అమెరికా డైరీ
13 -04 -12 -శుక్ర వారం
నిన్న అంటే పన్నెండో తారీకు నుంచి ఉదయం స్నానం చేసిన తరువాత సంధ్యా వందనం ,పూజా ప్రారంభించాను .మొన్న బుధ వారం రాత్రి షార్లెట్ లో ”ఎల్లా ”వారి స్టార్ నైట్
గురించి రాశాను .షార్లెట్ లోని భారతీయులంతా షార్ప్ గ ఉన్నారన్న భావం కనిపించింది .ఏళ్ళ వారు ఆ రోజూ స్టార్ ఆఫ్ attraaction గా నిలిచారు .
ఇవాళ ఉదయం పూజా కార్య క్రమం పూర్తి అయిన తరువాత .ఇక్కడ విజ్జి స్నేహితురాలు శ్రీ మతి ప్రియా అనే అమ్మాయి ఇంటికి వచ్చింది .ఆమెది గుంటూరు అని భర్త వెంకట్ ది నెల్లూర్ ఆని ,వారిద్దరూ ఒక ఇల్లు ఇక్కడే కట్టిస్తున్నామని మే నెలలో దాన్ని బిల్డర్ స్వాధీనం చేస్తాడని ,గృహ ప్రవేశానికి ముహూర్తం చూడ మని కోరింది .ఇద్దరి నక్షత్రాలను బట్టి ఈ నెల 16 సోమ వారం ,25 బుధ వారం రెండు ముహూర్తాలు బాగా ఉన్నాయని చెప్పాను .మళ్ళీ జూన్ పది హీను తర్వాత కాని ముహూర్తాలు లేవని తెలియ జేశాను .ఈ రెంటి లో ఏది వీలయితే ఆ రోజూ పాలు పొంగించమని సలహా చెప్పాను .సంతోషం గా ఆమె వెళ్ళింది .చక్కని సంస్కారం ఉన్న అమ్మాయి లా గా కని పించింది .
నేను ఉయ్యూరు నుంచి ఇక్కడికి బయల్దేరే ముందు వారం తెలుగు విద్యార్ధి మాస పత్రిక సంపాదకులు ,నాకు ఆప్తులు స్నేహితులు శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు గారు ఫోన్ చేసి ,కొన్ని ఇంగ్లీష్ ఆర్టికల్స్ పంపిస్తున్నానని వాటిని తెలుగు లోకి అనువాదం చేసి పంపమని కోరారు .దానికి సమాధానం గా నేను అమెరికా వెళ్తున్నానని వీలుని బట్టి అక్కడికి తీసుకొని వెళ్లి చేసి మెయిల్ చేస్తానని చెప్పాను .టెక్ యువర్ వోన్ టైం అన్నారాయన .అంతకు ముందే విజయ వాడ ఆకాశ వాణి డైరెక్టర్ శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు నేను రాసిన ”దర్శ నీయ దేవాలయాలు ”పుస్తకం చదివి వెంటనే ఫోన్ చేసి అందులో కృష్ణా జిల్లా దేవాలయాలా గురించి అర్జెంట్ గా అయిదారు రోజుల్లోపు రాసి పంపమని కోరారు .వెంటనే మొదలు పెట్టి మూడు రోజుల్లో 25 పేజీలు రాసి పంపించాను .
దాన్ని మార్చ్ 31 శుక్రవారం ఉదయం 07 -15 నిమిషాలకు ఏప్రిల్ 06 శుక్రవారం ,ఏప్రిల్ 13 శుక్రవారం ప్రసారం చేశారు .అలాగే ఏప్రిల్ ఒకటి శ్రీ రామ నవమి నాడు శ్రీ సువర్చలాంజ నేయా దేవాలయం లో సీతా రామ కళ్యాణ మహోత్సవం సమయం లో నేను రాసిన ”శ్రీ హనుమత్ కధా నిధి ”పుస్తకాన్ని ఆవిష్కరించిన సంగతి మీకు ఇది వరకే తెలియ జేశాను .ఆ పుస్తకం చదివిన శ్రీ ఆదిత్య ప్రసాద్ గారు వెంటనే ఫోన్ చేసి ”హనుమజ్జయంతి -విశేషాలు ”అనే వ్యాసం నేను అమెరికా వెళ్ళే లోపు రాసి పంపించమని ఆదేస్శించారు .అంతే ఏప్రిల్ మూడు మంగళ వారం తెల్ల వారు జామున మూడున్నరకు లేచి రాయటం మొదలు పెట్టి అయిదు గంటలకు పూర్తి చేసి నాల్గవ తేది ఉయ్యూరు నుంచి హైదరా బాద్ బయల్దేరే రోజూ కొరియర్ లో పంపాను .అందుకని అసలేమీ సమయం చాలక కొల్లూరి వారి అనువాదం జోలికి వెళ్ళ లేక పోయాను .ఈ రోజూ సాయంత్రం కూర్చుని ఆయన పంపిన 16 పేజీలలో రెండు పేజీలు అనువదించి మెయిల్ చేశాను .ఇదీ ఈనాటి కార్య క్రమం.
విజ్జి వాళ్ళింటికి ఎదురుగా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు జరుగు తోంది .ఎదురు గా రెండు ఇల్లు శర వేగం గా తయారవ్సుతున్నాయి .అంతా చెక్కలతో నేగా .చాలా తేలిక .ఇక్కడి పని వాళ్ళు మెక్సికో వాళ్ళు .ఇల్లు చూడటానికి వెడితే ఒకతను ”నమస్తే ”అన్నాడు .ఏదేశం అని అడిగితె మెక్సికో అని చెప్పి వాళ్ళు నేపాల్ దేశం నుంచి వలస వచ్చి నట్లు చెప్పాడు .పనిలో ఎక్కడా అలసత్వసం కని పించలేదు .ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతున్నారు
14 -04 -12 -శని వారం
ఉదయం ఆరు గంటలకే లేచి పూ జాదికాలు పూర్తి చేసి టిఫిన్ తిని అందరం కార్ లో ఎనిమిదింటికి ఇక్కడికి రెండు గంటల ప్రయాణ దూరం లో barligtan రోడ్లో ఉన్న ”గ్రీన్ బరో ”కు బయల్దేరాం ఒక గంట ప్రయాణం తరువాత బందరు కు చెందిన అడుసు మిల్లి రామ కృష్ణ ,ఉషా కుటుంబం తో కలిసి ఐ హోప్ హోటల్ దగ్గర ఆగి కాఫీ తాగి విజ్జి తెచ్చిన ఇడ్లీలు వాళ్లకు పెట్టాం. గ్రీన్స్ బరో అనే చోట దేవాలయం ఉంది అక్కడ రాదా కృష్ణ ,రామ పరివారం ఆంజనేయ స్వామి బాలాజీ అందారు దేవుళ్ళు ఉన్నారు ఇవాళ తమిళ ఉగాది సందర్భం గా అక్కడ షార్లెట్ సాయి భజన సమాజం లోని అయిదు కుటుంబాల వారిని ఆహ్వానించారు .అందు లో మేము ఉన్నాం .పదిన్నరకు స్వామి రాజేంద్రన్ కార్య క్రమ వివ రాలను తెలియ జేశారు .అందరు కలిసి తామిలా నూతన సంవత్స రాదిని జరుపు కోవాలని ఈ ఏర్పాటు చేసి నట్లు తెలిపారు .నాద ప్రియుడు భజన ప్రియుడు భగ వంతుడని నాదో పాసన కు మించింది లేదని ,త్యాగయ్య అన్నమయ్య ,పురందర దాసు మీరా మొదలైన వారంతా దీనితోనే తరించారని చెప్పారు షార్లెట్ లోని సుబ్బు అధ్యక్షత లో ఉన్న భక్త బృందాన్ని ఆహ్వానించామని వారు నామ సంకీర్త్తనతో మనల్ని తన్మయులను చేస్తారని అన్నారు సరిగ్గా పద కొందు గంటలకు భజన ప్రారంభ మైంది అంతా యువకులే ముప్ఫై మంది మహిళలు నలభై మంది పురుషులు పది మంది పిల్లలు హాజ రైనారు .డోలక్ మద్దెల హార్మని తప్పెట లతో భజన చాలా హాయిగా సాగింది మా అమ్మాయి విజ్జి ,ఉషా ,సౌమ్య ,చిన్న పిల్లలు సాయి సహానా ,ఆనుషా వగైరా అందరు అద్భుత మైన గానం తో మై మర పించేట్లు భజన చేశారు అన్ని భాషల పాటలు పాడారు పిబరే రామ రసం ,”భక్త జన వాత్సల్ ;;శంకరా చార్య స్తోత్రాలు అన్నీ కమ్మ గా పాడారు .వాయిద్యాల వాళ్ళు శ్రుతి మధురం గా వాయించి వన్నె తెచ్చ్చారు .సుబ్బు షార్లెట్ సాయి భజన మండలి అధ్యక్షుడు ఏ.రవి బి రవి .సత్యనారాయణ ,సత్య గోపాల్ ,సుబ్బు భక్తీ రసాన్ని ప్రవహింప జేశారు .భజన తో అందరు తన్మయులయారు .అందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులే అందరు సాయి భక్తులే .నాకు అని పించింది అమెరికా లోని భారతీయులందరి హృదయాల్లో సత్య సాయి ,షిర్డీ సాయి నెలకొని నడి పిస్తున్నారేమో నని .సంస్కృతీ ప్రవాహం అవిచ్చిన్నం గా ఇక్కడ ప్రవహిస్తున్నందుకు పర మానందం గా ఉంది .వార సత్వాన్ని తరువాతి తరాలకు అంద జేస్తున్నారు .రెండు గంటల పాటు నాదో పాసన సాగింది .ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో అన్ని వయసుల వారు ఉండటం విశేషం
ఇండియా నుంచి ఒక పూజారిని సెలెక్ట్ చేసి ఈ రోజే ఆయనకు బాధ్యతలు అప్పగించారు .ముప్ఫై అయిదేల్లుండ వచ్చు హైదరా బాద్ కు చెందిన వాడు భువన గిరి మురళీ కృష్ణ శర్మ .ప్రస్తుతం ఒక్కడే వచ్చాడు .తరువాత భార్య పిల్లలు వస్తారట .పడ మూడు మంది అప్ప్లై చేస్తే అన్ని స్క్రీనింగులు అయి ఇతన్ని సెలెక్ట్ చేసింది కమిటీ .అంటే నియామకం అంత పకడ్బందీ గా జరిగిందన్న మాట .అతను కుర్తాళం పీఠాది పతి పూర్వాశ్రమం లో ప్రసాద రాయ కుల పతి గారి శిష్యుడు .వేదం చదివి అధ్యాపనం చెప్ప గల సమర్ధుడు .అన్ని వైదిక కార్య క్రమాలు నిర్వ హించ గలడు విగ్రహ ప్రతిష్ట కలశ ప్రతిష్ట హోమాలు యజ్ఞాలు యాగాలు నిర్వ హించ గలడు నాలుగైదు భాషల్లో ప్రావీణ్యం ఉంది .భక్తీ చానెల్ లో ”నోములు -వ్రతాలు ”శీర్షిక ను నిర్వ హించి నంది బహు మతి పొందాడట .అలంకార బ్రహ్మ ,మహాదా చార్య బిరుదు లు పొందిన వాడు .ఉపనయనం వివాహాది కార్య క్రమాలను నిర్వ హించ గలడు అంటే సర్వ సమర్దుడినే పూజారిగ్స నియమించారన్న మాట .పూజారిని అందరికి పరిచయం చేశారు .అందరం హర్ష ధ్వానాలతో స్వాగాతిన్చాం .
ఆ తర్వాత హారతి ప్రసాద విని యోగం .అందరికి పులిహోర చక్ర పొంగలి ,రవ్వ కేసరి ,పెరుగు వడ ,చేర్ర్రి పండ్ల ముక్కలు ,ఆపిల్స్ ఆరంజ్ చపాతి, కూర ,మజ్జిగ ,పానకం ప్రసాదం గా తిన్నంత పెట్టారు .అందరు తృప్తిగా తిన్నారు .అక్కడే ఉయ్యూరు లో కోట శ్రీ రామ మూర్తి గారి కుమారుడు ప్రభాకర్ అన్న భార్యకు మేనల్లుడు ,భార్య పరిచయ మయారు వాళ్ళ ఇంటి పేరు భాగవతుల వారు .కూచి పూడి నివాసులు ఇలా యాదృచ్చికం గా కలవటం భలే తమాషా గా ఉంది
స్వామి రాజేంద్రన్ గారు ఉగాది సందర్భం గా షార్లెట్ నుంచి వచ్చిన కుటుంబాలను వారింటికి ఆహ్వానించారు దంపతులు చాలా మంచివారు .ఆయన అక్కడ సాయి సమాజానికి అధ్యక్షులె కాదు ఆలయ నిర్వాహకులు కూడా .వారింట్లో నిలువెత్తు సత్య సాయి ఫోటో ఉంది .సుబ్బు బృందం కొంత సేపు మళ్ళీ భజన చేశారు మా మనుమడు శ్రీ కేత్ కూడా ఒక భజన గీతం పాడాడు .అందరికి కాఫీ టీ బిస్కట్లు ఇచ్చారు అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు బయల్దేరి సాయంత్రం అయిదు గంటలకు ఇంటికి చేరాం .
ఇంటికి రాగానే మొబైల్ వాన్ లో ఫర్నిచర్ అమ్మటానికి వచ్చారు మంచం వగైరా ఐదింటిని 1500 డాలర్లు పెట్టి కొన్నారు .ఇలా ఈ రోజు గడిచింది .పిల్లలు బానే ఎంజాయ్ చేశారు .
వెళ్ళే టప్పుడు దారిలో ఒక పెద్ద వాన్ మీద ”UNITED HOUSE OF PRAYER FOR ALL PEOPLE ”అని రాసి ఉన్న దాన్ని చూశాం .వారి విశాల దృక్పధానికి జోహార్ అని పించింది .అదేమిటో నాకు తేలీ లేదు కాని వారి భావన నచ్చింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -04 -12 .
కాంప్ –షార్లెట్ –యు.ఎస్.ఏ.
వీక్షకులు
- 1,107,460 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

