Gabbita Durga Prasad
Rtd. head Master
అలెగ్జాండర్ కాలం లో పర్షియా సమాజం
300b.c.నాటికి పర్షియా రాజ్యం ప్రపంచం లోనే అతి పెద్ద రాజ్యం గా ఉంది .ఇవాల్టి మధ్య ఇరానే ఆనాటి పర్షియా .భారత దేశం వరకు వ్యాపించింది .పడమర మధ్య ధరా సముద్రం ,ఉత్తరాన నేటి తార్కి ,దక్షిణాన ఈజిప్ట్ ,లిబియా ల మధ్య విస్తా రించిన సువిశాల సామ్రాజ్యం పర్షియా సామ్రాజ్యం .డెబ్భై దేశాలను జయించి జయ పతాకాన్ని ఎగుర వేసిన రాజ్యం .మేదిస్ ,పార్దియన్లు ,బాక్త్రియన్లు ,బాబి లోనియన్లు ,అసీరియన్లు ,ఈజిప్షియన్లు ఉన్న రాజ్యం .వీరివి వివిధ భాషలు .ఆరోమిక్ ,మీడియన్ ,పాత పర్షియా భాషలను ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే వారు .
అనేక ముఖ్య పట్నాలను కలిపే 2,400కి.మీ .”రాయల్ రోడ్ ”తూర్పు పడమర లకు వ్యాపించి ఉంది .ఈ రాజ్యానికి పెర్సి ఆలిస్ ,సుసా ,ఆర్ష గాదే ,అనే మూడు రాజ దానులున్డటం విశేషం .పర్షియా రాజును ”గ్రేట్ కింగ్ ఆఫ్ పర్షియా ”అని గౌరవం గా పిలుస్తారు .రాజరికం వంశ పారంపర్యం .పెద్దల యెడ గౌరవం ఎక్కువ .రాజుకు వంగి వంగి సలాం చేయటం ఆచారం .అందరు రాజు ముందు వంగి నిలబడాల్సిందే .ఆస్థానం లోని వారిని ,సంమానితులను రాజు ముద్దు పెట్టు కొనే సంప్రదాయం ఉంది .
స్థానిక పాలకులను సాత్రపులు అంటారు అంటే గవర్నర్లు .సత్రపి అనే నిర్ణీత భూభాగానికి అతను అది పతి .రాజు తరఫున పాలిస్తాడు .రాజు వీరి పరిపాలనా సామర్ధ్యాన్ని తెలుసు కోవటానికి చార చక్షువులను ఏర్పాటు చేస్తాడు .వీరే రాజు కు కళ్ళు ,చెవులు .మంచి న్యాయ వ్యవస్థ ఉండేది .దీన్ని సైరస్ రాజు ఏర్పాటు చేశాడు .”he would allow his subjects to continue to following their own faiths and other traditional practices”అని చరిత్ర కారులు రాశారు .అంతే కాదు దీనినే ”official charter of human rights”అని గొప్పగా కీర్తించారు .అంత ఉదార హృదయం తో రాజ్య పాలన సాగేది .
పర్షియన్లు pantheon అనే సామూహిక దేవత లను పూజిస్తారు .సముద్రం ,భూమి ,గాలి ,ఆకాశం వాళ్లకు ఆరాధ్య దేవతలు .achemendis కాలం లో జోరాష్ట్రియాన్ మతాన్ని అవలంబించారు .ఇప్పుడు జోరాష్ట్రియాన్ ఒక్కడే దేవుడు .సర్వ సమర్ధుడు ,సర్వ వ్యాపకుడు ,సర్వ శక్తి మంతుడు ”ఆహూరా మజ్దా ”అని ఆయన బోధించాడు .అగ్ని ని పూజిస్తారు .రాజు తాను దేవతల ప్రభావం తో పాలిస్తున్నానని నమ్ముతాడు .అంటే రాజు దైవాంశ సంభూతుడు అన్న మాట .వీళ్ళ మత గ్రంధం జెండ్ అవెస్తా .
ప్రజలు రెండు అంతస్తుల ఇళ్ళ లో నివ సహించే వారు .కాల్చని ఇటుక లతో ఇల్లు కట్టే వారు .దానికి తెల్ల సున్నం పూసే వారు .లోపల రంగులు వేసుకొనే వారు .ఎత్తైన ప్రహరీ గోడ ఉండటం సహజం .ఇంటికి తోట కూడా ముఖ్యం .గులాబి ,నిమ్మ చెట్లను పెంచే వారు .నీటిని చిమ్మే ఫౌంటెన్స్ ఉండేవి .సాధారణ భోజనమే చేసే వారు .బార్లి ,గోధుమ ,లింతెల్స్ ,బీన్స్ ,వీరి ఆహారం .వెన్న ,పెరుగు తినే వారు .మేక మాంసం ,చేపలు తినే వారు .కాయగూరలను బాగా పండించే వారు .ఖర్జూర,పియర్స్ పళ్ళు లభ్యం .వైన్సేవించే వారు .ఇది ఖర్జూరం తో చేస్తే మహా ప్రశస్తమైనది గా భావించే వారు .
మంచి కుటుంబ వ్యవస్థ ఉండేది .బహు భార్యాత్వం మామూలే .పిల్లల్ని ఎక్కువ గా కనే వారు .మగ పిల్ల లంటే ముద్దు .ఆడవారికి స్వాతంత్రం ఉంది .ఉద్యోగాలు చేసే వారు .ఉన్నత ఉద్యోగాల్లోనూ మహిళలు రాణించే వారు .ఆడ పిల్లలు బడి కి వెళ్లటం తక్కువే .ఇంటి పనులు నేర్చే వారు .వ్యాపార వాణిజ్యాలు ఈ దేశం లో ఎక్కువే .సరకు రవాణా జాస్తి .మంచి రహదారి సౌకర్యం ఉండటం తో సరుకు త్వరగా చేరేది .వ్యవసాయం చేయటం ,చిన్నా ,చితకా పనులు చేయటం బానిసల పనే .రోడ్ల నిర్మాణం భవనాల నిర్మాణం వీరే చేస్తారు .
పర్షియా లో achaemends కాలం లో కళలు బాగా అభి వృద్ధి చెందాయి .అసలు ఆయనే ఒక గొప్ప కళా కారుడు .పెర్సిపోలిస్ నగరాన్ని అత్యంత సుందరం గా ,సకల సౌకర్యాలతో వైభవో పేతం గా నిర్మించాడు .ఇదే మొదటి డేరియన్ రాజు గారి రాజధాని .బలీయ మైన సామ్రాజ్యం గా పర్షియా ఉండేది .శత్రు దుర్భేద్య మైన కోటలున్దేవి .సమర్ధ వంత మైన రాజుల పాలన ,సుస్తిర రాజ్య వ్యవస్థ దానికి బాగా కలిసి వచ్చాయి రాజ్యం సకల సౌభాగ్య విలసితం గా ఉండేది .ప్రజలు కూడా భోగ భాగ్యాలతో సుఖం గా ఉండే వారు .ఆర్ధిక స్తితి అద్భుతం .
అయితే రోజులేప్పుడు ఒకే రీతి గా ఉండవు కదా .385b.c.నాటికి అస్తిరత్వం ఎక్కువైంది .మూడవ ఆటా xerxes తన కుటుంబం లోని తనకు శత్రువు లని పించిన బంధువు లందర్నీ చంపి రాజు అయ్యాడు .రక్తపు కూడు తిన్నాడు .అతని ఇరవై ఏళ్ళ పాలన అంతా ఒడి దుడుకులే .326 b.c.లో మూడవ డేరియస్ మాయో పాయాలతో రాజయ్యాడు .issus వద్ద జరిగిన యుద్ధం లో అలెగ్జాందర చేతిలో ఒడి పోయి మధ్య పర్షియా చేరాడు .మళ్ళీ సైన్యాన్ని సమ కూర్చుకొని 331లో బాబిలాన్ కూడా వదిలి వెళ్లి పోయాడు .అలెగ్జాండర్ ముందుగా కొంత సేనను పంపి ,యూఫ్రాస్ నదికి వంతెన కట్టించి ,మెస పోతెమియా అంటే ఇవాల్టి సిరియా ,ఇరాక్ ల మీదుగా ఇక్కడికి వచ్చి టైగ్రెస్ నది దాటి వెళ్లాడు .ఇక్కడే మానవ నివాసం 7000 b.c.కే ఉండేదని చరిత్ర కారుల కధనం .దీనినే” cradle of civilization ”అంటారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-7-12.–కాంప్–అమెరికా

