారు .పిరికితనం వదలక పెళ్లి విషయం రహస్యం గానే ఉంచాడు .టాల్ స్టాయ్ను ఇష్టపడే  వారందరికీ చెకోవ్కూడా ఇష్టమే  .కాని తనకు బయటి ప్రపంచానికి ఊహాత్మక అడ్డ గోడ ఒకటి నిర్మించుకొని లోపలే ఉండిపోయాడని చెకోవ్ మరణం తర్వాత భార్య చెప్పింది .

జీవిత చరమాంకానికి ఇక మూడు ఏళ్ళు మాత్రమె మిగిలాయి .రష్యన్ అకాడేమిలో సభ్యుడయాడు రెండేళ్ళ తర్వాత తన స్నేహితుడు మాక్సి గోర్కీ ని అకాడెమి కి ఎన్నిక చేశాడు . గోర్కీ రాజకీయ సిద్ధాంతాలకు  అకాడెమి అభ్యంతరం చెప్పి అతని ఎన్నిక ను రద్దు చేసింది .దీనికి తీవ్రంగా స్పందించి గోర్కీ పక్షాన నిలిచి అకాడెమి సభ్యత్నానికి రాజీనామా చేశాడు.చెకోవ్ .మరో రెండు నాటకాలు దిత్రీసిస్టర్స్ ,ది చేర్రిఆర్చార్డ్  రాసి మహా పాప్యులర్ నాటక  కర్త అనిపించాడు .శారీరక బాధ అంతకంతకు ఎక్కువైంది .రోజుకు కొన్ని పంక్తులు మాత్రమె రాయ గలిగే వాడు .వ్యంగ్యాత్మక హాస్యాన్ని కొత్త విలువలతో పాత పద్ధతిలో రాశాడు

చెర్రి  ఆర్చర్డ్ తర్వాత చెకోవ్ పరిస్తితి విషమించింది .శారీరకం గా బలహీనుడైనా మానసికంగా మరింత ధృఢ౦ గా ఉన్నాడు .దేవుడు తనలో జీవాణువుపెట్టాడని అనేవాడు దిగజారిన ఆరోగ్యం వలన బెదేన్ వీలర్ శానిటోరియం లో చేర్చారు .డాక్టర్లు ఆయనకేమీ ఫర్వాలేదని ధైర్యం చెప్పేవారు .చెకోవ్ కూడా డాక్టరు కదా ఆయన్ను ఎవరూ మోసగించ లేరు .’’నేను చనిపోతున్నాను ‘’అని చెప్పి,2-7-1904 న 44ఏళ్ళకే ఇంకో ఆరు నెలలకు 45ఏళ్ళు వస్తాయనగా  చెకోవ్ చనిపోయాడు .   చెకోవ్ ఏక వ్యక్తీ సైన్యం లాగా క్రుత్రిమతపై తిరుగు బాటు చేశాడు .శైలీ నిర్మాణం తో నాటకాలను ,అందమైన కదానికలను రాసి అజరామరమైన కీర్తి సాధించాడు .అతని మొదటి ఆంగ్ల శిష్యురాలు కేధరీన్ మానస్ ఫీల్డ్ చిన్నకధకు వన్నె తెచ్చాడని అంది .అటు అమెరికాలోను చెకోవ్ కధలకు బ్రహ్మ రధం పట్టారు .ఎన్నో కధానికా పోటీలలో ఆయన కధలు బహుమతులు పొందాయి .ఏది రాసినా దాన్ని మధ్యలోనే చెప్పటం వదిలేస్తాడు .పాఠకుడి ఊహకే  కద సమాప్తాన్ని వదిలేయటం చెకోవ్ ప్రత్యేకత  .నటన ,క్రుత్రిమత్వాలను ఏవ గించాడు .కధలను ‘’it does not matter ‘’అని ,’’if we could know ‘’అని కాని చెప్పి ముగిస్తాడు .’’His was the genius of a style ,the biography of the mood ,the slice of life which gave rise to a new and enlarging literature of sensibility ‘’అని విశ్లేషకుల భావన .

చనిపోవటానికి కొన్ని నెలలముందు  తన రచనలను జనం మరో ఏడేళ్ళు చదువుతారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.అ తర్వాత ఆరున్నర ఏళ్ళు జీవించాడు . ఆయన అంచనాలు తారుమారయ్యాయి .మరణానంతరం పాప్యులారిటీ బాగా పెరిగింది .ఆయన చెర్రీ ఆర్చర్డ్ నాటకం తో టాల్ స్టాయ్ కి తరువాతివాడిగా ప్రజలు భావిన్చేట్లు చేసింది .చెకోవ్ కధలను ఫస్ట్ ,సెకండ్ థర్డ్ గ్రేడ్ లుగా విభజించారు .ఇంగ్లీష్ లోకి అనువాదం పొందాక ఆంగ్ల పాఠకులు చెకోవ్ పై వీరాభిమానం చూపారు .జేమ్స్ జాయిస్ వర్జీనియా ఉల్ఫ్ కేధరీన్ మానస్ ఫీల్డ్ వంటి ప్రముఖులు ఆయన్ను మెచ్చుకొన్నారు .ముఖ్యంగా బెర్నార్డ్ షా ప్రశంసలు పొందాడు చెకోవ్ .అయన చిన్నకధలు నాటకాలను డామినేట్ చేశాయి వాటికే విపరీతమైన క్రేజ్ వచ్చింది .చెకోవ్ ప్రభావం అమెరికా రచయిత హెమింగ్ వే మీద బాగా ఉంది .చెకోవ్ కద ’’ది లేడీ విత్ ది డాగ్ ‘’చాలా గొప్పకద అని హెమింగ్వే అభిప్రాయ పడ్డాడు .వర్జీనియా ఉల్ఫ్ కు ‘’ది కామన్ రీడర్ ‘’కద బాగా నచ్చింది .

‘’Chekhov is comic in avery special paradoxical way .His plays depend as comedy does on the vitality of the actors to make pleasurable what would other wise be painfully awkward –inappropriyate speeches ,missed connections ,faux pas stumbles childishnesss –but as part of deeper pathos ,the stumbles are not pratfalls but an energized graceful dissolution of purpose ‘’అని విశ్లేషించాడు ఒక ప్రొఫెసర్ .భూ ప్రపంచం మీద రెండవ గొప్ప రచయిత చెకోవ్ అన్నది యదార్ధం .జపాన్ నాటక రచయిలు షిమూజి కునో ,యోజి సకాటే ,ఐ నాగాయ్ లపై చెకోవ్ ప్రభావం ఎక్కువ .చిన్న కధకు వన్నె చిన్నెలు దిద్ది కళాకృతి గ మార్చిన మహా కదా కధన శిల్పి చెకోవ్

 

Inline image 1    Inline image 2    Inline image 3Inline image 4   s

Inline image 6

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -82

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -82

36-చిన్న కధకు ప్రాణం పోసిన రష్యన్ కధకుడు అంటోన్ చెకోవ్-2

ఆ రోజుల్లో రచయితలంతా  లియో టాల్ స్టాయ్  ప్రభావం పడిన వారే .చెకోవ్ కూ ఆయనంటే అభిమనమేకాని ఆయన మార్మిక భావాలు నచ్చేవి కావు .చెకోవ్ ను రాడికల్ అని అజ్ఞాత వాదిఅనీ అనేవారు .30ఏళ్ళు వచ్చేసరికి సాహిత్యం లో చెకోవ్ లబ్ధ ప్రతిష్టుడైనాడు. మిత్రుడు సవోరిన్ మెడికల్ ప్రాక్టీస్ కు రాం రాం చెప్పమన్నాడు .అప్పటికే ఆరోగ్యం క్షీణించటం మొదవటం తో రెండు వాహికలూ ఉండాలనే అన్నాడు చెకోవ్ .తల్లీ ,తమ్ముల సంరక్షణ తో అతని శక్తి నీరుగారి పోయింది .అదే సమయం లో లిడియా అవేలోవా తో పరిచయం కొంత ఆశా జనకం గా ఉన్నా ఆమెకు అప్పటికే పెళ్లి అయి గర్భ వతిగా ఉండటం తో నిస్పృహకు లోనయ్యాడు .వీటి నుండి కొంత విశ్రాంతి పొందటానికి దూరం గా ఉన్న సఖాలిన్ ఐలాండ్ కు వెళ్ళాడు .మూడు నెలలు ఉండి ఖైదీలతో తన అనుభవాలను రాశాడు .’’భగవంతుని భూమి అందమైనది .అయితే అందులో అందంగా లేనినిది మనం మాత్రమే ‘’అని ముగించాడు .

ఒత్తిడి, వేదనలతో రాయాలన్న ఉత్సాహం జావ గారి పోతోంది .అతని ‘’సి గల్’’కధలోని త్రిగారిన్ మదనే చెకోవ్ మధనం .’’పగలూ రాత్రి రాయటమే రాయటం అయి పోయింది నా జీవితం .రాయి రాయి రాయి అనే ఒత్తిడే ఎక్కువైంది .ఒక పుస్తకం పూర్తీ చేశానని తెలియగానే మరోటి రాయమని పుమాయింపు .ఇలా నిరంతరం రచనా వ్యాసంగం లోనే ఉండిపోయాను .ఓపిక నశి౦ చేదాకా రాస్తూనే ఉన్నా .దీని నుంచి తప్పించుకో లేనిస్థితి నాది .నన్ను రెచ్చ గొట్టి రాయిస్తున్నారు తప్పులు రాస్తున్నాని తెలుసు. కాని గత్యంతరం లేదు .దీనితో అసంతృప్తి .అధైర్యం .చదివిన ప్రతిదాన్నీ అబ్బో అదర గొట్టాడు చి౦ పేశాడు నరికేశాడు దున్నేశాడు విజ్రు౦ భించాడని  రాం డోళ్ళ మోత .ఇలా అంటూనే టాల్ స్టాయ్రాసినంత  బాగాలేవు అని సన్నాయి నొక్కులు .నేనూ మనిషినే. బాధ్యత గల పౌరరుడినే . వాళ్ళ కస్టాలు కన్నీళ్లు చూసి ఓదార్చార్చాల్సినవాడినే .వారి ప్రతినిధి గా ఉండాల్సిన వాడినే .వారి భవిష్యత్తు ,శాస్త్రీయ అవగాహన ద్రుక్పదాలకు ఆసరాగా ఉండాలి .అందుకే అన్ని విషయాలపై రాశాను అన్ని వైపుల్నించి విమర్శలను ఎదుర్కొన్నాను .’’అని రాసుకొన్నాడు .

అప్పుడప్పుడు చిన్న చిన్న స్ట్రోక్స్ వస్తున్నా రచనలనేమీ ఆపలేదు రాస్తూనే ఉన్నాడు .నిర్లఖ్యం చేశాడు .సన్నిహితులతో తప్ప మిగిలిన వారెవ్వరి తోనూ కలిసే వాడుకాదు .’’తెలియని వారి సమక్షం లోకంటే ఆత్మీయుల దగ్గర చావటం మేలు ‘’అనేవాడు .మొదటినాటకం విజయం పొందిన తర్వాత రెండవది ‘’ది వుడ్ డెమన్’’రాశాడు .ఇది తన్నింది .నిరాశపడకుండా మూడోది ‘’ది సీ గల్’’రాశాడు .మిత్రులకు దీన్ని చదివి వినిపిస్తే పెదవి విరిచారు .నాటకం ఆడితే హాల్లో పిల్లి ,నక్క కూతలు అరుపులు ఆగం .మిత్రుల సలహాతో  సి గల్ ను  అయిష్టం గానే   కొంతమార్చి’’మాస్కో ఆర్ట్ దియేటర్ ‘’లో స్టానిస్ లేవిస్కి నిర్వహణలో ప్రదర్శిస్తే సూపర్ డూపర్ విజయం సాధించింది .ఇది అనూహ్య విజయం ,అత్యంత విశేష విజయం .

నిరాశా ,నిస్పృహలతో  ,బతికే ధైర్యం లేని బడుగు జీవులకు చెకోవ్ నాటకాలు మానసికానందాన్నిచ్చేవి .విధానాన్ని మరల్చాడు చెకోవ్ .జీవిత సత్యాలను ,అంతర్భాగమైన హాస్యాన్ని మేళ వించి విజయం సాధించాడు .బడుగు ప్రజలు సామాన్యులతో దూరంగా ఉండటాన్ని ఎద్దేవా చేసి చైతన్య వంతుల్ని చేశాడు .’’the artist should be not the judge of his characters  ,but only an un biased witness ‘’అంటాడు.  ఇవాళ ఆంధ్ర జ్యోతి ,వాళ్ళ చానల్ ’’ఉయ్ రిపోర్ట్  యు డిసైడ్ ‘’ అని చెప్పినట్లు  ఆనాడే చేకోవ్ ‘’నా పని సంఘటనలు సన్ని వేశాలని రిపోర్ట్ చేయటమే .అందులో పాత్రల స్వభావాలను కాంతి వంతం చేయటానికి అవసరమైనవీ అనవరమైనవీ ఉంటాయి .వీటిని నిగ్గు తేల్చి నిర్ణయింఛి తీర్పు చెప్పాల్సిన  వారు పాఠకులు మాత్రమె’’అన్నాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -81

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -81

36-చిన్న కధకు ప్రాణం పోసిన రష్యన్ కధకుడు అంటోన్ చెకోవ్

హాస్యం అంటే మొదటినుంచి అమితాసక్తికలిగి ,లెక్కలేనన్ని  హాస్య కధలు రాసిన రష్యన్ రచయిత అంటోన్ పాల్వోవిచ్ చెకోవ్ ను ఇవాళ ప్రపంచం అంతా ఆయన కొత్త సాహిత్య సృష్టికర్త గా ,మనిషి సంతోషరహిత ఏకాంతాన్ని ఆవిష్కరించిన వాడిగా ,సమ కాలీనులను అర్ధం చేసుకోలేక పోయిన వాడిగాభావిస్తున్నారు .

16-1-1860లో రష్యాలో సి ఆఫ్ అజోవ్ పై ఉన్న టాగన్ రాగ్ పట్నం  లో చెకోవ్ జన్మించాడు .వీళ్ళ పూర్వీకులు ప్లేబియన్ లకంటే తక్కువ స్థాయి వారు .తాత ఒక బానిస .అయినా డబ్బు సంపాదించి తెలివి తేటలతో స్వేచ్చ కొనుక్కొని బానిసత్వం నుండి విముక్తి చెందాడు .తండ్రి పావెల్ డబ్బు లేని దుకాణాదారుడు  .గర్వం ,సంకుచిత స్వభావంగల  ,క్రూరుడైన తండ్రి .తల్లి వస్త్ర వ్యాపారి కూతురు .ఆరుగురు సంతానం లో చెకోవ్ మూడో కొడుకు  .గృహ జీవితం సంతోషకరం గా లేదు .చిన్నతనం అంతా అణచివేత దౌష్ట్యం కింద నలిగిపోయిందని జ్వరం లాగా అవి పీల్చి పిప్పి చేశాయని  చెకోవ్ వాపోయాడు .మత వ్యవహారలలోపిల్లలు ఏమాత్రం అతిక్రమించినా తండ్రి సహి౦చేవాడుకాడు .కఠిన దండన కు గురి చేసేవాడు . ఇరవై తొమ్మిదవ ఏట చెకోవ్ తన బాల్యం గురించి రాస్తూ ‘’దయ అనేది నాకు చాలా దూరమైన విషయంగా ఉండేది .ఎవరైనా దయ చూపిస్తే ఏంతో కొత్తగా  పరమ సంతోషంగా ఉండేది .అందుకే ఇతరులపై దయ చూపాలనే సంకల్పం నాకు స్థిరంగా కలిగింది .కాని ఎలా దాన్ని చూపాలో తెలియటం లేదు ‘’అన్నాడు .

యవ్వనం లోకి రాకుండానే అన్నలు అలేక్సాండర్ ,నికొలాస్ ఇద్దరూ పూటుగా తాగి ,గాంబ్లింగ్ లో మునిగి ఇల్లు వదిలి బాధ్యతలు మరచి పారిపోయారు .కుటుంబ బాధ్యత అంటోన్ పైన పడింది .8ఏళ్ళకే ఫామిలీ స్టోర్స్ లో పని చేయాల్సి వచ్చింది .కాని అతనిది తేలికగా తీసుకొనే స్వభావం ,సంతోషం తో ఉండేరకం .అందంగా ఉండటం తో అందర్నీ ఆకర్షించేవాడు ముఖ్యంగా మహిళలను .దీనితో 13వ ఏటికే ‘’ప్రేమ రహస్యాలు ‘’అన్నీ తెలిసిపోయాయి .పదహారవ ఏట ,తండ్రి వ్యాపారం దివాలాతీసి ,అప్పుల వాళ్లకు అందకుండా ఇంటి నుంచి పరారైపోయాడు .తండ్రితో బాటు కుటుంబం వెళ్లి పోయింది. చెకోవ్ ఒక్కడే అక్కడే ఉందడి కుటుంబ స్నేహితుడి ఇంట్లో ఉంటూ,తింటూ  వాళ్ళబ్బాయికి ట్యూషన్ చెబుతూ  కృతజ్ఞతగా బదులు తీర్చుకొంటూ స్కూల్ చదువు పూర్తీ చేశాడు .చదువులో పెద్దగా అభి వృద్ధి ఉండేదికాదు. తప్పాడు .అందుకని ట్రేడ్ స్కూల్ లో చేరి టైలరింగ్ నేర్చాడు .కస్టపడి ఇంకా ఎక్కువ ట్యూషన్లు చెబుతూ కొంత డబ్బు వెనకేసుకొన్నాడు .ఈ డబ్బును దాదాపు పస్తులతో బతుకుతున్న తన కుటుంబానికి పంపేవాడు .17వ ఏట తీవ్రంగా జబ్బుపడ్డాడు .అప్పటినుంచి మెడిసిన్ చదివి  డాక్టర్ కావాలనుకొన్నాడు .చెణుకులు ,హాస్య గుళికలు ,జోకులు రాసి మాస్కో లో కామిక్ ప్రెస్ లో పని చేస్తున్నన్న  అన్న అలేక్సాండర్ కు  పంపేవాడు.అందులో కొన్ని ప్రచురితమై మరిన్ని రూబుళ్ళు చేతిలో పడేవి .

19వ ఏట పరీక్ష పాసై మెడికల్ స్కూల్ లో చేరటానికి స్కాలర్ షిప్ పొందాడు .పుట్టిన ఊరి నుంచి మరో ఇద్దరు విద్యార్ధుల్ని తన వారితో ఉండమని చెప్పి మాస్కో వెళ్ళాడు .అందరూ చేరటం తో ఇల్లు ఇరుకై మురికివాడలో ఒక ఫ్లాట్ లోకి మారాల్సి వచ్చింది .బతకటానికి పోరాటమే చెయ్యాల్సి వచ్చేది .చిన్న తమ్ముడు మైకేల్ చాలా డామినేంట్ గా ఉండేవాడని చెకోవ్ అన్నాడు .అతనికి డబ్బు సంపాదించటం జాగ్రత్తగా ఖర్చు చేయటం తెలుసు .కుటుంబానికి నైతిక బలం అతనే .మెడిసిన్ లో చేరి చదువుతూ ,తేలికపాటి హాస్య రచనలు చేస్తూ ఉండేవాడు  .21వ ఏట మొదటిసారిగా అమ్మి ,తర్వాత వాటికేమీ సాహిత్య విలువలు లేవని  గ్రహించి వాటిపై ‘’ఆంతోష్ చేకాంటే ‘’’అనే కలం పేరు తో సంతకం పెట్టాడు .

క్రమంగా రచనలో పుష్టి ,పక్వత చోటు చేసుకొన్నాయి .ప్లాట్ కంటే ప్రొటెస్ట్ డామినేట్ చేసేవి .కాని నాన్ స్టాప్ గా రాస్తూనే ఉండేవాడు .27 ఏళ్ళకే 600 చిన్న కధలు రాసిన చేయి తిరిగిన కధకుదయ్యాడు .అప్పటికి ఆరడుగుల అందగాడు .కాని ఇరవై వ ఏట క్షయ వ్యాధి సోకింది.లక్షణాలను బట్టి గ్రహించాడుకాని కుటుంబం వారికి చెప్పకుండా రహస్యం గా ఉంచాడు .దీని నివారణకు చాలా ఖరీదైన మందులు చాలాకాలం వాడాలి .కనుక అది తన మేడిసన్ చదువుకు ,రచనకు అడ్డంకి అవుతుందని దాచుకొన్నాడు .

మెడిసిన్ పాసై 24వ ఏట ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు .పరిస్తితులకు అనుకూలం గా ఉంటూ,సైన్స్ ఆర్ట్   లకు ప్రాధ్యాన్యతనిస్తూ ,జీవితం లో హాస్యానికి సముచిత ప్రాధాన్యమిస్తూ గడిపాడు సాహిత్యాన్ని ,డాక్టరీ ని సమంగా ఆదరించాడు ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తే వైద్య పరిభాషలోనే చమత్కారంగా ‘’వైద్యం నా లీగల్ వైఫ్ అని ,సాహిత్యం నా మిస్ట్రెస్-ఒకామేతో విసుగొస్తే రాత్రి అంతా రెండవ ఆమెతో హాయిగా గడిపేస్తా ‘’అనేవాడు .   ఇది మర్యాదకాడుకదా అని ఒక పబ్లిషర్ అంటే ‘’తప్పదు .అది బోర్డం నుంచి తప్పిస్తుంది .నేను ఒకసారి ఒకరితో ఉండటం వల్ల,ఆ ఇద్దరిలో ఏ  ఒక్కరికి అసౌకర్యం ,నష్టం లేదు  నేను వారికి అవిశ్వాసం గా ఉన్నాను అనటానికి అవకాశమే లేదు ‘’అనేవాడు .

చెకోవ్ కంటే పాతికేళ్ళ సీనియర్ సవోరిన్ చెకోవ్ కు మిత్రుడు ఫిలాసఫర్ ,మార్గ దర్శి అయ్యాడు .అతని ప్రభావం తో చెకోవ్ రచనా శైలి మారింది .26ఏళ్ళకే చెకోవ్ తన మొదటి కదా సంపుటిని ప్రచురించాడు. ప్రేక్షకులంటే ఏమిటో అర్ధమైంది .ఒక ఆర్టిస్ట్ గా చెకోవ్ బాధ్యత ఏమిటో ఎరుక పరచాడు సవోరిన్ .రష్యన్ సంప్రదాయం లో ఒక నవల పాఠకులను ,జనన వంతుల్ని  చేయటం కంటే వినోద పరచటం   కోసం  రాద్దామనుకొన్నాడు .కాని అందులో చరిత్ర ,ఫిలాసఫీ ,సోషియాలజీ కలపాల్సి వస్తుందని అది అంతగా ఆకర్షణీయం కాదని భావించి వెనక్కి తగ్గాడు .దీనికి బదులు ‘’ఇవానోవ్ ‘’అనే నాటకం రాశాడు .ఇది బాగా క్లిక్ అయి ‘’పుష్కిన్ ప్రైజ్ ‘’కొట్టేశాడు ఇరవైలలోనే .ఇది అతి చిన్న వయసులో ఆ యువ రచయితకు దక్కిన అరుదైన గౌరవం అయింది .దీనితో ఆత్మ స్తైర్యం ఏర్పడి రాబోయే కాలం లో తానొక ప్రముఖ రచయితను అవుతానని సాహిత్యం లో తనకొక ప్రత్యేక స్థానం ఏర్పడుతుందని  గొప్ప ఆత్మ విశ్వాసం ఏర్పడింది .ఈ విషయం లో ఆయన ‘’చేకాంటే చాలా రాశాడు కాని చెకోవ్ దాన్ని అంగీకరించతానికి ఇబ్బంది పడుతున్నాడు ‘’అన్నాడు నిస్పృహగా

.Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కదివేడుపాలలో రెండు ఉప్పు రాళ్ళు,ఆనందం ఎక్కడో లేదు రవి శంకర్

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పండుటాకుల ఘోష ,మానవతా వాది మల్లయ్య శాస్త్రి

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మీరు మేధావులా వెర్రి గొర్రెలా ?ఏం వి ఆర్ శాస్త్రి ప్రశ్న,జనం ఆమోదమే పాలకుల కొలమానం

Inline image 1
Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చిక్కనవుతున్న నిరసన ,మహాత్ముడు ,మండేలా క్రికెట్ –

Inline image 1


Inline image 2
.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

“విశ్వనాదామృతం” ధారావాహిక

ఈటీవీలో 
 
“విశ్వనాదామృతం” ధారావాహిక 
 
“కళా తపస్వి” సినీ జీవిత ఆవిష్కరణ –
 
కె. విశ్వనాథ్ గారి సినిమాల తెర వెనుక వింతలూ, విశేషాలు 
 
(ఆయన మాటలలోనే)
 

 నవంబర్ 1, 2015 నుంచి ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 1:30 PM ఇండియా లోనూ, అమెరికాలోనూ (USA EST)

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నట్టుగానే మా హ్యూస్టన్ లోనూ అనేక మంది “విశ్వనాథాభిమానులు” ఉన్నారు. అసమానమైన గొప్ప కళాత్మక దృష్టి తో అనేక విజయవంతమైన చిత్రాల దిగ్దర్శకులు విశ్వనాథ్ గారి ఆయా సినిమాల నేపధ్యం గురించి మా అందరికీ ఉన్న కుతూహలాన్ని ఒక ఆత్మీయమైన చారిత్రక దృక్పథంతో పదిలపరిచే ప్రయత్నం చెయ్యాలని “విశ్వనాధ వీరాభిమాని” చెరువు రామ్మోహన్ కి సుమారు ఏడాది క్రితం వచ్చిన ఒక మంచి ఆలోచన రాగానే మా అందరితోటీ పంచుకున్నాడు. ఆ సమాలోచనలన్నీ కార్యరూపం దాల్చి రూపొందించబడినదే ఈ నవంబర్ నుంచి 1, 2015 నుంచి 13 వారాల పాటు మీరు చూడబోయే “విశ్వనాదామృతం” టెలివిజన్ సీరియల్ —ఈటీవీ లో.

ఈ అపురూప ప్రసారం అటు ఇండియా లోనూ, ఇటు అమెరికా లోనూ (EST) మధ్యాహ్నం 1:30 PM కి జరుగుతుంది.

ఉత్తమ అభిరుచులతో టెలివిజన్ కార్యక్రమాలు, చిన్న సినిమాల నిర్మాణానికి మా మిత్ర బృందం చేత హ్యూస్టన్ లో నెలకొల్పబడ్డ “శృతిలయలు” అనే లాభా పేక్ష లేని సంస్థ తొలి ప్రయత్నమే ఈ “విశ్వనాదామృతం”. ఈ కార్యక్రమాన్ని ఎక్కువ సంఖ్యలో వీక్షించి, ఆనందించి మా సంస్థ విజయానికి తోడ్పడమని మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాం.

ఒక అసాధారణ దర్శకుడి చలన చిత్ర జీవిత సందర్శనం……ఆయా చిత్రాల నిర్మాణంలో ఆయన సృజనాత్మక శక్తి కి అక్షర దానం, గాత్ర దానం, నటనా కౌశలం, సాంకేతిక పరిజ్జానం, ఆయన చిత్ర నిర్మాతలుగా ఆర్ధిక పరిపుష్టినీ అందించిన హేమా హేమీలు ఆత్మీయంగా వెలువరించిన అభిప్రాయాలతో….అందరికన్నా ముఖ్యంగా విశ్వనాథ్ గారే స్వయంగా ఇప్పటి దాకా ఎవరికీ తెలియని విశేషాలని మనతో పంచుకున్న ఒక అపురూపమైన ప్రయత్నం..ఒక ధారావాహికలా బుల్లి తెర మీద చలన చిత్ర చరిత్రని పదిలపరిచే ఈ ధారావాహికకి ఏంకర్ సుప్రసిద్ధ గాయకుడు నేమాని పార్థు. విశ్వనాథ్ గారితో సినీ ప్రస్థానం సాగించిన “సిరివెన్నెల సీతారామ శాస్త్రి”, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కమల్ హసన్, జయ ప్రద, వెంకటేష్, చిరంజీవి, మొదలైన నిష్ణాతులు ప్రధాన వ్యాఖ్యాతలు కాగా అక్కినేని, అల్లు అరవింద్ లాంటి ప్రముఖులు విశ్వనాథ గారి ప్రతిభా విశేషాలని విశ్లేశిస్తారు.

తెలుగు సినిమా కి దేవుడిచ్చిన వరంగా అందరూ భావించే “కళా తపస్వి” శ్రీ కాశీనాధుని విశ్వనాథ్ గారి “రీల్” లైఫ్ ….అనగా ఆయన తీసిన ప్రతీ సినిమా తాలూకు, నేపధ్యం, ఆ కథ రూపుదిద్దుకున్న తీరుతెన్నులు, పాత్రల ఎంపికలో, సాహిత్యం విలువలు ఉన్న పాటల రచనలలో, అత్యున్నతమైన సంగీతం సమకూర్చడం లో, ఆసక్తికరమైన చిత్రీకరణ లో ఎదుర్కొన్న ఇబ్బందులు మొదలైన విశేషాలతో ఆయన చలన చిత్ర జీవితాన్ని చరిత్రలో శాశ్వతంగా తెర మీద నిక్షేపించిన ఈ “విశ్వనాదామృతం” కార్యక్రమాన్ని కనుల పండుగ గా, వీనుల విందుగా ఆస్వాదించండి. ఈ ధారావాహికలో “ఓ సీత కథ, సిరివెన్నెల, సాగర సంగమం, శంకరా భరణం, శుభలేఖ, స్వాతి కిరణం, స్వరాభిషేకం, స్వర్ణ కమలం, శృతిలయలు మొదలైన విశ్వనాథ్ సినిమాలన్నింటి తెర వెనుక కథలు, పాటలు ఆసక్తికరంగా ఆవిష్కరించబడ్డాయి.

లాభా పేక్ష లేని ఈ “విశ్వనాదామృతం” టెలివిజన్ దారావాహికకి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఒక స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ ధారావాహిక సంక్షిప్త విశేషాలు ఇందుతో జత పరిచిన ఆంగ్ల ప్రకటన లో చూడండి.

ధన్యవాదాలతో

వంగూరి చిట్టెన్ రాజు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
ఫోన్: 832 594 9054

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అట్లతద్ది కి కృత్తి వెన్నుఒల్లంగి దిబ్బలో లో కొత్తరకం ఉయ్యాల

uyyala 001అట్లతద్ది కి కృత్తి వెన్నుఒల్లంగి దిబ్బలో లో కొత్తరకం ఉయ్యాల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -56 గూరూరు మైకా వ్యాపారం చేసిన వేగ రాజు వారు

ఊసుల్లో ఉయ్యూరు -56

గూరూరు మైకా వ్యాపారం చేసిన వేగ రాజు వారు

గూరూరు మైకా గనులు ,వ్యాపారం అంటే చప్పున గుర్తోచ్చేవారు కృష్ణా జిల్లా మానికొందలోని గోగినేని వారి కుటుంబం .అక్కడి మైకా గనులపై తిరుగు లేని ఆధిపత్యం సంపాదించి పుష్కల౦ గా  డబ్బు సంపాదించి అపర కుబేరులయ్యారని అందరూ చెప్పుకొనే విషయమే .సరుకు ఒకటే కాని దాని లోని లోతులుపాతులు తెలిసి వ్యాపారం చేస్తే కలిసొస్తుంది .లేక పొతే నష్టాల్లో ఆ గని లోతుల్లోకి కూరుకు పోతారు .దీనికెంతో లౌక్యం చాకచక్యం ,ధీమా, వ్యవహార దక్షత,అవతలి వాడిని ఎదుర్కొనే సత్తా ,సామర్ధ్యం ఉండాలి ,.దీనికి తోడూ అదృష్టమూ కలిసి రావాలి  .మైకా పైకి కనిపించే తళతళలతో ఊరించి బుట్టలో వేసు కొంటుంది. దిగితెనేకాని లోతు తెలియదుకదా .తెలీకుండా దిగితే ,అంచులు పట్టుకొనే తెలివి తేటలు లేకపోతె పెట్టిన సొమ్మంతా గనిపాలే .మిగిలేది అప్పులూ, తిప్పలే    .ఈ రెండవ రకానికి చెందినా వాళ్ళే మా ఉయ్యూరు లోని వేగారాజు వారు .పూర్తిగా మునిగిపోయారు .ఇప్పటిదాకా  ఉయ్యూరు వారు మైకా వ్యాపారం చేశారని నాకు తెలీదు  మా ఉయ్యూరు వాడు ,హైస్కూల్ లో నాశిష్యుడు ,కే సి పిలో పని చేసి రిటైరై  బెంగుళూర్ లో స్థిర డ్డవాడు  ,ఏ దేశం లో ఉన్నా సరసభారతి ని చదివి స్పంది౦ చేవాడూ ,వేగరాజు రాజేంద్ర ప్రసాద్ ,ఏదో పని మీద ఉయ్యూరు వచ్చి నాలుగు రోజుల క్రితం మా ఇంటికొచ్చి మాటల సందర్భంగా తమ తాతగారు స్వర్గీయ వేగ రాజు వెంకట సుబ్బయ్య గారు గూడూరు మైకా గనుల వ్యాపారం చేశారని ,అందులో నష్టపోయారని సవివరంగా తెలిపాడు .నేను రాసేదంతా ఆతను నాకు చెప్పిన విషయాలే .

          శ్రీ వేగరాజు వెంకట సుబ్బయ్య గారిల్లు ఉయ్యూరు లో విష్ణాలయం వెనక బజారులో ఉంది .ఆయన్ను నా చిన్నప్పుడు చూశాను .అప్పటికే బాగా ముసలివారు .వాకిట్లోదిగాలుగా  కూర్చుని ఉండేవారు.ఆయన భార్య సుందరమ్మగారినీ చూశానని గుర్తు . మేము విష్ణాలయానికి మా ఇంటి నుంచి ఈ వెనక దారిలోనే వెళ్ళేవాళ్ళం .ఇప్పటికీ అలానే వెడతాం.అప్పటికి ఆయన గురించి నాకేమీ పెద్దగా తెలియదు .కాని అయన తమ్ముడు వేగ రాజు సీతారామయ్య గారు ఇంకా వయసులోనే ఉన్నారు .బాగా స్థితిపరులని పేరు పొందారు .ఈయన ఇల్లు గుండు పద్మావతమ్మ గారింటికి వెళ్ళే దారిలో ఎడమ ప్రక్క ఎత్తైన స్థలం లో ఉండేది .సంతానం లేదు .అన్నగారి పిల్లలే వారింట్లో పిల్లలు .సీతారామయ్యగారు వేగ రాజు వారికే దత్తత వెళ్లారట .అందుకే ఆస్తి బాగా కలిసివచ్చిందట .వీరి ద్దరి మధ్య వెంకటేశ్వర రావు గారు౦౦ డేవారట .ఈయన్ను నేను చూసిన గుర్తు లేదు .ముగ్గురికి పిత్రార్జితమైన ఇల్లు ,పొలాలు ,స్థలాలు బాగానే ఉండేవట .వీరి పొలాలు తోటల వల్లూరు రోడ్డుకు ,పుల్లేరుకాలువకు ఎదుటి వైపు రోడ్డును ఆనుకొని ఉండేవట .ఉయ్యూరులో వేగరాజు వారి కటు౦ బానికి మంచి పలుకు బడి ఉండేదట .ఇక్కడి ఆస్తి అజమాయిషీ వెంకటేశ్వరరావు గారు చేసేవారట .

            ఈ అన్నదమ్ములలో పెద్ద వారైన వెంకట సుబ్బయ్యగారు గూడూరు వెళ్లి  మైకా గనులకొనుబడి , అమ్మకం  సుమారుగా 1940నుండే చేసేవారట .కొంతకాలం బాగా కలిసోచ్చిందట .విధి వైపరీత్యం వలన వీరి  గనులు కొన్ని కూలిపోయాయి .వ్యాపారం మొత్తం దివాలా తీసిందట .పది వేల రూపాయల అప్పులలో కూరుకు పోయారట .దిగాలుపడి గూడూరు నుంచి ఉయ్యూరు వచ్చేశారు .ఆ అప్పులు తీరిస్తేకాని ఆయన తల ఎత్తుకొలేని స్తితి .అప్పుడు తమ్ముడు వెంకటేశ్వర రావు గారు అన్నగారి పేర ఉన్న స్థలాలు ,పొలాలు   అయినకాడికి అమ్మేసి ,ఆ పది వేలు తీర్చేసి ,తానూ బొక్కాల్సింది బొక్కేసి రాజమండ్రి వెళ్లిపోయారట .ఊళ్ళో కరణం సీతం రాజు సాంబశివ రావు గారు ఈ వెంకటేశ్వర రావు గారికి బాగా వత్తాసు పలికి వెయ్యి రూపాయలు కిమ్మతు ఉన్నదాన్ని వందరూపాయలే వాల్యూ గాచూపించి సుబ్బయ్య గారిని ఈ ఇద్దరూ నిలువునా ముంచారని రాజేంద్ర ప్రసాద్ మొన్న ;లబో దిబో మన్నాడు. ఆతను చెప్పేదాకా నాకు అసలే విషయమూ తెలియనే తెలియదు .ఇలా ఉయ్యూరు వేగ రాజు వారి గూడూరు మైకా గనుల వ్యాపారం ముగిసిన అధ్యాయమే అయింది .కాని అదృష్టం బాగుండి ఆయన అల్లుడు మైకాలో పిచ్చ పిచ్చగా  సంపాదించాడట .ఆ కద తెలుసుకొందాం .ఎవరి అదృష్టం ఎలాంటిదో ?

        సుబ్బయ్యగారు సుందరమ్మగార్లకు శ్రీ వెంకట నాగేశ్వర రావు ,శ్రీ సాంబ శివరావు ,శ్రీ గోపాలకృష్ణ మూర్తి ,శ్రీ విశ్వేశ్వర రావు ,శ్రీ సూర్య నారాయణ ,శ్రీ విజయ రామారావు  అనే 6గురు కుమారులు .ఒక్కతే శ్రీమతి దుర్గాంబ ఆడపిల్ల .ఇందులో విస్సు ,సూరి మాకు సీనియర్లు .విజయ రామారావు నాకు హైస్కూల్   లో క్లాస్ మేట్.

   దుర్గాంబ గారిని కడప జిల్లా రాజం పేట కు చెందిన శ్రీ గోటేటి వెంకటేశ్వర రావు గారికిచ్చి వివాహం చేశారు .అప్పటికే ఆయన మైకా గనుల యజమాని. దుర్గాంబ గారి పాణి గ్రహణం తో ఆయనకు అంతా బాగా కలిసొచ్చింది. మైకా సామ్రాజ్యాధిపతి అయి ఇబ్బడి ముబ్బడిగా సంపాదించి వ్యాపారం ఎలా చేయాలో నిరూపించి మామగారికి ఊరట కలిపించాడు మామగారిది ‘’బాపన వ్యవసాయం ‘’లా వ్యాపారం ఉంటె అల్లుడుగారు ‘’వైశ్య దృక్పధం ‘’తో గొప్ప సంపాదనా పరులయ్యారు .ఎదురులేని వ్యాపారి అనిపించారు రాజేంద్ర చెప్పిన దాన్ని బట్టి ఇప్పటకీ గోటేటి వారికి 14లారీలు ,జీపులు కార్లూ ఎన్నో ఉన్నాయి .

            సుబ్బయ్య గారి సంతానం లో శ్రీ సాంబశివరావు గారు ఉయ్యూరు కెసీపి లో ఉద్యోగం చేశారు .మంచి పలుకుబడి సంపాదించారు .అందరికి తలలో నాలుకగా ఉండేవారు .ఏడాది క్రితమే సుమారు 90ఏళ్ళు జీవించి చనిపోయారు .ఆయన భార్య చనిపోయి సుమారు 40ఏళ్ళు అవుతుంది .వీరికుమారులు –శ్రీ సురేష్ బాబు  ,శ్రీ రాజేంద్ర ప్రసాద్ ,,బాబ్జీ అనే శ్రీ శంకర్ .ఇతను అకస్మాత్తుగా తండ్రి మరణానంతరం పదినెలల క్రితం చనిపోయాడు .బాబ్జీ ఐ టి ఐ ఇంస్ట్రక్తర్ గా పని చేసి రిటైర్ అయి ఉయ్యూరు చేరి ‘’వేగ రాజు మాన్షన్ ‘’అనే అపార్ట్ మెంట్ సముదాయం నిర్మించి తాతగారి పేరు నిలబెట్టాడు .సురేష్ ,రాజేంద్ర ,బాబ్జీ లు హైస్కూల్ లో నా శిష్యులే .ఉయ్యూరు బ్రాహ్మణ సంఘం లో క్రియా శీలక పాత్ర వహించిన వారే .క్రిందటి కార్తీకమాసం లో కొత్తగా  ఏర్పడిన బ్రాహ్మణ సంఘం లో బాబ్జీ కీలల పాత్ర పోషించాడు .పేదబ్రాహ్మణ విద్యార్ధులకు తండ్రి సాంబశివరావు గారి పేర పది వేల రూపాయల స్కాలర్ షిప్ లను అందజేసిన వదాన్యుడు .సా౦బశివరావుగారి కి ఇద్దరమ్మాయిలు శ్రీమతి బేబి జ్యోతి ,శ్రీమతి రాణీ సుజాత .ఇందులో జ్యోతి హైస్కూల్ లో నా శిష్యురాలే .

   ఉయ్యూరు వీరమ్మ తల్లికి ,వేగ రాజు వారి కుటుంబానికి సాన్నిహితం ఉంది. మాఘ మాసం లో శుద్ధ ఏకాదశి నాడు అమ్మవారు ఊరేగింపుగా బయల్దేరేటప్పుడు ముందుగా వేగ రాజు వారింటికి వచ్చిచీ, సారే, హారతి తీసుకొన్న తరువాతనే బయాల్దేరుతుంది అని ,వీరమ్మ తిరునాళ్ళు  11వ రోజు జరిగే  సిడి బండీ ఉత్సవం  రోజున  తాటి మాను సిడిబండీకి మొదట వేగరాజువారే గుమ్మడికాయ కట్టి  కొబ్బరికాయ కొట్టి ,హారతిస్తారని ఆ తర్వాతే మిగిలిన వారు చేస్తారని అప్పుడే సిదిబండీ బయాల్దేరుతుందని ,ఇది అనాదిగా ఆనవాయితీగా వస్తోందని  రాజేంద్ర చెప్పాడు .

             మరో విషయం తో కలుద్దాం

సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-10-15-ఉయ్యూరు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

అమెరికా తెలుగు వారికి అండగా శైలజ -జ్యోతి గౌరీ మహాత్మ్యం కంచె ,రాజు గారిగది సినీ సమీక్ష –

Inline image 1
 
Inline image 2
Inline image 3

 
 
 
Inline image 4
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లాలూ దశ తిరిగేనా ?సర్దేశాయ్ దీపశిఖ కొన్ని ఆధ్యాత్మిక వ్యాసాలూ

 

Inline image 1
Inline image 2
 
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అయి పోయిన సచిన్ ఆటతో ఇప్పుడు ఆడుకుంటున్న కపిల్

Inline image 1
Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒక్క సంతకం తో సహారా పరివారాన్ని సహారా ఎడారిలో పడేసిన కె సి ఆర్.

—

Inline image 1
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముషారఫ్ నోట నిజాలు మరియు కొత్తా దేవుడండీ

Inline image 1
Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రేపుఅట్ల తద్ది -వరాలిచ్చే వాయన పండుగ

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కోణార్క అందాలు -ఆంధ్ర జ్యోతిమరియు ముదిరిపోతున్న సెక్యులర్ పిచ్చిభూమి

Inline image 1
 
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -80

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -80

 

  1. వ్యావహారిక సత్తా వాద వేదాంతాన్ని ప్రచారం చేసిన అమెరికన్  సంస్కర్త – జాన్ డ్యూయి

అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ రైతు, నిర్భయ ఉదారవాది, ప్రాగ్మాటిజం ప్రచారకుడు విద్యా సాంఘిక సంస్కర్త ,ఫిలాసఫర్ జాన్ డ్యూయి అమెరికా రాజకీయాలను, సంస్కృతిని ఆధునిక విద్యనూ ప్రభావితం చేసిన ఆలోచనాపరుడు. అమెరికా ప్రజలు ఆయనను ప్రగతిశీల విద్య విధాన స్థాపకుడు అంటారు. డార్విన్ కు విలియం జేమ్స్ కు అనుచరుడు. విధానాలను స్పష్టపరచడమే కాక   వ్యాప్తికి ధర్మయుద్ద్ధం చేసినవాడు. డార్విన్ లాగానే జ్ఞానం ముందే ఏర్పడిన భావాల పై ఆధారపడి ఉండదని, జీవాత్మక యదార్దాలపై ఆధారపడి ఉంటుందని అన్నాడు. విలియం జేమ్స్ వలెనే  నిరంకుశాధికారం, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా వ్యావహారిక సత్తా వాదం (ప్రాగ్మాటిజం ) ను బలపరచాడు. వ్యవహారంలో ఉన్నవాటిని ప్రశ్నించలేదు. ఆలోచన, పదార్ధం రెండూ కూడా ఒక చలనశీల విధానం అని, తర్కం అనేది వృద్ధి చెందుతున్న ఒక విధానమని తత్వ శాస్త్రం ,వాస్తవ విషయ జనిత సంగ్రహాల సమాహారం కాదని, దానికి ఒక సాంఘిక పునాది ఉంటుందని కనుక అది సాంఘిక శక్తిగా భావించాలని అన్నాడు.

 

జాన్ డ్యూయి    అమెరికాలోని వెర్మాంట్ రాష్ట్రంలో బర్లింగటన్ పట్టణంలో 20-10-1859లో జన్మించాడు. అదే సంవత్సరంలో చార్లెస్ డార్విన్ ‘’ ఆరిజిన్ ఆఫ్ స్పెసీస్’ ప్రచురించటం ఒక  యాదృచ్చిక సంఘటన. నాలుగు రోజుల తర్వాత జాన్ బ్రౌన్ హార్పర్స్ ఫెర్రీ పై దాడి చేసాడు. క్రీ.శ. 16౦౦ నుండి ఇతని కుటుంబం అమెరికాలోనే ఉంది. తండ్రి ఒక కిరాణా షాపు నిర్వహించేవాడు. తల్లి ఒక వేర్మార్మర్ కుమార్తె. ఆమె పూర్వీకులు కేప్ గాడ్ రైతులు. చిన్నతనం నుంచి పుస్తకాలలో కూరుకుపోఎవాడు. పుస్తకాలతోనే  అతని ఆట. 20 ఏళ్ళు రాక ముందే వెర్మాంట్ యూనివర్సిటీ నుండి పట్ట భద్రుడయ్యాడు. వెంటనే పాఠాలు బోధించాడు. పెన్సిల్వేనియాలోని ఆయిల్ సిటీ లో మొదట ఉద్యోగంలో చేరి తర్వాత తన సొంత రాష్ట్రంలో అక్కడి గ్రామీణ స్కూళ్ళలో బోధన చేసాడు. కొన్నేళ్ళ తర్వాత తత్వ శాస్త్రాన్ని ముఖ్య విషయంగా ఎంచుకుని జాన్స్ హాప్కిన్స్ లో చేరి 25 ఏళ్లకే డాక్టరేట్ పొందాడు. తన విద్యార్థిని అయిన యాలిస్ చిప్మన్ ను పెళ్లి చేసుకున్నాడు. మిచిగాన్ యూనివర్సిటీ లో  ఇన్ స్టక్ట ర్ గా చేరి 1888 లో మిన్నెసోటా యూనివర్సిటీలో తత్వ శాస్త్ర ఆచార్యుడు అయ్యాడు. 35 వ ఏట చికాగో యూనివర్సిటీలో  తత్వ శాస్త్ర విభాగానికి అధిపతి అయ్యాడు.  రెండేళ్ళ తర్వాత దాని’’ లాబరేటరీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ‘’కు డైరెక్టర్ అయ్యాడు. అది  ప్రయోగాత్మక విద్యా విధానం కోసం ఏర్పడిన స్కూల్. నిజాలు, గణాంకాలు ఆలోచనలు పిల్లలపై వారికి ఆసక్తి కలిగేవరకు బలవంతంగా రుద్దరాదని అనే ఆశయంతో ఈ స్కూల్ నడుస్తోంది. జాన్డ్యూయి   పిల్లవాడి వర్తమాన అనుభవాన్ని సుసంపన్నం చేయాలని  స్పష్టంగా తెలియని భవిష్యత్తు కోసం వారిని ఇబ్బంది పెట్టరాదని భావించాడు. అతని ఆశయం’’ పని చేస్తూ నేర్వడం’’ (లెర్నింగ్ బై డూయింగ్). భవిష్యత్తుకోసం విద్య బోధించడం కాక ఇప్పటి జీవితాన్ని అర్థవంతం చేసేట్లుగా విద్య ఉండాలని చెప్పేవాడు. దీనిపై అప్పుడు వాదోపవాదాలు ఉండేవి.  “The new spirit in education forms the habit of requiring that every act be an outlet of the whole self” అనేది అతని వాదం. సనాతన భావాలకు విరుద్ధంగా ఆయన చెప్పేవాడు. తన భావాలను ఆయన మొదటి గ్రంథం’’ ది స్కూల్ అండ్ సొసైటీ’’లో విస్పష్టంగా వివరించాడు. ఆయన 40 వ ఏట ఇది ప్రచురించబడింది.

 

45 వ ఏట చికాగో యూనివర్సిటీకి రాజీనామా చేసి కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా చేరి అక్కడే జీవితమతా చిరస్మరణీయమైన సేవలు అందించాడు. ఆయన శిష్యుడు, సహాయకుడు మాక్స్ ఈస్ట్మన్’’ సాటర్ డే రివ్యూ ఆఫ్ లిటరేచర్ ‘’లో ఆయన రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ లాగా ఉండేవాడని వర్ణించాడు. సమతలమైన జుట్టు, నల్ల మీసాలు కాంతివంతమైన కళ్ళతో తరగతి గదికి వచ్చేవాడు. ఆయన స్ఫూర్తినిచ్చే ఉపన్యాసకుడు కాదు. పాఠాలు మార్పు లేకుండా మూస విధానాలు ఉండేవి. ప్రేరణ కలిగించేవి కావు. కొలంబియా యూనివర్సిటీ తత్వ శాస్త్ర అధిపతి ఇర్విన్ ఎడ్మండ్ ఈయన బోధన మొదటిసారి విని చాలా నిరాశ చెందాడు. కానీ అయన విషయ పరిజ్ఞానం చాలా లోతైనదని ఆయన మేధా పరిణతికి ఆశ్చర్య పడ్డాడు. ఆయన చెప్పేదంతా సృజనాత్మక తత్వ శాస్త్రమే.

50 వ ఏట “How we think” పుస్తకం రాసాడు. కూతురు ఈవ్లిన్ తో కలసి ‘’స్కూల్స్ ఆఫ్ టుమారో’’రాసాడు. ‘’డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్’’ అనే ఈయన రాసిన గ్రంథం చాలా ప్రాముఖ్యమైనదిగా భావిస్తారు. 61 వ ఏట’’ రి కన్స్ట్రక్షన్ ఇన్ఫిలాసఫీ ‘’ రాసాడు. తత్వ శాస్త్రాన్ని అర్థం చేసుకోలేని వారికి వెలుగు మార్గం చూపే కరదీపికగా దీనిని భావిస్తారు. పిల్లలకు వారి భావాలను బయటకు చెప్పే స్వాతంత్ర్యం ఇవ్వాలని వారి స్వేచ్చకు భంగం కలిగించరాదని చెప్పేవాడు. ఒకసారి ఈయన నర్సరీ స్కూలుకు పర్యవేక్షణకు వెళ్ళగా అక్కడ ఆయన కొడుకు ఒక పెద్ద కుర్రాడి చేత తన్నులు తింటూ నేల మీద అసహాయంగా పడివుండటం చూసాడు. అక్కడే ఉన్న ఒక ఉపాధ్యాయుడు “ఇది మా అభివృద్ధి విద్యా విధానం” అని నవ్వుతూ అన్నాడు. వెంటనే డ్యూయి ‘’ప్రపంచంలో దుర్మార్గం చాలా ఉందని దానికి తన కుమారుడు ఎదిరించటానికి   సిద్ధంగా ఉన్నాడని అన్నాడు. ఇంకొకసారి ఆయన ఒక క్లాస్ రూమ్ లోకి వెళ్ళగా క్లాసు గోలగోలగా ఉండగా ఒక కుర్రాడు పుస్తకాన్ని తదేక దీక్షగా చదువుతుండటం చూసాడు. అక్కడ ఉన్న టీచర్ ‘’అతన్ని మీరు క్షమించాలని,అతను స్కూల్ లో చేరి ఒక వారమే అయ్యింది.’’అన్నాడు అంటే   ఇతను కూడా ,వారిలాగానే  అల్లరి చేసేవాడుఅనే అర్ధం వచ్చేట్లు అన్నాడు ‘’మీ విద్యా సంస్కరణలు ఇలా ఏడ్చాయి ‘’అని దెప్పి పొడవటం అన్నమాట .. ఇలాంటి సంఘటనలు చాలానే ప్రచారంలో ఉన్నాయి. వయస్సు పెరిగిన కొద్దీ ఆయన శక్తిసంపన్నుడు అయ్యాడు. 50-60- ఏళ్ల మధ్యలో చాలా చురుకుగ్గా ఉన్నాడు. న్యూయార్క్ నగరంలో ‘’టీచర్స్ యూనియన్ ‘’ఏర్పడడానికి కృషి చేసాడు. రాజకీయంలో ప్రవేశించాడు. ఉదారవాదులలో ప్రముఖుడయ్యాడు. “పార్టీ కంటే వ్యక్తికీ ఓటు వేయండి” అనే నినాదాన్ని ప్రచారం చేసాడు. జపాన్ పర్యటించి టోక్యోలోని ‘’ఇంపీరియల్ యూనివర్సిటీ’’లో  ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆయన శిష్యులైన చైనా విద్యార్థులు ఆయనను పట్టుబట్టి చైనాకు తీసుకెళ్ళాడు. అక్కడ రెండేళ్ళు పెకింగ్ లో, నాంకింగ్ లో ఉపన్యాసాలిస్తూ ఉన్నాడు. 65-70 ఏళ్ల మధ్య టర్కీ, మెక్సికో, రష్యా సందర్శించి అక్కడి విద్య ప్రయోగాలను నిర్దేశించాడు. 78 వ ఏట ఒక తీవ్రమైన వివాదాస్పద సంఘటనలో ఇరుక్కున్నాడు.

సోవియట్ ప్రభుత్వం లియాన్ ట్రాటస్కీ అనే ప్రవాసంలో ఉన్న అతనిపై చేసిన ఆరోపణలను పరిశోది౦చటానికి ఏర్పడిన కమిషన్ కు నాయకత్వం వహించాడు. స్టాలిన్ అనుచరులందరినీ అక్కడి ప్రభుత్వం చంపేస్తోంది.   ట్రాటస్కీ చాకచక్యంగా తప్పించుకుని మెక్సికో వెళ్ళిపోయాడు. కానీ అక్కడ దారుణంగా హత్య చేయబడ్డాడు. ద్యూయి తటస్థంగా ఉన్నాడు. తాను ట్రాటస్కయిట్ కానీ స్టాలినిస్టూకాదని  మాస్కో వారి సాక్ష్యాన్ని , అవతలి వారి సాక్ష్యం విన్నతర్వాత మాత్రమే అ౦గీకరిస్తామని చెప్పాడు. కమిషన్ ట్రాటస్కీ కి తీవ్రవాదం, ఫాసిజం తో అమబంధం లేని అమాయకుడుఅని ,, నిర్దోషి అని తీర్పిచ్చింది. కనుక అతనిపై ఆందోళనలు తగవని అది ఒక కుట్ర అని చెప్పింది. కమ్యూనిష్టులు అతనిని తీవ్రంగా రెచ్చ గొట్టినా ఆయన కలవరపడలేదు. ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా రక్షించాలని ఆయన ధ్యేయం. జీవితం చరమాంకంలో ఆయన భయాలకు ఎర అయ్యాడు. ఎనభైలలో కూడా తను నమ్మిన సిద్ధాంతాలను ప్రచారం చేయటానికి జంకలేదు. ఎనభై ఐదు లో కూడా ప్రజాస్వామ్య విలువలకోసం తీవ్రపోరాటం చేస్తూనే ఉన్నాడు. 1946లో చికాగో, డెట్రాయిట్ లో కార్మిక నాయకులతో కలిసి పీపుల్స్ పార్టీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. ‘’పీపుల్స్ లాబీ’’కి అధ్యక్షుడయ్యాడు. అమెరికాలోని’’ రెండు పార్టీలు’’ పెద్ద వ్యాపార సంస్థలు అన్నాడు. ప్రభుత్వాదికారం ధనస్వామ్యం చేతిలో కాక ప్రజలకు దక్కాలి అని ప్రచారం చేసాడు. 1946లో రాసిన’’ ప్రాబ్లంస్ ఆఫ్ మెన్’’ లో తన అభిప్రాయాలను పొందుపరచాడు. దీనిని సమీక్ష చేసిన ఆల్విన్ జాన్సన్ అనే న్యూ స్కూల్ ఫర్ సోషల్ రిసర్చ్ అధ్యక్షుడు  ‘’ తత్వశాస్త్రంలోనూ రాజకీయంలోనూ గొప్ప ప్రతిక్రియకు తోడ్పద్దాడని అన్నారు. తత్వ శాస్త్రాన్ని సమూలంగా మార్చాలని భావించాడు. ప్రస్తుత ప్రపంచం ప్రజాస్వామ్యానికి చెందినదని భావించాడు. ప్రజాస్వామ్యం కాలం కోసం ఆగకూడదని ఊహాగానాలపై ఆధారపడకూడదని అన్నాడు. 87లో ఆయన చూపు, ఆలోచనలకు ఏమాత్రం పదును తగ్గ లేదు. మరింత ద్రుఢపడ్డాడు. భార్య చనిపోయిన 20 ఏళ్ళ తర్వాత, 88ఏట తన వయస్సులో సగం వయస్సును రోబర్తా గ్రాంట్ అనే విధవ స్త్రీని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య వలన ఆరుగురు పుడితే అందులో ఇద్దరు బాల్యంలోనే చనిపోయారు.ఏడవ వాడిని పెంచుకున్నాడు. తర్వాత ఇంకొక ఇద్దరినీ యుద్ధ శరణార్ధులను దత్తత తీసుకున్నాడు. తొంభై వ  పుట్టినరోజున అనేక సన్మానాలు, గౌరవాలు, డిన్నర్లు, ప్రపంచవ్యాప్త ప్రశంశలు అందుకున్నాడు. ఆయన అభిమానులు తొంభై వేల డాలర్లను కానుకగా అందించారు. ఆ ధనాన్ని తన అభిమాన విద్యా ప్రణాళికల అమలుకు ఖర్చు చేశాడు ..

తొంభై ఒకటవ ఏట కిందపడగా మోకాలు విరిగింది. త్వరగా కోలుకుని ‘’ఏల్స్’’ అందచేసిన గౌరవ పట్టాను స్వయంగా తీసుకున్నాడు. 1952  వసంత కాలంలో న్యుమోనియా వచ్చి తీవ్రమై 93 వ ఏట 2-6-1952 న జాన్ డ్యూయీ మరణించాడు.

ఆయన రచనలు స్టయిల్ కంటే విషయానికి ప్రాధాన్యం ఉండేది. ఆయన ప్రకటనలు సంక్లిష్టంగా పునరుక్తితో ఆకర్షణీయంగా ఉండేవి కావు. ఆయన రాసిన ముప్పై ఎనిమిది పుస్తకాలు, ఎనిమిది వందలపైగా రాసిన వ్యాసాలలో కొట్టవచ్చేటట్లు ఒక వాక్యమూ కనిపించదని ,’’కోటబుల్ కోట్స్ ‘’ఉండవని విమర్శకులు అంటారు. కానీ అంతర్గర్భంగా తీవ్రమైన,  ఆలోచనా సంపన్నమై ఉంటాయని తెలుస్తుంది. “Dewey calls for intellectual pioneering toward wider horizons”. ఆయన తత్వ శాస్త్రాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. కానీ ప్రతివారూ దానిని అనుసరిస్తారు. “His philosophy grows out of common experience and can be tested by it. It is applicable not only to college professors but to travelling salesmen, plumbers, farmers, clerks. His pulse beat quickens to the drums of humanity’s blundering march toward freedom.” ఆయన –స్థిరం గా  మంచితనానికి అవకాశమున్న చెడ్డతనానికి మధ్య విభజనరేఖ గీయటానికి ఇష్టపదేవాడు కాదు. ఆయన దృష్టిలో చెడ్డవాడు అంటే  “The bad man is the man who, no matter how good he has been, is beginning to deteriorate to grow less good.  అలాగే మంచివాడు అంటే “The good man is the man who, no matter how morally unworthy he has been, is moving to become better”. జీవితాన్ని నిర్వచి౦చ లేమని అది ఎప్పటికి చివరిది కాదని అది ఎప్పుడూపురోగామిస్తూనే ఉంటుందని   అన్నాడు. అలాగే “Not perfection has a final goal, but the ever enduring process of perfecting maturing refining is the aim of living”అని చెప్పాడు. మనం ఉన్న ప్రపంచం అన్నిటికంటే ఉత్కృష్టమైనది అనుకోవటం నిరాశావాద౦  యొక్క విరక్తత అని అన్నాడు. ప్రజాస్వామ్యం, సమాజం జాన్ డ్యూయి కి అతి ముఖ్యమైన విషయాలు. నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా పోరాడటానికి అమెరికాలోని ‘’యా౦కీలను’’ సన్నద్ధం  చేయటమే ఆయన ధ్యేయంగా జీవించాడు. అతని దృష్టిలో తత్వ శాస్త్రం అంటే “is a catholic and far sighted theory of the adjustment of the conflicting factors of life.”

డ్యూయీ రె౦డిటికి ప్రాదాన్యమిచ్చాడు .ఒకటి స్కూల్స్ ,రెండవది పౌర సమాజం .విద్య చెప్పే వారు ఎప్పటికప్పుడు స్వయం సమర్ధం అవ్వాలన్నాడు లేక పొతే కాలం కంటే వెనక బడతారని చెప్పాడు .టీచర్ నిరంతర విద్యార్ధి గా ఉండాలని సూచించాడు .ఇదే విద్యా నాణ్యతను పెంచుతు౦దన్నాడు .అందుకే కొఠారి ‘’విద్యార్ధి వ్యక్తిత్వ వికాసం  క్లాస్ రూమ్ లోనే తీర్చి దిద్దబడు తుంది ‘’అన్నాడు .టీచర్ ఎడ్యు కేషన్ కు ఎక్కువ ప్రాదాన్యమిచ్చాడు .జర్నలిజం సంఘాన్ని తీర్చి దిద్దటం లో ప్రముఖ పాత్ర పోషించాలన్నాడు.పబ్లిక్ ను ఎలివేట్ చేసే పని వారిదే నంటాడు .మానవత్వమంటే మహా మక్కువ ఉన్న డ్యూయీ ఆ సంబంధ కార్యక్రమాలనేన్నిటిలోనో చురుకుగా పాల్గొన్నాడు .  ‘’humanism means not a contraction of human life ,an expansion in which nature and the  science of nature are made the willing servants of human good.’’అని మానవత్వాన్ని నిర్వచించిన మేధావి..విద్యా స్వేచ్చ కోసం అయిన్ స్టీన్ తో కలిసి ‘’ఇంటర్ నేషనల్ లీగ్ ఫర్ ఎకాడేమిక్ ఫ్రీడం ‘’ లో అమెరికా తరఫున సభ్యుడైనాడు .1940లో హోరేస్ కేల్లెన్ తో కలిసి బెర్ట్రాండ్ రసెల్ కేసు కోసం అనేక వ్యాసాలూ రాశాడు .టీచర్ల వ్యక్తిత్వ రక్షణకోసం ,కమ్యూనిస్ట్ ల నీడ పడకుండా స్వేచ్చాయుత ఉపాధ్యాయ ఉద్యమ నిర్వహణ చేశాడు  ‘’నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్ మెంట్  ఆఫ్ కలర్డ్ పీపుల్ ‘’ఏర్పరచాడు .1939లో ‘’’లీగ్ ఫర్ ఇండస్ట్రియల్ డెమోక్రసీ ‘’కి అధ్యక్షుడయ్యాడు .’’కాంగ్రెస్ ఫర్ కల్చరల్ ఫ్రీడం ఫ్రంట్ ‘’కు డ్యూయీ ,బెర్ట్రాండ్ రసెల్ కార్ల్ జాస్పర్స్ మొదలైన వారు ‘’ఆనరరీచైర్మన్ ‘’హోదా పొందారు .

 

యూని వర్సిటి ఆఫ్ ఒశియో , పెన్సిల్వేనియా ,ఏల్,రోమ్ లు  గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి. బ్రూక్లిన్ ,న్యూ యార్క్ లలో ఆయన పేర హైస్కూల్స్ ఏర్పడ్డాయి .గ్రీన్ బే , బార్రింగ్ టన్ లలో డ్యూయీ  పేరిట ‘’ఎకాడేమి ఆఫ్ లెర్నింగ్’’సంస్థలేర్పడ్డాయి .

 

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-10-15-ఉయ్యూరు ,

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment