జన వేమన -21 ఆంద్ర మత కర్తలు లేరా ?

  జన వేమన -21
                                                                              ఆంద్ర మత కర్తలు లేరా ?
”ఆంధ్రుల లో మత ప్రచారకు లున్నారు కాని మత కర్తలు లేరు .నాకు ఇయ్య లేదని తిట్టిన వారే కాని నువ్వు చెడి పోతున్నావు అని చెప్పిన వారు లేరు .తనకు తోచిన సత్యాన్ని నిర్భయం గా దేశ మంత తిరిగి మథాలు స్తాపించి ,బోధనచేసినతెలుగు  వారిలో వేమనే మొదటి వాడు .పుస్తకాలలోని విషయాలను చెప్ప కుండా యోగా సాధన తో తత్వాన్ని గ్రహించి ,దాన్ని తాను అనుభవించి ,తన దేశం వారిని తరింప జేయాలన్న ఉదారాశయంతో ఉపన్యాసాలిచ్చాడు .అతని బోధలలో జీవం ఉంది .మత కర్తలు కాని మత ప్రచారకులలో ,మత కర్తలకున్నంత విలువను ,వ్యాప్తిని కొంత వరకు సంపాదించిన ధీరుడు వేమనే .వేమన పద్యాలు చిటికే లో ముగింపగలిగే  చిన్న పలుకులు .అచ్చ తెనుగు పద్యం నడక ,గుండు దెబ్బ లాగా గురి తప్పని చి క్కని చెక్కిన మాటలు ఆయనవి .వేమన ను పరిచయం చేసిన బ్రౌన్ వేమన ను కవి అనక పోవటం ఆశ్చర్యం .”వ్రాలకందని పద్యాలు వేలుగా చెప్పాడు ”ఆటవేలదే కాక ,”భువి రాజ తారకంబులు -ప్రవిమల తార హంస యోగభావంబులకున్ -వివరంబులు గావించెద ”వంటి కంద పద్యాలూ చెప్పాడు .కొన్ని పాటలూ చెప్పాడు .”శ్రీ కరుడగు వేమన చెప్పి నట్టి ”వంటి తేట గీతులు చెప్పాడు .”వేమన వాక్యాలు ”అనే పేర పద్యాల వంటి వచనాలు కూడా ఉన్నాయి .వీటికి చివర ”విశ్వదాభి రామ ”మకుటం ఉంది .అవి యోగా ,సాంఖ్య తత్వాలు అని రాళ్ళ పల్లి వారన్నారు .అంటే వేమన ఛందో వైవిధ్యం పాటించాడని తెలుస్తోంది .మచ్చుకు ఒక వేమన వాక్యం చూద్దాం –”పూర్ణ సమాధి లో రేచించి ,పూరించి ,కుమ్భించి ,పెద్ద గాలి వలె ,బరగు చుండు -యేడు కోట్ల వెర్రి నాదంబులు గాన బడును .మేను చల్లని గాలి వలె విసరును .గాలి లోపల నుండును .గాంధర్వ గానంబు గాన బడువిను బాట లో నుండు ఎంతైన నడు వీధి నాడు చుండు ”అలాగే ”ఆది మూల మందు ”అంబికా శివ యోగి మూల గురుడు మాకు ముక్తి జూపె ”అనీ ఉంది లంబికా అనటానికి బదులు అంబికా అని పొరబడి ఉండవచ్చు .
    మహ్మ దీయుల పై వేమన అభిప్రాయం 
మహమ్మదీయులు పాలించిన రోజుల్లో హిందువులు అనుభవించిన కష్టాలను స్వయం గా చూశాడు వేమన .దాని పై స్పందించాడు ”.పసరపు మాంసము బెట్టియు ,-మసలక సుల్తాను ముసలి మానుల జేసెన్ –”అని మత మార్పిడులను నిరషించాడు .”లింగ మతము లోన దొంగలుగా బుట్టి -ఒకరి నొకరు నింద నొరగ జేసి -తురక జాతి చేత దూలి యై పోదురు ”అని మన మతం లోనే దొంగలు ఉండి  ,ఒకరి నొకరు నిందించు కుంటూ ఉంటె చివరికి తురక జాతి అందర్ని కబళించి  మట్టి పాలు చేస్తుందని హెచ్చ రించాడు .”షేకు నాయుడు మొగలు ,చెంగు పతానులు -తురకల దొర తనము తొలుత జేసి –రాగ రాగ విడిచి ,రైతులై కొలిచిరి ”అని మహ్మదీయుల క్రమ పతనాన్ని వివరించాడు .మనకున్న మూఢ విశ్వాసాలు వాళ్ళకు కూడా ఉన్నాయని ,ఎద్దేవా చేస్తూ ”మక్కాకు జన నేల ,మగుడ ,దా,రానేల -ఏక మైన చిత్త మెందు కలదు -అన్నిటా పరి పూర్ణ మల్లా మహమ్మదు ”అని వాళ్ళకూ బోధింఅని వెంపర్లాడ వద్దు అనిచాడు .అసలు విషయం ఏమిటి అంటే -ఎక్కడో ఏదో ఉంది .
             
 శివ యోగి తత్త్వం ఏమిటి ?
శ్రీ శంకరాద్వైతానికీ ,శ్రీ వైష్ణవాద్వైతానికి మధ్య లో ఉన్న వారిని వీర శైవులు అంటారు . శివ తత్త్వం లో శక్తి ,లింగం అని ,అంగం అని రెండున్నాయి .లింగాన్ని పూజిస్తారు .ఆది రుద్ర రూపం .అంగం జీవాత్మ యేకాక శక్తి కూడా .కళఅని భక్తీ అని రెండు రకాలు .శివుని లో కళ ఉంటుంది .అదే సంసారానికి ,సృష్టికి కారణం .భక్తీ జీవుని లో ఉంది ముక్తికి కారణమవుతుంది .భక్తీ నిరంతరం గా ఉంటే ,జీవుడికి శివుడి తో ఆనందం తో కూ డిన ఐక్యం లభిస్తుంది .-ఇదే ముక్తి .దీనికి యోగ సాధన కావాలి .ఈ రక మైన అద్వైతాన్ని అభ్యాసం చేసే వారంతా శివ యోగులు .దీనిని అవలంబించే వారంతా బ్రాహ్మణులు కాని వారే .వీరి లో కొందరు గృహస్తులు ,కొందరు మథనివాసులు ,ఎక్కువ మంది బ్రహ్మ చారులు .వీరందరూ స్వర్ణ కార విద్య లో నేర్పరులే .అందుకే వేమన కూడా ”ఇహ లోకమున సుఖియింప హేమ తారక విద్య –పరమున సుఖియింప బ్రహ్మ విద్య –కడమ విద్య లెల్ల మూధుల విద్య ”అని తేల్చి చెప్పాడు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-9-12-కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.