జనవేమన -15
వేమన గురించి కధలు -గాధలు
కొండవీటి రాజులు పాలించే కాలమ్ లో వేమన పూర్వీకులు మూగ చింత పల్లి నుంచి ,కొండవీడు చేరి ఉంటారని ,ఆ కాలమ్ లో రాజుల కొలువు లో పని చేసిన ఉన్నతోద్యోగులు తమ పిల్లలకు రెడ్డి రాజుల పేర్లు పెట్టటం అలవాటు గా ఉండేదని ,అదనం గావేమన పూర్వీకులకు రెడ్డి పదం చేరి ఉంటుందని భావిస్తున్నారు .అది వేమన వరకు పాకి ఉంటుంది .కొండవీటి పడమర వీధి లో శివాలయం ఉండేదని ,దాని దగ్గరలో వేమన ఇల్లు ఉండేదని పండిత బండారు తమ్మయ్య అభిప్రాయ పడ్డారు .బ్రౌను దొర వేమన వాడిన మాండలీకాలను పరిశీలించి ,”తెలంగాణా ”లోని నైరుతి ప్రాంతం వాడని భావించాడు .ఇది నిజం అకాడని తేల్చి పారేశాడు మేజర్ మాగ్దోనాల్ద్ .వేమన రాయల సీమ వాడే నని స్పష్టం చేశాడు కూడా .మూగ చింతపల్లి చిత్తూరు జిల్లా చంద్ర గిరి తాలూకా లో మాత్రమే ఉందని ఆరుద్ర పరిశోధించి చెప్పాడు .చాలా జిల్లాల లో ఆ పేరిట ఊళ్లు ఉన్నట్లు తెలుస్తోంది .”వడ్ల లో ఎన్ని రకాలో ,రెడ్ల లోను అన్ని భేదాలున్నాయి ”అందుకే తాను ”కాపు ”అని చెప్పుకోన్నాడని కొందరు తేల్చారు .దీనికి ఉదాహరణం గా ”కలి యుగంబున నున్న కాపు కులానికి -వేమన తన కీర్తించే ”అన్న పద్యం చెప్పాడు .”కాపు రెడ్లు ”గా వేమన వంశాన్ని భావించి కృషీవలుడు అన్నారు .
అందరికి తెలిసిన కధ
వేమన చిన్నతనం లోనే ,తలిదండ్రుల్ని కోల్పోయాడు .అన్న రాచ వేమన ,ఒదిన నరసమాంబ వేమన్న ను చాలా గారాబంగా పెంచారు .ఒదిన అంటే వేమన్నకు తల్లి తో సమానం .ఆమె మాట ఆయనకు వేద వాక్కు .అన్న వదినల కూతురు ”జ్యోతి ”అంటే వేమనకు ప్రాణం .వేమన్నే ఓదినకు కొడుకు .అన్న గ్రామాది కారి కనుక ఎప్పుడూ తీరిక గా ఉండే వాడు కాదు తమ్ముడి సంగతి అసలు పట్టించుకో లేదు .దానితో వేమన కు చదువు అబ్బలేదు .కొండ వీడు దేవాలయం లో దేవదాసి తో పరిచయం పెరిగి ఆ ఆకర్షణ లో పది పోయాడు వేమన .వేశ్య తల్లికి డబ్బు పిచ్చి .ఎలాగైనా వేమన నుంచి డబ్బు గుంజాలని ఆమె పాచికలేస్తోంది .అన్న చాటు బిడ్డ వేమన .ఒదిన ఏమీ ఇవ్వగలిగే స్తితి లో లేదు .వేశ్య తల్లి కూతుర్ని ఒత్తిడి చేసి డబ్బు లాగామంతోంది .చివరికి గత్యంతరం లేక ఒదిన నగలు కాజేసి వేశ్యకు ఇచ్చాడు వేమన .ఒక రోజూ జ్యోతి తల్లి నగలు పెట్టుకుంటానని మారాం చేసింది .తల్లి పెట్టె తెరచి చూస్తె నగలు గల్లంతు .అన్నకు ఈ విషయం తెలిసి ,వేమన్న ను ఇల్లు వదిలి పొమ్మన్నాడు .నిర్లిప్తం గా బయటకు వచ్చేశాడు .కొడుకును పోగొట్టు కొన్న తల్లిలా బాధ పడింది ఒదిన .వేమన పై ఆమెకు మమకారం మాత్రమే కాదు ,అతను మారి మళ్ళీ దారి లో పడతాడని తల్లి గా భావించింది ..
వేమన కు ఒక వరుస మరదలు ఉంది .పేరు లక్ష్మి .బావను పెళ్ళాడాలని ఆమె ఉబలాటం .ఈయనకు ఆ ధ్యాసే లేదు .ఇంట్లో చేరి వలపుల చూపులు రువ్వింది .ఏమీ చలించలేదు .ఒదిన ఆమె కు ఆసరాగా ఉన్న కధ ముందు వస్తుంది .పెళ్లి మాట ఎట్ట వద్దని లక్ష్మికి చాలా సార్లు చెప్పాడు వేమన .దేవదాసిని పెళ్లి చేసు కొన్నానని నమ్మించాడు కూడా .ముత్తైదు చిహ్నం గా ఒదిన గారి ముక్కెర ఇమ్మని ప్రార్ధించాడు .అదొక్కటే తనకు మిగిలిందని ,అదే తమ పెళ్లి గుర్తు అని ,నచ్చ చెప్పింది ఒదిన .ముత్తైదువ ముక్కెర తీసి ఇవ్వాడు అని స్పష్టం చేసింది .తన చివరి కోరిక ముక్కేరే నని మంకు పట్టు పట్టాడు .ఒదిన ,ఒక షరతు విధించి ముక్కెర ఇచ్చింది .అది చాలా విచిత్ర మైన షరతు .”దేవదాసి ని నగ్నం గా వెనక్కు వాలి ముక్కెర తీసుకొనేట్లు చెయ్యి ”అన్నది .పరుగు పరుగున దేవ డాషి దగ్గరకు వెళ్లి షరతు చెప్పి ముక్కెర ఇచ్చాడు .ఆమె అలానే చెప్పినట్లే తీసుకొంది .దిమ్మ తిరిగి పోయింది వేమన కు ఆమె రూపం చూసి .రక్త మాంసాలతో ఉన్న తోలు తిత్తి కోసమా ఇంత వెర్రిగా ,ఇంత కాలమ్ తాను వేమ్పర్లాడాను?అని తెలుసుకొన్నాడు .తల తిరిగింది .తల్లిగా చూసే ఒదిన కన్నులు తెరిపించింది అని అర్ధం చేసు కొన్నాడు .వెంటనే ,ఆ ముక్కెర ను ఒదిన పాదాల చెంత ఉంచి కన్నీరు మున్నీరు గా విలపించాడు వేమన .ఆయనకు జీవితం పై రోత కల్గింది .వేశ్య పై విముఖత ఏర్పడి నది . .మారి మంచి వాడవుతాడు అనుకొన్న మరిది విరాగి అవటం తో ఒదిన నిస్చేస్తురాలైంది .తల్ల డిల్లి పోయింది .మౌనం గా ఉండే వాడు .దేన్నీ పట్టించు కొనే వాడు కాదు .జ్యోతిని కూడా ప్రేమగా పలకరించే వాడు కాదు .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -09 -12 -కాంప్–రాలీ -నార్త్ కెరొలినా -అమెరికా

