మేము ఉంటున్న నార్త్ కెరొలిన
క్రీ.శ..200 లో ఇక్కడ ఇటుకలు మట్టి బొమ్మలు తయారు చేసేవారు .వాటి ని ఉత్సవాలకు వాడే వారు .క్రీ.శ. 1000 లో పు రాతన మిసిసిపి సంస్కృతీ ఇక్కడికి వచ్చింది .పెద్ద నగరాల నిర్మాణం జరిగింది .వ్యాపారవాణిజ్యాలు బాగా ఉండేవి .ఇక్కడి ఆదిమ జాతులు carolino .angloquian , భాషలు మాట్లాడే చౌనోక్ ,రోనోక్ మొదలైన జాతుల వాళ్ళు .వీరిని మొదటిసారిగా బ్రిటిషర్లు ఎదిరించారు .ఇక్కడికి వచ్చిన మొదటి యురోపియన్లలో ఇంగ్లీష వారే ప్రధములు .1580 లో సర వాల్టర్ రాలీ ఇక్కడ రెండు సెటిల్మెంట్లు ఏర్పాటు చేశాడు .తరువాత వాళ్ల కాలనీలు ఏమయ్యాయో మిస్టరీ .1640 లో వర్జీనియా నుంచి ఆంగ్లేయులు ఇక్కడికి వలస వచ్చారు .1663బ్రిటన్ రాజు ఇక్కడ కారోలీనా కాలనీ ఏర్పాటుకు అంగీక రించాడు .
పద్దెనిమిదవ శతాబ్దానికి ప్రాతినిధ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి .1765 లో బ్రిటిషవాళ్ల అధిక పన్నులకు ,పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేక పోవటానికి నిరసన ప్రారంభ మైంది .అమెరికా విప్లవం లో ఇది దేశ భక్తీ ప్రాంతం అయింది .దీని ఫలితం గా బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందే అవకాశం ఇక్కడి డెలిగేట్ల కు లభించింది .కాని బ్రిటీష వారి భక్తులు కొందరు దాన్ని అమలు కాకుండా అడ్డు పుల్ల వేశారు .
19 వ శతాబ్డం ప్రారంభం లో ఇది రూరల్ స్టేట్ గా ఉంది .సిటీలు లేవు .కొన్ని పల్లెలు మాత్రమే ఉన్నాయి .బానిసల సాయం తో పత్తి బాగా పండించే వారు .పత్తికి అనువైన భూమి ఎక్కువ ఉంది .ప్రజాస్వామ్య భావాలు మొదటి నుంచి ఎక్కువ గా ఉన్న రాష్ట్రం .బానిసలపై కూడా దయా దాక్షిణ్యం చూపించే వారు .దక్షణాది వారు యునియన్ నుంచి విడి పోదామని ప్రయత్నిస్తే వీళ్ళు అంతగా సహకరించలేదు .ఇక్కడి ఎన్నికల్లో తూర్పు ప్రాంతం డెమోక్రాట్లకు ,పడమటి ప్రాంతం విగ్గు లకు తీవ్ర పోటీ ఉండేది .1861ఏప్రిల్ లో ఫోర్ట్ సెంటర్ లో కాల్పులు జరిగాయి .యూనియన్ నుంచి నార్త్ కెరొలిన విడి పోయింది .కాన్ఫెడరేషన్ లో చేరింది .అమెరికన్ సివిల్ వార లో వేర్పాటు వాదులకు మద్దతు నిచ్చిందీ రాష్ట్రం .రి కన్స్ట్రక్షన్ కాలం లో బానిస విమోచన జరిగింది .1950-60 మధ్య జరిగిన సివిల్ రైట్స్ ఉద్యమం లో ఈ రాష్ట్రానికి పెద్ద పాత్ర ఉంది .’’సిట్ ఇన్ ప్రొటెస్ట్ ‘’ను గ్రీన్ బరో సిటి లో నిర్వహించాడు మార్టిన్ లూధర్ కింగ్ .ఇది ఉద్యమ కేంద్రమే అయింది .’’student non violent co-ordination committee ‘’ ఇక్కడే అంటే రాలీ లో sha university’ లో ఏర్పడింది .1973 లో రాలీ మేయర్ గా క్లారంస్ లైటనేర్ అనే ఆఫ్రికన్ అమెరికన్ ఎన్నికైనాడు .నార్త్ కరోలీన రాజ దాని రాలీ ..పెద్ద నగరం మాత్రం శార్లేట్
ఇక్కడ అపలేచియన్ పర్వతాలున్నాయి .తీరప్రాంతాలు ,పంట భూములు ఉన్నాయి .పొగాకు పంటలో అమెరికా లో మొదటి స్తానం .అలాగే చిలగడ దుంప కూడా అత్యధికం గా పండుతు నంబర్ వన్ స్తానం పొందింది క్రిస్మస్ ట్రీలు అంటే పైన చెట్లకు రెండో స్తానం .కుకుంబర్ అంటే దోస పంట కు మూడో స్థానం .స్త్రా బెర్రి ,ప్రత్తి పంటకు నాలుగో స్తానం .సోయా బీన్స్ ,మొక్క జొన్న ,గోధుమ ,వేరుసెనగ ,బ్లూ బెర్రిస్ , బంగాళా దుంప ,టమేటో మొదలైన పంటలు పండే రాష్ట్రం .
కోళ్ళు ,ట ర్కీలు ,పందుల పెంపకం ఎక్కువ .బ్రాయిలర్ కోళ్ళకు మొదటి స్థానం .అలాగే ఆపిల్స్ కు కూడాపీచు లు ,పశు పెంపకం హాగ్ పెంపకము ఎక్కువే .
వస్త్ర పరిశ్రమ ,సిగరెట్లు ,టొబాకో లకు నంబర్ వన్ .పందుల పెంపకం లో రెండో స్తానం .సిన్తేతిక్ ఫైబర్ ,ఫార్మా స్యూటి కల్స్ ,కు ఇది కేంద్రం .కంప్యుటర్ ,ఎలక్ట్రానిక్ వస్తువులు ,కమ్యునికేషన్ సామగ్రి ఉత్పత్తికి జాతీయం గా మూడో స్తానం లో నార్త్ కెరొలినా ఉంది .
నార్త్ కెరొలినా లో గ్రానైట్ గనులు అపారం గా ఉన్నాయి .సున్నపు రాయి నిక్షేపాలు అధికమే .ఫాస్ఫాల్తిక్ రాక్ ,లిదియం గనులున్నాయి .మైకో ,మార్బుల్ లకు కేంద్రమైంది .
బ్లుక్రాబ్స్ ,ష్రిమ్ప్ చేపలకు ప్రసిద్ధి ,ఆక్వా కల్చర్ ఉంది .కాట్ ఫిష్ ఇక్కడి ప్రత్యేకత .
నార్త్ కెరొలినా కు ‘’ .the tar hill state ‘’,’’turpentine state ‘’ అని మారు పేర్లున్నాయి .
charlotte (షార్లేట్ )
అమెరికా లో ఛ ను షా గా పలకటం ఫాషన్ .చికాగో ను షికాగో అంటారు .చార్లేట్ ను షార్లేట్ అంటారు .ఇది ఈ రాష్ట్రం లో పెద్ద సిటి ..మెక్లీన్ బర్ఘ్ కౌంటి దీని దగ్గరే ఉంది .పదిహేడవ పెద్ద నగరం .న్యూయార్క్ తర్వాత ఇక్కడే బాంకింగ్ ఎక్కువ గా జరుఫు తుంది .మూడు ప్రధాన బంకులకు కేంద్రం శార్లేట్ .charles macklien burgh అనే బ్రిటీష రాజు మూడవ జార్జి భార్య పేరు మీద ఈ సిటి ఎర్పడింది .అమెరికన్ రివల్యుషనరి వార్ కు కేంద్రం గా నిలిచింది .జనరల్ కారన్ వాలీస్ ను తరిమి కొట్టిన ప్రాంతం .hornest nest అని దీనికి నిక్ నేం.తూర్పున catawba,ఆగ్నేయం లో లేక నార్మన్ సరస్సు ఉన్నాయి .ఇది మాన వ నిర్మిత అతి పెద్ద మంచినీటి సరస్సు .
షార్లేట్ డెమొక్రాటిక్ పార్టీకి మెజారిటీ అభిమానం ఉన్న సిటి .ఇంతవరకు యే ప్రెసిడెంట్ ఎన్నికలకు అభ్యర్ధిని నిర్ణయించే సమావేశం ఇక్కడ జరగలేదు .ఈ సంవత్సరం సెప్టెంబర్ లో డెమొక్రాటిక్ అభ్యర్ధిని ప్రకటించే పెద్ద సదస్సు షార్లేట్ లో జరుగ బోతోంది .చరిత్రను సృష్టిస్తుంది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-5-12.కాంప్ –అమెరికా .


GOOD CHARITRA BAGUNDI MEE DESHA CHARETRA RASTE INKA BAGUNTUNDI………..
LikeLike
ఊసుల్లో ఉయ్యూరు (31) lo chadavandi
LikeLike