జన వేమన –25
వేమన ది మాన వీకరణ మార్గం –ఈశ్వర తోపా
డాక్టర్ ఈశ్వర్ తోపా గారు ఆంగ్లం లో ”సెయింట్ వేమన అండ్ హిస్ ఫిలాసఫీ ”అనే గ్రంధాన్ని రచించారు .దానిని డాక్టర్ దివా కార్ల వెంకటావ ధాని గారు సరళం గా తెలుగు చేశారు .దీని లో తోపా గారు ప్రవహింప జేసిన భావ ధార ను పరి శీలిద్దాం .
సంఘం లో మానవుడు ఇంకా సంస్కారి కాలేదు .మాన వత్వ విషయం లో చాలా వరకు మానవుడు వెనక బడే ఉన్నా డింకా .అతనికి మార్గ దర్శ కాలై ,అభ్యుదయానికి ఉప యోగ పడే సహజ సరళ మార్గాన్ని వేమన చెప్పాడు .ఉన్నత వర్గా లలో సంస్కృతి మృగ్యం గా ఉందని వేమన గ్రహించాడు .మానవ జీవితం జీవ శాస్త్ర సిద్దాంతా లకు అనుగుణం గా వర్తిస్తుంది .అందుకే వేమన ”దేహము బడలిక బడి నను –పోషణ తత్వములు పొందవు ”అన్నాడు .వ్యాకులత ఉంటె ,భావ చాంచల్యం కలుగుతుంది .మనసు మాత్రమె ఆలోచన లను సంబద్ధం గగా ,అర్ధ వంతం చేస్తుంది .బ్రతికి నప్పుడే ,ఆలోచనలు మనిషికి తోడ్పడాలని వేమన భావం .”తనువు తీరే నేని ,తలపు తోడనే తీరు ”అని హెచ్చ రించాడు .ఆత్మ ను సంస్క రించు కోవాలి .ఆ సంస్కారమే మనిషికి పశువు కు తేడా ను తెలుపు తుంది .మనిషి గా తన పని చేసుకొంటూ ,ఆత్మ విజ్ఞానం తో బుద్ధి గా జీవించాలి .తన హద్దులు తెలిస్తే గర్వం రాదు .అందుకే ”జనన మరణములకు సరి స్వతంత్రుడు కాదు -మొదల కర్త గాదు తుదను గాదు –నడుమ కర్త ననుట నగు బాటు కాదొకో ”అని జన్మ రహస్యాన్ని తెలియ జేశాడు .ఈ జీవిత సత్యం తెలుసు కో కుండా ,దానిలో మునిగి పోవటం మూధత్వం .మన చుట్టూ మంచి ,చెడు రెండూ ఉన్నాయి .వివేకం తో సంచ రించాలి .ప్రలోభ పడ రాదు .అంతటి సంస్కారం లేక పోతే జీవితం అర్ధం కాదు .జీవితం లోని రహస్యాలను అర్ధం చేసుకో వాలి .హీన మైన సంస్కృతి నుంచి ఉత్తమ సంస్కృతికి మానవుడు చేరాలి .మనుష్యుల పరిస్తితి ”కలి యుగాన లేడు ,కదలిమ్పడా నోరు –వినియు ,వినగా లేడు విస్మయమున -సంపద గల వాడు సన్నీ పాతక మిది ”అని మానవ స్వభావం చెప్పాడు .జీవితం తమ నుండి ఏమి కోరుతోంది అని మనిషి తెలుసుకోలేక పోతున్నాడు .మానవ ప్రకృతి అవగాహనను మొదటగా నేర్వాలి .అప్పుడే అతనికి అన్నీ దక్కు తాయి .”వ్రాత వెంట గాని వర మీదు దైవంబు –సేత కొలది గా వ్రాత గాదు –వ్రాత కజుడు కర్త ,సే తకు దా కర్త ”అని మనిషి చేసే పని మీదే అంతా ఆధార పడి ఉంటుందని తేల్చి చెప్పాడు .
భోగ పరాయణత్వం జీవితాన్ని దెబ్బ తీస్తుంది .మనశ్శాంతి ఉండదు .కృతజ్ఞత రాదు .”పర సుఖంబు నొంది ,బ్రతు కంగా నేరడు –”అన్నాడు అందుకే .”నేర నన్న వాడు నేర జాణ మహి లోన -నేర్తు నన్న వాడు వార్త కాడు –ఊరకున్న వాడే ఉత్తమోత్తము డెందు ”అందుకే మనిషి ముందుగా తనను తాను తెలుసు కోవాలి .తనకు చెప్ప గల వారెవరు ?”తను దా తెలియక ఉండిన –తన కేవరున్దెలుప లేరు తధ్యము వేమా ”అన్నాడు .సంస్కారం కావా లంటే సత్య సంద్హత కావాలి .లోకం లో అసత్యం ఆధి పత్యం వహించటం వాళ్ళ అంత రాత్మ నిర్జీవమై ,సత్య భాషి ద్వేషానికి గురి అవుతున్నాడు .నిజాన్ని నీచుని తో చెప్ప రాదు .”నిజ మహాత్ము గూడి నిజ మాడ వలె నురా ”అని మంచి నిజాన్ని బోధించాడు .వేమన చెప్పే సంస్కృతీకరణ చేస్తే ,”మనుష్యుడిల మహాను భావుడే ”అవుతాడు .”జాతి వేరు లేక జన్మ క్రమంబున -నెమ్మదిన భవుని నిల్పె నేని –యఖిల జనుల కెల్ల నాతడే ఘనుడయా ”
మనిషిని అర్ధం చేసికోవటం ,స్నేహం చేయటం వల్ల బంధం గాధం అవుతుంది .మత సిద్ధాంతాలు మాన వత్వం తో నిండి ఉండాలి .అప్పుడే సామరస్యం వస్తుంది .మనిషిని మతం సృష్టి కర్త కు దగ్గర చేర్చేదే కాక మానవుల్ని ఐక్యం చేసేది గా ఉండాలి .సత్యమైన మతం దీన్నే బోధిస్తుంది .మానవత కోసం మతం అవసరం .అందుకే వేమన ”ఎల్లి ,రేపు నేడదేలాగు నైనను -మనసు నిలుపు వాడు మంచి వాడు ”అన్నాడు .ఇంద్రియాలను వశం చేసుకోవాలి .లేక పోతే సంస్కారం రాదు .”కడుపు చిచ్చు చేత కామానలము చేత –క్రోధ వహ్ని చేత ,కుటిల పడక –నొక్క మనసు తోడ నుండి నప్పుడే ముక్తి ”అని చెప్పాడు .ఇంద్రియాలను జయిన్చుకోవాలి అందుకే ”మచ్చరమున తనను జెరచు మహిలో వేమా ”అని హెచ్చరిక .సంపూర్ణ మాన వుడి ని ఆవిష్కరించాలి అని వేమన తీవ్రం గా భావించాడు .సమగ్ర మాన వత్వం రావా లంటే తనకు ,ప్రపంచానికి మధ్య ఉన్న క్లిష్ట బంధాన్ని తప్పించుకొనే సామాన్యుడు పొందే సమగ్ర రూపమే సంపూర్ణ మాన వుడు .అంటే -ప్రపంచానుభవం ఉన్న ఉదాత్త మానవుడే అని అర్ధం .”పగలు రేయి మరచి భావంబును మరచి –తాను ,నేన యన్న తప్పు మరచి -యుండు వాని నెంచు నుత్తమ యోగిగా ”అని నిర్వచనం చెప్పాడు .మానవ బుద్ధి సంపదకు వేమన సజీవ ఆదర్శం .”మనిషి లోని వాని మానుగా దెలిసిన –నుర్వి జనులు వాని యోగి యండ్రు -నీవు నిన్నేరుంగనీవే పో శివుడవు ”.అదేఎ వేమన ఆదర్శం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –12-9-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,107,557 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

