తిక్కన భారతం –18
యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –6
పద్మ వ్యూహం లో అభి మన్యుడు మరనిన్చటాన్ని ధర్మ రాజు దిగ మింగు కో లేక పోయాడు .తన వల్లే ఇదంతా జరి గిందని తీవ్రం గా విల పిస్తాడు .ఇన్ని కష్టాలు, కురుక్షేత్ర యుద్ధం అన్నీ తన తప్పిదం వల్లనే వచ్చాయని బాధ పడ తాడు .ఈ సందర్భం లో అతని మనో వేదన ను వ్యక్తే కరించ టానికి చెప్పిన తిక్కన పద్యాలు ఆణి ముత్యాలు .”కొడుకు బోడగానకర్జునుడడిగే నేని ,–వానితో నింక నేమను వాడ ?హరికి –నతని గారాబు చెలియలి కధిక దుఃఖ –మే న చేసితి వగ వంగ నేమి గలదు ?–వాని తోడి లోకమి ఏను బోవ -నైతి బో గన్న పుత్రా శోకాతురత్వ –మున ,నిటిన్త వివరణత బొంద కుండ ,–జూడ కుండేడి వాడ నర్జునుని మొగంబు ”అని తండ్రి కొడుకు చని పోయి నప్పుడు పొందే వ్యధనంతా పొందాడు .అంతా తన అసమర్ధత అని చెప్పు కొన్నాడు .అర్జునుడు వచ్చి అడిగితే యేమని సమాధానం చెప్పాలి /అతనికి తన మొహాన్ని ఎలా చూపించగలను ?అని కుమిలి పోతున్నాడు .
అభి మన్యుని మరణం విన్న అర్జునుడు స్కందావారానికి వచ్చి ,అన్నలను తమ్ముళ్ళను చేత కాని వారిగా నినదించాడు .పుత్రా శోక వివశాత్వం తో చాలా కఠినం గా మాట్లాడాడు .అభి మన్యుని తల్లి సుభద్ర వ్యంగ్యం గా ,తీక్షణం గా ,భీమాదుల హృదయాలను కోసే మాట లంతుంది .స్త్రీ స్వభావం గా ,పుత్రా శోకాన్ని వెల్లడిస్తుంది .–”అనిలజు నుక్కు ,లావు ,గల డందురు ,సాత్యకి శౌర్య శాలి నా –జానూ ద్రుపదుండు ,సంగర విశారద భావము పూని యుండు ,మా –త్చ్యుని బటు విక్రమాధ్యుదని చూతురు ,పాండవు లిండ రుండి , యొ –క్కని కి ,గడంగ లేర ,నిను గావగ బుత్రకా !”అని అందర్ని కడిగి పారేశింది .అంకుశాలతో పొడిచి నట్లయింది వాళ్లకు .శ్రీ కృష్ణుడు సోదరిని ఓదారుస్తూ ”తగు మాట లాది కోడలు ఉత్తర శోకం తీర్చు -నీవు ధైర్య వతివి ,నిన్ను చూసి మేమూ ధైర్యం పొందాలి ”అన్నాడు లోక సహజం గా .నీ శోకం సరే -నీ కోడల్ని ఎవరు ఒదారుస్తారు నువ్వు తప్ప అని .గర్భ శోకానికి ఊరట ఉంటుందా /అందుకు సుభద్ర అన్ననే మెత్తని మనసు గల తన కోడలి దుఖాన్ని తీపి ,తళుకు లోల్కే మాటల తో ఒదార్చమని కోరింది .అలాగే సౌప్తిక పర్వం లో ద్రౌపది పుత్రా శోకం హృదయాల గూడులను పట్టి లాగేస్తుంది ఉప పాండవుల హత్య విని .ఈ విధం గా మాతా ,పితృ హృదయ ప్రకృతు లను అత్యంత సమర్ధ వంతం గా తిక్కన పోషించాడు .ఘోర యుద్ధం లో కూడా ,ఇలాంటి మానవ హృదయ వ్యాపారాలైన దయ ,వాత్సల్యం ,బంధు భావం చక్కగా ప్రదర్శిమ్పప జేశాడు .
సైంధవ వధ కు అర్జునుడు ఏకాకి గానే వెళ్లాడు .అతని క్షేమం విషయం పై ధర్మ రాజు తీవ్ర వ్యాకులత చెందాడు .సాత్యకిని వెళ్లి సాయం చేయమని చెబుతూ –”హరి గురుడు నీకు గ్రీడియు ,–గురు డిరువుర ఎడరు దీర్ప గోరి ,గురులకుం గురుడ నగు నేన, చేసేద –పరమ ప్రార్ధనము దీని బాటింపు దగన్ ” –ఈ విధం గా తన చింత పోగొట్టటం ,గురుడు సఖుడు బంధువు అయినఅర్జును నికీ ,అన్న శ్రీ కృష్ణుడికి తోడ్పడటం తన పరాక్రమ ప్రదర్శన చూపటం ఎంత అవసరమో ధర్మ రాజు చాలా మంచి పదాల తో సాత్యకి కి చెప్పాడు .సరే నని బయల్దేరి వెళ్లాడు సాత్యకి .అతని పై వీరాధి వీరులంతా పది విజ్రుమ్భించారు .మళ్ళీ బాధ పడ్డాడు పాండ వాగ్రజుడు -”తమ్ముని దలంచి కృష్ణుని –తమ్ము బనిచె నాతని బదంబడి తన ,చి –త్తమ్మున ,దలపడ ధర్మ రాజు –డమ్మెయి వాడోక్కో నారే ఈ యున్న జనులున్ ” మొదటి పదాలను చాలా సార్ద కం గా ప్రయోగించాడు .తన తమ్ములు ఉండగా కృష్ణుడి తమ్ముడిని పంపటం లో తను ఎంత గడుసు వాని గా సైన్యం లోని వారు అనుకొంటారో నని బాధ పడ్డాడు .ఆ ఊహే ఆయన విచారానికి కారణం .యుద్ధం లో సంర్దుల్ని పంపటం సహజం .కాని ఇక్కడ బంధుత్వ విచారణ చేశాడు .ధర్మ రాజు .లోకాప వాడ ముద్ర పడ రాదనీ భావించాడు .ఇది ఉత్తముల లక్షణం .చివరికి తన మనసు ను సమాధాన పరచు కొని భీముడిని సహాయం పంపాడు .–”భీము జేర నరిగి భీభాత్సు నీ తమ్ము –నని ,యెలుంగు ,గళము నందు దగుల —-నశ్రులోలుక మాట సెప్ప లేడత –డార్తి సూచీ ఇట్టు లనియ నతడు” భీభాత్సుడు అనటం తో అర్జునుని పరాక్రమాన్ని గుర్తు చేయటం నీ తమ్ముడు అంతం తో భ్రాత్రు వాత్సల్యాన్ని కర్తవ్య పరాయనత్వాన్ని తెలియ జేయటం ,అతడిని రక్షించు కోవాల్సిన అవసరాన్ని గుర్తు చేయటం అన్నీ ఇందులో కనీ పిస్తాయి .అంతే కాదు అర్జునుడిని ఎంత అభిమానం గా తామందరం చూసు కొంతున్నామో అతనికి ఏదైనా జరిగితే ఎలా తట్టు కోలేక పోతారో వివ రించే ఇంకో పద్యం –”నీ తమ్ము గుర్ర ,రూపసి ,–నీతి విడుదు ,సకల గుణ నిది ,మద్భక్తుం –డాతనికే డరగు నో యను –చేతో గతి పల్ల టిల్ల జేయదే తాల్మిన్ ”–అర్జునుని గుణాలను ఏకరువు పెడుతూ ,ఒగుడుతూ ,భీముని ప్రోత్స హించటం చాలా ఉచితం గా ఉంది .అతదింకా ధర్మ రాజుకు ”కుర్రడే”.అంతే కాదు తానంటే భక్తీ శ్రద్ధలున్నవాడు .భీముడు తొమ్మిది రోజుల యుద్ధం చేసి శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడి పీనుగుల రాసి చేసి పారేశాడు .అతని పరాక్రమాన్ని తెలిసి పొంగి పోతు కృష్ణుడికి వివ రించి చెబుతాడు .సంతుష్టుదౌతాడు –”కార్చిచ్చు గవిసి మరుగ తతి -నేర్చు కరణి నేడు భీష్ము డేచిన కడిమిం –బేర్చి ,మన సేన బొదివె శ –రార్చుల నీ వీరు గన్ను లార.గంటె -తాను జూదమాడి ,తమ్ముళ్ళను చాలా కష్ట పెట్టాడు .దానికి మనసు లో బాధ పడుతూనే ఉన్నాడు .తన మీద అంత అనురాగం గౌరవం ఉన్న తమ్ముళ్ళు బాధ పడటం సహించ లేక వాళ్ళను రక్షించకొని కన్నారా చూస్తూ సంతోషించాలి కాని భీష్మునికి బలి ఇవ్వ లేను అని తన అంత రంగాన్ని ఆవిష్కరిస్తాడు . ”
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-12–కాంప్–అమెరికా .
http://suvarchalaanjaneyaswami.wordpress.com
వీక్షకులు
- 1,107,405 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
- శ్రీ ఆర్. ఎస్.సుదర్శనం గారినూరు సమీక్షలు.1 వ భాగం.20.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త0.2 వ చివరి భాగం.20.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.6 వ భాగం.20.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,544)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

