http://vihanga.com/?p=4440
సాధారణం గా కుటుంబం లో ఎవరి కైనా జబ్బు చేస్తే కాలూ ,చేయి ఆడక తన్ను కొంటాం .నానా కంగారు పడిపోతాం .మన కంగారుని ఇతరులకూ అంటించి ,వారినీ ఇబ్బంది పాలు చేస్తాం .మరి ఆ జబ్బు కుటుంబ పెద్ద ,భర్త అయితే ,అది కేన్సర్ వంటి తీవ్ర వ్యాధి అయితే అతని భార్య తట్టుకో గలదా ?.దానికి రేడియేషన్ చికిత్స నలభై మూడు రోజులు, రోజూ చేయాల్సి వస్తే ,ఆమె మానసిక స్తితి తట్టు కోగల దా.?అలాంటి విపత్కర పరిస్తితి నే ఎదుర్కొంది ‘జేన్ ఎలన్ ‘’ అనే కవయిత్రి , రచయిత్రి .ఆ బాధను తగ్గించు కోవటానికి ,భర్తకు సాంత్వన కల్గించటానికి’’రేడియేషన్ పోయెమ్స్ ‘’ పేరిట రోజుకొక సానెట్ అంటే పద్నాలుగు పంక్తుల కవిత ను రాసింది .చికిత్స విజయవంతం అయి,భర్త మళ్ళీ మామూలు మనిషి అయాడు .ఆ కవితలు ఎంతో మంది డాక్టర్లకు ,కేన్సర్ పేషంట్లకు ఊరట కలిగించి ,మనో నిబ్బరం పెంచాయి .ఇదే ఈ వ్యాస విషయం .
జేన్ ఎలన్ అంతకు ముందు ఎన్నో పుస్తకాలు రాసింది .ఎన్నో అవార్డులు పొందింది .చిన్న పిల్లలకు ఆమె రాసిన పుస్తకాలు బాగా ప్రచారం అయాయి .’’ఔల్ మూన్ ‘’, ది డేవిస్ అరిత్మాటిక్ ‘’’’హౌ డు డైనోసార్స్ సే గుడ్ నైట్ ?’’అనే పుస్తకాలు ఆమెను ‘’అమెరికా స్ హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ ‘’ను చేశాయి .ఆమెను ఆధునిక ‘’ఈసప్ ‘’అని న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రసిద్ధ పత్రికలు ప్రశంసించాయి .ఆమె పుస్తకాలను ఇరవై ఒక్క భాషల్లోకి అనువాదం చేశారంటే ,ఆమె ఎంత గొప్ప రచయితో మనకు అర్ధమవుతుంది .క్రిస్టోఫర్ అవార్డ్ ,రెజీనా మెడల్ ,’’దిసొసైటీ ఆఫ్ చిల్డ్రన్స్ బుక్ రైటర్స్ అండ్ ఇల్లస్ట్రెటర్సు ’’అవార్డ్ లాంటి ఎన్నో అవార్డులు ,రివార్డులు పొందింది .ఆమెరచన నేషనల్ బుక్ అవార్డ్ కు నామినేట్ అయింది .మూడు ఆనరరి డాక్టరేట్లను పొందిన విదుషీ మణి. భర్త డేవిడ్ స్టేమ్పుల్ తో మసా చూసెట్స్ ,సౌత్ లాండ్ లో ఉంటోంది .
భర్త కూడా తక్కువ వాడేమీ కాదు . మసా చూసెట్స్ లో కంప్యూటర్ ప్రొఫెస్సర్ .చివర్లో ఆ శాఖకు చైర్మన్ గా పని చేశాడు.రిటైర్ అయిన తర్వాత పక్షుల విషయం పరిశోధన చేబట్టాడు .రికార్డ్ చేయటానికి మద్య ,దక్షిణ అమెరికాలలో బ్రిటీష్ ఆయిల్స్ లో విస్తృతం గా పర్యటన చేశాడు .తన పరిశోధనా ఫలితాలను ,రికార్డింగ్ లను ‘’మెకాలే లైబ్రరి ఆఫ్ నేచురల్ సౌండ్స్ ఎట్ కార్నెల్ యూనివర్సిటీకి’’ దానం చేశాడు . అలాంటి విద్యా నిష్ఠ గల దంపతులు వారిద్దరూ .ఆయన కు కేన్సర్ వ్యాధి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది .చికిత్స చాలా కష్టం .రేడియేషన్ ట్రీట్ మెంట్ మాత్రమే శరణ్యం అని తేల్చారు .అదీ వరుసగా నలభై మూడు రోజులు చేయాలని నిర్దారించారు .
దీన్ని తట్టు కోవటం భార్య జేన్ ఎలన్ కు బహు కష్టమైంది .ఆయన ఎలా అయినా గండం గడచి బయట పడాలని శత కోటి దేవుళ్ళకు మొక్కు కుంది .మనసును చిక్క బట్టుకోవటం కోసం రోజూ చికిత్స అయి ఇంటికి చేరిన తర్వాత ఆమె ఒక సానెట్ రాసేది.వాటికే ‘’రేడియేషన్ పోయెమ్స్ ‘’అని పేరు పెట్టింది .
వాటిలో ఆమె భయం ,ఆందోళన ,ప్రేమ ,బాధ్యత ,చికిత్సా విధానం ,ఆధునిక టెక్నాలజీ… చేస్తున్న సేవ మొదలైన వాటిని నింపింది .తాను స్వాంతన పొంది ,భర్తకూ స్వాస్థ్యం చేకూర్చటమే ఆమె ధ్యేయం .అన్ని కవితలూ రాసి ‘’నేషనల్ పబ్లిక్ రేడియో ‘’లో విని పిస్తే అనూహ్య మైన ప్రతి స్పందన వచ్చింది .వైద్య సాంకేతికత కు ఆమె జోహార్లు అర్పించింది .ఈ కవితల్లో దేవుడి పై కోపం ,కొద్దిగా భర్త ఆరోగ్యం మెరుగైతే ఆనందం ,ఇంతలో ఆవేశం ,నిరాశ ,ఆశల పొరలు అన్ని ఎమోషన్స్ కవితల్లో నింపింది .తను ఆరోజు పొందిన అనుభూతినంతా సానెట్ లో పొందు పరచింది .భర్త తో ఉన్న అనుబంధం , ప్రేమ , వివాహ బంధాలు అన్నీ గుర్తు చేసుకొన్నది .తన నిస్వార్ధత ను ,అంకిత భావం తో తాను చేస్తున్న సేవను ,కోలుకుంటాడనే ఆత్మ ధైర్యాన్ని ,ఎవరైనా బంధువులు ,స్నేహితులు భర్త ను వచ్చి చూసి నప్పుడు పొందిన ఉద్విగ్నతలను చక్కగా నిక్షిప్తం చేసింది జెన్స్..ఈ కవితలు విన్న వారందరికి ఊరట కల్గింది .మనో ధైర్యం పెరిగింది .జీవిస్తాం అనే ఆశ ,నిబ్బరం హెచ్చాయి .అంత గొప్ప ప్రాభావం చూపించాయి ఆమె సానేట్స్ .
భార్యా భర్తల మద్య ఉండాల్సిన సయోధ్యతను ,కష్ట సమయాల్లో ఉండాల్సిన ఆత్మ ధైర్యాన్ని ప్రబోదిస్తాయి .’’’కష్టాల కడలి లో ఈదే వారికి ఈ కవితా సంకలనం ఒక తెడ్డు లాగా ఉపయోగ పడుతుంది ‘’అని పత్రికలూ మెచ్చాయి .ఆమె ప్రశాంత మనస్కురాలై ,అందరికీ ఆ ప్రశాంతత పంచింది ..హృదయాలను తాకే ఎన్నో కవితా పంక్తులు అందు లో ఉన్నాయి .’’కవిత్వాన్ని చికత్స కోసం ప్రయోగించిన కవయిత్రి జెన్స్’’.
రేడియేషన్ చికిత్స పరమ బాధా కరం .దాన్ని ఏ పేషెంటూ తట్టు కోలేడు ,చూసే వారు తట్టు కోలేరు .దాన్ని తట్టు కొని నిలబడే ధైర్యం కలగటానికే ఆమె రాశానని చెప్పింది . wit is the only wall between us and the daark ‘’అన్నMark Van Do ren అనే రచయిత మాటలు ఆమెకు ప్రేరణ నిచ్చాయి .ఈ కవితలను ‘’పెర్ఫార్మన్స్ పోయెమ్స్ ‘’అన్నారు .అంటే గట్టి గా బయటకు చదివి వినిపించేవి .అప్పుడే దాని ప్రభావం తెలుస్తుంది .ఈ కవితల్ని తనను తాను ఆవిష్కరించు కోవటానికి,గుండె గొంతులో కొట్టుకుంటున్న బాధను బయట పడేసేదానికోసం రాశానని ఆమె చెప్పుకోంది ‘సానెట్ అంటే నాల్గు పంక్తులున్న మూడు భాగాలు చివర్లో ఒక ద్విపద అంటే కప్లేట్.కప్లేట్ లో ముందు రాసిన దాని సారాంశం అంతా ఉండటం విశేషం .కేన్సర్ వ్యాధి ఏడవ టానికి సమయం ఇవ్వదని,తాను,తన భర్త ‘’ఇద్దరం ఫైటర్స్’’ మని అంటుంది .సానెట్ నే ఎందుకు రాశావు అంటే compression of poetry echos compression of emotions ‘’అని చెబుతూ , విషయాన్ని తాను ఎంచుకొన్నానని ‘’ఫారం’’ తన్ను ఎన్నుకొన్నదని జెన్స్ అన్నది .వీటిని భర్త డేవిడ్ కు అంకిత మిచ్చింది . కొన్ని కవితా పంక్తులు మీ, మన కోసం –
I want another April ,May and June –I want still the wanting so muchh .
if we breathe enough to share ,-to give you ,along with care
If i could know that it was best,–i would feed you ,husband,at mya breast ‘’
చివరి పంక్తి చాలా అద్భుతం గాఉందికదూ.దీన్ని చదివితే కొలకలూరి ఇనాక్ గారి కధ ఒకటి గుర్తుకు వస్తోంది .పేరు జ్ఞాపకం లేదు.కాని భార్యా భర్త రాయల సీమ ప్రాంతం వారు .తిండికి గడవక వలస వెళ్తూ ఉంటే భర్త కు దాహం అయి గొంతెండి పోయి పడి పోయే పరిస్థితి లో ఉంటే భార్య స్తన్యం ఇచ్చి ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆయన ఎన్నో గొప్ప కధలు రాసినా ఈ కధే నాకు బాగా నచ్చింది .కాని పేరు ఎందుకో ఎన్ని సార్లు ప్రయత్నించినా గుర్తుకు రాదు.ఆ కధ విషయం ఇనాక్ గారికి నేను ఒక సారి గుర్తు చేస్తే ,చాలా సంబర పడిపోయారు.*
– గబ్బిట దుర్గా ప్రసాద్
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D