అమెరికా డైరి 15 -04 -12 ఆది వారం

అమెరికా డైరి 
                               15 -04 -12 ఆది వారం
ఉదయం ఆరు గంటలకే మెలకువ వచ్చి లేచి ప్రముఖ కధకులు ,విమర్శ్శకులు ,పడ చిత్ర రామాయణ కర్త అయిన శ్రీ విహారి గారి ”అయోధ్యా కాండం ”పుస్తకం చదవటం మొదలు పెట్టాను .దీనికో ఫ్లాష్ బాక్ ఉంది .సుమారు నాలుగైదేళ్ళ కిందట ఉయ్యూరు లో సాహితీ మండలి ఆధ్వర్యం లో శ్రీ విహారి రాసిన పద చిత్ర రామాయణం లోని సుందర కాండ ను పరిచయం చేసే కార్య క్రమం జరిపాం .దాని స్పాన్సర్ శ్రీ గుత్తి కొండ సుబ్బా రావు గారు .శ్రీ మాది రాజు రామ లింగేశ్వర రావు గారు పుస్తకాన్ని పరిచయం చేసి అందులోని విశేషాలను వివ రించారు .పూర్ణ చంద్ ,శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ వంటి ప్రముఖులు హాజ రైనారు .అప్పుడు నేను కూడా అందులోని సొగసుల్ని గురించి చెప్పాను .ఆ తర్వాత హైదరా బాద్ నుండి విహారి గారు ఫోన్ చేసి నేను చెప్పిన విష యాలు ఎవరు చెప్పనివని దాన్ని ఒక వ్యాసం లాగా రాసి పంపమని కోరారు .అలానే రాసి పంపాను .దాన్ని ”బాల కాండ ”లో ప్రచురించారు .ఆ పుస్తకం నాకు పంపారు .దాన్ని చదివి నేను ”బాల కాండ పద చిత్రాలలో -పలు విచిత్రాలు ”అన్న శీర్షిక తో నా స్పందన రాసి ఆయనకు పంపాను .ఆ తర్వాత ఎప్పుడో విజయ వాడ లో ఒక సభ లో కలిసి నేను రాసినది చాలా అద్భుతం గా ఉందని దాన్నంతటిని ఒక్క అక్షరం కూడా వదిలి పెట్టకుండా ”అయోధ్య కాండ”లో ప్రచురిస్తున్నానని చెప్పి ఆ పుస్తకం ఆవిష్కరణ తర్వాత నాకు నాలు గు నెలల కిందట పంపారు .చదవటం కుదర లేదు నిజంగా నే నేను రాసింది అక్షరం కూడా వదల కుండా అందులో వేసి ,అన్న మాట నిలుపు కొన్నారు విహారి .దాన్ని ఇక్కడికి తెచ్చుకొన్నాను చదువుకోవటానికి .అదే ఇవాళ మొదలు పెట్టాను .కధ అందరికి తెలిసిందే అయినా విహారి చెప్పిన తీరు ప్రయోగించిన జాతీయాలు ఆవిష్కరించిన భావాలు మనసు ను పట్టేస్తాయి భిన్న ఛందస్సు లను వాడి అర్ధ పుష్టి కల్గిస్తారు .సుమారు ఇరవై పేజీలు  ఇవాళ ఉదయం చదివి ఉంటాను .
దయం స్నానం సంధ్య ,పూజ తర్వాత ప్రభావతి తప్ప మేమందరం ఒక పావు గంట ప్రయాణ దూరం లో ఉన్న సాయి సెంటర్ కు వెళ్లాం .ప్రతి ఆది వారం ఇక్కడ సాయి భక్తులూదయమ్ పది నుండి పన్నెండు వరకు కలిసి సత్సంగ్ భజన నిర్వ హిస్తారు .ఇరవై మంది ఆడ వారు ,పదిహేను మంది మగ వారు ,పది మంది పిల్లలు వచ్చారు .పిల్లలకు నీతి బోధ క్లాస్ ఉంటుంది ఒక గంట సేపు .పది నుండి పద కొండు గంటల వరకు సత్సంగ్ జరిగింది .పిల్లల్ని పెంచటం లో ఇబ్బడులు వాటిని అదిగా మించే మార్గాలు సత్య సాయి ఈ విషయం లో చేసిన మార్గ నిర్దేశకాల గురించి అందరు తమ మనసు లోని ఆటలను తెలుపు కొన్నారు సుబ్బు మానిటరింగ్ చేశాడు .నిలు వెట్టు సత్య సాయి ఫోటో ,దాని ప్రక్కన కుర్చీలో సత్య సాయి ధరించే కాషాయ చొక్కా ఒక కుర్చీలో ఏర్పాటు చేశారు .ఫోటో కు ఎదురుగా ఒక రెడ్ కార్పెట్ ,దాని పై గులాబి పూలు ఆయన రాక కోసం అన్నట్లుగా ఏర్పాటు చేశారు .ఒక పెద్ద స్క్రీన్ మీద సాయి సూక్తులు ,ఫోటో ను కంప్యుటర్ ద్వారా చూపించారు .
పద కొండు నుంచి పన్నెండు వరకు సుబ్బు బృందం భజన కార్య క్రమం నిర్వ హించారు .అందరు తలో గీతం పాడి భజన అన్ని భాషల్లో ను చేశారు .ఆ తర్వాత హారతి .విభూతి ప్రసాదం .పుష్ప అనే ఒకావిడ తన ఇంటిలో కింది భాగాన్ని సత్సాన్గానికి ఇచ్చింది .ఇక్కడే ప్రతి వారం సమా వేశాలు జరుగు తాయి .ఇక్కడే ఉయ్యూరు లో నా గురువు గారు వేమూరి శివ రామ క్రిష్నయ్య గారి రెండవ కుమారుడు ,నా క్లాస్ మేట దుర్గయ్య అన గారు అయిన కామేశ్వర శర్మ గారి కూతురు ,అల్లుడు కలిశారు .తమాషా పరిచయాలు ఏర్పడు తున్నాయి .నిన్న కోట వారి బంధువుల పరిచయం ఇవాళ ఇది .కామేశ్వర శర్మ మాకు సీనియర్ .ఏదో పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయి సాయి సేవ లో ఉంటున్నాడట .
తారు వాత బెల్లంకొండ ఉషా రవి వాళ్ల అమ్మాయి పుట్టిన రోజూ పండుగకు అందరం అంటే భక్త బృందం లో ఒక పాతిక మందిమి వెళ్లాం .వెళ్ళే తప్పటికే ఒంటి గంట దాటింది .కమ్మటి భోజనం తయారు చేసింది ఉష .పూరి కూర చాలా బాగున్నాయి .మినప సున్ని ఉండలు ,కిచిడీ అన్నం ,పెరుగన్నం ,మినీ ఆవడ ,కోకా ఐస్ క్రీం,కర్బూజా ,పుచ్చ్చ కాయ ముక్కలు .అన్ని కడుపు నిండా తిన్నాం .ఆ తర్వాత బర్త్ డే కేక్ కట్ చేశారు .అందరికి కేక్ పెట్టారు .పిల్ల లందరికి తలో అయిదు ఫ్దాలర్లగిఫ్ట్ కార్డు లిచ్చారు రవి ఉషా దంపతులు .పవన్ భార్య రాధ పిల్లలు కూడా వచ్చారు .అడుసు మిల్లి అతను ”అంకుల్ ఎలా కాలక్షేపం చేస్తున్నారు ?”అని అడిగితె ,వివరం గా చెబితే నోరు వెళ్ళ బెట్టాడు .ఇంటికి వచ్చే సరికి నాలుగున్నర అయింది రవి వాళ్ళున్న  ఏరియా ను కాన్కార్డ్  అంటారట .అమెరికా లో ఏ ఊరు అయినా ,ఏ ప్రదేశం అయినా ఒక్కటే .అన్నీ ఒకటి లానే దాదాపు గా ఉంటాయి .ఇళ్ళు అన్నీ ఒకటిగా ఉన్నట్లే .మొత్తం మీద అందరం తరచుగా కలుస్తున్నండుకుపరిచయాలు పెరుగు తున్నందుకు  హాయిగా ఉంది సాయంత్రం శ్రీకేత్  కు తెలుగు tution    పవన్ వాళ్ల ఇంటి దగ్గర ఉంటె విజ్జి వాళ్ళమ్మను కూడా తీసుకొని వెళ్ళింది .వీళ్ళింటికి నడి ఛి  వెళ్ళేంత దగ్గిరే .అరవై మంది పిల్లలకు తెలుగు నేర్పుతున్నారు రాదా ,ఇంకో అమ్మాయి కలిసి .మంచి పని చేస్తున్నందుకు అభి నందనలు .
మాధవికి ,మైనేని గారికి మెయిల్ రాశాను .విజ్జి ,వేద వల్లి కొడుకు హరి కి ఫోన్ చేసి మాట్లాడింది .వాడికి ఉన్న చోటు నుండి traansfer అయిందట .కొత్త చోటు లో త్వరలో చేరుతాడట .అక్కడికి వెళ్ళే లోపు వాళ్ల అమ్మ మాతో పంపిన వాటిని తీసుకొని వెళ్ళమని విజ్జి చెప్పింది .ఎప్పుడో వస్తాడు .ఇవీ  ఈరోజు విశేషాలు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-04-12
camp–charlotte —n.c–.u.s.a.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.