కంచికి చేరని కధ –2
చాలా మంది విశ్రుమ్ఖ లత్వానికి వివాహమే పరిష్కారం .ఇది లోక రీతి .ఒక సారి ఆమెతో ఆమె కధ రాస్తున్నాని చెప్పాడు రచ యిత .కధ చెప్పాడు కూడా .ఎలా ముగిస్తాడో నని ఆశ్చర్యం గా అడిగింది .’’ఏముంది ?అమ్మాయికి బుద్ధి వచ్చి బుద్ధి మంతు రాలవుతుంది ‘’అన్నాడు .అలా అవాలని అతని కోరిక కూడా .అవుతుందనే నమ్మకమూ అప్పుడుంది .పగల బడి నవ్వి ‘’ఇదన్న మాట నువ్వు అర్ధం చేసుకోంది?అందుకే మన వాళ్ళ రచనలు ఇంకా మూల బడి ఉన్నాయి .యూ ఫూల్ !నేనా కుర్రాడిని పెళ్లి చేసుకో బోతున్నాను ‘’అంది విజయ గర్వం గా .ఎక్కడో తాను పోర బాటు పడ్డానను కొన్నాడు రచయిత .దిగ్భ్రాంతి చెందాడు .అతను ఊహించనిది, కలలో నైనా అనుకోనిది .సంబాళించుకొన్నాడు .’’ఐ యాంఇన్ లవ్ విత్ హిం ‘’అంది ధీమా గా .ఆమె ఆంతర్యాన్ని తెలుసుకో లేక పోయాడు .చెప్పు దెబ్బకు పెళ్లి పరిష్కారం అవుతుందని ఎవరను కొంటారు ?ఏదో సినిమా కధల్లో తప్పా .అందుకే సజావు గా వెడుతోంది అను కొన్న కధ ‘’సరిగ్గా కంచికి వెళ్ళ లేదు ‘’అంటాడు .అందుకని ఈ కధ రాయటం ఆపేశాడు రచయిత .
ఆ తర్వాత చాలా కధలు రాశాడు అయితే తన దగ్గర ‘’నలుగురికీ తెలియని ఒక కొత్త పాత్ర ఇంకా ఖర్చు కాలేదన్న గర్వం చాలా రోజు లుండి పోయిందట ‘’ఆ పాత్ర సరిగా తనకు అర్ధం కాదని ,అర్ధం కావటానికి మరో పదేళ్లు పట్టింది పాపం .అంత జటిల మైన తీరు,స్వభావం సత్య భామది .సాదా సీదాగా అయితే ఎప్పుడో కంచికి చేరేది .చేర్పించే వాడుకూడా .తండ్రి తాసిల్దారు గారు కాలం చేశారు .విజయ వాడ లో ఓ పెద్ద భవంతి కొన్నది .’’అగ్గి పెట్టె నిల బెట్టి నట్లు ఆ కాశం లోకి ఎదిగిన ఆ భవంతి ముందు ,ఆవరణ లో కుర్చీలో కూర్చుని ఉంది ఓ సారి తను చూట్టానికి వెళ్లి నప్పుడు .తన కధకు చక్కని ముగింపు చెబుతుందని ఊహించాడు .ఆమె ఒళ్ళుచేసింది .శరీరం ముడుతలు పడింది .అయినా మనిషి మరింత ఠీవిగా ,నిర్లక్ష్యం గా కన్పించింది .’’ ఆ ఠీవి లో ముప్ఫై ఏళ్ళ వయస్సు ఇరవైకి కుంచించుకు పోయింది ‘’అన్నాడు ఆమె నుచూడంగానే .రచయిత ఎవరి కోసమో వేదుకు తున్నాడు కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ మాట్లాడుతూనే .’’ఇంకా పెళ్లి కాలేదా ?’అని అడిగితే ‘’ఏం బాబూ ! నేనిలా సుఖం గా బతకటం నీ కిష్టం లేదా ?’’అంది మోహ మాటం లేకుండా .అదిరి పోయాడు గురుడు .ఆ కాలేజీ స్టూడెంటు ను ఏం చేసిందో నని అడిగాడు .’’వాడు బ్రూట్ .నన్ను చదువు మానేసి తన తొ హైదరా బాద్ రమ్మన్నాడు .
వాళ్ళ నాన్నకు అక్కడ పెద్ద ఆస్తి ఉందట .గెటవుట్ అన్నాను .’’అంది గర్వం గా .జయించా నాన్న ధీమా ,ఎవరికీ లొంగ నన్న నమ్మకం ,ఆమె మాటల్లో ధ్వనించాయి .’’ఆమె స్వభావాన్ని యవ్వనమూ జయించలేక పోయింది ,డబ్బూ జయించలేక పోయింది ‘’అని తెల్సుకొన్నాడు రచయిత .తనను గురించి రాస్తున్న కధ పూర్తీ అయిందా అని కుతూహలం గా అడిగింది .తన చుట్టూ బంధువులు చేరారని ఆస్తి కోసం వాళ్ళ కొడుకుల్ని ఉసి గొల్పు తున్నారని ,తానేం చేస్తుందో ఊహించమనీ అడిగింది .ఆమె ప్రశ్న అతనికి ‘’తెనాలి రామ లింగాని కత్తి ‘’లా ఉందట .పడదు అంటే పడ వచ్చు .కాదు అంటే దాటి పోవచ్చు .సందిగ్ధం లో పడి పోయాడు అంతటి రచయితానూ .ఏం తోచక ‘’పెళ్లి మానేస్తావా ?’’’అన్నాడుఅమాయకం గా .
‘’డాం ఫూల్ !అందుకే మీ కధకులు ఇంకా వెనక పడే ఉన్నారు .మన ఇంటి పక్క నుండే డిమాన్ స్త్రేటర్ ను పెళ్లి చేసుకొంటున్నాను .’’అంది దిమ్మెర పోయాడు మళ్ళీ .అతని పర్స నాలిటీ కి ఆశ్చర్య పోయాడు .సన్నగా ,పీలగా ‘’feather weight champion ‘’లా ఉంటాడని పించింది .ఆమె పాలిటి ‘’demon ‘’లాగా ఉంటాడని తోచింది .ఆమె ను చూసిజాలి పడాలో ,ప్రశంశిం ఛా లో తెలీలేదు .అతని లో ఆమెను ఆకర్షించిన గుణమేమిటని ధైర్యం గానే ప్రశ్నించాడు .నవ్వినాసత్య భామ‘’ఆలో చించు .అది అర్ధ మైతే కధ పూర్తీ చేయగలవు ‘’అంది సవాలుగా అతి సహజం గా .మెదడు మొద్దు బారి పోయింది రచయితకు .ఇక ఆ విషయమై ఆలోచించక పో వటం వల్ల ఆ కధ ఇంకా పూర్తికానే లేదు .’’సత్య భామ మంచి పాత్ర .మంచి ముగింపు రానిదే ఆ పాత్ర వృధా అవుతుంది .అందుకు మరో పదిహేనేళ్ళుఆ కధ ముందుకు సాగ లేదు .’’అంటాడు రచయిత .అంతటి అర్ధం కాని మనస్తత్వం ఆమెది .సవాలు విసరటమే కాని ,జవాబు చెప్పని తత్త్వం .ఊహకు అందిందని పించినా ,అంచనా తప్పు అని పించే వైఖరి .తమాషా అయిన స్వభావం. నామ మహాత్యం ఏమో ?,
సత్య భామ కధ ఇంకా సాగుతుంది ఓపిక కావాలి
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –4-12-12-ఉయ్యూరు

