హి(హృ)దయ తుల్లా
మధ్య ప్రదేశ్ లో జన్మించి బార్ ఎట్ లా అయి నాగపూర్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ గా ,సుప్రీం కోర్ట్ జడ్జిగా ఎదిగి ,సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గా సమర్ధ వంతం గా పని చేసి ,పరిస్తితుల ప్రభావము ,అదృష్టం కలిసి రావటం వల్ల భారత రాష్ట్ర పతి గా సుమారు నెల రోజులు పని చేసిన అదృష్ట వంతుడు జస్టిస్ హిదయ తుల్లా .ఆయన తన జీవిత చరిత్ర ను ”my own Boswell” గా రాసుకొన్నారు .ఈ పుస్తకాన్ని మొన్న అలబామా పర్యటన లో నాకు మైనేని గోపాల కృష్ణ గారు కానుక గా ఇచ్చారు .అందులో అందరికి పనికి వచ్చే హిదయతుల్లా గారి హ్రుదయావిష్కరణే ఈ వ్యాసం .
ప్రఖ్యాత విమర్శకుడు ,నిఘంటు నిర్మాత శామ్యుల్ జాన్సన్ శిష్యుడు బాస్వేల్ .గురువు గారి జీవిత చరిత్ర ను అత్యద్భుతం గా రాశాడు బాస్వేల్.ఎవరైనా గొప్ప శిష్యుడు ఉంటె అతన్ని శామ్యుల్ గారి బాస్వేల్ అంటారు .కాని హిదయతుల్లా ప్రతి వాడు తనకు తాను బాస్వాల్ అన్నారు .జీవిత చరిత్ర రాసుకోవటం కష్టమే నంటూ దాన్ని ఇనుప కలం తో వజ్రపు పాళీ తో రాయాలి అన్నారు .స్వీయ చరిత్ర ”మరచి పోయిన విషయాలలో సగానికి రికార్డ్ అని అవి నిజమో ,అబద్ధమో కాని మధుర జ్ఞాపకాలు అవటం మాత్రం నిజం ”అన్నాడు .ఈ సందర్భం గా బాస్వేల్ ను గుర్తు చేసు కొంటూ అతను ప్రపంచం లో జీవిత చరిత్రలను వ్రాసిన వాళ్ళలోమొట్ట మొదటి అత్యంత గొప్ప ప్రతిభా వంతుడు అని కితాబు ఇచ్చారు . .
హిదాయ తుల్లా వంశం విద్యలో తర తరాలుగా ముందు న్నది .సాధారణం గా ముస్లిములు తమ వంశాలు పర్షియా కో ,అరేబియా కో చెందినవని గర్వం గ చెప్పు కొంటారట .కాని తమ పూర్వీకులకు ఈ విషయం లో ఏ ప్రమేయమూ లేదంటారు. తమ కుటుంబం లో పంది మాంసము తో పాటు ఆవు మాంసమూ నిషిద్ధమే నన్నారు .దీపావళి పండుగను హిందువు లతో బాటు తామూ ”దివస్ ”అనే పేర జరుపు కొంటామని తెలిపారు .
మెకాలే ను జ్ఞాపకం చేసుకొంటూ ఆయన జ్ఞాపక శక్తికి ఉదాహరణ ఒకటి చెప్పారు .మెకాలే తండ్రి కొడుకును ”claarissa harlowe’.చదివావా అని అడిగితే చదివానని చెప్పటమే కాకుండా ఆ నవలను పేజీలకు పేజీలు అప్ప గించి తండ్రి ని ఆశ్చర్యం లో పడేశాడట .అలాగే తన తండ్రి ఖాన్ బహదూర్ హఫీజ్ మొహమ్మద్ విలాయ తుల్లా తొమ్మిదో ఏడాదికే పవిత్ర ఖురాన్ అంతా హృదయగతం చేసుకోను ”హఫీజ్ ”అయ్యారని గర్వం గా చెప్పారు .ఉర్దూ లో ”బాబాయ్ ”అంటే తండ్రి అనిఅర్ధం ట ”.బాబాయ్ ఉర్దూ” అంటే ఫాదర్ ఆఫ్ ఉర్దూ అని అర్ధం అన్నారు .
తనతో పాటు చదివిన అనంత శయనం అయ్యంగార్ కి ఐ.సి.ఎస్ పరీక్షలో” వైవా వోసి” లో మార్కులు నిరాకరించటం వల్ల ఏడవ రాంక్ వచ్చిందట .లేక పోతే మొదటి స్థానం సంపాదించి ఉండే వారట అయ్యంగార్.ఆయన మద్రాస్ హైకోర్ట్ ప్రధాన న్యాయ మూర్తిగా ఉండి పోవలసి వచ్చిందట .తాను ఆ పోటీ పరీక్షకు వెళ్లి సమయాన్ని వృధా చేసుకోక పోవటం వల్ల సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి అయాను అన్నారు .ఆ పరీక్ష జోలికి పోక పోవటం వల్ల తనకు అమూల్య మైన 14ఏళ్ళ కాలం కలిసి వచ్చిందన్నారు .
తుల్లా గారి జేబులో ఎప్పుడు గోళీలు ఉండేవట .ఒక గోలీ ఎప్పుడూ నోట్లో ఉండేది .ఒక సారి గాజు గోలీలను కొట్టే పెద్ద సీసపు గోళీ ని -దీన్నే ”బిల్లేరు ”అంటారు నోట్లో పెట్టు కొని మింగేశాదట.ఇంకేముంది విరేచనాల మందేమందు .అప్పుడు కాని బయట పడ లేదు .ఆయనకు నా లానే డ్రాయింగ్ అంటే భయం .వేస్తున్నట్లు నటించ్స్తూ సోదరుడి సాయం తో బొమ్మలు పూర్తీ చేసే వారు .ఒక సారి మేస్టారికి అడ్డం గా దొరికి పోయారు .ఆయన హెడ్ మాస్టర్ కి రిపోర్ట్ ఇచ్చాడు .హెడ్ అడిగితే తనకు డ్రాయింగ్ ఇష్టం లేదని చెబితే నవ్వి, సబ్జెక్ట్ మార్పించాడు .
1954లో ఒక సంక్షేమ నిది కోసం తాను చీఫ్ జస్టిస్ టీం కు కెప్టెన్ గా గవర్నర్ టీం తో ఆడానని ,తాను అయిదవ బాట్స్మన్ గా వచ్చి ,తన టీం మొత్తంమూడు పరుగులకే మొత్తం అవుటయితే అందులో మొదటి పరుగు ఒకే ఒక్క పరుగు తనదే నని చెప్పారు .
మయూర్ భంజ్ రాజ్య వారసుని సంక్షోభం తల ఎట్టి నప్పుడు వారి రాజ గురు తో సంప్రదించి బాబుదాని అనే రా కుమార్తె ను రాణి ఆయె తట్లు దివాన్ అయిన తమ తండ్రి చేసి కొత్త సంప్రదాయానికి తేర తీశార ని రాశారు బ్రిటీష రాజ పాలన లో ఒక రాజ కుటుంబం లో కుమార్తె కు పదవి దక్కటం అదే ప్రధమం అని చెప్పారు .దానికి ఆ కుటుంబం ,ఆ ప్రజలు తమ కుటుంబానికి కృతజ్ఞతలు చూపారని అన్నారు .తాను మధ్య ప్రదేశ్ ప్రధాన న్యాయ మూర్తి అయి నప్పుడు ”గడ్డం దివాన్ గారి అబ్బాయి ”అని తనను పలకరించారని చెప్పారు .బస్తర్ లోని ఇంద్రా వతి నది గొప్ప జలపాతం వల్ల ఏర్పడిందని అది సుందర దృశ్యం అని వివ రించారు .
కాలేజిలు అంటే” గులక రాళ్ళను పాలిష్ పెట్టేవి ,వజ్రాలను కాంతి హీనం చేసేవి” అంటారు హిదయ తుల్లా .నాగపూర్ కాలేజి లో అన్ని మతాల పండుగలను అన్ని మతాల వారు కలిసి చేసే గొప్ప సంప్రదాయం ఉండేదట .లండన్ లో ధియేటర్లలో నాటకాలు బాగా ఉండేవట .జాన్ గీల్గుడ్ అనే నటుడు హామ్లెట్ వేషం అత్యద్భుతం గా వేసే వాడని ,మహా నటన ప్రదర్శించే వాడని అందుకే అతనికి ”నైట్ హుడ్”పురస్కారం లభించిందిఅన్నారు . .ఒథెల్లో నాటకం లో పాల్ రోబెంసన్ అనే నీగ్రో ముఖ్య పాత్ర పోషించే వాడట అతనితో ఒక తెల్ల జాతి మహిళ స్త్రీ పాత్ర ధరించా వలసి వచ్చిందట .ఆమెను చేస్తారా అని అడిగితే ”i would consider it an honour ” అని సంస్కారాన్ని ప్రకటించింది …ఒక సారి నాటక ప్రదర్శన లో ప్రఖ్యాత నాటక రచయిత బెర్నార్డ్ షా వస్తే చూసి సంతోషం పట్ట లేక ”అదుగో షా”అని అరిచారు హిదాయ తుల్లా .షా వెనక్కి తిరిగి చూశాడట .ఆయన దృష్టి లో పడటమే ఈయనకు కావలసింది .పోలీసులు రెక్కలు పట్టి లాగేశారట .
నాగపూర్ లో హై కోర్టు న్యాయ మూర్తిగా పని చేసినపుడు రామినేని కౌసలేంద్ర రావు అనేఉయ్యూరు దగ్గర కుమ్మమూరు నివాసి న్యాయ వాది గా ఉండే వారు .ఆయన భాస్కరేంద్ర రావు గారి తండ్రి .ఆ తర్వాతా ఎన్నో పదవులు ఆయన్ను వరించాయి .తెలుగు అకాడమీ లో పని చేసి విజ్ఞాన సర్వస్వాల నిర్మాణం లో సహకరించారు .కౌశలేంద్ర రావు గారి ఫోటో ను హిద్య తుల్లా తన స్వీయ చరిత్ర లో ముద్రించి వారితో తనకున్న అనుబంధాన్ని చాటారు .
హిదయతుల్లా గారు హిందూ స్త్రీ శ్రీ మతి పుష్ప గారిని వివాహం చేసుకొని కొత్త దారి తొక్కారు .వారి దాంపత్యం చాలా అన్యోన్యం గా సాగింది చివరిదాకా .వారికి ”అవని ”అనే కూతురు ,”అర్షద్ ”అనే కొడుకు పుట్టారు .కాని కూతురు కు ”నీలం రంగు శరీరం ”ఏర్పడి(fallot’s tetralogy) చాలా ఇబ్బందులు blue babyఅని పించుకొని . అతి చిన్న వయసు లోనే చని పోయి ఆ కుటుంబానికి తీవ్ర మనోక్షోభ కల్గించింది .ఆ పిల్లను ప్రాణ ప్రదం గా చూసుకొని అందిన అన్ని వైద్యాలు చేయించినా ,చివరికి ఆపరేషన్ అవసరం అయి చేయించినా ఫలితం దక్కలేదు .ఆపరేషన్ తరువాత మర నించింది .
నాగ పూర్ లో ప్రధాన న్యాయ మూర్తి గా ప్రమాణం స్వీకరించే అధ్యాయం లో ”under pain pleasure -under pleasure pain lies (emersan )”అనే ప్రఖ్యాత రచయిత ,దార్శనికుడు ఎమర్సన్ మాటలను సందర్భోచితం గ కోట్ చేశారు .లెక్కలు నిర్దుష్టం గా రాసే వారు .కక్కుర్తి లేదు .న్యాయాన్ని నూటికి నూరు పాళ్ళు అమలు చేసే వారు .కే.ఎస్.దాస సుప్రీం కోర్ట్ చీఫ్ జడ్జి గా ఉన్నప్పుడు ఫోన్ చేసి హిదయతుల్లాను సుప్రీ కోర్ట్ జడ్జి గా బాధ్యతలు స్వీకరించమని స్వయం గా ఫోన్ చేసి చెప్పటం ఆయన వ్యక్తిత్వానికిచ్చిన గొప్ప కితాబు .అక్కడికి చేరిన తర్వాతా కేసులన్నీ అతి శ్రద్ధగా చదివి కోర్టు కు హాజరయ్ వారు .అన్నీ కూలం కషం గా అధ్యయనం చేయటం మొదటి నుంచి అల వడింది .
అనేక సంవత్స రాలు మౌన వ్రతం లో ఉన్న ”మెహర్ బాబా ”గారి పై జరిగిన ఒక సభలో ఢిల్లీ లోసుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ హిదయతుల్లా అధ్యక్షత వహించారు .మెహర్ మహాత్మ్యం పై సుదీర్ఘ ప్రసంగం చేసి అందర్ని మెప్పించారు .ఆ ప్రసంగం టేప్ ను మెహర్బాబా కు పంపారు .ఆయన సంతోషించి ”remember me on my next birth day ”అని సందేశం పంపారు .దాని భావమేమిటో ఎవరికి అంతు బట్ట లేదు .తీవ్రం గా ఆలో చిస్తే మెహర్బాబా పుట్టిన రోజు ఫిబ్రవరి ఇరవై అయిదు అని తెలుసు కొన్నారు .
ప్రధాన న్యాయ మూర్తి ముందుకు మొదటికేసు నాగపూర్ బాబా తాజుద్దీన్ కేసు వచ్చింది .దాన్ని పరిశీలిస్తున్నారు .ఒక రోజున వచ్చే నెల చివర్లో ఆయన్ను హత్య చేయ బోతున్నట్లు ఒక ఆకాశ రామన్న ఉత్తరం వచ్చింది ”.దానికేమీ ప్రాధాన్యత నివ్వక చించి పారేశారు .ఒక రోజు కోర్ట్ లో ఒక ఆగంతకుడు కత్తి పట్టు కొని ఈయన మీదకు వైద్యలింగం అనే ఆయన గ్రోవర్ అనే న్యాయ మూర్తి మీదకు అందర్నీ తప్పించుకొని వచ్చి వైద్యలింగాన్ని కత్తితో పొడిస్తే హిదయతుల్ల వగైరాలు అడ్డు పడ్డా గాయమై రక్తం తో బట్టలన్నీ ఎరుపెక్కాయి .వాడి కత్తిని చాకచక్యం గా కింద కార్పెట్ లో గుచ్చు కోనేట్లు చేయటం తో ప్రమాదం తప్పింది .వెంటనే వైద్య సదుపాయానని వైద్య లింగానికి ఎర్పాటు చేసి ప్రధానికి ,హోమ్ మినిస్టర్ కు ఫోన్ లో తెలియ జేశారు .ఎంతో ధైర్యాన్ని ,నిబ్బరాన్ని ప్రదర్శించి చీఫ్ జస్టిస్ ప్రమాదాన్ని నివారించారని పత్రికలన్నీ ప్రశంసించాయి .దాడి చేసిన వాడి పేరు మన్ మోహన్ దాస్.కోర్ట్ లో కేసు నడి చింది .తనకు ప్రత్యెక స్థానం ఇస్తా మంటే వద్దని తిరస్కరించి ,మామూలు సాక్షి గానే హాజరయారు .
భారత దేశాధ్యక్షులు మహా మేధావి సంస్కారి విద్యా వంతుడు గాంధి గారి ప్రియ శిష్యుడు జాకీర్ హుస్సేన్ మరణించారు .వి.వి.గిరి తాత్కాలిక రాష్ట్ర పతి అయారు .ఆయన తో ప్రమాణ స్వీకారాన్ని హిదయతుల్లా చేయించారు .ఈ చాప్టర్ లో ప్రారంభాన when good men die thier goodness does not perish –but lives though they are gone ”అన్న ఈరిపిడియాస్ వాక్యాన్ని సందర్భోచితం గా ఉదాహరించారు .
గిరి గారికి సంజీవ రెడ్డి గారికి రాష్ట్ర పతి పదవి కోసం పోటీ జరిగింది .అప్పుడు గిరిగారు పదవికి రాజీ నామా చేశారు ఎన్నికలలో నిలబడి ప్రచారం చేసుకోవటానికి . సంప్రదాయం ప్రకారం ప్రధాన న్యాయ మూర్తి తాత్కాలిక ప్రెసిడెంట్ అవుతారు .హిదాయ తుల్లా గారికి ఆ అదృష్టం దక్కి రాష్ట్ర పతి భవనం చేరారు .ఊహించని పరిణామం .అదృష్టం తన్నుకు రావటం అంటే ఇదే .35రోజులు ఆక్టింగ్ ప్రెసిడెంట్ గా పదవిని నిర్వ హించారు .అప్పుడే అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ భారత దేశ పర్యటనకు వచ్చారు .భారత దేశానికి మేమేమి సహాయం చేయగలం అని నిక్సన్ అడిగితే ”మా జనాభా బాగా పెరిగి పోతోంది .దాన్ని నియంత్రించే విధానాలు అమలు చేయటం లోను ,సంచార వైద్య విధానాన్ని ఏర్పరచటం లోను ,కుటుంబ నియంత్రణ కు సాయ మందించటం లోను ,గ్రామ సౌభాగ్యానికి దోహద పడటం లోను సహాయం చేయమని భారత రాష్ట్ర పతి అమెరికా అధ్యక్షుడిని కోరారు .”i must make a note of this ”అన్నాడు నిక్సన్ .తనను చూడటానికి విపరీతం గా రోడ్ల మీద జనం చేరటం చూసి నిక్సన్ మీ ప్రెసిడెంట్ వచ్చినా ఇలానే జనం వస్తారా లేక అమెరికా ప్రెసిడెంట్ ను చూడటానికి ఇంత మంది వచ్చారా / అని అడిగాడు .హిదయతుల్లా ప్రశాంతం గా ”వాళ్ళంతా బుల్లెట్ ప్రూఫ్ కారు ఎలా ఉంటుందో చూడటానికి వచ్చిన వాళ్ళే ”అనే సరికి ఆయనా నవ్వాడు .
వరాహ గిరి వెంకట గిరి గారు ఇందిరా కాంగ్రెస్ తరఫున ,పాత కాంగ్రెస్ అభ్యర్ధి సిండికేట్అభ్యర్ధి అయిన నీలం సంజీవ రెడ్డి గారిని ఓడించి రాష్ట్ర పతి అయారు .హిదయతుల్లా మళ్ళీ ప్రధాన న్యాయ మూర్తి పదవి చేబట్టారు .
ఇదీ జస్టిస్ హిదయతుల్లా గారి హ్రుదయావిష్కరణం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –4-7-12–కాంప్-అమెరికా .


హిదాయతుల్లా గొప్ప సెక్యులర్ మేధావి.హిందూ స్త్రీని మతాంతర వివాహం చేసుకొనడం,
తాను కూడా హిందూ పండుగలు జరుపుకొనడం,చాలామంది ముస్లింలలా కుటుంబ
నియంత్రణను గుడ్డిగా వ్యతిరేకించక, దానిపై చక్కటి శాస్త్రీయ అవగాహన కలిగి, దాని ఆవశ్యకతను
గుర్తించడం — ఇవన్నీ గొప్ప విషయాలు.హత్యా ప్రయత్నానికి గురైన వ్యక్తిని ఘటనా స్థలంలో
కాపాడడమేకాక, తరువాత ఆ నేరం మీద విచారణ జరిగినప్పుడు తాను ఒక న్యాయాధిపతి
అయివుండికూడా, ఒక సామాన్యుడిలా కోర్టు ముందు నిలబడి సాక్ష్యం చెప్పడం ఆయన
మానవతకు అద్దం పట్టే ఘటనలు.
‘తుల్లా గారు’అంటూ హిదాయతుల్లా పేరును విడదీయరాదు.ఉర్దూలో ‘హిదాయత్’
అంటే ‘మార్గదర్శనం’ అని అర్థం.’ హిదాయత్- ఉల్లా ‘(హిదాయతుల్లా) అంటే ‘భగవంతుడి
మార్గదర్శనం'(భగవంతుడి శాసనాల సముదాయం) అని అర్థం.
అలాగే ఉర్దూలో ‘బాబాయ్ అంటే తండ్రి అనే అర్థంట’ అని పేర్కొన్నారు. ‘బాబాయ్’
అంటే తండ్రి అనే అర్థం కాదు.’ బాబా-ఇ-ఉర్దూ’అంటే “Father of Urdu” అని అర్థం.బాబా అంటే
ఉర్దూలో తండ్రి అని అర్థం.
అలాగే యూరిపిడీజ్ ని ‘ఈరిపిడియాస్’అన్నారు.Euripides(యూరిపిడీజ్) క్రీ.పూ.
480-406 మధ్య జీవించిన గొప్ప గ్రీకు విషాదాంత నాటకకర్త.
ఇకమీదట ఇలాంటి భాషాదోషాలు, ముద్రణా స్ఖాలిత్యాలు చక్కటి సమాచారయుతమైన
మీ వ్యాసాల స్థాయిని తగ్గించరాదని భావిస్తాను. దోషాలు మరింతగా పరిహరిస్తారని ఆశిస్తాను.
దీనిపై మీ స్పందన కోసం ఎదురుచూస్తాను.
మీ,
ముత్తేవి రవీంద్రనాథ్,తెనాలి.
LikeLike