శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –6

 శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –6
12— ”త్వదీయం సౌందర్యం ,తుహిన గిరి కన్యే ,తులయితుం –కవీన్ద్రః కల్పంతే ,కధ మపి ,విరించి ,ప్రభ్రుతయః
యదా లోక్యౌ త్శుక్యా ,దమర లలనా యాంతి మనసా –తపో భిర్డు ష్ట్రా పామపి ,గిరిశ ,సాయుజ్య పదవీం ”
తాత్పర్యం –ఓ పార్వతీ మాతా !నీ అందాన్ని వర్ణించ టానికినాలుగు ముఖాలున్న  బ్రహ్మాదుల వల్ల  కూడా కాదు .బ్రహ్మ సృష్టించిన లోకోత్తర సౌందర్య రాశు లైన రంభాది అప్సరసలు నీ చక్కదనానికి ప్రభావితు లై ,నిన్నే తదేక ధ్యానం తో అలా చూస్తూ ఉండి పోతారు .వారు శివ సాయుజ్యం పొంద టానికి మనసు లోనే భావించటం వింత గా ఉంటుంది .వేరే పూజ వారికి అక్కర లేదని పిస్తుంది .
నీ సౌందర్యం తెలిసిన వాడు శివుడు ఒక్కడే .ఆయనతో మానసిక ఐక్యత కోరి ,శ్రీ దేవి సౌందర్యాన్ని పూర్తిగా చూడాలను కొనే వారు అప్సరసలు .నీ సౌందర్యానికి మించిన సౌందర్యం ప్రపంచం లో లేనే లేదు .నీ ధ్యానం తో నానా భోగాలను అనుభవించి, శివ సాయుజ్యం పొంద వచ్చు .
13— ” వరం వర్షీ యామ్సం ,నయన విరసం ,నర్మ సు జడం –తావా పామ్గా  లోకే ,పతిత ,మనుధావంతి  శత సహః
గళద్వేణీబంధః ,కుచ కలశ ,విస్రస్త ,సి చయా –హఠాత్ ,త్రుట్యత్కాం చ్యో  ,విగలిత,యువ తయః ” .
తాత్పర్యం –కాత్యాయినీ !ముసలి వాడై ,కంటి చూపు కూడా లేకుండా ,శ్రుంగార భావం నశించిన వాడు కూడా నీ కడ గంటి చూపు తో నవ మన్మధుడై స్త్రీ లను ఆకర్షించే శక్తి సంపన్నుడు అవుతున్నాడు .అంతటి సామర్ధ్యం నీ కడ గంటి చూపుకు ఉంది .
14—”క్షితౌ ,షత్పంచాశ ,ద్విసమధిక ,పంచాశాదుదకే –హుతాశే ,ద్వే షష్టి శ్చ తురధిక ,పంచా దనిలే
దివి ,ద్విషత్రిమ్శన్మన సిచ ,చతు స్షష్టి రితియే –మయూఖా ,స్తేషా మప్యుపరి ,తవ ,పాదాంబుజ యుగం ”
తాత్పర్యం –పృధ్వీ తత్త్వం తో కూడిన మూలాధారం లో 56,జల తత్వ మైన మణి పూరకం లో 52,అగ్ని తత్వ మైన స్వాదిష్టానం లో 62,వాయుతత్వ ప్రధాన మైన అనాహతం లో 54,ఆకాశ తత్వ మైన విశుద్ధం లో 72,మనస్తత్వం కల ఆజ్న లో 64,కిరణాలు సాధకుని దేహం లో ప్రసిద్ధి చెందాయి .వాటి పైన ఉన్న సహస్ర దళ మధ్యమ లో ,చంద్ర బిమ్బాత్మక మైన బైందవ స్తానం లో ,సుధా సింధువు లో ,నీ అడుగుల జంట నర్తిస్తోంది .ఇదంతా సమయా చార సంప్ర దాయం గా భావించాలి .
విశేషం –మూలాధార ,స్వాధీ ష్టానాలు ఒక ఖండం .మణి పూరక అనాహతాలు రెండవ  ఖండం .విశుద్ధ ,ఆజ్ఞలుమూడవ ఖండం .మొదటి ఖండానికి పైన అగ్నిస్థానం ఉంటుంది .ఇదే రుద్రా గ్రంధి అంటారు .రెండవ ఖండం పైన సూర్య స్తానం ఉంటుంది .ఇదే విష్ణు గ్రంధి .మూడవ ఖండం పైన చంద్ర స్తానం ఉంటుంది .ఇదే బ్రహ్మ గ్రంధి .ఇదే సోమ ,సూర్య ,అనలాత్మకం అని అవరోహణ క్రమం లో (కింది నుంచి పైకి )చెబుతారు .ప్రధమ ఖండం లోని అగ్ని జ్వాల అంతటా వ్యాపిస్తుంది .రెండవ ఖండం లోసూర్య కిరణ ప్రసారం జరుగు తుంది .చంద్రుడు తన కళ ల చేత మూడవ దాన్ని ప్రకాశింప జేస్తూంటాడు .
మూలాధారం లోపృథ్వి ,అగ్ని  జ్వాలలు56, మణి పూరకం లో ఉదక జ్వాలలు 52,కలిసి మొత్తం108 అగ్ని జ్వాలలు .స్వాదిష్టానం లో అగ్ని తత్వాత్మక జ్వాలలు 62,అనాహత వాయు తత్వాలు54, కలిసి సూర్య కిరణాలు 116.సూర్య కిరణాలు మణి పూరకం వదిలి ,స్వాధీ శతానం చేరటం అంటే సూర్యుడు ,అగ్నీ ఒక్కరే నాన్న భావాన్ని తెలియ బర్చతమే .అంటే సూర్యునిలో అగ్ని అంతర్భావం అని అర్ధం .సూర్య స్థానం లో అగ్ని ,అగ్ని స్థానం లో సూర్యుడు ప్రవేశిస్తారు అని తెలుసుకోవాలి .అగ్ని ని శమింప జేయ టానికి ”సంవర్తం ”అనే మేఘం సూర్య కిరణాల వాళ్ళ పుట్టి వర్షాన్నిస్తుంది .
ఆకాశాత్మక మైన విశుద్ధం లో 72,మనస్తత్వాత్మక మైన ఆజ్న లో 64కలిసి 136 చంద్ర కళలు .అగ్నికి 108 జ్వాలలు ,సూర్యునికి116.కిరణాలు ,చంద్రునికి136 కళలు అని తెలియ దాగిన విషయం .ఈ విధం గా సోమ సూర్య అగ్నులు అంద ,పిండ ,బ్రహ్మాన్దాలను ఆవరించి ఉన్నారని భావం .పిందాన్డానికి అతీతం గా ,సహస్ర కమలం ఉంది .ఆది వెన్నెల సముద్రం .అక్కడి చంద్రుడు నిత్య కళా స్వరూపి .సహస్ర దళ కమలం లోని చంద్రునికి వృద్ధి ,క్షయం అనేవి ఉండవు .16వాడి అయిన చంద్ర కళ ”సదా ”అనే పేరుతో సహస్రారం లో ఉంటుంది .మొదటి 15కు వృద్ధి క్షయాలున్నాయి .
”  పంచాతిధి ”రూపం ఉండటం వాళ్ళ శ్రీ విద్య కు ”చంద్ర కళా విద్య ” అనే పేరు వచ్చింది 360.కిరణాలు కలిస్తే ,360రోజులు ఉన్న సంవత్సరమే అవుతుంది .దీనికి రూపం ”ప్రజాపతి ”.ఆయనే జగత్కర్త .కనుక కిరణాలు ఈ జగత్తును సృష్టించ టానికి కారణం అవుతున్నాయని భావం .ఇవి స్రేఎ దేవి పాడార విండ సంభావాలు .”మరీచిః స్వాయమ్భువః ”అని తైత్తిరీయ ఉపనిషత్తు యొక్క సారమే ఇదంతా .
సూర్య చంద్రాగ్నులు భగవతి పాడార విన్దాల నుండి ప్రభవించిన అనంత కోటి కిరనాలనుంది కొన్నిటిని మాత్రమె తీసుకొని జగత్తును ప్రకాశిమ జేస్తున్నాయి .అయితే సర్వ లోకాలకు అతీత మైన చంద్ర కళా చక్రం మే బైండవ స్థానం .అక్కడే శ్రీ దేవి చరనాముజాలున్నాయి .అంటే అనేక కోటి బ్రహ్మాండ ,పిండాండ ల పై భగవతి పాద పద్మాలు నర్తిస్తున్నాయని తెలుసు కోవాలి .”తమేవం భాంతం ,అనుభాతి సర్వం తస్య భాషా సర్వ మిదం విభాతి ”అని కథోపనిశత్ తెలియ జేస్తోంది .అదే ఇది .
పగలు సూర్యుడు ,రాత్రి చంద్రుడు ,సంధ్య వేల అగ్ని ప్రకాశిస్తాయి .ఈ కిరణాల మొత్తం360 అని ముందే చెప్పుకొన్నాం .అదే ప్రజాపతి అంటే 360రోజులున్న సంవత్సరం .ఆయన మరీచి మొదలైన మునులను సృష్టిస్తే ,వారు లోక పాలకులను సృష్టిస్తే ,వారంతా లోకాలను రక్షిస్తున్నారని భావం .జగత్ సంహారం ”హరుడు ”చేస్తాడు .భవుడు జగత్తు ను ఉత్పత్తి చేస్తాడు .మ్రుడుడు జగత్తును రక్షిస్తాడు .ఈ విధం గా సృష్టి స్తితి ,లయలు పరమేశ్వరి నియమం తో శివుడు చేస్తున్నాడని అర్ధమయ్యే విషయం .కంథం’లో విశుద్ధం ,హృదయం లో అనాహతం ,నాభి లో స్వాదిష్టానం ,లింగం లో మణి పూరకం  గుదం లో మూలా ధారం ఉన్నాయి .ఇన్ని విషయాలను ఎరుక పరచ టా నికే ఈ శ్లోకాన్ని పరమ రమణీయం గా ,నిగూధం గా ,తెలుసు కొనే వారికి తెలియ దగి నంతగా, లోతులు తరచే వారికి ప్రజ్ఞా నిది సమూహం గా భగవత్పాదులు ఈ శ్లోకం రాసి తరింప జేశారు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —24-9-12-కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.