శ్రీ శైల సందర్శనం –4 చూడ దగిన ప్రదేశాలు

 శ్రీ శైల సందర్శనం –4

                                            చూడ దగిన ప్రదేశాలు
   శ్రీ శైల మల్లికార్జున ,భ్రమ రాంబా దేవుల దివ్య దర్శనం తారు వాత సమీపం లోని విశేషాలు తెలుసు కొన్నాం .ఇప్పుడు కొంచెం దూరం గా వున్న దర్శనీయ స్థలాల గురించి తీలుసుకొందాం .
అంకాలమ్మ గుడి -ప్రసంనాన్జనేయస్వామి -పాతాళఈశ్వర    -వితలేస్వర (vithalesvara )   -సాక్షి గణ పతులు
మల్లికార్జున గుడికి ఎదురు రోడ్డులో చివర ,కుడివైపు చెట్టు తొర్రలో వ్యాపించిన గుడినే అంకాలమ్మ గుడి అంటారు .
పాతాల గంగ రోడ్డు లో ,మెట్లకు ఎడమ వైపు శ్రీ ప్రసన్నాంజనేయ దేవాలయం వుంది .ఇది 1460 నాటికే ఉండేదని ”అనాసినీ కిచెన్ ”అనే రష్యన్ రచయిత రాసిన గ్రంధం లో వుంది .స్శిదిల మై పోగా మళ్ళీ ఆలయాన్ని నిర్మించారు .
ఈ ఆలయానికి ఎదురు గా ,”పాతాలేశ్వర ఆలయం ”వుంది .
రెండవ హరి హర రాయల భార్య వితలాంబ , 1393 -94 లో పాతాళ గంగ కు మెట్లు నిర్మించి ,మార్గ మద్యం లో వితలేశ్వర ఆలయం కట్టించింది .శ్రీ శైలం ఆనకట్ట నిర్మించే టప్పుడు ముంపుకు గురికాకుండా ,ఆలయాన్ని మెట్లకు పైభాగాన కట్టారు శిల్ప సంపద కళ్ళకు దిగ్భ్రాంతి కల్గిస్తుంది .
భక్తులు స్నానం చేయటానికి వీలుగా ,మెట్లను పునరుద్ధ రించారు .త్రేలిగ్గా కృష్ణ లో స్నానం చేసి బిందెతో జలాన్ని తీసుకొని వెళ్లి మల్లికార్జున స్వామికి అభిషేకం చేసు కొంటారు .
  సిద్ది రామప్ప కొలను 
కర్ణాటక కు చెందిన ఆరేళ్ళ సిద్ది రామప్ప అనే శివ భక్తుడు ,మల్లేశ్వర స్వామిని ,వెతుక్కుంటూ ,వచ్చి కనపడక పొతే ,జీవితం వ్యర్ధం అని భావించి ,లోయలోకి డూకాడట . .  .అప్పుడు మలన్న ప్రత్యక్షమై ,చేయి పట్ట్టు కోని కాపాడిన ప్రదేశాన్ని సిద్ది రామప్ప కొలను అంటారు . అందుకే శ్రీ శైలం వెళ్ళే భక్తులు భక్తిగా ”ఆదుకో మల్లన్న ఆదు కోవయ్యా -చేదుకో మల్లన్న చేదు కోవయ్యా ”అంటూ నడిచి వెళ్తుంటారు .
  సాక్షి గణ పతి 
మల్లికార్జున ఆలయానికి రెండు కిలో మీటర్ల దూరం లో సాక్షి గణ పతి ఆలయం వుంది .భక్తులు శ్రీ శైలాన్ని సందర్శించి నట్లు  ఈ గణ పతి ,కైలాసం లో సాక్ష్యం చేబుతాదట .
అందుకే ఆ పేరు .భక్తులు ఇక్కడ గణపతిని దర్శించి ,తమ గోత్ర ఆమాలు చెప్పు కొంటారు .ఆయన వీరి పేర్లను రాసుకొంటునట్లు విగ్రహం వుంటుంది .
నల్ల రాయి విగ్రహం .”సాక్షి గణ పతి కన్న తల్లివి -సద్గుణా వతి శాంభవీ ”అని స్త్రీలు పాటలు పాడుకొనే వారు పూర్వం .
  హాథ(hatha ) కేశ్వరాలయం 
ఇది పాల ధార ,పంచ ధార లకు ఎదురు గా వుంది .     కుమ్మరి వాడైన భక్త కేశప్ప కు శివుడు అటిక (కుండ పెంకు )లో బంగారు లింగ రూపం లో దర్శనం ఇచ్చిన ప్రదేశమే ఇది .అందుకే అటికేశ్వర ఆలయం  అనీ అంటారు .మండపానికి ముందున్న పందిరి కి పక్క వున్న తూము లో ”తెల్లని నాగు పాము ” ఎన్నో ఏళ్ళు గా నివశిస్తోంది .దేవతా సర్పం గా అందరు భావిస్తారు .అందరు తప్పక దర్శిస్తారు .. .
  పాల ధార -పంచ ధారలు 
సాక్షి గణ పతి ఆలయానికి కిలో మీటరు దూరం లో వున్నాయి .ఇక్కడే ఆది శంకారా చార్యులు తపస్సు చేశారని,ఇక్కడే ;;శివా నంద లహరి ”రాశారనిప్రతీతి .  ..ఇక్కడి గుహ లోనే స్వామి వుండే వారట .కంచి పీఠాది పతి వారు ఇక్కడే ఆది  శంకరులు తపస్సు  చేశారని యోగ దృష్టి తో చూసి చెప్పారట .అందుకే ఆది శంకరుల పాల రాతి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారు .కిందికి దిగ టానికి మెట్లున్నాయి .మెట్లకు ఎడమ వైపు ,ఒక నీటి ధార ,పక్కనే అయిదు నీటి ధారలు కన్పిస్తాయి .మొదటి దాన్ని పాల ధార అంటే శివుని ”ఫాల భాగం ”నున్చివచ్చిన ధార అని .మగిలినవి శివుని పంచ ముఖాల నుండి ఉద్భవించిన ధార లని స్థానికులు చెబుతారు .పాల ధార తెల్లగా వుంటుంది .మిగిలిన అయిదు ధారలు తియ్య గా వుంటాయి .అందుకే ఆ పేర్లు వచ్చాయి .ఈ ధారలు నిరంతరం ప్రవహిస్తూనే వుంటాయి . .ఎక్కడి నుంచి నీటి ధారలు వస్తున్నాయో ,ఎక్కడికి ఆ నీరు ప్రవ హిస్తుందో మిస్టరీ .పక్క నున్న లోయ లో కాని ,చుట్టూ ప్రక్కల ఎక్కడా నీళ్ళు కన పడవు .ఇక్కడే కన్పించటం విశేషం .ఈ నీరు ”భోగ వతి ”అనే పేరు తో పాతాళ గంగ అయిన కృష్ణా నది లో కలుస్తుందని ”శ్రీ శైల ఖండం ”లో వుంది .
  శిఖరేశ్వరం  
             శ్రీ శైల పర్వత శిఖా రాలలో ఇది అతి ఎత్తైన పర్వ త శిఖరం .సంముద్ర మట్టానికి 2830 అడుగులు వుంటుంది .శ్రీ శైలం నడిచి వెళ్ళటం చాలా కష్టం గా వుండేది .ఇక్కడికి చేరిన భక్తులు శ్రీ శైల శిఖరాన్ని ఇక్కడి నుంచే దర్శించి ,వెనక్కి ఇరిగి వెళ్ళే వారట ”అందుకే ”శ్రీ శైల శ్కిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్య తే ”అని లోకోక్తి వచ్చింది .శిఖర దర్శనం చేస్తే పండిన దోస కాయ -తొడిమ నుండి విడి పోయినట్లు మన పాపాలన్నీ ,విడి పోతాయట .శ్రీ రాముడు కూడా శిఖర దర్శనం చేశాడని వుంది .ఇక్కడే ”వీర శంకర స్వామి ”ఆలయం వుంది .ఆలయం పైన పెద్ద రోలు ,దానికి వున్న పొత్రం పై నండీ వుంటాయి .ఒకప్పుడు భక్తులు రోట్లో నువ్వులు పోసి ,పోత్రాన్ని తిప్పే వారు .నువ్వులు నలిగి ,నూనెకింద  వున్న వీర శంకర స్వామి లింగం పై అభిషేకం గా పడుతుండేది .కాలక్రమం లో రోలు అరిగి పోయింది .ఆలయం బాగు చెస్తున్నప్పుడు పైన వున్న రంధ్రం పూడి పోయింది .అయినా  ఇప్పటికి భక్తులు అక్కడే అమ్మే నువ్వులు ,బియ్యం కోని ర్రోట్లో వేసి తిప్పటం వుంది .నంది కొమ్ముల మధ్య నుంచి శ్రీ శైల శిఖరం చూసి తరిస్తారు .ఇది శ్రీ  శైలానికి ఎనిమిది కి.మీ .లో వుంది .
                             భీముని కొలను
  పాండవులు శ్రీ శైలం దర్శించి నపుడు ఒక సారి ద్రౌపదికి దాహం వేసింది .ఎక్కడా నీరు లేదు .భీముడికి కొం వచ్చి గద తో కొండను కొట్టాడు .కొండ రెండు గా చీలి ,నీరు ఉబికింది .ఇక్కడి నుంచి నీరు ప్రవహించి పాతాళ గంగ లో కలుస్తుంది .ఇదే భీముని కొలను .ఇక్కడే భీమేశ్వరాలయం వుంది .కర్ణాటక శివ భక్తులు ఉగాది పండుగకు ,నాగ లూటి ,పెద్ద చెరువు మీదుగా ,ఇక్కడికి చేరి ,ఇక్కడ నుండి  ,కైలాస ద్వారం హట కేశవరం ద్వారా శ్రీ శైలం చేరటం అల వాటు .
మిగిలిన విశేషాలు మరో సారి

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in శ్రీ శైలం and tagged . Bookmark the permalink.

2 Responses to శ్రీ శైల సందర్శనం –4 చూడ దగిన ప్రదేశాలు

  1. kalyani అంటున్నారు:

    శ్రీశైల సందర్శనం – చాలా బాగుంది. మంచి విషయాలు పంచుకుంటున్నారు ధన్యవాదములు. గడచిన వారం మాకు శ్రీశైల దర్శన బాగ్యం కలిగింది. ఫాలధారా-పంచధార ప్రదేశంలో నీరు ఎక్కువ లేవు. water pipe arrange చేశారు tap water లా వస్తున్నాయి. ఆది శంకరుల పాదముద్రలు గుడిలొ చూసేభాగ్యం కలిగింది. హాటకేస్వరం లొ శ్రీచాగంటి కోటేశ్వఱావుగారు చెప్పిన భహుబిల్వపత్రవృక్షాన్ని చూడగలిగాము. మీ టపా చదువుతూ మరొమారు శ్రీశైలదర్శనమ్ చేస్తున్నాము. ధన్యవాదములు. . .

  2. muthevi ravindranath అంటున్నారు:

    aa Russian yaathrikudi peru ‘anaasinee kichen’kaadu. afnaasi nikitin.
    phaaladhaara- panchadhaarala gurinchina vivarana baagundi. ayithae aadi shankarulu akkada
    thapassu chaesi undavachchugaanee, aa vishayaanni kanchi kaamakoti peetaadhipathi divyadrushtitho choosi cheppaaranadam ashaastreeyamgaa undi.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.