అమెరికా డైరీ –వేడుకల వారం
అమెరికా వచ్చి మండలం రోజులు అంటే నలభై రోజు లయింది .కిందటి వారం కన్నా ఈ వారం సందడి గా గడిచింది .వేడుకలతో నిండింది .పదమూడవ తేదీ ఆది వారం ఉయ్యూరు లో శ్రీ హనుమజ్జయంతి మూడు రోజుల కార్యక్రమం మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి (హనుమజ్జయంతి 13,14,15 జరిగిన విశేషాలు)ఆలయం లో ఉదయం అభిషేకం తో ప్రారంభమైంది .గంధ సిందూరం పూజ .మధ్యాహ్నం . పన్నెండుకు సరస భారతి ఆధ్వర్యం లో ‘’ఆదిత్య హృదయం ‘’పుస్తకావిష్కరణ జరిగింది (ఆదిత్య హృదయం – ఆవిష్కరణ).రాత్రి చిన్న పిల్లలు నృత్య ప్రదర్శన చేశారు .మర్నాడు సోమ వారం ఉదయం మామిడి పండ్ల తో(హనుమజ్జయంతి – మామిడి ఫల -పూజ దర్శనం ) పూజ .చాలా ఖరీదు గా ఉన్నా ,ప్రతి సంవత్సరం లానే జరిగింది .రాత్రి మల్లీ నృత్య ప్రదర్శన .పదిహేనవ తేదీ మంగళ వారం శ్రీ హనుమజ్జయంతి .ఉదయం ఆరు నుండి తమల పాకులతో పూజ నాన్ స్టాప్ గా పదింటి వరకు .పదిన్నరకు శ్రీ సువర్చలాన్జనేయ స్వాముల శాంతి కళ్యాణం .మేము అక్కడ లేక పోయినా మా అబ్బాయి రమణ దగ్గర ఉండి అన్ని కార్య క్రమాలు చేసి ,వాళ్ళిద్దరూ దంపతులు పీట ల మీద కూర్చుని కళ్యాణం జరి పించారు .ఆ రాత్రి కే.సి.పి.కాలనీ మహిళా మండలి వారు శ్రీ హనుమాన్ చాలీసా నలభై సార్లు చేశారు . న్యూస్ పేపర్ కవరీజ్ బాగానే వచ్చింది దినపత్రికలలో వచ్చిన హనుమత్జ్జయంతి వార్తలు
ఇక్కడ హనుమజ్జయంతి నాడు నేను సహస్ర నామ పూజ చేశాను .నేను వెంట తెచ్చు కొన్న ‘’కళ్యాణం చేయించే పుస్తకం ‘’తో యదా విధిగా అన్ని మంత్రాలతో తంత్రం లేకుండా కళ్యాణం చేశాను .మా దేవాలయం లోని సువర్చలాన్జనేయ స్వాముల ఫోటోలు ఇక్కడ మా అమ్మాయి వాళ్ళింట్లో ఉన్నాయి .విష్వక్సేన పూజ ,పుణ్యః వాచనం ,నవగ్రహ ,ఆష్ట దిక్పాలక పూజ కన్యా వరణం ,మధు పర్కం ,ప్రవర ,మహా సంకల్పం ,చూర్నికా ,లగ్నాష్టకాలు అన్నీ యధావిధి గా చదివి కళ్యాణ అక్షింతలు అందరికి వేశాను .కొబ్బరి కాయ కొట్టాం .పంపర పనస ,మామిడి పళ్ళు ఆపిల్స్ నైవేద్యం .విజ్జి ఉదయమే స్నానం చేసి అప్పాలు ,పులి హోర చేసింది .వాటినీ ని వేద్యం పెట్టాను .ఇలా అమెరికా లోను కళ్యాణం జరిపి నట్లే .
మా అమ్మాయి విజ్జి –మా మనవడు చదివే స్కూల్ లో వాడి వార్షిక పరీక్షలకు అయిదు రోజులు ఉదయమే ఏడింటికే వెళ్ళింది సోమ నుంచి శుక్ర వరకు .పేరెంట్స్ ను ఇక్కడ వాలంటరీ గా ఇంవిజిలేషన్ చేస్తారు . .పరిక్షలు చాలా స్ట్రిక్ట్ గా జరుగు తాయట . .ఒకే పుస్తకం లో మూడు రోజుల ప్రశ్నా పత్రాలు ఉన్నా ఎవరూ రేపటి పరీక్ష ఆపేర్ లో ఏమి ఉన్నాయో చూడక పోవటం ఇక్కడి విశేషం అని చెప్పింది .అన్నీ ఆబ్జెక్తివ్ ప్రశ్నలే .ముందు రాసేసినా, చివరి వాడు రాసే వరకు ఎవ్వరు కదల రాదట .వాడు రాయ లేక పొతే మళ్ళీ టైం పెంచుతారట .అందరు రాయటం అయిపోతేనే బయటికి వెళ్లటం వాలంటరీ కి రెండు రోజులు ట్రైనింగ్ ఇస్తారు .వార్షిక పరీక్షలను’’ ఎండ్ఆఫ్ గ్రేడ్’’అంటారు
బుధవారం –ఒక బీహారీ వాళ్ళ ఇంట్లో భజనకు వెళ్ళాం .ఇరవై మంది ఉన్నారు . స్వీటు అరటి పండు అందరికి ఇచ్చారు .విజ్జి, మా మనవడు శ్రీ కెత్ కూడా పాడారు .మర్నాడు గురువారం పవన్ అనే మా బంధువుల అబ్బాయి ఇంటి దగ్గర సునీత అనే వాళ్ళ ఇంట్లో భజన .ముప్ఫై మంది హాజరు .రెండు స్వీట్లు ,పులిహోర ప్రసాదం .శని వారం లైబ్రరి కి నేను మనవడు పీయూష్ వెళ్లి పుస్తాలు ఇచ్చి నేను ఇరవై ఒక్క పుస్తకాలు తెచ్చు కొన్నాను .కిందటి వారం లో చివర చదివిన ముస్సోలిన్-సామ్రాజ్యం చాలా బాగుంది .ఇన్స్పైరింగ్ .దాని మీద పన్నెండు పేజీల నోట్స్ రాసు కొన్నాను .అలానే హౌస్ ఆఫ్ లింకన్ కూడా బాగున్నాయి .మిగిలినవి బొమ్మల పుస్తకాలే .తెచ్చిన వాటిలో నిన్నా ,ఇవాళ షార్ప్, అనేది అలాన్ టూనర్ పుస్తకాలు చదివేశాను .
షష్టిపూర్తీ –శ్రీ వెంకటేశ్వర కళ్యాణం
నిన్న అంటే పందొమ్మిదవ తేది శని వారం సాయంత్రం ఇండెపెండెన్స్ రోడ్ లో ఉన్న ‘’హిందూ సెంటర్ ‘’అనే శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి అనీతా ,కిరణ్ అనే వారు పిలువగా వెళ్ళాం .ఇదే మొదలు దేవాలయ దర్శనం చేయటం ఇక్కడ .అనీతా వాళ్ళ నాన్న గారికి షష్టి పూర్తీ జరిపారు ఆ దేవాలయం లో .అందుకని వాళ్ల అమ్మా ,నాన్న పీట ల మీద కూర్చుని శ్రీ వెంకటేశ్వర కళ్యాణం చేశారు .సాయంత్రం అయిదున్నర కు ప్రారంభమై ,రాత్రి ఏడున్నరకు పూర్తీ అయిన్చ్ది .వాళ్ళు పిలుచుకొన్న వారందరూ వచ్చారు .అనీతా వాళ్ళు హైదరాబాద్ కు చెందినా తెలుగు వాళ్ళు .పూజారులు కల్యాణాన్ని బానే చేయించారు .అన్నీ యదా విధిగా .కాని తలంబ్రాలు పోయించలేదు ఎందుకనో .పరవాన్నం రవ్వ కేసరి ,పులిహోర ప్రసాదాలు. అక్కడ అందరు దేవుళ్ళు ఉన్నారు .అంటే కాంప్లెక్స్ .మా తోను కన్యా దానం ఇప్పించారు .వెంకటేశ్వర కళ్యాణం లో కన్యాదానం చెయ్యటం ఇదే మొదలు .ఆ తర్వాతా ప్రక్కనున్న విశాల మైన హాల్ లో డిన్నర్ ఏర్పాటు చేశారు అనీత కిరణ్ లు .రసగుల్లా ,మిరప కాయ బజ్జి ,వడ ,పప్పు ,చపాతి రెండు కూరలు వంకాయ కూర అప్పడాలు చట్నీ ,సాంబారు పెరుగు టో భోజనం బాగా ఉంది .అంతా వాళ్ళే తయారు చేసి తెచ్చారు .హాలు చాలా అందం గా ఉంది అందు లోని దొమ్ లైట్లు అద్భుతం .షష్టి పూర్తీ దంపతులు కళ్యాణం అవగానే మా ఇద్దరికీ సాష్టాంగ నమస్కారం చేసి ఆశీ స్సులు పొంది అక్షంతలు వేయించు కొన్నారు .ఆ తర్వాతా అనీతా వాళ్ళ నాన్న గారితో కేక్ కట్చేయించి అందరికి పంచారు .అంతా ఆయె సరికి రాత్రి పది అయింది .అప్పుడు బయల్దేరి ఇంటికి పదిన్నర కు చేరాం .
వైశాఖ వన భోజనం
ఇవాళ ఆదివారం నాడు విజ్జి అవధాని గార్లు మూడు కుటుంబాలను మధ్యాహ్నం భోజ నానికి పిలిచారు .ఒకటి రాంకీ ఉషా కుటుంబం ,రెండు బెల్లంకొండ రవి ఉషా కుటుంబం ,మూడోది పవన్ వాళ్ళ కుటుంబం .పిల్లా జెల్ల కలిపి ఇరవై మంది .పవన్ అత్తా గారు మామ గారూ కూడా వచ్చారు .బి.రవి కి .పవన్ కు మన శ్రీ హనుమ కధా నిది పుస్తకాలు ఇచ్చాను .టమేట పప్పు ,కాబేజీ కూర ,బంగాళా దుంప కూర ,వడియాలు ఆవకాయ .చారు ,పెరుగు .పుచ్చకాయ ముక్కలు పనస తొనలు అందరు కమ్మగా తిన్నారు .అందరు బయట చెట్ల కింద పట్టాల మీద ప్రక్రుతి లో కూర్చుని హాయిగా భోజనం చేశారు .ఉసిరి గింజలు మొలిచి మొక్కలు వస్తున్నాయి .కనుక దీన్ని వైశాఖ వన భోజనం అన్నాం.అన్నీ విజ్జే చేసింది .ఈ కుటుంబాలన్నీ చాలా మంచి కుటుంబాలు .సంస్కారం ఉన్న వి .స్నేహ పాత్ర మైనవి .
ముత్తేవి రవీంద్ర నాద గారు వారానికో సారి ఫోన్ చేసి మాట్లాడు తున్నారు .మధుసూదన రావు గారు రెండు సార్లు మాట్లాడారు ఆయనే ఫోన్ చేసి .మెయిల్ పెడితే మొన్న ఫోన్ చేశారు గోపాల కృష్ణ గారు .ఇలా ఈ వారం అంతా వేడుకల వారం గా గడిచింది .ఇవాళ మధ్యాహ్నం పాత’’ లవ కుశ ‘’సినిమా జెమిని లో చూశాం . .కళ్ళకు ,మనసుకు ఎంతో రిలీఫ్ ఇచ్చింది. రామ రాజ్యం చూసిన దోషం పోయిందని ఊరట కలిగింది .అందులో కుశుడు వేసిన నాగ రాజు రామోజీ స్టుడియో లో రెండేళ్ళ క్రితం ‘’వరుడు ‘’సినీ షూటింగ్ లో కలిశాడు .అరవై ఎల్లువచ్చాయి .పలకరిస్తే చక్కగా మాట్లాడాడు .ఒకటి రెండు సార్లు ఫోన్ చేసి మాట్లాడాడు .అప్పుడప్పుడు ఉయ్యూరు వస్తూ ఉంటానని చెప్పాడు .ఊరగాయ కావాలంటే మా అమ్మాయి మాగాయ ఇచ్చింది .చాలా బాగుందని హైదరాబాద్ లో షూటింగ్ లో ఉండగా ఫోన్ చేశాడు .మా మనవడు హర్ష వరుడు లో అల్లు అర్జున్ కు తోడి పెళ్లి కొడుకు గా నటించాడు .మేమందరం కూడా అందులో పాల్గొన్నాం .ఎక్కడో వెతుక్కుంటే కని పించ వచ్చు .సినిమా అటకెక్కింది పాపం .ఇప్పుడే మేనల్లుడు శాస్త్రి కాళి ఫోర్నియా నుంచి ఫోన్ చేసి మాట్లాడాడు .తప్పకుండా వారానికి రెండు సార్లైనా మాట్లాడుతుంటాడు .ఆంద్ర లో ఎండలు మండుతున్నాయత .’’సూర్య భగ భగ వానుడు ‘’గా ఉన్నాడని ఈనాడు రాసింది .ప్రకాశం జిల్లాలో యాభై కి వచ్చి జనం అల్లల్లాడి పోతున్నారట .ఇవాళ కాళి ఫోర్నియా లో సంపూర్ణ చంద్ర గ్రహణం అనీ ఇప్పుడే మొదలైందని మేనల్లుడు చెప్పాడు .ఇవీ ఈ వారం విశేషాలు .ఫోటోలు తర్వాతా పేడ తాము .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20-5-12.—కాంప్ –అమెరికా .


🙂
ఇవాళ మధ్యాహ్నం పాత’’ లవ కుశ ‘’సినిమా జెమిని లో చూశాం . .కళ్ళకు ,మనసుకు ఎంతో రిలీఫ్ ఇచ్చింది.
రామ రాజ్యం చూసిన దోషం పోయిందని ఊరట కలిగింది
LikeLike
Sir,
please see this video slide presentation, (at your free time)
ఇలాంటి slide show presentation పై మీ ఉద్దేశ్యం కావాలి ఇది నిన్న రాత్రి తయారు చేయటం జరిగింది, మీకు నచ్చినట్లయితే మీ blog లో పూర్వం శివరాత్రి సమయం లో మీ ద్వారా ప్రకటితం అయిన శ్రీ శైల విశేషాలను తమరి అనుమతితో నా బుద్ధికి తోచినట్లు కాక కాస్తంత సల్లక్షణాలు ఉండేట్లు గానే తాయారు చేయాలని ఉన్నాడని మిమ్ము ఆనాడే కోరితిని మా చిన్నప్పటి నుంచి శ్రీశైలం సంవత్సరమునకు రెండు పర్యాయములు వెళ్ళటం ఆనవాయితి,
ఇక కాలాంతరం లో వీలు పడక పోయింది. Hyderabad నుంచి 6 or 7 గంటలేనంత 2 ఏండ్లు ఉన్నా ఒక్క సారి బుద్ధి పుట్టలేదు, ఇప్పుడో ఇంటికేల్లెందుకే అవకాశం లేదు, ఇక ఈశ్వర సన్నిధానానికి మరింత జటిలం అంచేత తమరి ఆనతి మరియు సలహా మేరకు మీరు తెలియ పరచిన వివరాలతో శ్రీశైల video చెయ్యాలని అభిలాష వేగంగా కాదు నిదానంగానే !! పై video ఒక్క మారు చూసి బదులు తెలుప గలరు.
?!
http://endukoemo.blogspot.com
LikeLike
మీ ప్రయోగం అత్భుతం.
పూర్వం శివరాత్రి సమయం లో మీ ద్వారా ప్రకటితం అయిన శ్రీ శైల విశేషాలను తమరి అనుమతితో నా బుద్ధికి తోచినట్లు కాక కాస్తంత సల్లక్షణాలు ఉండేట్లు గానే తాయారు చేయాలని ఉన్నాడని మిమ్ము ఆనాడే కోరితిని
అనుమతి ఇచ్చాము. మాకు మీరు ఇలాగ చెయ్యడం ఆనందం
LikeLike
మిక్కిలి సంతోషం ! మహా ప్రభో !!
ఇక వీలు చూసుకుని ఆ పరమేశ్వరుని కార్యక్రమమునకు శీఘ్రంగా ఉపక్రమించెదన్ !
ధన్యోస్మి !!
Jai Baba
LikeLike