వంచనా వివక్ష కు గురైన వనితా శాస్త్ర వేత్త -లైస్ మేట్నర్
వంచనా వివక్ష కు గురైన వనితా శాస్త్ర వేత్త -లైస్ మేట్నర్
లేస్ మెట్ నర్ ఆస్ట్రియా లోనీ వియన్నా లో 1878నవంబర్ ఏడు న జన్మించింది .అక్కడ అంతా కరువు .తినటానికి తిండి లేదు .వేసవి లో కలరా .పక్కలు వంతుల వారీగా పంచుకొని పాడుకొనే వారు .జన సమ్మర్దం ఎక్కువ .మంచి నీళ్ళు కూడా దొరకని స్తితి .యూరప్ మొత్తం మీద ఆత్మా హత్యాలు అక్కడే ఎక్కువ .ఆఫ్రికా రాజు కైజేర్ ఫ్రాంక్ యూదులకు అవకాశాలు కల్పించాడు .తండ్రి ఫిలిప్ మొదటి జ్యూ లాయర్ .అప్పటి లిబరల్ రాజ కీయాలలో చురుకైన కార్య కర్త .నీటి సరఫరా ను మెరుగు పరచాడు .డాన్యూబ్ నది వరదలను నియంత్రించాడు .తండ్రికి ఉన్న ఎనిమిది మంది సంతానం లో మూడవది ఈమె .చిన్నప్పటి నుంచి సైన్స్ ,లెక్కలు అభిమానం .పలుకు బడి ఉన్న కుటుంబం కనుక పెద్ద లందరూ వచ్చి వెళ్ళే వారు .ఆ కాలం లో ఆస్ట్రియా లో ఆడ పిల్లలకు చదువు తక్కువ .నాలుగేళ్ల వయసులోనే చదువు ఆపేస్తారు .మధ్య తరగతి ఆడ పిల్లల్ని ప్రైవేట్ బడుల్లో చది విన్చె వారు .అవి వారిని టీచర్ పోస్ట్ లకే పనికి వచ్చేది .
లైస్ ఫ్రెంచ్ టీచర్ ట్రైనింగ్ పొందింది .ఆడ వాళ్ళు యూని వేర్సిటిలో చదివితే మానసిక స్తితి కోల్పోతారని ,సంతాన వంతులు కాలేరని నమ్మే రోజులవి .ప్రైవేట్ ట్యూటరింగ్ పొంది యూని వర్సిటి లో చేరింది .ఎనిమిదేళ్ళ కోర్సు ను రెండేళ్ళ లో పూర్తీ చేసింది .గ్రీక్ లాటిన్ జర్మని సాహిత్యం లాజిక్ లను బట్టీ పట్టింది .అప్పుడు ఆస్ట్రియా అమెరికా దేశాలలో మొత్తం 700 మంది ఫిజిసిస్టులు మాత్రమె కాలేజీలలో ఫిజిక్స్ బోధించే వారు .వియన్నా వర్సిటి లో చేరింది .అక్కడి ఫిజిక్స్ ప్రొఫెసర్ .ఆయన అడ వారిని చేర్చుకోమని ప్రోత్స హించే వాడు .’’your trust ,your affection ,your love in a word for the most you have the power to give your self ‘అనే వాడు .ఆయన ఫిజిక్స్ లో లిజేండ్ అని పించుకొన్నాడు .పరమాణు సిద్ధాంతాన్ని అద్భుతం గా వివ రించే వాడు .
అక్కడ మూడేళ్ళ కోర్సు పూర్తీ చేసింది లైస్ .అక్కడి రూల్స్ ప్రకారం డాక్ట రేట్ రావా లంటే కొన్ని నెలలు రిసెర్చ్ చేయాలి .ఓరల్ పరీక్ష పాసై డాక్టరేట్ సాధించింది .ఆ నాడు మహిళా శాస్త్ర వేత్త లకు ఉద్యోగాలూలేవు .రేడియో యాక్టివిటి కానీ పెట్టిన మేడం క్యూరీ నోబెల్ బహుమతిని సాధించినా విచక్ష్త త కు గురైంది .ఆడ వాళ్ళ స్కూల్ లో టీచర్ గా చేరింది మేట్ నర్ .అప్పటికి రేడియేషన్ కొత్త సబ్జెక్టే .రూధర్ ఫోర్డ్ పరమాణువు న్యూక్లియస్ ను కనీ పెట్టి యురేనియం నుండి ఆల్ఫా బీటా గామా కిరణాలు ఉద్గారం చెందు తాయని కనీ పెట్టాడు .అప్పటికి ఆ విషయమేదీ యువ శాస్త్ర వేత్త లేవరికి తెలీదు .లీఫ్ ఎలెక్ట్రో స్కోప్ తో ప్రయోగాలు చేసింది .పూర్తీ ఫిజిసిస్ట్ కావాలని కోరిక పెరిగింది .1907 లో జర్మని చేరింది .ఇక్కడా శ్రీ వివక్షత ఎక్కువే .ఆడవారు తల్లులు భార్య స్తానాలకే పరిమితమనే నమ్మిక .ఆడ ఉద్యోగస్తులు మరీ తక్కువ .క్లాసులకు వెళ్ళాలి అంటే పర్మిషన్ కావాలి మాక్స్ ప్లాంక్ శాస్త్రజ్నుడికీ ఈ అభిప్రాయమే ఉండేది .ఆతోహాన్ కెమిస్ట్రి శాఖ లో ‘’newe field on radio activity ‘’లో ప్రయోగాలు చేస్తున్నాడు .వర్సిటి లో ఆడ వాళ్లకు ప్రత్యెక బాత్ రూములు లేవు .ఒక ఏడాది తర్వాత స్త్రీలకూ విశ్వ విద్యాలయం లో అవకాశమిచ్చారు .ఆటో హాన్ తో కలిసి బీటా రేడియేషన్ లో కృషి చేసింది .న్యూక్లియస్ శిధిలం చెందితే రేడియేషన్ ఏర్పడుతుంది .ఆటం లోపల న్యూక్లియస్ ప్రోటాన్లు ఉంటాయని ,వెలుపల ఎలేక్త్రాన్లు తిరుగుతుంటాయని తెలిసింది .హాఫ్ లైఫ్ పీరియడ్ ను కనీ పెట్టె విషయం తెలిపారు వీరిద్దరూ. రూధర్ ఫోర్డ్ భార్యతో వచ్చి ఇక్కడ జరిగే పరిశోధన చూశారు .ఆ యన ‘’oh!i thought you are a man ‘’అని మెచ్చాడు .ఎంత పని చేసినా జీతాలు లేవు .ఆర్టికల్స్ రాసి కొంత సంపాదిస్తోంది .
1905 లో Kaiser wilham institute for physical chemistry and electro chemistry ‘’నిర్మించారు .అందులో కొంత భాగం రేడియో యాక్టివిటి కి కేటా యించారు .ఇలా చేయటం జర్మిని లో ఇదే మొదలు .ఆటో కు గొప్ప పదవీ జీతం లభించాయి .ఈమెను పట్టించుకో లేదు .అతని తో అం పైడ్ గెస్ట్ గా పని చేసింది పాపం .మాక్స్ ప్లాంక్ ఈమె కు తన అసిస్టెంట్ గా .ఉద్యోగం ఇచ్చాడు .దీనితో ప్రొఫెసర్ ఆయె దారి ఏర్పడింది .జీతం కూడా ఇస్తున్నారు .1919 లో ప్రొఫెసర్ అయింది .ఆమె జర్మని లో మొదటి మహిళా ప్రొఫెసర్ .అయితే బోధన చేసే వీలు కల్పించలేదు .ల్యాండ్ వర్సిటి లో చేరింది .ఆమె సాధించిన దానికి గుర్తింపు రాలేదు .ఆటో కు ఎమిల్ ఫిషర్ మెడల్అనే అత్యన్నత పురసారాన్ని చ్చి ఈమె కు దాని కాపీ మాత్రం పంపారు అంటే స్త్రీ విచాక్షత కు గురైంది .అతనూ ఏమీ చేయ లేదు .
నాజీ పార్టి అధికారానికి వచ్చి ఈమెకు బోధించే అవకాశాన్ని తీసే శారు .జర్మని పరిస్తితి దుర్భరమైనది .అంతటా నిఘా .1938లో డెన్మార్క్ చేరి కోపెన్ హాం వెళ్ళాలని నిర్ణయించు కొంది.అక్కడ ఏమీ అచ్చి రాలేదు .ఆటో, ఫ్రిడ్జ్ అనే అతని తో కలిసి రేడియో యాక్టివ్ శిధిలం లో ఏర్పడిన పదార్ధం ఐసో టాప్ అని నిర్ణయించారు .ఇది తప్పు అని మేట్ నర్ర్ చెప్పింది చివరికి వచ్చేది బేరియం అని తేల్చింది .వారిద్దరూ ఒప్పుకొన్నారు .’’lise is intellectual leader of our team ‘’ అని మెచ్చాడు ఆటో .ఆ తర్వాతా వారిద్దరూ పరమాణువు ను విచ్చేదం చేశామని ప్రకటించారు .ఆమె కేమీ ప్రాధాన్యత నివ్వ లేదు పక్ష పాతం చూపాడు ఆటో ..వారి ఆవిష్కరణ లో తన పేరు లేక పోయినా వారిని అభి నందిన్చింది .ఆటో కీర్తి పెరిగింది .సన్మానాలు బిరుదులూ వచ్చాయి .ఎక్కడా ఈమె పేరు ప్రస్తా వించలేదు .ఆటో కూడా నాజీ లకు లొంగిపోయి పని చేశాడు .అతనిది’’ వన్ మాన్ షో’’అయింది .
75 ఏళ్ళ వయసులో ఇంగ్లాండ్ లోనీ తన మేనల్లుడి ఇంటికి చేరి అక్కడే ఉంది .తన ఆటో బయాగ్రఫీ ని రాయమని సూచించిన వారికి ‘’either in science or tactics or both ‘’లో తనకేమీ తెలీదని మర్యాదగా తిరస్కరించింది .న్యూక్లియర్ ఫిషన్ లో ఎంతో భాగస్వామ్యం ఈమెకు ఉన్నా ఆటో కు నీడ లాగే ఉండి పోవాల్సి వచ్చింది .శ్రమ ఈమెది పేరు ప్రఖ్యాతులు అతనివి .అయాయి .ముప్ఫై ఏళ్ళ తర్వాతా జనానికి తెలిసింది .మూనిచ్ లో ఒక మ్యూజియం లో ఆమె పేరు ను అతి చిన్న అక్షరాలలో రాయించాడు ఆటో .అతడి కుత్సితం అప్పుడు బయట పడింది .డెబ్భై ఎనిమిదేళ్ళ వయసు లో కూడా యువ శాస్త్ర వేత్త లఆవిష్కారాన్ని తెలుసుకొనేది .ప్రోత్స హించేది .ఎన్రికో ఫెర్మి అవార్డు నిచ్చారు .అప్పుడు కూడా ఆటో డిస్కవరి కేమిస్ట్రి తనదే నని వాదించాడు .లైస్కు ఇవ్వక్కర్లేదని వాదించాడు .ఇతని మాట వినకుండా ఆమెకే అందజేశారు .పీరియాడిక్ టేబుల్ లో109 వ మూలకానికి ‘’Meitrium ‘’అని పేరు బెట్టి గౌర వించారు . తొంభై వ పుట్టిన రోజున 1968 july 28 న ఈ మహిళా శాస్త్ర వేత్త మరణించింది .ఆమె సమాధి పై ‘’Lise Meitner –a physicist who never lost her humanity ‘’అని రాసి ఆమె లోనీ మాన వత్వాన్ని చాటారు.