జన వేమన –18- కొండ వీటి వైభవం

  జన వేమన –18-  కొండ వీటి వైభవం 
”పరరాయ పర దుర్గ పర వైభవ శీల -గోన కొని ,విడనాడు కొండ వీడు
పరి పంధీ  రాజన్య బలముల సంధించు -గురుతైన యురి తాడు కొండ వీడు
ముగురు రాజులకును మోహంబు పుట్టించు -కొమరు మీరిన వీడు కొండ వీడు
చటుల విక్రమ కళా సాహసంబోనరించు -కుటిలాత్మకులకు సూడు కొండ వీడు
సాధు సైంధవ భామినీ సరస వీర -భటనటానేక  హాటక ప్రకట గంధ
-సిందురాద్భుత మోహన శ్రీ ల దనరు -కూర్మి నమరావతికి జోడు కొండ వీడు ”
అని శ్రీ నాద మహా కవి చేత ప్రశంసలు పొందింది కొండవీడు .ఆ కొండ వీడే ,మన వేమన కు స్థావర మైంది .”కొండ వీటి దండ కవిలె ”లో దాని విషేషా లన్నీ ఉన్నాయి .”కొండ వీటి కైఫీయత్ ”కూడా చరిత్ర చెప్పింది .కొండ వీటి కోనప్ప అనే అతను దండ కవిలె సంపాదించాడు .
గుంటూరు జిల్లా లో నరస రావు పేట దగ్గర ఉన్న అరణ్యం లో కొండ వీడు ఉంది .అక్కడ ఒక ఎత్తైన పర్వత దుర్గం ఉంది  .దాని ఎట్టు 1725అడుగులు .చుట్టూ కొలత 30 మైళ్ళు .ఈ పర్వతానికి 50శిఖరాలున్నాయి .వెంకటేశ్వర ఆలయం ,కన్యకల బావి ,శివాలయం ఉన్నాయి .వీటిలో ఆరు గుహలున్నాయి .పర్వతం పై మూడు పెద్ద చెరువులున్నాయి . 36స్తంభాల మహా మండపం ఉండి .శిధిల మైన రాజ మందిరాలు చాలా కన్పిస్తాయి .మహమ్మదీయులు కట్టించిన నమాజు చేసే మందిరాలూ ఉన్నాయట .6,4,1,1/2గజాల కొలతలున్న రాతి నేతి తొట్టె ఉంది  .దానిలోరెడ్డి రాజులు  నెయ్యి పోసుకొనే వారట .24స్తంభాలు ,22స్తంభాలు ఉన్న మండపాలుండే వట .గణపతి ,సుబ్రహ్మన్యేశ్వర స్వామి గుడులున్నాయి .నాగ కన్యల విగ్రహాలున్నాయి .కొండ గుహ పై పాను వట్టం పై శివ లింగం ఉండేదట .ఇవన్నీ చదు నైన ప్రదేశం లో ఉంటె ,దీని చుట్టూ ,పర్వత శిఖరాల మీద కొండంతా వ్యాపించి ఉండే కోటలు ఉండి ,శత్రు దుర్భేద్యం గా ఉండే వట .నృసింహ ఆ లయం ఉంది  .దీనికి రెండస్తుల ద్వారం మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది .దీనికి తూర్పున రెండు వరుసలు ఉన్న16 స్తంభాల మండపం ఉంది .”దీన్ని ”యోగి వేమన మండపం ”అంటారు .తూర్పున అంబ గుడి ఉంది .పర్వతానికి దక్షిణాన  గంజి కాలువ ,దాని దగ్గర గంగాధర రామేశ్వరాలయం ఉన్నాయి .ఆలయ స్తంభం మీద శ్రీ రంగ రాయల వారి శాసనం ఉందట .కొండ పై రెండు మసీదులున్నాయి .కొండల మధ్య ఉన్న గుహ లో ”కొండ సింగరయ్య ”అనే నరసింహ స్వామి దేవాలయం ఉంది .దీనికి బయట నవులూరి పోత రాజు ,నాగ వర్మ గుళ్ళున్నాయి .పోత రాజు గుడినే శ్రీ నాధుడు ”గృహ రాజు మేడ ”అన్నాడు .
కొండ దిగితే ”కోట” అని పిలువా బడేగ్రామం ఉంది .దీనికి దక్షిణం లో గోపీ నాద స్వామి ఆలయం రమణీయం గా ఉంటుంది .దీని ప్రక్కన వేయి కాళ్ళ మండపం శిధిలా వస్త లో ఉండి పోయింది .ఇప్పుడు అదే మసీదు గా మారింది .దీనికి ఎదురుగా20 గజాల ఎత్తున్న రాతి ధ్వజ స్తంభం ఉంది.సదాశివ రాయల నాటి శాసనాలిక్కడ కనిపిస్తాయి గుడికి దక్షిణం లో శిధిల శివాలయం ఉంది .శివుని కెదురుగా అంద మైన నంది ఉంది .నంది కడుపు లో వరహాలు ఉండేవట .దొంగలు తోక దగ్గర కన్నం చేసి ,దోచేశారట .”లంకెల బావి ”,వసంత ఘర్”అనే రాజ మందిరాలు కూడా శిధిలమై పోయాయి .
పుట్ట కోట సమీపం లో రెడ్డి రాజులు కట్టించిన ”రంగ నాయక ఆలయం ”ఉంది.దీనిలో నాగేంద్రుని విగ్రహం చెక్కు చెదర కుండా ఉంది .దగ్గర్లో మాణిక్యాల రావు కోనేరుంది .అంతఃపుర స్త్రీలు సహగమనం చేయటానికి గుండాలున్నాయి .గృహ రాజు మేడ దిబ్బల దగ్గర ”జడ్డిగల బావి ”ఉంది .ఇది గృహ రాజు మేడ లోని ”శ్రీ ఆది లక్ష్మీ అమ్మవారు ”జలక్రీడలు చేయటానికి ఉప యోగ పడేదట .దీనికి దక్షిణాన పెద్ద చెరువు ఉంది .రెండు పెద్ద తోటలున్దేవి .చెరువు కట్ట మీద వేణు గోపాల స్వామి దేవాలయం ఉంది .కొండల క్రింద ”తిరుమల శ్రీ లక్ష్మీ నరసింహాలయం ”ఉంది .పడమర రామేశ్వరాలయం ,తూ ర్పున గోపాలస్వామి గుడి ఉన్నాయి .పడమర లో ”సీతా పతి ”అనే రాతి మూత గల చెరువు ఉంది .కొండ వీటికి ఉత్తరం గా వీరభాద్రాలయం ,”పోదిలే రహినా సాహేబు దర్గా ”అనే మూడు గోరీ మండపాలున్నాయి .దీనికి ఉత్తరాన ”పతేఖాన్ మసీదు ”,”భోజరా ”అనే అత్తరు సాహేబు మసీదు ఉన్నాయి .సురఖాన మసీదు, నల్ల మసీదు ,గుమ్మల్ మసీదు ,జామ్తానా మసీదు చిన మసీదు ఉన్నాయి .
ప్రస్తుతం ఉన్న కొండ వీడు కి దక్షిణం లో రెండు మైళ్ళ దూరం లో ”శిఖా వస్ ఖాన్ పేట ”అనే గ్రామం ఉంది .అక్కడ శ్రీ వెన్న ముద్దు కృష్ణ స్వామి ఆలయం ఉంది .దీన్ని కొండవీటి రాజులే కట్టించారు .పోలయ వేమ రాజు, చదల వాడ రాఘవాలయం ను ,నాదెండ్ల గోపయ్య రఘునాయక ఆలయాన్ని నిర్మించారు .కొండ వీటి కోట ను 800ఏళ్ళ క్రితం ”విశ్వంభర రాజు ”నిర్మించాడు .కొండపై అరకోట ,పిల్ల కోట ,పెదమూలం కోట ,తట్టు కోట మొదలైన అయిదు కోటలున్దేవట .ఈ కోటల గుండా పైకి వెళ్ళే దారిలో ”ఖిలై  దర్వాజా ” మందిరం ఉంది .కొండ కింద పడమర లో ఒకటిన్నర మైళ్ళ చుట్ట కొలత ఉన్న కోట ,దాని చుట్టూ యాభై గజాలు వెడల్పు ,పది గజాల లోతు ఉన్న అగడ్త ఉంది .ఈ కోటను రాయని భాస్కరుడు కట్టించి గోపీ నాద పురం అనే గ్రామాన్ని, ఆలయాన్ని కట్టించాడు .రాయని భాస్కరుని ప్రస్తుతిస్తూ పద్యం ఒకటి రాతి మీద చెక్క బడి ఉంది .దీన్ని ”కొండ పల్లి గవా”అంటారు .దక్షిణ ద్వారమే ”నాదెండ్ల గవని ”.కొండకు  -ఉత్తరాన కొండల మధ్య ”పుట్ట కోట ”ఉంది .దీన్ని ప్రోలయ వేమా రెడ్డి కట్టించాడు .”కుండిన నగరం ”ఇందు లోనిదే నంటారు .ఇదే శ్రీకృష్ణుని భార్య రుక్మిణి తండ్రి భీష్మకుడు పాలించిన ప్రదేశం అంటారు .పర్వత సోపానాలకు ఉత్త రానతారా బురుజు ల తో అయిదు కోటలున్నాయి .మొత్తం 25బురుజులున్నాయి .ఇంత ప్రశస్తి చెందిన కొండ వీడు లో శిల్ప ,రసవాద ,ఆయుర్వేద ,యోగ ,తాకిల ,రాజ కీయ ,వేదాంతాలను జ్ఞానియై పొంది ,యోగి యై ప్రవర్తించాడు మన వేమన కవీశ్వరుడు .స్థల మహాత్మ్యం అనటానికి ఇంత కంటే మంచి ఉదాహరణ లేదేమో .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ — 4-8-12-కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.