బాలి లో జోరుగా వీస్తున్న హిందూ గాలి
అనేక శతాబ్దాలుగా బాలి లో హిందూ సంస్కృతి నిలిచి ఉండటానికి కారణం తమ సహన శీలతా ,చిరు నవ్వే నని వారు చెబుతారు .”నవ్వు అనే సంస్కృతి నర నరానా జీర్నిన్చుకొన్న వాళ్ళం మేము” అని గర్వం గా ప్రకటిస్తున్నారు .2002,2005లలో టెర్ర రిష్టులురెండు సార్లు విరుచుకు పడినా నవ్వు తోనే వారిని ఎదుర్కొన్నామని చెబుతున్నారు .మౌనం ,ప్రార్ధన లతో వారికి సమాధానం చెప్పారట .ప్రతి రోజు దేశాన్ని కాపాడమని సామూహిక ప్రార్ధనలు చేశారట .ఒక్క హిందువు ల కోసమే కాదు మొత్తం ఇండో నేషియాకోసం ప్రార్ధనలు చేశారు వారు .ప్రతి రోజు ప్రత్యెక ఉత్సవాలు నిర్వ హించారట .అందరి సంక్షేమం కోసమే ప్రార్దిన్చామని వారు చెప్పారు .”ఆ దేవ దేవుని నుండి మాకు ఆశీర్వాదం, శక్తి లభిస్తాయి ”అని నమ్మకం గా చెప్పారు .
భారత దేశం తో సాంస్కృతిక సంబంధాలను నేల కొల్ప టానికి డాక్టర్ కరణ సింగ్ నాయకత్వం లో” Indian council for cultural relations ”బాలి లో
అనే ప్రభుత్వ సంస్థ బాలి లో ఒక విభాగాన్ని ఏర్పరచింది .సాధారణం గా ఇలాంటివి దేశానికి ఒకటి మాత్రమె ఉంటాయట .కాని ఇండొనీషియా లో రెండు కేంద్రాలను ఎర్పరచారట .ఒకటి జకార్తా లో ,రెండోది బాలి లో .దీని ఆధ్వర్యం లో అన్ని పండుగలు నిర్వ హిస్తారు .యోగా తరగతులు నిర్వ హిస్తారు .భరత నాట్యంనేర్పిస్తారు మౌలనా అబ్దుల్ కలాం దీని వ్యస్థాపకుడు
.హిందీ నేర్పుతారు .ఇక్కడి విద్యార్ధులకు సంవత్స రానికి 30 స్కాలర్షిప్పులను ఇండియా లో చదువు కోవటానికి ఇస్తారు .అక్కడి వారు గణేష్ చతుర్ధి ని వైభవం గా నిర్వ హిస్తారు .Neiypi ,అనే పండుగను ,ప్రతి రెండు వందల పది రోజులకో సారి వచ్చే ”galungaan ” పండుగను చేస్తారు
.ఇది పది రోజుల పండుగ .ఆ పది రోజుల్లో దేవత లంతా భూమి మీదకు దిగి వస్తారని వీరి నమ్మకం .యజ్న కర్మలను నిర్వ హిస్తారు .1960కి ముందు హిందువులు చాలా మంది క్రిస్టియన్లు గా మారారట.కాని ఆ తర్వాత మళ్ళీ కొన్నేళ్ళకు అందరు హిందువులుగా మారిపో యారట .
ఇక్కడ” world Huindu Youth organization ”HSC ను ఏర్పాటు చేసుకొన్నారు .బాలి లో హిందువు లందరూ ఒకే కుటుంబం లాగా కలిసి ఉంటారు .సంస్కృతే వారిని ఒకే కుటుంబం లా కలిపి ఉంచు తోంది .ఇక్కడ రక్షణ కోసం పోలీసు వ్యవస్థ లేదు
.ప్రతి గ్రామం లో ప్రతి మూలా పౌరులే రక్షణ వ్యవస్థ ను నిర్వ హించటం ఇక్కడి ప్రత్యేకత .వీరిని ”పాచాలకులు ”అంటారు .అలాగే ఇక్కడ వివాహం జరిగితే తలిదండ్రులకు బాధ్యత తక్కువ .సమాజమే ఆ బాధ్యత నిర్వ హిస్తుంది .ఎవరిని పెళ్ళికి పిలవాలో అక్కర్లేదో యజమానికేమీ సంబంధం లేదు .పెళ్లి రోజు ను చెప్పటమే తలిదండ్రుల బాధ్యత .ఇక్కడి గ్రామ పెద్ద ”బంజార్ ”యే అందర్నీ ఆహ్వానిస్తాడు .ఆయనే పెళ్లి పెద్ద .అన్నీ గ్రామమే ఏర్పాటు చేస్తుంది .అలాగే ఇంట్లో ఎవరైనా చని పోయినా అంతే .గ్రామానిదే అంతా బాధ్యత .చావు యే ఒక్కడి విచారము కాదు .అందరిదీ .పెళ్లి ఎలాగో ఇదీ అంతే .ఇదీ ఇక్కడి సమాజ బాధ్యత .బాలినీయులు తాము తమ కుటుంబం తమ సమాజం ,తమ దేశం కోసం ప్రార్ధనలు చేస్తారు .అందరు కలిసి సామూహికం ప్రార్ధించటం ఇక్కడి గొప్పతనం ,ప్రత్యేకతా .ఇదే సమాజాన్ని కలిపి ఉంచు తుంది .సమైక్య భావన, సోదర భావన యేర్పడ టానికిదే తోడ్పడు తుందని వారి నమ్మకం .
హిందువులు ఇతర మతాల్లోకి మారి పోకుండా ఉండ టానికి బాలి లో ”institute of Hindu dharma ”ను ఏర్పాటు చేసుకొన్నారు .స్వామి వివేకా నంద ,సత్య సాయి బాబా ల ప్రభావం ఇక్కడ బాగా పని చేసింది హిందూ అనాధ పిల్లలకు రక్షణ కల్పిస్తున్నారు .ఎనిమిది అనాధ ఆశ్రమాలను ఏర్పరచి సేవ లందిస్తున్నారు .అందరికి శాకా హార భోజనమే .బాలి ఇండియన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ దీన్ని పర్య వేక్షిస్తుంది .భారతీయ సంప్రదాయాలను ఇక్కడ ఇంకా పటిష్టం గా అనుసరిస్తున్నారు .ఎడమ చేతి తో ఏదైనా ఇవ్వటం కాని చూపుడు వ్రేలితో ఎవరి నైనా చూపించటం కానిచేయరు .అలా చేస్తే అపవిత్రం గా భావిస్తారు .వారి భావన ప్రకారం భారత దేశం లోని హిందువులు కలుషితం అయారు .కాని ఇక్కడి హిందువులు చాలా స్వచ్చం గా ఉన్నారు అంటారు. వారి ఉన్నత సంస్కారం మనందరికి ఆదర్శనీయం అని బాలి ని సందర్శించిన హిందువులు చెబుతున్నారు .
బాలి కమ్యునిస్టు వ్యతి రేక భావనలున్న ప్రదేశం .1960లో ఇక్కడి ప్రభుత్వం మత విధానాలకు ఒక మంత్రిత్వ శాఖ ను ఏర్పరచింది కాని అందులో” ఆగమ తీర్ధం ” అనే దానికి మాత్రం గుర్తింపు నివ్వ లేదని బాలీ హిందువులు బాధ పడతారు .ఇక్కడి ముస్లిములు హిందూ పేర్లను పెట్టు కొంటారు .ఇక్కడి శూద్రులు అంటే ఇండియా లో లాగా తేలిక భావం లేదు .గర్వం గా భావిస్తారు .రామాయణ మహా భారతాలు వారి జీవన సంస్కృతి లో భాగమై పోయాయి .వీటికి సంబంధించిన నాటకాలలో ముస్లిములు ఆ పౌరాణిక పాత్రలను ధరించి రంజింప జేస్తారు .అక్కడి ఒక హిందూ పెద్ద చెప్పిన విషయం గుర్తుంచు కో తగినది ”అయిదు వందల ఏళ్ల క్రితం హిందువులు బాలి లోకి ప్రవేశించారు .వారి మతాన్ని కాపాడు కోవటం కోసం” పంది మాంసాన్ని” తిన్నారు .అలా చేయటం వాళ్ళ ముస్లిములు తమను మతం మార్చుకోమని బల వంతం చేయరు అని భావించారు .ఆ ”స్ట్రే ట జి” ఫలించింది .కనుక మతాంతీకరణ చాలా అరుదు గా జరిగి వీరంతా హిందువులు గా నె ఉండి పోయారు .
ఇక్కడి పూజారులు త్రీ సంధ్య లలో పూజ చేస్తారు ఆరు శ్లోకాలను చదివి పూజ నిర్వ హిస్తారు .మొదటి శ్లోకం లో భూమి ఆకాశం ,స్వర్గాలను దేవతలు అని సూర్యుడు దేవుని ప్రతి నిది అని తమ లోని ఉన్నత భావాలకు ఆ కాంతి కారణం అనీ అర్ధం వచ్చే శ్లోకంచదువుతారు . .రెండోది నారాయణునికి చెందింది .నిర్గుణ నిరాకార స్వయంభు గా ఏక నిరంజన్ గా ఆయన్ను స్తుతించే శ్లోకం .మూడవది శివుడికి చెందినది .ఆయనే మహాదేవుడు , ఈశ్వరుడు , బ్రహ్మ,విష్ణు ,రుద్రా ,పురుష , అని భావిస్తారు .అన్నిటికీ ఆయనే మూలం .సర్వ శక్తి మంతుడు .నాల్గవ శ్లోకం లో తామంతా పాపాత్ములమని తమ పాపాలను పోగొట్టమని దుఖం పోగొట్టి ,శారీరక మానసిక బౌద్ధిక శాంతిని కల్గించమని ప్రార్ధిస్తారు .అయిదవ దానిలో మహా దేవుడిని ముక్తిని ఇవ్వమని కోరుతారు .మార్గ దర్శి యై మంచి మార్గం లో ప్రయానిన్చేట్లు చేయమని ప్రార్ధిస్తారు .ఆరవ శ్లోకం లో చేసిన తప్పులు పాపాలు క్షమించి శాంతి సుఖాలను త్రీ శాంతులను ఇవ్వ మని ప్రార్ధిస్తారు .వీటి వల్లనే ఇక్కడి హిందూ ధర్మం సజీవం గా శతాబ్దాల పాటు ఉంది అని బాలినీయుల భావన . ఇక్కడ ”మహర్షి మార్కండేయ యోగా సిటి ప్రాజెక్ట్ ”యోగా శిక్షణ నిచ్చే అతి పెద్ద కేంద్రం .దీనిలో యోగా ,ఆయుర్వేదం ,ధ్యానాలను నేర్పుతారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20-9-12-కాంప్–అమెరికా
Gabbita Durga Prasad

