ఊసుల్లో ఉయ్యూరు –28 ముత్తయ్య మేష్టారు

    ఊసుల్లో ఉయ్యూరు –28 ముత్తయ్య మేష్టారు


నల్లని నిగ నిగ లాడే శరీరం ,ఉండీ లేని నెత్తి మీది తెల్లని వెంట్రుకలు ,తెల్లని కను బొమలు .మెడలో పెద్ద సైజు రుద్రాక్ష మాల ,తెల్లని గ్లాస్కో పంచె మడచి కట్టి ,సగం పైకి ఎత్తి నడుం దగ్గర దోపిన పల్చని లుంగి,  చొక్కా లేకుండా , చేతి లో తాటాకు విసన కర్ర , చంకలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేపరు తో ఏవ రైనా అరవై అయిదేళ్ళ వ్యక్తీ కని పించారు అంటే ఆయనే మా ముత్తయ్య మేష్టారు .తూర్పు గోదా వారి జిల్లా లో మిడిల్ స్కూల్ హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయి అత్త వారి ఊరైన ఉయ్యూరు లో స్థిర పడ్డారు స్వంత ఇల్లు  ఏర్పాటు చేసుకొన్నారు . దేవుల పల్లి వారింటి పక్క ఇల్లే .ముందు రోడ్ మీదకు ఒక పాక ,వెనక పెంకుటిల్లు .పిల్లలు లేరు .ఆయన గరుగు మీద కృష్ణ మూర్తి అని అందరి చేత పిలువ బడే సోమయాజుల కృష్ణ మూర్తి గారికి అక్క గారి భర్త అంటే బావ గారు . ఆ కాలమ్ బి.ఏ.పట్ట భద్రుడు . మంచి ఇంగ్లీష్ మాట్లాడే వారు చక్కని ఇంగ్లీష్ లో రాసే వారు .మా కంటే  అరవై దశకం లో నే మాకంటే చాలా పెద్ద వారు . కృష్ణ  మూర్తి  గారి    పిల్లలనే  స్వంత  పిల్లలుగా  చూసు  కొనే  వారు  .భార్య  ఉత్తమా   ఇల్లాలు .

ఇంతకీ ముత్తయ్య మేస్టారి అసలు పేరు పళ్ళా వజ్ఝాల మృత్యుంజయ శర్మ గారు .ఆ పేరు ఎవరికీ తెలీదు .ముత్తయ్య మేష్టారు అంటేనే   అందరికి తెలుసు . గరుగు మీద  నుంచి పొద్దున్నే కృష్ణ మూర్తి గారి అబ్బాయిలు చిక్కని గేదె పాలు తెచ్చి ఆయనకు ఇచ్చే వారు. దానితో కాఫీ కాస్తే మహా రుచిగా ఉండేది . డికాషన్ కాఫీ .మా కు ఇంటికి వెడితే తప్పక ఇచ్చేవారు .ఆయన రోజుకు చాలా సార్లు కాఫీ తాగే వారు .అందుకని పెద్ద ఫ్లాస్క్ లో కాఫీ ఎప్పుడు రెడి గా ఉంచే వారు ఆయన భార్య గారు .మేష్టారు గోదావరి జిల్లా వారు కనుక మాట లో ఆ యాస ఉండేది .ఇంటి దగ్గర లెక్కలు ,ఇంగ్లీష్ ప్రైవేటు చెప్పే వారు .వారిది నిర్దుష్ట మైన బోధన . పదానికి అర్ధం వివరం తో బోధించే వారు .ren అండ్ మార్టిన్ గ్రామర్ లో నిధి . వ్యాకరణం లో మహా దిట్ట .రాసినదేదైనా నిర్దుష్టం గా ఉండేది .ఆయనతో మాట్లాడటం ఒక ఎడ్యు కేషన్ గా అని పించేది .కావాలని ఇంగ్లీష్ కోసం ఆయన దగ్గర చదివే వారు .కొంచెం కోపం ఎక్కువే .
            మాస్టారికి ఏదైనా చెప్పా లంటే పూర్వకాలం లోకి ఫ్లాష్ బాక్ గా వెళ్ళే వారు .nainteen ఫార్టీ లో అనో nainteen ఫిఫ్టీ లో అనో సందర్భాన్ని గుర్తు చేసుకొని ఇప్పటి దానికి ఉదాహరణ గా చెప్పటం ఆయన అల వాటు .అది మా బోటి వాళ్లకు తమాషాగా ఉండేది .తాసిల్దార్ సినిమా లో సి.ఎస్.ఆర్ .”ఆ రోజుల్లో నేను కాలేజీ లో చదివే టప్పుడు ”అని ఊత పదం గా చెప్పే వాడు .అది జ్ఞాపకం వచ్చి నవ్వు కొనే వాళ్ళం .ఒక్కో సారి నేను ఆయన ఆ మాట మర్చి పోయినా, కొంత ఆట పట్టించాలని ”మాస్టారూ !మీ రోజుల్లో ఇలాంటి సంఘటన ఎప్పు డైనా జరిగిందా “”/అనే వాణ్ని .ఇంకేముంది -వెంటనే సంవత్సరం నెల ,తేదీ ఊరు తో సహా ఆ వివ రాలన్ని అమాయకం గా చెప్పేసే వారు .మేము ఆయనకు తెలీకుండా ముసి ముసి నవ్వులు నవ్వే వాళ్ళం .అదో సరదా మాకు .మమ్మల్ని ”ఏమయ్యా ”అని పిలిచే వారు .చాలా చనువు గా మాతో ఉండే వారు మాస్టారు బాగా నాటకాలు ఆడించి ఆడే వారు .వారిలో గొప్ప నటుడున్నాడు .
1962 లేక  63 లో ఉయ్యూరు హై స్కూల్ వార్షి కొత్సవ సందర్భం గా పూర్వ విద్యార్దులేవరైనా నాటిక వేయ దలచుకొంటే అవకాశం ఇస్తామని కబురు చేశారు .అప్పుడు మేమందరం కలిసి భమిడి పాటి కామేశ్వర రావు గారి ”అంతా ఇంతే ”అనే హాస్య నాటకాన్ని వేయాలనుకోన్నాం .మాకు అంతకు ముందు స్టేజి అనుభవం లేదు .ఎలా అనుకొంటుండగా మాస్టారికి తెలిసి తాను దర్శకత్వం వహిస్తానని చెప్పారు .ఎంతో సంతోషించాం .నేను యజ మానిగా మా తమ్ముడుడోక్కా లంబోదరం గా ,పార్ధి తమ్ముడు భాస్కర్ ఇంకో వేషం గా ప్రాక్టీసు చేశాం .మాస్టారి పాకలో రోజూ రిహార్సిల్లు చేసే వారం ముత్తయ్య గారు దగ్గ రుండి ఏ పాత్ర ఎలా మాట్లాడాలో దాని స్వరూప స్వ భావాలేమిటో డైలాగ్ ఎలా చెప్పాలో ,ఎక్కడ ఒత్తి పలకాలో ఎక్కడ తేల్చి చెప్పాలో అన్నీ వివరం గా చెప్పి చేయించే వారు .డైలాగ్ సరిగ్గా చెప్పే దాకా వదిలే వారు కాదు .ఖచ్చిత మైన సమయ పాలన చేసే వారు .దాదాపు నెల రోజులు అలా తీవ్రం గా ప్రాక్టీస్ చేయించారు .నాటకం బాగా అందరికి కంతో పాఠం గా వచ్చే సింది .వార్షి కొత్సవం నాడు అద్భుతం గా ప్రదర్శించాం .అదిరి పోయింది .అందరు విప రీతం గా మమ్మల్ని అభి నందించారు .మాస్టారు మాకు మేకప్ చేశారు .ఆయన డైలాగులు పలికే విధానం మాకు ఆశ్చర్య మేసేది .ఒత్తి ఒత్తి పలికే వారు అలానే మాతో పలికించే వారు .ముఖ్యంగా ”డొక్కా లంబోదరం నిమ్మ పళ్ళ రోడ్డు ”పాత్ర ను మా తమ్ముడు బాగా చేశాడు .ఆ నాటకాన్ని నేను హై స్కూల్ లో పని చోటల్లా విద్యార్ధులతో వేయించే వాడిని .మాకు బాగా నచ్చిన నాటకం .అలానే బి .వి.రమణ మూర్తి రాసిన ”భర్త మార్కండేయ ”కూడా వేయించే వాడిని .రెండు కడుపు చేక్కలఎట్లు నవ్వించే నాతికలే .మాకు కొద్దో గొప్పో నాటకాను భవం రావ టానికి ముఖ్య కారకులు ముత్తయ్య మాస్టారు నని నిస్సందేహం గా చెప్పగలను .
పార్ధి మాస్టారి అరుగు మీద రోజూ సాయంత్రం మేమంతా భేటి అయే వారం .ముత్తయ్య గారు తప్పని సరి .ఆయన కు రాజకీయా లన్ని బాగా తెలుసు .మంచి జెనెరల్ నాలెడ్జి ఉండేది .అది మాకు బాగా ఉపయోగ పడేది .మమల్ని చాలా ఆప్యాయం గా చూసే వారు .గొంతు కొంచెం గంభీరం గా ఉండేది .బయటి ఊరికి వెళ్ళే టప్పుడు చిన్న చేతు లున్న కుట్టిన తెల్ల బనీను వేసుకొనే వారు. చొక్కా వేసుకోవటం నేను చూడ లేదు .ఆ బనీనుకు లోపలా బయటా రెండు వైపులా పెద్ద జేబు లుండేవి .అందులోనే డబ్బు దస్కం పెట్టు కొనే వారు .మా అందరికి నాటక గురువు మా ముత్తయ్య మాస్టారు .వారి జ్ఞాపకాలు ఒక మధురాను భూతి
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -04 -12 .
కాంప్ –అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

2 Responses to ఊసుల్లో ఉయ్యూరు –28 ముత్తయ్య మేష్టారు

  1. వుయ్యూరులో మీ చిన్ననాటి గురువులు, మిత్రులు, పాలేళ్ళు,వైద్యులు వగైరాలనందరినీ వారి
    వారి విలక్షణమైన మాటతీరు, అలవాట్లు, ఆహార్యంతో సహా సమగ్రంగా వర్ణిస్తూ ఆ యా వ్యక్తుల
    సజీవ మూర్తులను చదువరుల కట్టెదుట నిలుపుతున్నారు. అమితమైన మీ ఆసక్తికి లోతైన
    పరిశీనాశక్తి కూడా తోడైనందున ఆ వ్యక్తులు మాకూ అతి సన్నిహితమైన వారేననే భావనను
    కలిగించడంలో కృతకృత్యులవుతున్నారు.మీరు కొంచెం అదనంగా శ్రమిస్తే ఇంత చక్కటి
    రచనలో ఉండకూడని భాషా దోషాలు, ముద్రణాస్ఖాలిత్యాలు పరిహరించి దీనికి మరింత
    పరిపుష్టి కలిగించవచ్చుననే విషయంలో నాకెలాంటి సందేహమూ లేదు. ఆ దిశగా కూడా కృషి
    చేయాలని నా ఆకాంక్ష.
    –ముత్తేవి రవీంద్రనాథ్, డేటన్, న్యూజెర్సీ, యు.యస్.ఏ.నుంచి.

    Like

    • prechand's avatar prechand says:

      Dear Mastaru, Thanks for the life sketch of Mutthiah mastaru. Although I never met him, I felt, for a moment atleast that I was standing in his presence. Two minor modifications. 1 It is Wren . Actually it was Wren and Martin. I had their grammar book late into my honours studies. 2. CSR said it in a movie called Jeevitam which was produced by Avm studios and the debut film of Vyjaintimala. regards, Premchand

      Like

Leave a reply to prechand Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.