అమెరికా డైరీ
అమెరికా దీపావళి వారం –1
గడచిన వారం అంటే జూలై రెండు సోమ వారం నుండి ఎనిమిది ఆదివారం వరకు విశేషాలు-గురుపౌర్ణమి ,అమెరికా స్వాతంత్ర దినోత్సవం ,మా అట్లాంటా ప్రయాణం’.మేము అమెరికా వచ్చి మూడు నెలలయింది .
గురు పూర్ణిమ
జూలై మూడవ తేది మంగళ వారం పౌర్ణమి రోజు ను వ్యాస పౌర్ణమిగా ,గురు పూర్ణిమ గా జరుపు కోవటం ఆన వాయితీ .ఆ రోజే షిర్డీ లో కూడా సాయి బాబా జయంతిని వైభవం గా చేస్తారు .ఇక్కడి డాక్టర్ మహేష్ డాక్టర్ గౌరీ దంపతులు వాళ్ళ స్వంత ఇంట్లో గురు పూర్ణిమ మహోత్సవానికి ఆహ్వానించారు .దాదాపు యాభై మంది హాజరై నారు .రాత్రి ఏడు గంటల నుండి ఏడున్నర వరకు స్తోత్రాలు ,గణేశ ఉపనిషత్తు ,నమక చమకాలు పథనం చేశారు .మా అల్లుడు అవధాని నమక చమకాలు చదివాడు .ఆ తర్వాత గంట సేపు అంటే ఎనిమిదిన్నర వరకు భజన కార్య క్రమం నిర్వ హించారు .మా అమ్మాయి విజ్జి రెండు భజనలు ,మా పెద్ద మనవడు శ్రీ కెత్ రెండు భజనలు గానం చేశారు .ఆ తర్వాతఅందరికి విందు .ఇడ్లీ ,గారే ,గులాబ్ జాం ,రెండు చట్నీలు చపాతీ ,రెండు కూరలు ,సాంబారు ,పులి హోర ,సాంబార్ ,పెరుగన్నం తో రుచి కరమైన భోజనం ఏర్పాటు చేశారు .డాక్టర్ గౌరీ ఆడవాల్లందరికి బొట్టు పెట్టి జాకెట్ ,పసుపు కుంకుమ ,వెండి పూత పూసిన పళ్ళెం ,పళ్ళు ఇచ్చ్చారు . మేమిద్దరం మొదటి సారిగా వాళ్ళింటికి వచ్చి నందుకు డాక్టర్ సర్వేష్ సంతోషం ప్రకటించారు .ఆయన ఈ రీజియన్ సాయి సంఘానికి ప్రెసిడెంట్ . ఎన్నో వైద్య కార్య క్రమాలను భార్యా భర్తా నిర్వహిస్తూ సమాజ సేవ చేస్తున్నారు .మేము వచ్చిన్ద దగ్గర్నుంచి పరిచయం . వాళ్ళ ఇంటి పేరు ”సత్తి రాజు ”,బాపూ గారి ఇంటి పేరే .అయితే బాపు తో పరిచయం లేదని నాకు మొదటి సరి పరిచయమైనప్పుడే చెప్పారు .
అమెరికా స్వాతంత్ర దినోత్సవం
మనం నరకాసుర సంహారం జరిగిన మర్నాడు దీపావళి ని వైభవం గా దీపాలంకరణ తో ,టపాకాయలు కాల్చి జరుపు కొంటాం .అమెరికా లో బ్రిటీష పాలన తో విసిగి పోయిన పద మూడు కాలనీ వాసులు ,అనేక హెచ్చరికలు బ్రిటీష ప్రభుత్వానికి చేసినా పేడ చెవిన పెడితే ,తిరగబడి ,అందరు ఏకమై 1776 జూలై 4 న తాము బ్రిటీష ప్రభుత్వాన్ని గుర్తించమని, తాము స్వాతంత్రాన్ని పొందుతున్నామని సంయుక్తం గా ఒక డిక్ల రేషన్ ప్రకటించి స్వాతన్త్ర్యాన్ని ప్రకటించు కొన్నారు .అప్పటి నుడి జూలై నాలుగును అమెరికా స్వాతంత్ర దినోత్సవం గా మహోత్సాహం గా జరుపు కొంటున్నారు .ఇప్పటికి 236ఏళ్ళు .ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నర నుండి పదిన్నర వరకు ప్రభుత్వాధ్వర్యం లో అనేక రకాలైన టపాకాయలు కాల్చి సంబరాన్ని అంబరం అంత ఎత్తు కు తీసుకొని వెళ్తారు .ఆ గంటా ఆకాశం అంతా వెలుగుల పున్నమే .రవ్వల జలతారు .ధమ ధమ ధ్వనులే .ఆకాశం అంతా ఎన్నో హరి విల్లు లతో కనుల విందు చేస్తుంది .నాన్ స్టాప్ గా గంట సేపు కన్నులకు పండువే .దీన్ని చూడ టానికి ఎంతో దూరం వెళ్లి టికెట్ కొని చూసి ఆనందిస్తారు .అక్కడ దొరికే బాణా సంచా కొని జనం కూడా కాలుస్తారు .అపార్ట్ మెంటల్ దగ్గర కాల్చ రాదు .కౌంటీ లలో, ఇండిపెండెంట్ హౌస్ లలో కాల్చుకో వచ్చు .మిగిలిన రోజుల్లో ఎప్పుడూ ఈ సందడి కనీ పించదు.మా అమ్మాయి ,అల్లుడు ,మనవాళ్ళు వెళ్లి అమెరికా దీపావళి చూశారు .మేము పదేళ్ళ క్రితం మొదటి సారి వచ్చి నప్పుడు హూస్టన్ నగరం లో ఆ వేడుక చూశాం .నాలుగేళ్ల క్రితం షికాగో లో సరస్సులో స్టీమర్ మీద ఉండి ఫైర్ వర్క్స్ చూసి ఆనందించాం .ఏమైనా చూడ ముచ్చటైన పండుగే .ఎన్నో రకాలు ,ఎన్నో రంగులు ,ఎన్నెన్నో మోడల్స్ కను విందు చేస్తాయి .స్వాతంత్రం లో ఉన్న హాయి ని అనుభవ విస్తు అమెరికా వారు జరిపే సంబరం ఇది .మా అమ్మాయి ,అల్లుడు ,మనవలు వరుసగా మూడు రోజులు ఇంటి దగ్గరే టపాకాయలు కాల్చి వేడుక చేసుకొన్నారు .
అట్లాంటా ప్రయాణం
క్రిందటి వారమే నేను అట్లాంటా మీదుగా ,అలబామా వెళ్లి హన్త్స్ విల్ లోని మా స్నేహితులు మైనేని గోపాల కృష్ణ గారింటికి వెళ్లి వచ్చాను .మా అమ్మాయి వాళ్ళు ఎప్పుడూ అట్లాంటా ను చూడ లేదట .అందుకని అందరం కారు లో బయల్దేరి మూడు రోజుల పర్యటన చేయాలని నిర్ణ యించారు .శార్లేట్ కు అట్లాంటా సుమారు 260 మైళ్ళదూరం .అంటే సుమారు నాలుగు వందల కిలో మీటర్ల దూరం లో ఉంది .మూడున్నర గంటల డ్రైవ్ .మధ్యలో విశ్రాంతి ఒక గంట .అంటే అయిదు గంటల సమయం .అది జార్జియా రాష్ట్రం లో ఉంది .జార్జియా కు రాజ దాని అట్లాంటా .ఒక పెద్ద పట్నం రాజ దాని అవటం ఇక్కడే చూస్తాం .నార్త్ కెరొలినా దాట గానే సౌత్ కెరొలినా దాని తర్వాత జార్జియా రాష్ట్రాలు వస్తాయి .బ్రిటన్ రాజు జార్జి రెండు పేరు మీదుగా జార్జియా రాష్ట్రం పేరు వచ్చింది .అమెరికా లో జనాభా లో తొమ్మిదవ స్థానం లో ఉంది .టెక్సాస్ రాష్ట్రం తర్వాతా బాగా వేగవంతం గా అభి వృద్ధి చెందుతున్న రాష్ట్రం .1829లోజార్జియా మౌంటేన్ ల వద్ద బంగారు నిక్షేపాలు లభించాయి .అందువల్ల గోల్డ్ రష్ పే రిగింది .ఇక్కడ రెడ్ సెడార్ వృక్షాలు ప్రసిద్ధి చెందాయి .అనేక రకాల పైన్ చెట్లున్నాయి .ఓక్ ,మాపిల్ చెట్లూ ఎక్కువే .ఈ రాష్ట్రం డెమొక్రాటిక్ పార్టి కి వెన్ను దన్ను గా నిలిచింది .1976 లో ఈ రాష్ట్రానికి చెందినా జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్ అయాడు .ఇక్కడ పట్టి ,
rye,పెకాన్స్ ,పీచులు బాగా పండుతాయి .ఇక్కడి ”చారోకీ రోస్” చాల ముచ్చటగా ఉండే పుష్పం .దీన్ని ”పీచ్ స్టేట్ ”అంటారు .గ్రానైట్ రాయి కి కేంద్రం .లైవ్ ఓకే వృక్షం వీరి జాతీయ వృక్షం .వీరి రాష్ట్ర పక్షి- బ్రౌన్ త్రాషర్ .జార్జియా దగ్గరే సవాన్నా నది ప్రవహిస్తుంది .
అట్లాంటాలో 1996లోజూలై19-ఆగస్ట్ నాలుగు మధ్య సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి .centinnial ఒలింపిక్స్ గా దాన్ని పిలిచారు .197దేశాలు ,10 ,318క్రీడా కారులు పాల్గొన్నారు .ఒలింపిక్స్ నిర్వహించిన అయిదవ అమెరికా సిటి అట్లాంటా .సమ్మర్ ఒలింపిక్స్ జరిపిన అమెరికా లోని మూడవ సిటి .అప్పుడు దేశానికి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ . ఇప్పుడు అట్లాంటా లో జూలైఆరు నుండి ఎనిమిది వరకు ”ఆటా ”;;తెలుగు సంబరాలు జరుగు తున్నాయి .
మేము ఆరవ తేది శుక్ర వారం ఉదయం ఎనిమిదిన్నరకుకార్ లో బయల్దేరాం .దారిలో వెంట తెచ్చుకొన్న పులిహోర తిన్నాం యోగాత్ అనే పెరుగు తిన్నాం .ఆరగా ఆరగా జ్యూసులు తాగుతూ చల్లని మంచి నీళ్ళు జుర్రుతు ,మధ్యాహ్నం పన్నెండున్నరకు ”హాలిడే ఇన్”అనే చోట రెండు రూములు తీసుకొని బస చేశాం .కాసేపు విశ్రాంతి తెసుకోన్నాం
కోకా కోలా ప్లాంట్
కోకా కోలా మోడల్ ప్లాంట్ కు మూడు గంటలకు చేరాం .ఇది డౌన్ టౌన్ లో ఉంది .ఇక్కడే సి.యెన్.యెన్.కేంద్రం ,జార్జియా ఆక్వేరియం కూడా ఉన్నాయి ఒక గొప్ప రద్దీ కేంద్రం లో ఇవన్నీ ఉండటం అరుదు .అన్నీ దగ్గర దగ్గర లోనే ఉన్నాయి .ఈ మూదు ,దీనితో పాటు దూరం గా ఉన్న జూచూడటానికి మా అందరికి కలిసి టికెట్ల ఖరీదు 500 డాలర్లు ;’దాదాపు ఒక్కొక్క రికి25దాలర్లున్తుంది . ‘.ముసలి ముథా” కి కన్సెషన్ రెండు డాలర్లు మాత్రమె ఒక్కో టికెట్ మీద .ప్రభావతికి వీల్ చైర్ తీసుకుందివిజ్జి .దానికోసం ఐడెంటిటి కార్డ్ అప్పగించాలి .తిరిగి ఇచ్చి నప్పుడు కార్డ్ తీసుకో వాలి .దీనికి డబ్బు లేదు .అన్ని భాగాలను చక్కగా చూపించారు .బాటిల్స్ లో నింపటం సీల్ చేయటం పిల్లలకు సరదా గా ఉంటుంది .దాదాపు రెండు గంటల కార్య క్రమం .ఇక్కడే కోకా కోలా గురించి 4d ధియేటర్ లో డాక్యు మెంటరి చూపించారు .వస్తువులు మన ముందుకు వచ్చి న అను భూతి కలుగు తుంది .నీళ్ళు మీద పడ్డట్లున్తుంది .కుర్చీలు కదిలి పోతున్న ఫీలింగ్ వస్తుంది .పూలు చేతికి అంది నట్లు కన్పిస్తాయి అందరు అందుకోవటానికి చేతులు జాస్తారు .ఇదంతా ఎఫెక్ట్ మాత్రమె . ఆ తర్వాత60 రకాల కోకా కోలాలు ఉన్న ఒక హాల్ లోకి తీసుకొని వెళ్తారు .అక్కడ పెద్ద డ్రమ్ములలో వివిధ ఖండాలకు చెందినా కోకా కోలా లు ఉంటాయి .వాటి లోంచి మనకు కావలసిన దాన్ని ప్రక్కనే ఉన్న గ్లాస్ లో పైప్ ల ద్వారా పట్టు కొని ఎన్ని సార్లైనా తాగ వచ్చు .పిల్లలు మస్తుగా ఎంజాయ్ చేస్తారు .నేనూ అన్ని రకాలను టేస్ట్చేశాను .అమెరికన్ ,ఆశియన్ వరైటీలు తాగ టానికి బాగా ఉన్నాయి .అక్కడంతా సందడే సందడి .అందరికి తలా ఒక నిండు కోకా కోలా బాటిల్ ఉచితం గా ఇస్తారు .అందరం నోక్కేశాం ”.ఫ్రీ గా వస్తే ఫినాయిల్ అయినా రెడీ ”అన్న సామెత రుజువు చేశాం .బయటకు వచ్చి ఉడిపి కృష్ణా భవన్ కు వెళ్లి టిఫిన్ తిన్నాం .పూరీ చపాతి అట్టు ,చాట్ మసాలా అన్ని రకాలు ఉన్నాయి .రుచి గానే ఉన్నాయి .తెలుగు వాళ్ళు ఆటా సంబరాల కు సాంప్రదాయ వస్త్ర ధారణ తో చాలా మంది కనీ పించారు ముఖ్యం గా స్త్రీలు చీర సిన్గారించే కనీ పించారు .హోటల్ బాగా రద్దీ గా ఉంది .అదొక పెద్ద మాల్ లో ఉన్నది హాలిడే ఇన్ కు రాత్రి పదింటికి చేరాం .హాయిగా నిద్ర పోయాం .ఇక్కడ గదులకు తాళం చెవులు క్రెడిట్ కార్డుల్లా ఉంటాయి దాన్ని తాళం దగ్గర స్పేస్ లో పెడితే తాళం తెరుచు కుంటుంది .బయటికి వెళ్ళే టప్పుడు కార్డ్ జేబు లో పెట్టు కొని వెళ్ళాలి .ఇదీ మొదటి రోజు సమాచారం .మిగాతావివరాలు” పార్ట్ టు”లో తెలియ జేస్తాను
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-7-12- కాంప్-అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

