ఆడదై పుట్టటమే నేరమైంది
ఆమె గొప్ప గణిత శాత్ర వేత్త కుమార్తె .గణిత శాస్త్రం లో ప్రోఫెస్సర్ ,విజ్ఞాన శాస్త్ర వేత్త .ఆమె స్వయం వ్యక్తిత్వం మగవాళ్ళకు అసూయ పుట్టించింది .ఆమెను ఏమీ చేయ లేక నడి బజార్లో కిరాతం గా చంపే శారు .ఆమెయే హిపాటి యా అనే గ్రీకు మేధావి .శాస్త్ర్రేయ పరిశోధనలు చేసినందుకు హత్య గావింప బడ్డ మొదటి మహిళా హిపాటియా.
హిపాటియా తండ్రి తియాన్ .ఆయన అలెగ్జాండ్రియా లోని అతి పెద్ద మ్యూజియం లో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు .అది గ్రీకు మేధావులకు గొప్ప కేంద్రం .సాంస్కృతిక కేంద్రం కూడా .మేధావులైన విద్యా వేత్తలకు నిలయం .తియాన్ ను అత్యంత సమర్ధుడైన వేదాంతి గా ఆ కాలం లో భావించే వారు .మ్యుజియం అధికార సంఘం లో సభ్యుడు .ఖగోళం ,జామెట్రీ ,సంగీతం ,పై గొప్ప పరిశోధనలు చేసి వ్యాఖ్యానాలు రాశాడు ‘’.టా లమీ టాబ్లెట్స్’’ పై వ్యాఖ్యానానికి పెట్టింది పేరు .యూక్లిడ్ మూల సిద్ధాంతాలను బోధించే వాడు .బైజానటనులు న్లు కూడా అతని మార్గదర్శకత్వం లో నడిచే వారు .అంత మంచి పేరున్న వాడు ‘’.కాస్మిక్ కే యాస్’’ పై కవిత రాశాడు ‘’టా లమీ ప్రపంచం’’ పై కూడా వ్యాఖ్యానం రాసి మెప్పు పొందాడు .ఆయన్ను గొప్ప ఖగోళ శాస్త్ర వేత్తగా మజీశియన్ గా చరిత్ర పేర్కొంది .
అలాంటి గొప్ప తండ్రికి కి హిపాటియా .క్రీ.శ..355 లో గొప్ప కుమార్తె గా జన్మించింది .తండ్రి వద్దే విద్యనూ నేర్చింది .కొద్ది కాలం లోనే తండ్రిని మించిన కూతురు అని పించు కొంది .ద యా ఫాన్దిస్ రాసిన ‘’అరిత్ మాటి కా ‘’పై మంచి వ్యాఖ్యానం రాసి సెబాస్ అని పించు కొంది .అలాగే అపోలినయాస్ రాసిన ‘’కొనిక్స్ ‘’పైనా రాసింది .తండ్రి మొదలు పెట్టిన ‘’అలమాజిస్ట్ ‘’పుస్తకాన్ని సంపూర్ణం గా రాసి ప్రశంశలను పొందింది .ఇతర నగరాల లోని మేధావి వర్గం తో నిరంతరం సంప్ర దింపులు జరిపేది .ఆమె అలెగ్జాండ్రియా మ్యుజియం లో నియో ప్లతానిక్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ లో ప్రొఫెసర్ గా క్రీ.శ.400లో పని చేసింది .ఖగోళం ,గణితం ,గ్రహాల కదలిక పై పుస్తకాలు రాసి పేరు తెచ్చు కొంది .ఆమె క్లాస్ లో కూర్చొని ఆమె బోధన వినాలని చాలా మంది విద్యార్ధులు ఆమె ను వేడు కొనే వారు .సామ్రాజ్యం లో చాలా ప్రదేశాల నుంచి విద్యార్ధులు వచ్చి అక్కడ చదివే వారు .రాజకీయం గా కూడా మంచి పలుకు బడి ఉండేది ..ఆమె పై ప్లాటో ,ప్లోటి నస్ ప్రభావం ఎక్కువ గా ఉండేది .నిసియా అనే ఆమె స్నేహితుడు తాను రాసిన ‘’ఆన్ డ్రీమ్స్ ‘’పుస్తకాన్ని ఈమెకు పంపి అభిప్రాయం కోరాడు .ఆ సబ్జెక్ట్ లో ఆమెకే తగిన పాండిత్యం ఉందని అతని నమ్మకం .ప్లూటా ర్క్ కూడా ఆమె కు సహాధ్యాయి .సాధారణ స్త్రీలు ఆ రోజుల్లో కట్టు కొనే సాంప్రదాయ దుస్తులను ధరించేది కాదు .ఉపాధ్యాయులు వేసుకొనే బట్టలనే ధరించి బోధించేది .తన రధాన్ని తానే నడుపు కొనేది .
ఆమె శాస్త్ర వేత్త కూడా .plane astrolobe ,graaduated glaas hydrometer ,hydroscope లను నిర్మించింది .
హిపాటియా క్రిస్టియన్ కాదు .ఆ నాటి బిషప్ ‘’సిరిల్’’యూదులను తరిమి వేస్తుండే వాడు .దీన్ని ఆమె ,ఆమె తో పాటు అలేగ్జాన్ద్రియా గవర్నర్ ‘’ఒరేస్తేస్ ‘’కూడా వ్యతిరేకించాడు .అతను కూడా ఈమె లాగే నాన్ క్రిస్టియన్ (పాగాన్ ).ఇవన్నీ బిషప్ కు నచ్చలేదు .ద్వేషం టో గవర్నర్ ఆరేస్తాస్ ను చంపించాడు .హిపాటియా మగ వారి లా దుస్తులు ధరించటం ,లెక్కలు బోధించటం ,సైన్స్ ప్రయోగాలు చేయటం బిషప్ సిరిల్ సహించ లేక పోయాడు .అతని లో అసూయ నర నరానా వ్యాపించి పోయింది ,.వివేకం కోల్పోయాడు .ఆమె హద్దు మీరి ప్రవర్తిస్తోందని అందరి వద్దా వాపోయే వాడు .ఎవరు అతన్ని పట్టించు కోలేదు .దుష్ట పన్నాగం పన్నాడు .
క్రీ.శ. 415లో బిషప్ సిరిల్ పీటర్ అనే కిరాతక అనుచరుడిని ఈమెను చంపటానికి ఏర్పాటు చేశాడు .హిపాటి స్ క్లాస్ లో గణితం బోధిస్తుండగా ,కిరాయి మూక క్లాస్ లోకి ప్రవేశించి ,వివస్త్ర ను చేసి ,మంత్ర గత్తే అని నింద మోపి ,’’సేసారియన్ చర్చి ‘’ ‘’వరకూ ఈడ్చుకొని వెళ్లారు ..ఆమె సహాయం కోసం ఎంత అరిచినా ప్రయోజనం లేక పోయింది .ఎవరూ ముందుకు రాలేదు .మూగ రోదనే అయింది .అందరు చూస్తుండగా ఆమె కళ్ళు పీకేశారు .నాలుక కోసే శారు .ఆమె విల విల లాడుతూ చని పోతుంటే రాక్షసం గా నవ్వారు .చని పోగానే అక్కసు ఇంకా తీరక ఆమె శవాన్ని ‘’సినారాస్ ‘’అనే చోటికి తీసుకొని వెళ్లి ముక్కలు ముక్కలుగా నరికారు ఆ నరరూప రాక్షసులు .అయినా వారికి తృప్తి కలగ లేదు .ఆమె శరీరం లోపలి భాగాలన్నీ ,ఎముకల తో సహా బయటికి తీసి ,వాటినీ, ఆమెను తగుల బెట్టారు .అంటే, ఆమె ఆడది అని గుర్తింపు నిచ్చే దేన్నీ వాళ్ళు మిగలకుండా తగల బెట్టారు .ఇలా ఒక మహిళా శాస్త్ర వేత్త హత్య గావిమ్పబడం చరిత్ర లో ఇదే మొదటిది అని చరిత్ర కారులు పేర్కొన్నారు .’’తియోఫిలాస్ ‘’అనే చారిత్రకుడు రాసిన ‘’లైఫ్ ఆఫ్ ఇంసై డోర్‘’’’అనే పుస్తకం లో సిరిల్ చాలా అసూయతో హిహిపాటి యా వల్ల క్రిస్టియన్ మతానికి ఏదో ఉపద్రవంక లుగు తుందని ద్వేషం తో ఒక శాస్త్ర విజ్ఞాని అయిన మహిళను చంపటం అతి కిరాతకం ‘’అని రాశాడు .
క్రీ.శ. 642 లో ఆరబ్బులు అలెగ్జాండ్రియా ను వశం చేసుకొనే వరకు ‘’నియో ప్లటా నిక్ ‘’విద్య కొన సాగింది .ఆరబ్బులు అలెగ్జాండ్రియా లోని అతి గొప్ప మ్యుజియం గా ఉన్న లైబ్రరీ ని తగుల బెట్టారు .లక్షలాది పుస్తకాలు ద్వంసమయ యి .అందులో హిపాటియా రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి .అయితే ఆమె గురించి ఆమె శిష్యులు ,స్నేహితులు చెప్పిన రాసిన దాన్ని బట్టే ఆమే చరిత్ర కొంత తెలిసింది .ఇంతకీహిపాటియా చేసిన నేరం- ఆడదిగా పుట్టటమే .
గబ్బిట దుర్గా ప్రసాద్ —24-5-12—కాంప్—శార్లేట్ –నార్త్ కెరొలినా –యు.ఎస్.యే.


😦
ఓరి నాయనో ! ఎంత నీచ మైన ఘట్టం చరిత్రలో వాళ్ళని మనుషులు అని పిలవటానికి ఛాన్స్ లేనే లేదు, మృగాలు, కాదు కాదు అవే నయం వాటి ఆకలి తీర్చుకోవటం కోసం మాత్రమే అవి ప్రయత్నిస్తాయి ఇది నిజంగా దుస్సంఘటన, కొన్ని తరాలు గడచినా ఆ పాపం ఊరికే వదులుతుందా? ఆదేశాన్ని ? ”ఆడ జన్మకు ఎన్ని శోకాలో” అంటే లక్ష్యార్థం సూచించే story ఇది
http://www.youtube.com/watch?v=SBtjwniuSrY
?!
LikeLike
ఓక స్త్రీ పట్ల ఇంత ఘోరము,దారుణము ఇంతకుముందు చదవలేదు.
LikeLike
horrible. A scientist, that too a woman, what else is needed for those bastards. 😦
LikeLike
Chaalaa daarunam guruvu gaaroo!
LikeLike