బుసే ఫలస్(bucephalus)
ఈ పెరేక్కడిది అని కంగారు పడకండి .అది” అలేగ్జాన్దర్ ది గ్రేట్ ”పంచ కల్యాణి గుర్రం పేరు .దీనికింత కధ ఉందా?అని ఆశ్చర్య పడకండి .లేక పోతే మనకేందు కా సంగతి ?అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్ మాసిడోనియా కు రాజు అని అందరికి తెలిసిందే .ఆయన ఒక జవనాశ్వాన్ని చాలా ఖరీదు పెట్టి తెప్పించు కొన్నాడు .జాతి ,వంశం లెక్కలు అన్నీ చూసే తెప్పించాడు .తన దగ్గర ఉండవలసిన అశ్వం అని .కాని అది పొగరు బోతు .ఎవ్వరినీ దగ్గరకు రానిచ్చేది కాదు .మీద చెయ్యి వేస్తె ఈడ్చి పెట్టి తన్నేది .చాలా మంది ఆశ్వికులు దాని పని పట్ట టానికి ప్రయత్నించి ,కాళ్ళూ చేతులు పోగొట్టు కొన్నారు .తిండి పుష్టి నైవేద్యం నష్టి .మేపటం తప్ప దేనికీ పనికి రాకుండా పోయింది .రాజు కు ఇక దాని మీద విరక్తి పుట్టింది .యెట్లా గైనా వదిలించు కోవాలని ప్రయత్నం చేశాడు .బేరాలు పెట్టాడు .దాని సంగతి తెలిసి ఎవరూ కొనే సాహసం చెయ్య లేక పోయారు .చివరికి ఏమీ పాలు పోక ఏదో విధం గా వది లించు కోవటానికి విశ్వ ప్రయత్నం చేశాడు .అదీ లాభం లేక పోయింది .
ఇంతలో ఫిలిప్ రాజు గారి కుమారుడు అలెగ్జాండర్ నూనూగు మీసాల నూత్న యవ్వనం లో ప్రవేశించాడు .అశ్వ శాల లో గుర్రాల్ని పరి శీలిస్తుంటే అతని దృష్టి దీని మీద పడింది .తండ్రి కి తన అభీష్టాన్ని తెలియ జెప్పాడు .ఆయన కన్న కొడుకుతో ”నాయనా !ఈ గుర్రం మంచి జాతిది అని కొన్నాను .కాని వచ్చి నప్పటి నుండి అది ఎవరికి అలవి కాలేదు .దగ్గరకే రానివ్వటం లేదు .దాన్ని వది లించు కోవటమే మంచిదని పించింది .కనుక దాని జోలికి వెళ్ళద్దు .ఇంకో జాతి గుర్రాన్ని ఎన్నిక చేసుకొని స్వారి చెయ్యి ”అని హితవు పలికాడు .కొడుకు తండ్రి మాట విన్నాడు కాని తన మనసులోని విషయాన్ని తెలియ జేశాడు .”నాన్నా !గుర్రాలకు హృదయం ఉంటుంది .అందులో మీరు ఎంపిక చేశా రంటే దానికి ఎన్నో మంచి లక్షణాలు ఉండే ఉంటాయి .అయితే నాదొక విన్నపం .గుర్రానికి తనను ఎవరు లొంగ దీయ గలరో తెలుస్తుంది .అలాంటి వీరుడి కే అది లొంగి నిల బడుతుంది .గుర్రానికి కూడా సమర్ధుడు తనను అధి రోహించాలను కొంటుంది. చెప్పిన మాట వింటుంది .కనుక దాన్ని లొంగ దీసే బాధ్యత ను నాకు వదిలి పెట్టండి .దాన్ని అమ్మటం మాత్రం చేయ కండి ”అని నెమ్మదిగా చెప్పాడు .”సరే నీ ఇష్టం .నీ ప్రయత్నాన్ని నేను ఆప బోను .నీకూ లొంగక పోతే దాన్ని ఏదో ఒక రేటు కు అమ్మి వదిలించు కొంటాను ”అన్నాడు .సరే నన్నాడు కొడుకు .
బుసే ఫలాస్ ను అందం గా అలంకరించి కొలువు దగ్గరకు తెచ్చారు .అలేగ్జాండర్ దాని దగ్గరకు వచ్చి చెవి లో ఏదో ఊదాడు .ముందుకు వచ్చి ముక్కులో నోటి లో వ్రేళ్ళు పెట్టాడు .అసలు మనుష్యుల్ని దగ్గరకే రానివ్వని గుర్రం ఇవన్నీ చేస్తుంటే మైనపు ముద్దా లా ఒదిగి పోయింది .వీపు మీద చెయ్యి వేసి నిమి రాడు .అంతే మంత్ర ముగ్ధ లాగ గుర్రం లొంగి పోయింది .అమాంతం గుర్రం పైకి లంఘించి ఎక్కి కూర్చున్నాడు అలెగ్జాండర్ .అది ఒక్క సారి సకిలించి ఆఘ మేఘాల మీద దౌడు తీసింది . .మెరుపు వేగం తో దూసుకొని పోయింది .సభాసదులు ,రాజు సంభ్రమాశ్చర్యాలలో మునిగి పోయారు .యువరాజు కే మైనా ప్రమాదం సంభ విస్తుందేమో నని శంకించారు .అది పంచ కల్యాణి లా దూకి మళ్ళీ యదా స్థానానికిఅరగంట తర్వాత మళ్ళీ సకి లించు కొంటూ అక్కడికి చేరింది .నవ్వుతు యువ రాజు దిగాడు .జైజై ద్వానాలలో ప్రజలంతా హర్షాన్ని తెలియ జేశారు .అప్పుడు ఫిలిప్ రాజు తన కొడుకు అలెగ్జాండర్ ను దగ్గరకు తీసుకొని చాలా గొప్పగా అభినందించి ”కుమారా !నీకు ఈ రాజ్యం సరి పోదు .కనుక ఇంకో రాజ్యాన్ని చూసుకో ”(this country is not enough for you .Find out another”)అని కుమార రత్నానికి భవిష్యత్తును నిర్దేశించాడు .తగిన వీరుడు తనకు లభించాడని ఆశ్వమూ ,తనకు తగిన గుర్రం లభించిందని అలెగ్జాండర్ సంబర పడ్డారు .
వీరిద్దరి స్నేహం ఎంతో కాలం నిలిచింది .విశ్వ విజేత అవ్వాలన్న అలేగ్జండర్ మనసు గుర్రానికీ తెలుసేమో .చాలా సేవ చేసింది .ఎన్నో యుద్ధాలలో అది అతనికి విజయాన్ని చేకూర్చింది .అలెగ్జాండర్ అందరిరాజుల్లా కాకుండా స్వయం గా సైన్యాన్ని నడిపి యుద్ధాలు చేశాడు .అతని విజయాలకు అది భాగ స్వామి అయింది .సుదీర్ఘ యుద్ధాలలో అది సుమారు 25,000k.m.దూరం తన స్వామి తో ప్రయాణం చేసి , అలసి పోయి చివరికి 326b.c.లో సుమారు ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసులో తన నేస్తం ప్రియ అలెగ్జాండర్ ను వదిలి తుది శ్వాశ పీల్చింది .battle of hydraspes యుద్ధం తర్వాత దాని మరణం సంభవించింది .అలెగ్జాండర్ దుఖం వర్ననాతీతం .కుమిలి పోయాడు .మనసును చిక్క పట్టు కో లేక పోయాడు .అప్పటికి అతను పర్షియా ను జయించి ఇండియా దాకా వచ్చాడు .దాని అంత్య క్రియలను ఎంతో వైభవం గా జరిపించాడు .దానికి మనసారా కృతజ్ఞత లను తెలియ జేశాడు Hydespas నది ఒడ్డున ఒక నగరాన్ని”బూసా ఫాలియా” పేరు మీద నిర్మించి కృతజ్ఞతలు తెలుపు కొన్నాడు . ఈ నగరం జీలం నది ఒడ్డున ఉంది .అదీ అలెగ్జాండర్ గుర్రం” బూసే ఫలస్ ”కధ .
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –8-7-12–.కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com


రాణా ప్రతాప్ గుర్రం ‘చేతక్’ గానీ, చత్రపతి శివాజీ గుర్రం ‘కృష్ణ’ గానీ, అలెగ్జాండర్ గుర్రం
‘బ్యూసెఫాలస్’ గానీ విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి, తమ యజమానుల సేవలో
ధన్యమై, చిరకీర్తిని ఆర్జించిన ఉత్తమాశ్వాలు. బ్యూసెఫాలస్ (Bucephalus) అంటే ఎద్దు తల
కలిగినది అని అర్థం. దాన్ని బ్యూసెఫాలస్ అనే పలకాలి.మొండితనం (stubborn-ness)
విషయంలో అది ఎద్దు వంటిది కనుక దానికా పేరు వచ్చింది. అతి అరుదైన శరీర
సౌష్టవం,నల్లగా నిగనిగలాడే చర్మం, నుదుటిపై నక్షత్రం ఆకారంలో ఉన్న తెల్లటి మచ్చ ఈ
గుర్రం ప్రత్యేకతలు.నేటి పాకిస్తాన్ లోని జలాల్ పూర్ సమీపంలోని హైడ్రాస్పెస్ వద్ద క్రీ.పూ
. 326 లో జరిగిన యుద్ధంలో ఈ గుర్రం తీవ్రంగా గాయపడి మరణిస్తే నేటి పాకిస్తాన్ లోని
మండీ బహాఉద్దీన్ జిల్లా లోని ఫాలియా అనేచోట ఖననం చేయడం ద్వారా దీనికి ఒక
ప్రముఖ గ్రీకు వీరుడికి జరిగినట్లే అత్యంత ఘనమైన రీతిలో అంత్య క్రియలు జరిగాయి. దీని
మరణానంతరం దీని చిత్రంతో కొందరు గ్రీకు పాలకులు బంగారు నాణాలు ముద్రించారంటే
గ్రీకుల దృష్టిలో దీనికి ఎంతటి ప్రాముఖ్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ చరిత్రలో
సుస్థిర యశస్సును ఆర్జించిన ఒక ఉత్తమాశ్వాన్ని మరోమారు స్మరించుకునే అవకాశం
కలిగించినందుకు ధన్యవాదాలు.
– ముత్తేవి రవీంద్రనాథ్, తెనాలి.
LikeLike