జన వేమన -9
వేమన సార్వ కాలీనత —
”వినుము వివేక మని యేడి వింత గొడ్డలి చేత –వలయు విద్య యనెడు నడవి నరికి -తెలివి యనేడు గొప్ప దీపంబు చే బట్టి -ముక్తి జూడ వచ్చు మొనసి వేమ ”ముక్తి కి మార్గ వివేకం .విద్యా రణ్యాన్నిచేదించాలి .తెలివి అంటే ,పరమేశ్వర జ్ఞానం అనే దీపం తో ,వెతికి తేనె మోక్షం .ఈ శరీరం మట్టి కుండ,శిధిలం అయేది .ఆత్మ కు చావు లేదు. ఎన్ని కుండలు ఉన్నా ,అందులో ప్రతి ఫలించేది ఒకటే ఆకాశం .”ఎరుక సాటి ఎరుకయే ”.అని ఆత్మ జ్ఞాన రహస్యం .గురువు చిల్ల గింజ .దేహం కుండా .ఆత్మా కలుషిత నీరు .ఆ నీటికి గురువు అనే చిల్ల గింజ గంధం కలి పితే ,మాలిన్యా లన్ని అడుగుకు చేరి ,స్వచ్చ ,సత్య పరమాత్మ దర్శనం లభిస్తుంది .ఆది తెలిస్తే ,దివ్యామ్రుతమే నంటాడు .”పశుల వన్నె వేరు పాలేక వర్ణ మౌ -పుష్ప జాతి వేరు ,పూజ యొకటి -దర్శనంబు వేరు ,దైవంబోక్కటే ”అని, యే రీతి లో కొలిచినా చేరేది పరమ పదమే .చిత్తం అనే వేరు శిధిల మైతే ,శక్తి అనే చెట్టు కూలి పోతుంది .అప్పుడే కోరికలు అనే పెద్ద కొమ్మలు ఎండి పోతాయి .కనుక చిత్తాన్ని శిధిలం చేసు కోవాలి .
మానవుడు దేవుడు గా మారటమే మానవ జీవిత లక్శ్యం .ఆది సాధిస్తే ఇంకేమీ అక్కర లేదు .”సొమ్ము దొరకు దనుక జ్యోతి యంతియే కాక -సొమ్ము దొరుకు వెనుక ,వెనుక జ్యోతి ఎల -దేవుడైన వెనుక దేహంబు మరి ఏల ?”అని ప్రశ్నించాడు .ఆత్మ బుద్ధి అనేది ఉంటె ,అంతా తాను గానే కానీ పిస్తుంది .చెట్టు లో అగ్ని దాగి ఉంది .కాని అగ్ని లో చెట్టుబతక లేదు .చెట్టు లో ఉన్న అగ్ని లాంటి వాడు సంసారి .ఆశ వదిలేస్తే ,బంధం పోతుంది .బంధం విడి పోతే ము ని గా మారి పోతాడు .ముని అయితే ,సర్వ మొహాలు పటా పంచేలవుతాయి .”ఆత్మా లోని నాద మాలించి ,ఆలించి –నప్పుడే ,తత్వ జ్ఞాని అవుతాడు ”.త్రిగుణాలు నశిస్తే ,ముక్తి ఖాయం ”.తోలు తిత్తిఇది తూటులుతొమ్మిది,తుస్సు మనుట ఖాయం ”దీన్ని నమ్ము కోకు .బ్రహ్మాన్ని తెలుసుకో అన్నాడు .”నాశిక మధ్య నను జూచు యోగి –కాశి నాధు నైన గన గలడా యోగి -” అని సాధన రహస్యాన్ని వివ రించాడు .కను చూపు ను భ్రూ మాధ్యమ లో ఉంచి ,తరచి ,తెరచి చూస్తె ,ఆత్మ రాక పోక లన్నీ తెలుస్తాయి అని విశ్వాసం గా చెప్పాడు .”బ్రహ్మ మనగ ,వేరే పర దేశమున లేదు -బ్రహ్మ మన గలినే బట్ట బయలు -తనను దానేరిగిన తానే పో బ్రహ్మంబు ” అని బ్రహ్మోప దేశం చేస్తాడు .
”ఆణువు లో అఖిల జగాలు ఉన్నాయి .ఆ ఆణువు మన లోనే దాగి ఉంది .మనసు నిలి పితే నే ముక్తి సాధ్యం ”అని స్తూల సూక్ష్మ జగతిని గమ నించి చెప్పాడు .”చేతి లో వెన్న ఉన్నా ,నెయ్యి కోసం వెతికే మూర్ఖుడు మానవుడు ””తాను దైవ మయ్యు -దైవంబు దలచును ,”అంటాడు .”శివోహం” నేనే పరబ్రహ్మాన్ని అన్న విషయం మరిచి పోతూనే ఉంటాడు అని జాలి పడ్డాడు .”తనువు లేని వాడు తానే తనేనయా –”అని చెప్పాడు వేమన్న .శరీర భ్రాంతి వదిలితే ,”సోహం ”అనే భావం ఏర్పడుతుంది .దాని తో ముక్తి .”తాను సకల మైన సకలంబు -తనదు లోన ,వెలుగు ,తానేరింగి -యున్న మాన వునకు నోన రంగ ముక్తి రా ”అని ఈశ్వర వ్యాపకం జగత్తు అంతా నిండి ఉంది అని కమ్మగా ,నమ్మకం గా ఉపనిషత్ రహస్యాన్ని విప్పి చెప్పాడు .”ఆకృతి అంటే ,నిరాక్రుతే ”ఆ రెండు అపు రూపాలే .లోపలి దృష్టి ఉంటె ,లోకం అంతా ,అభి రామం గా దర్శన మిస్తుంది .బయటి దానికి మురిసి పోతే బంధనమే .”తనను జూడ ,జూడ ,తారక బ్రహ్మంబు ”అని రహస్యాన్ని చేదించి చెప్పాడు .విత్తనాన్ని భూమి లో నాటితే ,పై పొట్టు ఊడి ,మొలక గా బయట పడి నట్లు ,”వేత్త యగు వాని కర్మం-బత్తేరగున విడిచి పోవు ననువున వేమా ”అని బోధించాడు .మాయ పోర వదిలితే ,అంతా చిదానందమే .
ఎన్నో భోగాలు చుట్టూ ఉన్నా ,యోగి కర్మ సహాయాన్ని అంట కుండా తిరుగు తుంటాడు .అన్నానికి అంటుఉన్నట్లే ,ఆత్మకూ ఉంది .ఆత్మ శుద్ధి ఉంటె ,అన్న శుద్ధి ఉంటుంది .కనుక ఆత్మ మిన్ను ,మన్ను లాగా మెరుస్తుంది .శత్రు పంచకాన్ని జయించి ,కామ వాసన విసర్జించి ,శివ పంచాక్షరి జపిస్తే ,పంచత్వం నశించి ,శివుని పంచన చేరి పరుడౌతాడు .”ప్రవణ మరయలేక ,భక్తుడు కాలేడు -జ్యోతి నరయ లేక జోగి కాడు -నిత్య మరాయ లేక ,నిర్వాణి కాడయా ”అని ముక్తికి సోపానాలు చెప్పాడు .”సూక్ష్మ మధ్యమం లో జీవుడు ,స్తూల మధ్యమం లో సూర్యుడు ,నాద బిందు కళల మధ్య బ్రహ్మమూ ఉంటారు” అని వివరం గా తెలియ జేశాడు .ఆసనాలు ,యోగాలు అన్నీ బాహ్య ఆడంబరాలే .అవన్నీ సాము గరిడీ ల కంటే చింతాకు అంత తక్కువ .
నీటి మీది బుడగే జీవితం అంటే .దాని సోకు చూసి మోస పోవద్దు .జీవితం -విరిగి పోయే పచ్చి కుండ .దాని కోసం భ్రాంతి అనవసరం .మనం మాట్లాడే ప్రతి మాటా పరమేశ్వరుడికి తెలుస్తుంది .”నీవు పలుకు నిర్మలుం డేరుగడా” ?అని హెచ్చ రించాడు .ఎవరూ వినరని ,మనం ఇష్టం వచ్చి నట్లు మాట్లాడ కూడదు అని భావం .ఆ పై వాడికి చూపూ ,వినికిడీ ఉంటాయి .అతడు సర్వ సాక్షి అని మనం అను క్షణం గుర్తుంచు కోవాలి .”ప్రాణ మిలను లేక ,పర మందగా రాదు -ప్రాణ ముండ గానే పరము గద్దు -” అంటే -ప్రాణం ఉండగానే ఏదైనా సాధించాలి .అందుకే ”ప్రాణి పోయి నపుడు పనికి రాదీ దేహము ”అని గట్టిగా నే చెప్పాడు .శరీరం ధర్మ సాధన కోసం అనే ఆర్యోక్తి నిమళ్ళీ చెప్పాడు .పర తత్వ యోగి తత్వ మేమిటో ఇలా వివరించాడు ”మనసు హక్కు కర్మ మనిఏమి లేకయ -రాక ,పోక లేని రాజ వీధి -పరగ హాని గలదే ,పర తత్వ యోగికి ”నిర్వికారం గా నిర్బంధం గా ,చరించే వారికి నిబంధనలు వర్తించవు .జ్ఞాన ముద్ర చేత తళుకుకానీ పిస్తుంది .అదే మనకు శ్రేష్టం అని మహర్షులందరు చెప్పిన పరమ మైన మాట .ఆది తెలిస్తే
,పరమార్ధం తెలిసి నట్లే నని వివరించాడు యోగి వేమన .ఎంతో గహన మైన వేదాంత రహస్యాలను ,ఉపనిషత్ ,శాస్త్ర యోగ
విశేషాలను ,ధర్మ సూక్ష్మా లను ,అల వోకగా అరటి పండు ఒలిచి చేతి లో పెట్టి నట్లు హాయిగా తేట తేట పదాల ఆట వేలదుల్లో
కూర్చి జ్ఞాన బోధ చేశాడు .సార్వకాలీన సత్యాలను సర్వ జనులకు సత్య స్పూర్తి తో తెలియ జేశాడు వేమన యోగి పుంగవుడు .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –26-8-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 993,479 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.5వ భాగం.20.9.23
- శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.23వ భాగం.20.3.23
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు – 2023
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు – 2023
- రీ సువర్చాలంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం నాడు నటుడు మిస్రో దంపతులకు ఆలయ సాంప్రదాయ ప్రకారం సత్కారం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.4వభాగం.19.3.23.
- శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.22వ భాగం.19.3.23.
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు. 3వ భాగం.18.3.23.
- శోభక్రుత్ ఉగాది 2023 ఆహ్వానం సరసభారతి వుయ్యూరు
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,950)
- సమీక్ష (1,305)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (375)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (843)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు