అమెరికా డైరీ
సర్ప్రైజ్ వెల్కం వీక్
జూలై తొమ్మిది సోమ వారం నుండి పదిహేను ఆదివారం వరకు డైరీ -పిల్లల సమ్మర్
కాంప్-సర్ప్రైజ్ వెల్కం -భజన భోజనం -పుస్తకాల చదువు -నిన్న రాత్రి
సూర్యుడు కర్కాటక రాసి లో ప్రవేశించటం వల్ల ఉత్తరాయణం వెళ్లి దక్షిణాయనం
వచ్చింది .
పిల్లల సమ్మర్ కాంప్
ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో హిందూ సెంటర్ వాళ్ళు
వేసవి శిక్షణా తరగతులను పిల్లలకు ఏర్పాటు చేశారు .ఒక నెల రోజుల కార్య
క్రమం .పిల్లల్ని ఉదయం పదింటికల్లా సెంటర్ లో దింపాలి .సాయంత్రం నాలుగు
వరకు క్లాసులు .సంగీతం ద్రాయిగ్ పెయింటింగ్ ,నాటకం పాటలు సంభాషణా,
క్రికెట్ వంటి ఆటలు అన్నీ నేర్పుతారు .దానికి ఫీజు ఉంది .మధ్యాహ్న భోజనం
వాళ్ళదే .పిల్లలు వేసవి లో వృధాగా తిరిగి టి.వి.లతో కాలక్షేపం చేయకుండా
ఇదో మంచి కార్య క్రమం .మా ముగ్గురు మన వళ్ళను ఉదయం అరగంట ప్రయాణం లో ఉన్న
అక్కడికి తీసుకొని వెళ్లి దింపి వస్తోంది మా అమ్మాయి .మళ్ళీ సాయంత్రం
నాలుగింటికి వెళ్లి పిల్లలను తీసుకొని రావాలి .మా వాళ్ళు మంచి ఉత్సాహం గా
నేవెళ్తున్నారు .ఉదయం ఇంటి దగ్గర టిఫిన్ చేసి వెళ్తారు .ఉపయుక్తమైన కార్య
క్రమం.మధ్యలో కొన్ని రోజులు ఆ క్లాసుల తర్వాత స్విమ్మింగ్ ,పెయింటింగ్
,జిమ్నాస్టిక్స్ క్లాసులకు కూడా వేల్లోస్తున్నారు .మంచి టైంపాస్.ఇంట్లో
అల్లరి కొంత తగ్గు తుంది .
భజన -భోజనం
ఇక్కడి సాయి సెంటర్ లో ముఖ్యురాలు శ్రీ మతి కపిలా లీడ్ బీటర్
అనే వారింట్లో శనివారం సాయంత్రం భజన కార్యక్రమానికి ఆహ్వానిస్తే వెళ్ళాం
.యాభై మంది వచ్చారు .సాయంత్రం అయిదున్నర నుండి రెండు గంటలు అంటే రాత్రి
ఏడున్నర వరకు భజన .చాలా కొత్త భజనలు ముఖ్యం గా ఎక్కువ హిందీ ఇంగ్లీష్
భజనలను అత్యంత భక్తీ శ్రద్ధ లతో గానం చేశారు .తబలా హార్మని ,కంజీర
ల,తోడ్పాటు కూడా ఉంది .ముఖ్యం గా కపిల గారు చాలా భావ గర్భితం గా మనోహరం
గా శ్రావ్యం గా పాడారు .ఆవిడ పాడటం ఇదే మొదటి సారి నేను చూడటం .ఈ మధ్య
వరకు శార్లేట్ సాయి సెంట ర్ కు ఆమె అధ్యక్షురాలు .ఇప్పుడు సత్య అనే అతను
.సత్య మంచి తబలా విద్వాంసుడు .మంచి కార్య కర్త .సాయి బాబా సమక్షం లో
చదువు కున్న వాడు .అతని భార్య సౌమ్య చక్కని గాయని .హార్మని గొప్పగా
వాయిస్తుంది .వాయిస్తూనే బాగా శ్రావ్యం గా పాడుతుంది .తాదాత్మ్యం
కల్గిస్తుంది .మేము వచ్చిన దగ్గర్నుంచి ఆ దంపతులతో మంచి పరిచయం .సౌమ్య ఆ
రోజు అత్యంత భక్తీ భావం తో తార స్తాయి లో పాడి జనాలను పరవశులను చేసింది
.ఆమె వాయిస్ చాలా పీక్ గా ఉందని భజన అయిన తర్వాత ఆమె తో చెప్పాను
.మిగిలిన వాళ్ళు కూడా బానే పాడారు .ఆ తర్వాత అందరికి సాయిబాబా అభిషేక
క్షీరం తాగ టానికి ఇచ్చారు .ఆ తర్వాత నిమ్మ రసం ఇచ్చారు .దాని తర్వాత
విందు .విందు లో -చపాతి పూరీ ,కూరలు ,పెరుగు పచ్చడి ,కారట్ హల్వా ,పండు
మిరప కారం ,మూడు రకాల స్వీట్లు మూడు రకాల పెరుగు ఆవడ వంటి హాట్లు మొత్తం
సుమారు పది హేను వరైటీలు .ఇష్టమైన వి యేవో కొద్దిగా తిన్నాం .అక్కడ సుజన్
అనే వరంగల్లు కుర్రాడు పరిచయమై తెలుగు లో మాట్లాడాడు .అతను మేము కూడా
మాట్లాడటం విని ”చాలా రోజు లైంది తెలుగు విని” అన్నాడు .సత్య అతనికి
మన” సరస భారతి” గురించి” బ్లాగు” గురించి వివరించి చెప్పాడు అతను
ఆశ్చర్య పోయాడు .సత్య ఎక్కడ వీలైతే అక్కడ సరస భారతి గురించి మంచి ప్రచారం
చేస్తున్నాడు .మంచి గౌరవం గా ఉంటాడు .సుజన్ తో ”అంకుల్ -ఈ మధ్య ఈల శివ
ప్రసాద్ వచ్చి నప్పుడు రెండు మంచి బిరుదులు ”ఈల లీలా లోల ”-”గళ వంశీ
”అనే వి సజెస్ట్ చేసి వేదిక మీద ప్రకటించారు ”అని జ్ఞాపకం చేసుకొన్నాడు
.
సర్ప్రైజ్ వెల్ కం–గాయత్రీ సత్యనారయణీయం
శార్లేట్ సాయి సెంటర్ లో ముఖ్య గాయకుడు హార్మని విద్వాంసుడు
కుర్రాడు మంచి కలుపు కోలు వ్యక్తీ అయిన సత్య నారాయణ ఈ నెలలో ఇండియా
వెళ్లి అక్కడ పెద్దలు కుదిర్చిన గాయత్రి అనే అమ్మాయిని వివాహం ఆడి మళ్ళీ
ఇక్కడికి భార్య తో సహా వచ్చాడు .అతను వస్తున్నట్లు తెలిసి సాయి సెంటర్
వాళ్ళు సుబ్బు అనే కన్వీనర్ ఆధ్వర్యం లో నూతన దంపతులకు సర్ప్రైజ్ వెల్కం
ను శుక్ర వారం రాత్రి దగ్గర లోని కమ్యూనిటి హాల్ లో ఏర్పాటు చేశారు
..అందరం వెళ్ళాం .సుమారు యాభై మంది ఆహ్వానితులు వచ్చారు . ముందుగా ఒక
గంట భజన ఏర్పాటు .సత్య తో సహా అందరు పాడారు .ఆ తర్వాతవిందు -విజ్జి చేసిన
పెరుగు ఆవడలు ,ఇంకెవరో చేసిన చపాతి ,కూరలు ,బిర్యాని ,పెరుగు పచ్చడి
,చట్నీ ,అన్నం ,సాంబారు ,రెండు రకాల స్వీట్లు ,కీర పాయసం కోకా కోలా
వగైరాలతో విందు అదిరింది .నవ దంపతులు ఉత్సాహం గా పాల్గొన్నారు .అందరు తలో
ఐటం చేసుకొని వచ్చి నిండుదనం తెచ్చారు .తర్వాత- హాజ రైన దంపతుల తో చీటీలు
తీయించి అందులో వచ్చిన దాని ప్రకారం ప్రశ్నలకు సమాదానా లు ,పాటలు
పాడించటం వగైరా కార్య క్రమాన్ని రాంకీ భార్య ఉషా సరదా గా నిర్వహించింది
.ఒక గంట అందరూ ఒకటే అనే మంచి భావం ఇదంతా కలివిడి గల ఫామిలి అనే అభిప్రాయం
కొత్త దంపతులకు కలిగించటమే ఇందు లో ని ముఖ్య ఉద్దేశం .నూత్న దంపతులను
కూడా ప్రశ్న ల పరం పరతో సరదా చేసి వారి సమాధానాలతో అందరు మళ్ళీ తన పెళ్లి
రోజులను ఒక్క సారి జ్ఞాపకం చేసుకోనేట్లు చేశారు .కొత్త పెళ్లి కూతురుకి
అందరితో పరిచయం కలగటం ఆమె లో ముభావం ఉంటె పోగొట్టటం దీని ఉద్దేశ్యం .అది
బాగా నేర వేరింది .అందరు గొప్ప సహకారం అందించారు .మా ఇద్దర్ని కూడా ఆ
ఆటలో పాల్గొన మని ఉషా బలవంత పెడితే నేను ”మేము r.i.లం, మీరు n.r.i. లు
మేము పాల్గోవటం బాగుండదు అన్నా .అయితే” ఆంటీ -మీరిద్దరిలో ఎవరి మాట ఎవరు
వింటారో చెప్పండి” అని ప్రభావతి ని అడిగింది ”.ఆయన మాటే నేను వింటాను
”అంది దానికి నేను ”once up on a time అది -నేను రిటైర్ అయ్యే దాకా
ఆవిడ నా మాట వింది -రిటైర్ అయిన తర్వాత నేను ఆవిడ మాటే వింటున్నాను ”అనే
సరికి అందరూ గొల్లున నవ్వారు .మొత్తం మీద సరదా సరదా కార్యక్రమం .చివరికి
నూతన దంపతులతో కేక్ కట్చేయించి అందరికి పంచారు .ఇలా సర్ప్రైజ్
గావారిద్దరికి స్వాగతం పలికి ఆనందం చేకూర్చి ఈ కుటుంబం లో వారినీ
ఆహ్వానించి అంతా మంచి కుటుంబం అని పించారు .ఇదే ”గాయత్రీ సత్యనారాయణీయం
”.ఇంటికి వచ్చే సరికి రాత్రి పదకొండున్నర .
ఈ వారం లో చదివిన పుస్తకాలు –మైనేని గోపాల కృష్ణ గారు
హూస్టన్ లో జరిగిన నాటా సభల సావనీర్ ను ,,world demogrphic trends అనే
పుస్తకం పోస్ట్ లో పంపారు .రెండు చదివేసి వారికి తెలియ జేశాను .వారు నాకు
హన్త్స్ విల్ లో ఇచ్చిన జస్టిస్ హిదయతుల్లా పుస్తకంmy own boswell చదివి
”హ్రిదయ తుల్లా ”అనే ఆర్టికల్ ఇదివరకే రాశా .ఆయనే ఇచ్చిన the idea of
india ,the emotional life of your brain ,there is a spiritual solution
కొంత వరకు చదివా. లైబ్రరి లో తెచ్చిన వాటి లో albert eistein ,maya
angelo ,benjamin franklin ,keynes ,jefersan ,my prison life ,mary
magdolina ”లలో కొన్ని పూర్తిగా చదివా .కొన్ని తిర గేశా .
మీ–గబ్బిట –దుర్గా ప్రసాద్ –17-7-12-కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

