బాలి లో భగ వంతుడు
ఇండో నేశియా లోని బాలి లో హిందూ మతం విస్తృతం గా వర్ధిల్లింది .వర్ధిల్లు తోంది .అక్కడ వినాయకుడి విరిగిన దంతం విషయం లో ఒక చర్య చేబడతారట
.ఇది మన దేశం లోని కధకు ఆధారం.చిన్న పిల్లలకు పై దవడ లోని ఆరు ముందు పండ్లను మత పెద్ద, సాన పెడతాడట .ఈ ఆరు కామ ,క్రోధ ,లోభ ,మద ,ఈర్ష్య ,మోహ గుణాలకు ప్రతీకలు గా భావిస్తారట .వారి దేశం లో చెడ్డ దెయ్యం అనేది లేదు .వాటిని సౌమ్య జీవులుగా భావిస్తారట .వాటికి కావలసినవి నైవేద్యం పెట్టి ,దాన్ని దైవం గా మార్చటానికి ప్రయత్నిస్తారట .చెడును చంపటం వాళ్లకు ఇష్టం లేని పని .వాటిని మార్చటమే వారి ధ్యేయం .వాళ్ళ దృష్టిలో శివుడు అంటే సంహారకుడు కాదు .శివుడు మార్పు తెచ్చే వాడు కాని నాశన కారుడు కాదు .దేవుడు సృష్టించినది ఏదైనా చెడు అని అంటే ,లేక దేవుడికి ఇష్టం లేదని అంటే దేవుడే చెడ్డ వాడు అనే అభి ప్రాయం కల్గుతుందట .అదీ దేవుడే సృష్టించాడు కనుక చెడ్డది అంటూ లేనే లేదు .భాగ వంతుడు సృష్టించిన దానిలో చెడు ఉండదు .అంతా పవిత్రమైనదే అని వారి అభిప్రాయం .ఇండో నేశియా అంటే ముస్లిం దేశం కాని అక్కడ ఆ భేదం ఎక్కడా కానీ పించాడు .బాలి లో దేవాలయాలను ,ఇళ్లను నిర్మించే టప్పుడు ”భూమి పూజ ”చేస్తారు .దీనికొక అర్ధం వారు చెబుతున్నారు .అదేమిటంటే ”బాలి లో ఉన్న హిందువు లైన మేము ఇక్కడి భూమి పుత్రులమే ఎక్కడి నుండో ఇతర మైన చోట్ల నుంచి వచ్చిన వారం కాము అని తెలియ జేయటానికే ”అని చెబుతారు .
బాలి లో హిందూ మతం క్రీ.శ .500 లో ప్రవేశించిందని తెలుస్తోంది .మార్కండేయ మహర్షి ఇక్కడ హిందూ మతాన్ని స్థాపించాడని వారి విశ్వాసం .
1500లో మహర్షి ద్విజేంద్ర బాలి కి వచ్చారట .నాలుగవ శతాబ్దం లో మొదటి హిందూ సామ్రాజ్యాన్ని ,కుల వర్మన్ స్తాపించాడని చరిత్ర చెబు తోంది .ఇక్కడికి వచ్చిన హిందువులు అందరు దాదాపు దక్షిణ భారత దేశం నుంచి ఒరిస్సా రాష్ట్రం నుండే వచ్చారట .ఇక్కడ శైవ ,శాక్తేయ ,తంత్ర ,పురాణ ,వైష్ణవ బుద్ధ ఆరాధనలు కన్పిస్తాయి .ఇవన్నీ కలిసి పోయి ఇప్పుడు శైవ సిద్దాన్తమొక్కటే కానీ పిస్తోంది .అందుకే ఇండో నేషియా ను ”శైవ సిద్ధాంత ఇండో నేషియా ”అంటారు
.కనుక బాలినీయుల హిందూ మతం అంటే శైవ సిద్ధాంతమే .ఇక్కడ ద్వైత ,అద్వైత సాంప్రదాయాలు రెండు ఉన్నాయి .మజీవుడికి దేవుడికి భేదం ఉంది అంటే ద్వైతులు నమ్ముతారు .జీవుడే దేవుడు అంటే అద్వైతులు ఆనందిస్తారు .ఈ రెండూ కూడా బాల్నీస్ ను బాల మైన హిందువులు గానే చేసింది కాని భేద భావాన్ని కల్గించక పోవటం ఇక్కడి గొప్ప విషయం .
బాలినీయులు ఒంటరిగా ఎక్కడికీ వెళ్లారు .కుతుమ్బాలతోనే కలిసి వెళ్తారు .అందరు కలిసి దేవాలయానికి వెడితే దేవుడు సంతోషిస్తాడనే నమ్మకం వారిది .వారు అతిధులకు నమస్కారం చేసి ”ఓం స్వస్తి రస్తు ”అని పలకరించటం సంప్రదాయం ”.
భగవదాశీర్వాదం మీ పైన వర్షించు గాక ”అని అందులోని అర్ధం .బాలి లో 600మంది పూజారులున్నారు .అందరు బ్రాహ్మణులే .ఇక్కడ ”అబ్రాహ్మణుడు ”అనే మాట విని పించదు
.ఆది నేరం .పూజారులు అన్ని కులాల కు సంబంధించిన వారూ ఉన్నారు .గురు శిష్య సంప్రదాయం లో వారికి శిక్షణ నిస్తారు .ఆడ వారు కూడా పూజార్లు గా ఉండటానికి అర్హత ఉంది .సాధారణం గా భార్యా భర్తా కలిసి కార్య క్రమాలను నిర్వ హిస్తారు .అలా చేస్తే ఫలితం ఎక్కువని వీరి నమ్మకం .ఇక్కడి దేవుళ్ళు ముఖ్యం గా ముగ్గురు .వారే మన త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివుడు .బాలి లో తమ పూర్వీకులు అందించిన సంస్కారాల వల్ల తర తరాలుగా ప్రశాంతం గా జీవిస్తున్నామని చెబుతారు .వాటి వల్లే తాము శక్తి వంతం గా బలీయం గా ఉన్నామని అంటారు .అక్కడ విగ్రహారాధన ఉండదు .ఎత్తైన వేదికల మీద దేవుళ్ళను ఆహ్వానించి వారికి పూజ చేస్తారు .ఈ విధానం అంతా పూజారే నిర్వ హిస్తాడు .అతనికి సహాయ కులుంటారు .బాలి లో గ్రామాన్ని ”దేశం ”అంటారు
.దేశం లో అంటే గ్రామం లో బ్రహ్మ గుడి ఊరికి మధ్యన ,విష్ణు గుడి పొలాల దగ్గర ,శివాలయాన్ని శ్మశానం దగ్గర నిర్మిస్తారు .గ్రామం లోని భూమి అంతా అందరిదీ .అందరు వచ్చి దేవాలయాలలో పూజ చేయాలి .గ్రామ నిబంధనలను పాటించక పోతే గ్రామం వదిలి వెళ్లి పోవచ్చు .హిందూ మతం లో నుంచి ఇంకో దాని లోకి మారినా గ్రామం వదిలి వెళ్లి పోవాల్సిందే .అంతా కర్మ ఫలం అని నమ్ముతారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19-9-12-కాంప్-అమెరికా


బాలి సంస్కృతి గురించి క్లుప్తంగా చాలా బాగా చెప్పారు. థాంక్స్.
LikeLike