శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి -7

   శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి -7
15–”శర జ్యోత్నా శుద్ధం ,శశి యుత ,జటా జూట మకుటం –పరస్త్రాస త్రాణ స్పటిక ఘటికా పుస్తక కరాం
సక్రున్నత్వా ,నత్వా ,కధమివ ,సతాం సన్ని దధతే –మధు క్షీర ద్రాక్షా ,మధురి మధురణాహ్ ఫణి తయః ”
తాత్పర్యం –త్రిపురసుందరీ !శరత్ పూర్ణిమ వంటి శుద్ధ మైన శరీరం  కల దానివి .చిన్న జాబిల్లి తో కూడిన జడ ముడి ఉన్న కిరీటం కల దానివి .సకలాభీష్టం ఇచ్చే వర ముద్ర ,భయం పోగొట్టే అభయ ముద్ర స్పటికాక్షర మాల ,విద్యా రూప పుస్తకం ధరించిన నిన్ను ఒక్క సారైనా నమస్కరించిన వారికి ,తేనె ,ఆవు పాలు, ద్రాక్షా ఫలం తో సమాన మైన మాధుర్యం కలవాక్కును,  కవిత్వాన్నిఅందజేస్తావు .
విశేషం –శ్రీ దేవి క్రియా శక్తి స్వ రూపిణి .మూడు వేదాల లోని మొదటి అక్షరాలూ కలిస్తే .”ఐం ”అనే బీజం ఏర్పడుతుంది .దీనినే ”వాగ్బీజం ”అంటారు .దీన్ని జపిస్తే ,సర్వ విద్యా ,కవిత్వ లాభం కలుగుతుతాయి ..ఇదే ”దుర్గా నవాక్ష రాలు ”లో ”మహాకాళి బీజం” .కాళిదాసు  ఈ బీజక్షరాన్ని జపించే మహా కవి అయాడు .”చిద్గగన చంద్ర కళ”లో కాళిదాస మహా కవే స్వయం గా చెప్పుకోన్నాడట .నాలుగు హస్తాలు, నాలుగు పురుషార్ధాలకు చిహ్నాలు .వర ముద్ర -కోరికలను తీర్చటానికి ,అభయ ముద్ర- భయం లేకుండా చేయటానికి ,సంసార భయ నివారణ చేసి ,జన్మ రాహిత్యం కలిగించ టానికి,  జప మాల సర్వ తపస్సిద్ధి నిస్తుందని ,పుస్తకం- సర్వ విద్యా ప్రదత్వానికి గుర్తు అని భావించాలి .
16–”కవీన్ద్రానాం చేతః కమల వన బాలాతప రుచిం –భజన్తే ఏ సంతః కతిచ ,దరుణా మేవ భవతీం
విరించి ప్రేయస్యాస్తరళ తర శృంగార లహరీ    – గాభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజన మమీ ”
తాత్పర్యం –అమ్మా సౌందర్య లహరీ !కవీశ్వరుల మనస్సు అనే పద్మ వనానికి నువ్వు బాల సూర్య ప్రభవు .అరుణవు. ఏ కొందరో సత్పురుషులు నిన్ను కొలువ గలుగుతున్నారు .వారు మాత్రమే పుంభావ సరస్వతులు అవుతున్నారు .అందుకే వారు సభా రంజనం చేయ గల సమర్దులౌ తున్నారు .
ఆమె సరస్వతీ ప్రతీక స్వరూప .అరుణం శృంగార రసానికి చిహ్నం .వాక్కు  తో చేసే జప మహిమను ఇక్కడ శంకరులు  వివ రించారు ..రెండవది ”కామ రాజ కూట జప ఫలం ”అని విజ్ఞులు తేల్చారు .దీనికి ”గుప్త మహా సారస్వత మంత్రం ”తురీయం గా భావిస్తారు .అ దే ”ఈం”బీజం అంటారు .
17–”సవిత్రీ భిర్వాచాం ,శశి మణి శిలా భంగ రుచిభిహ్ –ర్వశిత్వా ద్యాభిస్త్వాం ,సహ జనని ,సంచిత యతి యః
స కర్తా కావ్యానాం ,భవతి ,మహాతాంభంగి రుచిభిహ్ –ర్వచో భి ర్వాగ్దేవీ వదన ,కమలా మోద మధురైహ్ ”
తాత్పర్యం –మహేశ్వరీ !చంద్ర కాంత మణి కాంతులతో శ్రీ చక్రం లో ,సర్వ రోగ హర చక్ర స్వామినులు అయిన వశిని ,కామేశ్వరి మొద లైన అష్ట శక్తు లతో ,12మంది యోగినులతో ,గంధా కర్శిణి తో ,కూడిన నిన్ను ఎవరు ధ్యానిస్తారో ,వారు కాళి దాసు లాంటి మహా కవీశ్వరులై ,మహా శక్తి వంత మైన కావ్యాలను రచించి చిర కీర్తిని పొందుతారు .
విశేషం –ఎనిమిది శక్తులు –వశిని ,కామేశ్వరి ,మోదిని ,విమల ,అరుణ ,జయిని ,సర్వేశ్వరి ,కౌలిని .
వసివ్యాదులు అంటే -క వర్గ ,చవర్గ ,ట వర్గ ,త వర్గ ,ప వర్గ ,య వర్గ ,శవర్గ ళ తో కూడిణ అక్షరాలూ
12యోగి నులు-అంటే -విద్యా ,రేచికా ,మోచికా ,యోగినీ ,అమృత యోగినీ ,దీపికా  జ్ఞాన ,ఆప్యాయినీ ,వ్యాపినీ ,మేధా ,వ్యోమ రూప ,సిద్ధ రూప  లక్ష్మీ యోగినులు .
8వశినులు ,12యోగినులు కలిసి20 కళలు.శుద్ధ స్పటికం లాగా అని పించేవి .గందాకర్శిణిఅంటే -గందాకర్శిణి ,రసా కర్శిణి,రూపా కర్శిణి, స్పర్శా కర్శిణి.”గంధ ద్వారాం ధురాకర్షాం నిత్య పుష్టం కరీషినీం-ఈశ్వరీం సర్వ భూతానాం ,తా మిహోపహ్వాయే శ్రియం ”అని పూజా విధానం లో ఉన్నది ఈ నలుగురి తో కూడినదే ”గంధ ద్వారా ”.దురాధర్షాంఅంటే మంద మతులు సమీపించ రానిది .నిత్య పుష్ట అంటే -అను నిత్యం ఆనంద స్వరూపిణి గా ఉండేది .కరీషినీంఅంటే గంధాదులను ఆకర్షించే శక్తి కలది .లేక ఏనుగుల చేత పరి వేష్టింప బడేది .ఈశ్వరీం –సర్వ భూతాది దేవత అని అర్ధం .తాం -అంటే ఆమేను అంటే శ్రీ విద్యన, ఇహ అంటే ఈ చక్రం లో ఊహాహ్వాయే -అంటే ఆహ్వానిస్తున్నాను .
అ మొదలైన సర్వ శక్తులు స్పటికాల వలె శుద్ధ మైనవి .క నుండి మ వరకు పగడపు రంగు కలవి .య నుండి ళ వరకు పసుపు రంగు కలవి .క్ష -ఎరుపు రంగు కలది .అకారాదులు బూడిద రంగు లోను ,క నుండి థవరకు సింధూరం రంగు లోను ,డనుండి ఫ వరకు అక్షరాలూ తెలుపు రంగులోను ,బ నుండి ళ వరకు అరుణం రంగులో ,వ నుండి స వరకు వర్ణాలు బంగారం రంగు లోను ,హ నుండి క్ష వరకు అక్షరాలూ ఎరుపు రంగు లోను ఉంటాయి .,ళఅక్షరం లలోని భాగమే .ఇదే శ్రీ శంకరుల మతం అని శ్రీ తుమ్మల పల్లి వారు విశేష వ్యాఖ్యానం చేసి ఎరుక పరిచారు .ఇలా ప్రతి అక్షరానికి క ప్రత్యెక ఫలితం రంగు వున్నాయి అని తెలుస్తోంది .
వచస్సులు –అంటే శుభగ ,శోభన ,భగ ,ఐశ్వర్యాదులు అని నాలుగు రకాలు .ఇవి మధురం గా ,సరస్వతీ దేవి ముఖ కమలం నుండి వినిర్గతమవుతాయి .ఇవి చాలా మృదువు గా ఉండటం విశేషం .ఈ విధం గా ఆమెను ధ్యానిస్తే  కర్తా ,నిర్మిత కూడా అయి ,కావ్య రచన చేస్తాడు అని భావం .
సశేషం –మీ– గ బ్బిట దుర్గా ప్రసాద్ –25-9-12-కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.