రెండో రోజు -జూలై ఏడవ తేది -శని వారం -ఉదయమే హాలిడే ఇన్ లో వాళ్ళు ఏర్పాటు చేసిన కాఫీ కలుపుకొని తాగి కారు ఎక్కి ,డౌన్ టౌన్ లోని సి.యెన్.యెన్.సెంటర్ కు చేరాం .అక్కడున్న హోటల్ లో బ్రెడ్ తిని కాఫీ తాగి లైన్ లో చేరాం .ముందుగా పై అంతస్తు లోకితీసుకొని వెళ్లారు .అక్కడ వార్తలను ప్రసారం చేసే విధానం చూపించారు .వాతా వరణ వివ రాలు ఎలా ప్రసారం చేస్తారో వెదర్ చార్ట్ ఎలా ఉంటుందో బ్రేక్ న్యూస్ ఎలా ప్రసారం చేస్తారో ,రంగులు ఎలా మారతాయో ఒక అమ్మాయి బాగా వివ రించి చెప్పింది .అక్కడ ఉన్న సీట్ లో ఎవ రైనా కూర్చుని వార్త లను చదవ మంది .మా మనవడు శ్రీ కెత్ వెంటనే వెళ్లి కూర్చుని ఎదురు గ ఉన్న స్క్రీన్ చూస్తూ వార్తలు చదివాడు .అందరం చప్పట్లు కొట్టాం .అక్కడి నుండి మెట్ల మీదు గా కిందికి దిగి అసలు వార్తా ప్రసారం లైవ్ గా ఎలా జరుగు తుందో చూపించారు .అనుమానాలుంటే అడగమన్నారు .అడిగిన వాళ్ళ డౌట్స్ క్లియర్ చేశారు .ఆ అమ్మాయి చాలా చలాకీ గా ఉండిఅందర్నీ ఉత్సాహ పరిచింది .అక్కడి నుండి ,ఇంకా కిందికి దిగి ఇంకో చేంబర్ లో జరిగే ప్రసారాలను చూశాం .ఇట్లా ఎనిమిది స్టెప్పులు దిగి చూడాలి .మాకు పరవా లేదు కాని ప్రభావతి ఇంకా మెట్లు దిగ లేనంది .వీల్ చైర్ సౌకర్యం మధ్యాహ్నం మాత్రమె ఉందని చెప్పింది .ఈ విషయం ముందే చెప్పాలి అని కసిరాం .చెప్పాం మీరు విని పించు కోలేదేమో అన్నారు సెక్యురిటి వాళ్ళు .లిఫ్ట్ మీదు గా కిందికి దింపితే వచ్చేశాం .పిల్లలకు పెద్ద గా హు షారు గా లేదు .
ఆక్వేరియం
దగ్గరలోని జార్జియా ఆక్వేరియం లోకి వెళ్ళాం .ఇక్కడ వీల్ చైర్ స్సౌకర్యం ఉంది .ఉప యోగించు కొన్నాం .ఫ్రీ .విజ్జే వీల్ చైర్ తేవటం ఇవ్వటం ,వాళ్ళమ్మ ను తోయ్యటం అంతా తానే చేసింది .నేను విగ్రహం పుష్టి గా పక్కన ఉన్నానంతే .నదుల్లోని చేపలు ,కాలి ఫోర్నియా లోని కోల్డ్ ఫిష్ ,నక్షత్ర చేపలు అనేక రకాలు చూశాం .ఆ తర్వాతఒక ఆడి టోరియం లో ”డాల్ఫిన్”ప్రదర్శన ఏర్పాటు చేశారు .అరగంట కు పైగా కార్య క్రమం .మధ్యాహ్నం ఒకటిన్నర నుండి రెండు వరకు .తెర ముందు చిన్న సరస్సు .దాని లో డాల్ఫిన్లు .వాటిని ఆడించే ఆడ ,మగా కుర్రాళ్ళు .పైన కామెంట్ చెప్పే వాడు .డాల్ఫిన్లు ఆకాశం లో నక్షత్రాల నుంచి వచ్చాయని నమ్మకం . .నక్షత్ర సముదాయం డాల్ఫిన్ ఆకారం గా ఉండటం తెర మీద చూపించారు .అనేక రకాలైన ఫీట్స్ ను డాల్ఫిన్ల తో చేయించారు .వాటి మీద స్వారి చేశారు .వాటి తో ముందుకు తోయిన్చుకొన్నారు .సౌండ్ ను బట్టి వాటిని డాన్స్ చేయించారు .ఒక్క సారిగా అవి నీటి లోంచి ఆరడుగుల ఎత్తు యెగిరి నీటి లోకి దూకటం బలే సరదా గా ఉంటుంది .బాక్ స్విమ్మింగ్ చేశారు ,చేయిస్తారు .పాముల్లా మెలికలు తిరిగి ఆడుతాయి .ఎంతో తర్ఫీదు నిచ్చి ఇలా చేయించటం అబ్బురం గా ఉంది .నుంచొని నడిచి వింత అని పిస్తాయి ..మళ్ళీ డాల్ఫిన్లు నక్షత్ర మండలానికి వెళ్ళే కోరిక ఉందని తెలియ జెప్పుతూ షో ముగిస్తారు .చప్పట్లే చప్పట్లు .హాలంతా అదిరి పోతుంది .సౌండ్ ఎఫెక్ట్ బాగా ఉంటుంది .పిల్లలంతా మహా వేడుకగా ఎంజాయ్ చేశారు . తర్వాతఅక్కడే ఉన్న రెస్టా రెంట్ లో పీజా కొద్దిగా తిని కాఫీ తాగాం .ఇక్కడ వాటర్ బాటిల్ ఖరీదు మూడు డాలర్లు .అదే బయట మూడు డాలర్లు పెడితే ఇరవై బాటిల్స్ ఉన్న కేసు వస్తుంది .అంత రేట్లు .అయినా జనం తండోప తండాలుగా వచ్చి పడుతున్నారు నిర్విరామంగా .ఆ తర్వాత 4d ధియేటర్ లో ఒక షో చూశాం .ఇది మూడున్నరకు మొదలై నాలుగు వరకు ఉంటుంది .కళ్ళకు వేరే రకమైన కళ్ళ జోడు ఇస్తారు .వాటి తోనే చూడాలి .అప్పుడే ఎఫెక్ట్ బాగా ఉంటుంది .లేక పోతే కళ్ళకు ప్రమాదం .ఏదో చిన్న డాక్యుమెంటరి లాంటి యాని మేషన్ సినిమా అది .నీళ్ళు మీద పడ్డాయి సౌండ్ కు టపాకాయలు పేలినట్లు అందులో కాలి మిగిలినవి మన మీద పడ్డట్లు చేస్తారు .పిల్లలకు అతి ఇష్టం గా ఉంటుంది .
జంతు ప్రదర్శన శాల (-జూ)
నెమ్మదిగా బయట పడి డ్రై చేసుకొంటూ జూకు చేరేసరికి అయిడుమ్బావు .ఆరున్నరకు మూసేస్తారు .వీల్ చైర్ పది డాలర్లకు తీసుకొని వాళ్ళ అమ్మను కూర్చో పెట్టుకొని మా అమ్మాయి తోసుకుంటూ తీసుకొని వెళ్ళింది .నేను పక్కన ఉత్స విగ్రహమే .పిల్లలు వాళ్ళ నాన్న తో వెళ్లారు లోపలి .ముందుగా ఏనుగులు రెండు కనీ పించాయి .బాగా నీర సంగా ,తోస్తే పడి పోఎట్లున్నాయి .తర్వాతా చిరుత పులులు హుషారుగా కనీ పించాయి .రంగుల పిచ్చుకల లాంటివి ఉన్నాయి .పెద్ద తాబేళ్ళు మందు కొట్టిన వాటి లాగా పడుకొని ఉన్నాయి .ఎలుగు బంట్ల వంటివి ఉన్నాయి .వెదురు గడ తింటూ అందులో ఒకటి ముచ్చట గా ఉంది .సహజా రాణ్యంలా ఉంచారు భద్రత బానే ఉంది .ఫ్లెమింగో పక్షులు నీటి దొరువుల వద్ద మందలు మందలు గా ఉన్నాయి .మన కొంగల్లా ఉంటాయి .ఎరుపు రంగు శరీరం .పిల్లలు ఎక్కి తిరిగే చిన్న రైలు ఉంది .అది పదినిమిషాల్లో సారి అంతటిని తిప్పి చూపిస్తుంది .అందరం ఎక్కి తిరిగాం .మధ్య లో గుహల గుండా రైలు పోతుంది .ఇదో అనుభూతి .దీని దగ్గరే ”ఉయ్యూరు వీరమ్మ తిరునాళ్ళు ”లో ఉన్నట్లు రంగుల రాట్నం ఉంది .అన్నీ జంతువులూ ,పక్షుల ఆకారాలతో .అందరం ఎక్కి సరదా గా తిరిగాం .వేగం లేదు .నెమ్మదిగా నే తిరిగింది .ముసలి వాళ్లకు సోఫా లాగా కూర్చునే సీటు ఉంది .ప్రభ దానిలో కూర్చుంది .అంతా అయిన తర్వాతాపిల్లలు ,పెద్దలు ఎంజాయ్ చేయటానికి” రాక్ క్లైమ్బింగ్”ఉంది .సీటు బెల్టు లతో కట్టి ,పైన ఉన్న తాడును పట్టు కొని ,ప్రక్కల ఉండే ఆధారాలతో పైకి ఎక్కాలి .ఒక ఇరవై అడుగుల ఎత్తు ఉంటుంది .ఒకే సారి ఇద్దరు రెండు వేరు వేరు సీట్లలో కూర్చుని ఎక్క వచ్చు .మా మనవళ్ళు ఆశుతోష్ ,పీయూష్ లు దానితో ప్రయత్నం చేశారు .ఆఖరి వాడైన పీయూష్ సగం దాకా ఎక్కి కిందికి దిగాడు .వాడి పైవాడు ఆశుతోష్ మాత్రం పైదా కా వెళ్లి అందర్నీ ఆశ్చర్య పడేట్లు చేశాడు చీర్స్ చెప్పాం మేమందరం .నేను వంద రూపాయలు గిఫ్ట్ గా ఇస్తానని వాడికి చెప్పాను .”తాత గారూ వంద ”అంటూ హోటల్ కు చేరే దాకా అంటూనే ఉన్నాడు .సరాసరి ఇండియన్ మాల్స్ ఉన్న చోటికి వెళ్ళాం .అక్కడ చెరియన్ అనే షాప్ లో బియ్యం సరుకులు మా వాళ్ళు కొనుక్కున్నారు .శార్లేట్ కంటే చాలా చవక .కూరలు కూడా తాజాగా చౌకగా ఉంటాయి .అక్కడి నుంచి ”వుడ్ లాండ్స్ మైసూరు విలాస్ ”కు వెళ్లి ,మేమిద్దరం మషాల అట్టు ,తిని మాంగో లస్సీ త్రాగాం.బానే ఉన్నాయి .పిల్లలు, వాళ్ళు వాళ్ళ కిష్టమైనవి తిన్నారు .రూం కు చేరే సరికి రాత్రి పది అయింది .హాయిగా నిద్ర పోయాం .
శ్రీ స్వామి నారాయణ దేవాలయం
జూలై ఎనిమది ఆదివారం -మూడో రోజు –హాలిడే ఇన్ ఖాళీ చేసి కార్ లో బయల్దేరి మధ్యలో స్టార్ బక్స్”లో డోనట్ తిని కాఫీ త్రాగాం .అక్కడి నుండి సుమారు ముప్పావు గంటల ప్రయాణం చేసి ”శ్రీ స్వామి నారాయణ దేవాలయానికి చేరాం . ఫ్రీ గా ఇచ్చిన వీల్ చైర్ లో ప్రభావతి ని కూర్చో పెట్టి నేను పక్కనన ఉండగా విజ్జి తోస్తూ లిఫ్ట్ ఎక్కి దేవాలయానికి చేరాం .చాలా విశాల మైన ప్రాంగణం లో చాలా ఎత్తు లో ఉన్న దేవాలయం స్వామి నారాయణ టెంపుల్ .అంతా పాల రాతి తో చేసిందే .విగ్రహాలు చాలా అందం గా ముచ్చటగా ,అలంకారాలతో ఆకర్షణీయం గా ఉంటాయి .రాదా కృష్ణుల విగ్రహం స్వామి నారాయణ విగ్రహం ఆయన పరంపరకు చెందినా అయిదుగురు శిష్యుల విగ్రహాలు అబ్బుర పరుస్తాయి .ఆలయం లోపలి డోమ్ మీద లతలు పూలు దశావతారాలు ,అతి సూక్ష్మమైన నగిషీ పనితో మానసాహ్లాదాన్ని ,ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి .గుజరాత్ నుండి రాజస్తాన్ నుండి మార్బుల్ తెప్పించి ,ఇక్కడే చెక్కించి నిర్మించారట .2007లో ఆలయం పూర్తీ అయి దర్శనార్ధం వదిలారు .శివుడు పార్వతి ,శ్రీ రామ మారుతి విగ్రహాలు కూడా ఉన్నాయి .ఇక్కడి శిల్ప విన్యాసం చూసి ఆనందించాల్సిందే కాని మాటలతో చెప్ప లేము .లోపల ఫోటోలు తీయటం నిషేధం .వారి బ్రోచర్ తీసుకొని అందులోని వాటిని ఫోటోలు తీశాను .అవి మేము పెట్టి నప్పుడు చూసి ఆనందించండి . ఇక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతుంది .
కింద ఫోటోలు పుస్తకాలు అమ్మే షాప్ ఉంది .అక్కడ కైలాసం లో శివ పార్వతులున్నట్లు శివుని జటా జూటం మీద నుండి గంగా జలం పడుతూ ఆవు ముఖం నుండి బయటకు వస్తు శివ లింగానికి అభి షేకం చేస్తున్నట్లు ఉన్న బొమ్మ ముచ్చటగా ఉంటె మా అమ్మాయి యాభై అయిదు డాలర్లు పెట్టి కొన్నది ఆ నీరు నిరంతరం అలా పడుతూనే వుంటుంది. రిసైకిల్ చెందు తుంటాయి ,మొదట్లో నాలుగు గ్లాసుల నీరు పోస్తే చాలు .పదకొండేళ్ళ క్రితం మా రెండో అబ్బాయి శర్మ ఫామిలి గుజరాత్ లోని అహ్మదా బాద్ లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి అహ్మదా బాద్ లోని స్వామి నారాయన దేవాలయం ,అక్షరధాం లను చూశాం .అది మూడు గంటల కార్య క్రమం .ఆయన తపస్సు చేసిన ప్రదేశాలన్నీ సహజ వాతా వరణం లో గుహలు గా నిర్మించి చూపించారు .తర్వాత ఆయన జీవితం పై సినిమా ,,మ్యూజిక్ ఫౌంటెన్ అన్నీ ఆశ్చర్య పరుస్తాయి .ఇక్కడ అంత ఎర్పాటు ఏమీ లేదు .తరువాత ఉంటాయేమో తెలీదు .అప్పుడే మేము ద్వారకకు, సోమనాధ దేవాలయానికి వెళ్లి వచ్చాము. అది దసరా కనుక దండీ నృత్యాలను ,ఆరుబయటి సినెమా థియేటర్లో ”లగాన్”సినిమా ను చూశాం .
దేవాలయ సందర్శనం తర్వాతా దానికి సంబంధించిన హోటల్ లో డబ్బులిచ్చి భోజనం చేశాం .పెద్ద గా సహించ లేదు .మధ్యాహ్నం మూడింటికి బయల్దేరి మధ్య మధ్య ఆగుతూ రాత్రి ఏడున్నరకు శార్లేట్ చేరి మన అన్నం తిని హాయిగా నిద్ర పోయాం .
ఇప్పుడు ఈ దేవాలయానికి సంబంధించిన ముఖ్య విషయాలు -1781 లో స్వామి నారాయణ ఉత్తర భారత దేశం లో జన్మించారు .దీన జనుల విముక్తి కోసం సాంఘిక ,ఆధ్యాత్మిక తిరుగు బాటు చేశారు .స్వామి నారాయణ సంప్రదాయం ఏర్పాటు చేశారు .మూధాచారాలను తిరస్కరించారు అహింసా మార్గమే ఆయన ఆదర్శం .3000 మంది సాధకులను తయారు చేసి ప్రచారాన్ని ఉధృతం చేశారు .అందుకని ఆయననే ”భగవాన్ ”అని పిలుస్తారు .నైతిక ఆధ్యాత్మిక ఉన్నతికి ఆయన మార్గ దర్శనం చేశారు .ఆయన మరణించినా ,సాధకులకు ఆయన ఎప్పుడు అందు బాటు లోనే ఉంటారని నమ్మకం .
వీరి మొదటి శిష్యులు ,వీరి తర్వాత ఆశ్రమ నిర్వాహకులు శ్రీ గుణాతీతా నంద స్వామి .”అక్షర పరబ్రహ్మ ”గా సాధక నామం .ఈయనే ఘనశ్యాం మహారాజ్ .స్వామి నారాయణ అవతారమే ఈయన .పద కొండు ఏళ్లకే సన్య సించి ఏడేళ్ళు దేశం లోని సర్వ క్షేత్ర సందర్శాన్ని కాలి నడకన చెప్పులు లేకుండాఒంటరిగా తిరిగి గుజరాత్ లో యాత్రను విరమించారు .అక్కడే ”అక్షర ధామం ”నెల కోల్పారు .అనేక మందిరాలను దేశమంతా నెల కొల్పిన మహా ను భావులాయన .
రెండవ శిష్యుడు ,ఉత్తరాది కారి భగవతి మహా రాజ . .మూడవ శిష్యులు అధికారి శాస్త్రీజీ మహారాజ్ .మంచి వక్త .”అక్షర పురుషోత్తమ భావవ్యాప్తి ”చేశారు .1907 లో Bachasanvasi sree akshara purushottama svaami naaraayana samstha ”(B.A.P.S )ను ఏర్పరచారు
. .నాల్గవ శిష్యుడు అధికారి యోగీజి మహా రాజ .ఇంగ్లాండ్ ,అమెరికా ఆఫ్రికా లను సందర్శించి స్వామి నారాయణ బోధ లను వ్యాప్తి చేశారు .
అయిదవ వారు ఉత్తరాధికారి ప్రముఖ స్వామి మహారాజ్ .2007 ఆగస్ట్ ఇరవై ఆరున ఆశ్రమ నిర్వహణ బాధ్యతలను స్వీకరించారు .వీరి ఆధ్వర్యం లో ప్రపంచ మంతా3,300 కేంద్రాలు ఏర్పడ్డాయి .మతం కులం భాషా జాతి ,వయసు లకు అతీతం గా సంస్థలను తీర్చి దిద్దారు .వీరినే హరికృష్ణ మహా రాజ అంటారు .ఇది వారి చిన్నప్పటి నామ దేయం .
దేవాలయం లో రాదా కృష్ణ విగ్రహాల ప్రక్కన స్వామి నారాయణుల పంచ లోహ విగ్రహం ఉంది .
ఏమైనా, మానసిక ప్రశాంతి నిచ్చింది ఈ మూడు రోజుల్లో స్వామి నారాయణ సందర్శనమే .అట్లాంటాకు గర్వ కారణం ఈ అక్షర ధామం.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-7-12.–కాంప్–అమెరికా
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
