శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –5

 శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –5
10— ” సుధా సారా సారై ,శ్చరణ ,యుగాళాన్తరవి గలిథైహ్ ప్రపంచం ,సిన్చంతే ,పునరపి ,రసామ్నాయ మహాసా –
అవాప్సత్వాం భూమిం ,భుజగ నిభ మధ్యష్ట వలయం -స్వమాత్మానాం కృత్వా స్వపిషి ,కుల కుండే ,కుహరిణి ”
తాత్పర్యం –కుమారీ !నీ రెండు పాదాల మధ్య నుండి స్రవించే అమృత ధారా వర్షం చేత ,72000నాడులను తడు పుతూ ,దాన్ని అమృత కిరాణ కాంతి గల చంద్రుని వది లేసి ,మళ్ళీ మూలాధారానికి చేరి ,అందులో స్వ స్వ రూపం అయిన పాముల చుట్టలు గా చుట్టూ కోని ,పృధ్వీ తత్వం లోని సన్నని రంధ్రం ద్వారా ,కుండలినీ శక్తి వై, నువ్వు నిద్రిస్తావు .
విశేషం –శిరస్సు లో చంద్ర మండలం ఉంటుంది .ఇది పదహారు కళల తో ఉంటుంది .పైన కానీ పించే చంద్ర మండలం కూడా శ్రీ చక్రమే .పద్మాసనం పై కూర్చుని ,సాధకుడు శ్వాసను ఊర్ధ్వ ముఖం గా నాడు పుతూ ,కుంభకం లో మనసు ను నిలపాలి .లోపల వాయువును నిలపదాన్నే కుంభకం అంటారు .దీని వాళ్ళ స్వాధీ శతానం లోని అగ్ని జ్వలిస్తుంది .దాని వేడికి ”ఆహిరాట్ ”అనే కుండలినీ శక్తి మేల్కొంటుంది .ఆ శక్తి స్వాధిష్ఠాన ,మణి పూరకళ మధ్య గల రుద్రా గ్రంధిని చేదించి ,మణి పూరక ,అనాహతాల మధ్య ఉన్న విష్ణు గ్రంధిని భేదించి ,అనాహత ,విశుదదాల మధ్య గల బ్రహ్మ గ్రంధిని , ఆరు మలాలను అనాగా ఆజ్ఞా చక్రాన్తాన్ని చేదిస్తుంది .ఆ తర్వాతా కుండలిని ,సహస్రారం చేరి శివుని తో కలిసి ,సంతోషాన్ని పొందు త్హుంది .ఈ స్తితి లో నిశక్తే పరాశక్తి .ఆమె నిత్య సుఖ ప్రదాయిని .
శివ ,బ్రహ్మ శక్తులే అమ్మ వారి చరణాలు .ప్రకాశ విమర్శలు  .ప్రకాశ శక్తి బ్రహ్మం ,శుక్ల వర్ణం గా ఉంటుంది .విమర్శ- మూల శక్తి .రక్త వర్ణం లో ఉంటుంది .శక్తి తో కూడిన శివుడే ”పరా పాదుక ”గా భావింప బడుతాడు .
పాదుకాంత దీక్ష -విమర్శ రూప శక్తి ,ప్రకాశ శివ సంగతి కలిసి సహస్రారం లో చేసేదే ఆనందామ్రుతాభి షేకం .పాదుకా మహా మంత్రాన్ని ఉప దేశం గా స్వీక రించటం ,సర్వ ఔషధాలున్న కాషాయ స్నానం చేయటం ,మాత్రమె పాదుకాంత దీక్ష కాదు .ఈ విధం గా సుధా సారాభి షెకాన్ని పొందిన వాడే పాదు కాంత దీక్షా ను భవం గల నిర్వాణ యోగ్యుడు అవుతాడు .అని దీని పై లోతులు తరచిన వారు తెలియ జేస్తున్నారు .కుండలిని 3,1/2మూడున్నర చుట్టలు గా ఉంటుంది .
11—”చతుర్భిహ్ ,శ్రీ కన్థైహ్ శివ యువథిభిహ్ ,పంచభి రాపి –ప్రభిన్నాభిహ్ ,శంభోర్నవ భి రపి ,,మూల ప్రక్రుతిభిహ్
త్రయశ్చత్వా రిమ్ష ,ద్వసు దళ ,కళా శ్రీ ,త్రివలయ –త్రిరెకాభిహ్ ,సార్ధం ,తవ ,శరణు కోణః పరి ణతః ”
తాత్పర్యం –చాముండీ !నీ నిలయం అయిన శ్రీ చక్రం లో నాలుగు శివ కోణాలు ,అయిదు శక్తి కోణాలు కలిసి తొమ్మిది మూల ప్రకృతుల చేత ,అష్ట దళ ,షోడశ కళ ,త్రివలయ ,భూ, పురత్రయాదు ల చేత 44 అంచులు గా మారింది .అయిదు శక్తి చక్రాలు -త్రికోణ ,అష్ట దళ ,దశ కోణ ద్వయ ,చతుర్దశ కోణాలు అన్న మాట .నాలుగు శివ చక్రాలు –బిందు ,అష్ట దళ ,షోడశ దళ ,చతురస్రాలు .
విశేషం –శ్రీ చక్రానికి మూల కారణాలైన తొమ్మిది చక్రాలు ప్రపంచ నిర్మాణ కారణాలైన తొమ్మిది దాతువులే .చర్మ ,రక్త ,మాంస ,మేధ ,ఆస్తులు ఈ అయిదు శక్తి సంభూతాలు .మజ్జ ,శుక్ల ప్రాణ ,జీవాలు నాలుగు శివ సంజాతాలు .అలాగే పంచ భూత ,పంచ తన్మాత్ర ,పంచ జ్ఞానేంద్రియాలు ,పంచ కర్మేంద్రియాలు మనశ్శక్తి సంబంధాలు .మాయ శుద్ధ ,విద్య ,మహేశ్వర సదాశివ లు శివ శక్తికి సంబంధించినవి .ఇలా25 తత్వాలు కలిసిన 9 కొణాలే బ్రహ్మాండ ,పిండాండ నిర్మాణానికి ఆధారం అని విజ్ఞులు చెబుతున్నారు .
అహంకారం మనసులో ,ఖ్యాతి విద్య లో ,గుణాలు ప్రకృతి లో ,ప్రకృతి శక్తి లో అంతర్భావాలు .పురుషుడు మహేశ్వరుని లో ,”కళకు శుద్ధ లో ”అంతర్భావం .కాలానికి మహేశ్వరుని లో ,సదాశివుని లో శక్తికి శుద్ధ విద్య లో అంతర్భావం .శివ తత్త్వం సదా శివ తత్త్వం లో అంతర్భావం .
అయిదు భూతాలు ,అయిదు తన్మాత్రలు ,అయుదు జ్ఞానేంద్రియాలు ,అయిదు కర్మేంద్రియాలు  ,మనసు ,మాయ ,శుద్ధ విద్య ,మహేశ్వర ,సదాశివ లతో కూడిన25 తత్వా లవల్ల ఆత్మ ఏర్పడు తుందని వేదోపనిషత్తులు తెలియ జేస్తున్నాయి .”పంచ వింశ ఆత్మా భవతి ”అని చాందోగ్య ఉపనిషత్ అంటోంది .వీటన్నిటికీ అతీత మైంది శివ శక్తి సంపుటం అయిన శ్రీ చక్రం ,దీని వల్ల నే జగత్తు ఉత్పత్తి అవుతోంది .పరమేశ్వరుడు శక్తి తో కలిసి నపుడే కార్య కారణ సమర్ధుడు అవుతాడు .ఇన్ని విషయాలను ఒక్క శ్లోకం లో నిక్షిప్తం చేసి, విశ్వ సృష్టి రహస్యాన్ని, అమ్మ వారి శక్తి సామర్ధ్యాన్ని తెలియ జేశారు శ్రీ శంకర భగ వత్పాదులు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-9-12-కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.