నమస్తే -గోపాల కృష్ణ గారు -”రేడియేషన్ పోయెమ్స్ ”అనే కవితా సంకలం గురించి నేను రాసిన ఆర్టికల్ ఈ నెల విహంగ వెబ్ మాగజైన్ లో పడింది .దానిని మీకు పంపాను .మీరు దాన్ని బాపు గారికి పంపుతామన్నారు కదా -పంపండి .కాకాని ప్రసాద్ ,రామ మోహన రావు గార్లకు ఫోటోలు పంపాను .ప్రసాద్ గారికి వెళ్లి నట్లు లేదు .మీరు ఫార్వార్డ్ చేయండి –మీ ఊళ్ళో నాకు అత్యంత ఆడరమైన స్వాగతాన్ని ,ఆతిధ్యాన్ని మీ ”మంచి కుటుంబం ”అందరు అంద జేసి నందుకు కృతజ్ఞతలు .నేను వచ్చి ఇబ్బంది పెట్టానేమో నని మనసు లో ఉన్నా ,మిమ్మల్ని చూడాలన్న తపన అంత పని చేయించింది .మీ సా హితీ, సాంఘిక మిత్రుల్నీ పరిచయం చేసినందుకు మీ” నార్త్ అలబామా తెలుగు అసోసియేషన్” (నాటా ) తరఫున మీ సంఘ అధ్యక్షులు రామ మోహన రావు గారితో సన్మానం చేయించి ,జ్ఞాపికను అంద జేసి నందుకు మీ అందరికి కృతజ్ఞతలు .బహుశా ఈమాట సరి పోదు -చిన్న మాట అవుతుంది ..హన్త్స్ విల్లి ని నేను ”వేట పాలెం లేక వేట పల్లి” అనచ్చు అని మీతో చేప్పా ను .అది వేట పాలెం అయితే మీరు దాని లైబ్రేరియన్ .అంతే కాదు హన్త్స్ విల్ ”రుషి పుంగవులు ”మీరు అని నా అభిప్రాయం .మీ ఆలోచనా ,సాంఘిక సేవ ,సహనం,సమాజం పై అణు కంప స్నేహశీలత ,సచ్చీలత ,ఉదారహృదయం ,మిత్రత్వం ,బంధు హితం అన్నీ ఒక రుషి కి ఉండే లక్షణాలు .అవి మీలో మూర్తీభావించాయి .అందుకే ”హన్త్స్ విల్ రుషి ”అన్నాను .మీ సహధర్మ చారిణి గారు ”స్వయం సిద్ధ ”.మీకు అను క్షణ అనుగామిని .సౌశీల్యం కుటుంబ భావన మూర్తీ భావించిన మాత్రు మూర్తి .మీ పిల్లలు రత్న మాణిక్యాలు .ఇంత కంటే తల్లి దండ్రులకు ఇంకేం కావాలి ?మీ అందరి మధ్య రెండు రోజులు క్షణం తీరిక లేకుండా గడి పీ నందుకు అమితా నందం గా ఉంది ..నన్ను షార్లెట్ నుంచి మీ ఊరికి రావటానికి నన్ను కార్ లో ఇక్కడి నుండి మాంట్ గోమారి కి ,మళ్ళీ అక్కడి నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి ,అనుక్షణం ‘అంకుల్ ”అంకుల్ ”అంటూ నాకే లోటు రాకుండా చేసిన మా అమ్మాయి వాళ్ల ప్రక్కింటి పసుపుల రవి కి నేనేమిచ్చి ఋణం తీర్చు కో గలను ? మీరు నాకు మాంట్ గోమారి నుండి హన్త్స్ విల్ కు ,ఆక్కడి నుండి మాన్త్గోమారి కి మీ” గ్రే హౌండ్స్(వేట కుక్కల ) ”బస్ లో రేసేర్వేషణ్ చేయించి ,నా ప్రయాణానికి వీలు కల్పించిన మీకు ఎన్ని కృతజ్ఞతలు చే ప్పినా తక్కువే .
సరసభారతి కి మీరు భారీగా అండగా నిలిచిన విషయం జీవితం లో మరువలేనిది .మీరు చేసిన సత్కారం నాకు కాదు ”సరస భారతి ”కి అనిమనస్పూర్తి గా భావిస్తూ ,అట్లాంటా లో నాటా సభలు జరిగుతున్న సందర్భం లో మీ హన్త్స్ విల్ లో సత్కరించటం నాకు తానా ఆటా ,నాటా అలలో సన్మానం అందు కొన్న మహదానందం గా ఉంది .అందరి లోని మంచినీ ఒక్క సారి చూసే అరుదైన అవకాశం కల్పించారు .రెండు రోజుల ముందు మాత్రమే అనుకొన్న ప్రయాణం అత్యంత ఆనందంగా ఫలవంతం గా జరిగింది .ఊహించని ప్రయాణం ఇది .”అలబామా కు అలవోక గా ”రావటం జరిగినా ,మనసంతా మధుర భావన నిండింది .–మీ దుర్గా ప్రసాద్

