అలేగ్సాండర్ నాటి గ్రీకు సమాజం
ఆకాలం లోగ్రీకుల ఇళ్ళు చిన్నవి గా ఉండేవి .కాల్చని మట్టి ఇటుకలతో ఇల్లు నిర్మించే వారు
.మధ్యధరా ప్రాంతపు ఎండ ప్రతి ఫలించటానికి వీలుగా తెల్ల రంగు వేసే వారు .
కిటికీలు పైన ఎత్తులో ఉండేవి .పేదలకు ఒకటి లేక రెండు గదులున్న ఇల్లున్దేవి .
ధనికుల ఇళ్లలోఆడ వారికి ,మగ వారికి వేరు వేరు గా గదులున్దేవి .ఇంటి మధ్య ఖ్ఖాలీ ప్రదేశానికి చుట్టూ గదులున్దేవి
.భోజనం సాధారణ భోజనమే .చాలాతాజా గా ,రుచి కరమైన వాటినే తినే వారు .
వేడి ప్రాంతం కనుక పళ్ళు ,కూరగాయలు బాగా పండేవి .గోధుమ ,బార్లీ చేపలు సమృద్ధి గాలభించేవి .మాంసం తినటం తక్కువే .
మేక పాలు తాగే వారు .పెరుగు ,వెన్న అన్నిటికీ మేక పాలే .ఆలివ్ ,ఆలివ్ నూనె వాడకం బాగాఉండేది .భోజనం లో ద్రాక్ష సారా తప్పని సరి .
బానిసలు ఎక్కువ .యుద్ధాలలో పట్టు బడ్డ వారు ,వారి తార తరాల సంతానం ,బానిసలే .ఆట ,పాటధనిక ,పేద భేదం నాలుగవశతాబ్దానికి పెరిగింది .
అన్ని పనులు బానిసలే చేసే వారు .ప్రతి ఇంట్లో వాళ్ళు తప్పని సరి
.ధనిక పేదల భేదం నాల్గవ శతాబ్దం నాటికిపెరరిగింది.ఆడ వాళ్ల కు
హక్కులు తక్కువే .మగ వాళ్ళ అధీనం లోనే ఆడబ్రతుకు ఉండేది .
ఆమె ఇంటికే పరిమితం .వీధి లో తిరగటం నేరం .స్పార్టా లో మాత్రంస్త్రీలకు స్వాతంత్రం ఉండేది .
అందుకే ఇక్కడి మహిళలు బలాధ్యమైన ,ఆరోగ్య వంత మైన పిల్లల్ని కనే వారు .ఆడవారు క్రీడలలో పాల్గొనేవారు .
బాక్సింగ్ కూడా చేసే వారు .మగ పిల్లలు బడి కి వెళ్ళే వారు .
ఆడ పిల్ల లకు ఇంట్లోనే చదువు .స్పార్టా లో ఆడ పిల్లలు బడికి వెళ్లిచదివే వారు .మగ వాళ్ళ తో పాటు అన్నిటికీ వారికి సమాన ప్రాధాన్యత ఉండేది .
గ్రీకు దేశం లో కళల పట్ల ఆరాధన ఎక్కువ .
నాటక శాలల్లో బహిరంగ ప్రదర్శనలు ప్రత్యక్షం గా జరిగేవి .కామెడీల ప్రదర్సనలు ఎక్కువ.అరిస్తోఫీనాస్ రాసిన కామెడీలు ,యూరిపిదాస్,సోఫోక్లాస్ రాసిన ట్రాజెడీలు ప్రదర్శిస్తే జనం బాగా చూసి ఆనందించే వారు ..
కవిత్వంఅంటే మాంచి సరదా .700b.c.కాలం వాడిన అంధ కవి హోమర్ గొప్ప కవి .
ఆయన రాసిన ఇలియడ్ ,ఒడిస్సీ లు 1200b.c.నాటిట్రోజన్ వార్ ఆ తర్వాతి కధలు .ఆ కాలం లో చాలా మంది విద్యా వేత్త లకు హోమర్ కావ్యాలు కన్తస్తం .
క్రీడలు గ్రీకులోనే పుట్టి పెరిగాయి .ఒలింపిక్ ఆటలకు కేంద్రం .ఆటల్లో మత భావాలను చొప్పించే వారు
.దేవత లను ఆరాధించటం గ్రీకుసంప్ర దాయం .చాంపియన్ క్రీడా కారులకు ప్రత్యెక సత్కారం చేసే వారు .అదొక ”క్లాసికల్ పీరియడ్ ”గా గుర్తింపు పొందింది .
ఇన్నీ ఉన్నా గ్రీకులకు ఆనందం కరువే .ఎప్పుడూ యుద్ధాలే .ఆ కాలం లో పర్షియా అనే ఆసియా రాజ్యం (ఇవాల్టి ఇరాన్ )అయోనియాభాగాన్ని ఆక్ర మించింది .ఇది ఏజియన్ సముద్ర తూర్పు తీరం .
ఇదే ఇవాల్టి ట ర్కి .దీనిలో ఎన్నో గ్రీకు వలస దేశాలున్నాయి .ఇవిపర్షియా పై499 b.c.లో తిరుగు బాటు చేశాయి .ఏథెన్స్ లాంటి సిటి స్టేట్స్ సమర్ధించాయి .డేరియస్ 1 అనే పర్షియా రాజు వీటిని అణచివేశాడు .
అంతటి తో ఆగ కుండా నావల మీద bay of marathan అనే ఏథెన్స్ దగ్గర ప్రాంతానికి దండెత్తి వచ్చాడు .ఎతియన్లకు,పర్శియన్లకు భీకర యుద్ధం జరిగింది .గ్రీకుల రణ కౌశలం పర్శియన్లను దెబ్బ తీసింది .ఓడియన్ ఒడి పోయి సముద్రం గుండాస్వదేశానికి పారి పోయాడు .
.
480b.c. లో మళ్ళీ అతని కొడుకు xerxes వచ్చి ,మీద పడ్డాడు .
తెర్మో పైల్ అనే ఇరుకు ప్రాంతం లో యుద్ధం జరిగింది .స్పార్తాన్సైనికులుమొదటి రోజు యుద్ధం లో పర్షియన్ల అంతు చూశారు .
ఒక గ్రీసు మోస గాడు పర్శియన్లకు వేరే మార్గం చూపించాడు .
పర్షియన్లుగెలిచారు అయినా ఎక్కువ మంది చచ్చారు .ఏథెన్స్ చేరి ఆ మహా నగరాన్ని కాల్చి బూడిద చేశారు .అప్పటికే ఏథెన్స్ వాసులు పారిపోయారు .
కనుక జన నష్టం జరగ లేదు తర్వాత సాలమిస్ వద్ద నెల రోజులనౌకా యుద్ధం లో ఏ అనుభవం లేని పర్షియన్లు చావు దెబ్బతిన్నారు .
ఈత రాక సముద్రం లో మునిగి పోయారు .వంద లాది పర్షియన్ సైన్యాన్ని ఊచ కోత కోసేశారు .మరుసటి ఏడాది యుద్ధం లోపర్శియన్లను పూర్తిగా ఓడించేశారు .
దీనినే battle of plataca అంటారు .యుద్ధాలు ముగిశాయి .గ్రీకులకు చారిత్రాత్మక విజయంలభించింది . 431b.c. లో మళ్ళీ కొత్త తగాదా .ఏథెన్స్ వాసుల ఆది పత్యాన్ని స్పార్టా సహించ లేదు
.సిటీ స్టేట్స్ మధ్య తగాదాలుపెరిగాయి .స్పార్టా కోరింత్ లు కలిసి ఏథెన్స్ పై దాడి చేశాయి
.ఇదే pilopennessian war(ఏథెన్స్ ఓడిపోయింది ..స్పార్టా బలీయ మైన సిటి స్టేట్ గా అయింది .మోనార్క్ ల పాలన లో నిలబడింది స్పార్టా .ఏథెన్స్ ప్రజాస్వామ్యం ఎన్నో దశాబ్దాల పాటు కడ గండ్ల పాలైంది .c
మాసి డోనియా కు సిటి హోదా అప్పటి దాకా లేదు .సామ్రాజ్యాధి పతుల అంటే మోనార్క్ ల ఏలుబడి లో ఉంది .వంశ పారం పర్య పాలన ఉంది .359b.c.లో ఫిలిప్స్ రెండు అధికారానికి వచ్చాడు .
చిన్న రాజ్యమైనా పెద్ద వ్యూహాలున్న వాడు ఫిలిప్స్ .సైన్యాన్ని బలోపేతం చేశాడు .మంచి శిక్షణ నిచ్చాడు .అవసరమైన ఆయుధాలను సమ కూర్చాడు .కొద్ది కాలం లోనే యూరప్ లోనే గ ర్వించ దగ్గ సైన్యాన్ని తయారు చేశాడు .ఆమ్ఫీ పోలిస్ అనే గనులు అధికం గా ఉన్న కాలనీ ని వశ పరచుకొన్నాడు .
అందులోని బంగారపు గనులు అతనికి బాగా కలిసి వచ్చాయి .ఐశ్వర్యం పెరిగింది .చుట్టూ ప్రక్కల ఉన ట్రైబల్ కమ్యూనిటి లను ఆక్రమించి మాసిడోనియా సామ్రాజ్యాన్ని విస్త రింప జేశాడు .
ఇక సరి హద్దులు దాటి విజయాలను సాధించాలనే వ్యూహం లో ఉన్నాడు .అదికారానికి వచ్చిన పదేళ్ళ లోనే దక్షిణాన గ్రీస్ వరకు రాజ్య విస్తరణ చేసి అందరికి పక్కలో బల్లెమైనాడు .
500-300b.c.కాలాన్ని” క్లాసికల్ ఏజ్ ”అంటారు .గ్రీక్ సిటి స్టేట్ ల మధ్య భీకర యుద్ధాలు జరిగాయి .గ్రీకుల ఐక్యతా కుదిరింది .
అంతా ఒకే గొడుగు కిందకి వచ్చారు .మాసిడోనియా కు ఇది నిజం గా నే సువర్ణావ కశం .దానికి ఇప్పుడు ప్రపంచం మీద దృష్టి పడింది .అది గో అప్పుడే” ప్రపంచ విజేత ”అవాలని ఉవ్విల్లూరిన ఫిలిప్ రాజు కొడుకు అలెగ్జాండర్ పుట్టాడు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –5-7-12.–కాంప్–అమెరికా


గ్రీకుల మీద మంచి సమాచారమే అందించారు. కోన్ని అచ్చు తప్పులు ఉన్నాయి, సవరించగలరు.
“అది గో అప్పుడే” ప్రపంచ విజేత ”అవాలని ఉవ్విల్లూరిన ఫిలిప్ రాజు కొడుకు అలెగ్జాండర్ పుట్టాడు .”
ఈ వ్యాఖ్యములో, మీరు చెప్పదలసుకున్న భావము స్పష్టముగా లేదు. దీనిని తిరగవ్రాయండి.
మీది మంచి ప్రయత్నమే.
LikeLike
చాలా బాగుంది. దయచేసి కొంచెం వివరంగా రాస్తార ? లైన్స్ పక్కకి వెళ్ళిపోయి కొంచెం గజిబిజి గా అయింది.
LikeLike
బాగా వ్రాసారు… మంచి ప్రయత్నం
LikeLike