గొల్ల పూడి కధా మారుతం –11 కంచికి చేరని కధ –3 (చివరి భాగం )

 గొల్ల పూడి కధా మారుతం –11

                                      కంచికి చేరని కధ  –3 (చివరి భాగం )

       ఆ తర్వాత సత్య భామ ఆ డిమాన్స్త్రేటర్ నుపెళ్లి చేసు కొన్నది .బెజ వాడ ఆస్తి అంతా అమ్మేసి చిత్తూరు లో భర్త తొ కాపురం చేస్తోంది .పిల్లలూ పుట్టారని తెలిసి చూద్దామని వెళ్లాడు రచయిత .’’పెద్దరికం ఆమె శరీరం లో ,గడ్డం దగ్గరా ,ఏర్పడ్డ ముడుతల తొ ఎక్కువ గా అర్ధమయ్యింది ‘’అయితే ఆమె స్వభావం లో కించిత్తు మార్పు కూడా లేదు .ఈ శరీరానికి ,ఐశ్వర్యానికి ,నౌకర్లు చాకర్లకు  ఎంతో పొందిక కన్పించిందట .’’ఆమె నిర్లక్ష్యపు స్వభావం యవ్వనం లో కంటే ,ఈ వయసు లో బాగా అతికి నట్టు కనిపించింది .’’ఆమె కోరు కొన్న స్తితి ,కి పరా కాష్టకు చేరి నట్లు అని పించింది .’’సత్య భామ పుట్టుక నుంచి మధ్య వయసు తోనే ఉంది .అయితే నేను గుర్తించటానికి ఇంత కాలం పట్టింది ‘’అని తన అంచనాలన్నీ ఎలా తారు మారు అయ్యాయో ఒక సరి జ్ఞాపకం చేసుకొన్నాడు .తల తిప్పకుండానే నౌకర్లకు ఆదేశాలిస్తోంది .అరమోడ్పు కనులతో పిల్లల్ని గమనిస్తోంది .ఏ విషయానికీ  ఎక్కువ లోతుకు పోయి ఆలోచించటం లేదామే .అదీ గమనించాడు .పిల్లలు సన్నగా రివట ల్లా గా డిమాన్ స్త్రేటర్ గారి ‘’ఫోటో స్టాట్స్’’ లాగా ఉన్నారని పించింది .ఇంతకీ అతన్ని ఎలాగా మార్చిందో తెలుసుకోవాలని పించింది .’’ఈ ఎక్సి బిషన్ లో ఎక్కడి వస్తువులక్కడే ఉన్నాయి .కాని ఒక్క వస్తువు కన్పించటం లేదే ‘’అన్నాడు ఆతురత తొ .’’ఎవరూ ?’’అని అడిగింది .’’నీ  భర్త సంగతే ‘’అన్నాడు .

          ‘’ ఓస్ ! అదా ‘’అంది .విరిగిన కుంటి బొమ్మను గురించి మాట్లాడు తున్నంత నిర్లక్ష్యం ఆమె మాటల్లో ప్రతిధ్వనించింది .’’ఆయన ఇక్కడ ఉండరు ‘’అంది నిర్లిప్తం గా .ఆ ముఖం లో ఏ భావమూ గుర్తించలేక పోయాడు రచయిత .కారణం అడిగాడు .ఇంకో ఇల్లు కొని పెట్టిందేమో నని అడిగితే ‘’ఒకటి కాదు –నాతో ఉంటె పదికొనే దాన్ని .అసలు డబ్బు అతణ్ణి పాడు చేసింది .’’అంది .అర్ధం కాలా మన వాడికి .’’అంటే నీ డబ్బు మోజు తొ నిన్ను చేసుకోన్నాడా ?’’అని మామూలుగా ,లోక రివాజు గా అడిగాడు .సహజమే కదా అనే భావం తొ ‘.ఎంత తెలివిగా ,గడుసుగా ,సమాధానం చెప్పిందో సత్య భామ వింటే, దిమ్మ గ్తిరిగి పోతుంది ఎవరి కైనా .

                  ‘’ఊహూ ! అదెం కాదు .నా డబ్బైనా అతనికి వ్యామోహం కలి గించలేక పోయిందే అని నా బాధ .నన్ను చేసుకొన్నాక ,అతన్ని ఉద్యోగంగం మాని పించేశా .ఇద్దరం’’ హాయిగా’’ గడిపాం .ఆ తర్వాత హఠాత్తుగా వాళ్ళ బాబాయి ఎవడో చని పోతె పది వేల ఆస్థికలిసోచ్చిందటఅత గాడికి . .చచ్చు పది వేలు .నా దగ్గర దానికి పదిరెట్లుంది .వాళ్ళ బాబాయి ఆస్థి కంచి లో ఉంది .అక్కడి కెళ్ళి కూర్చున్నాడు .పిల్లలతో నన్ను రమ్మంటాడక్కడికి .ఆ ఊరే బాగుంటుందిట అతనికి .  ‘’అన్నది .ఆస్తి కలిసొచ్చింది కదా అని తాను అక్కడికి వెళ్లనని ,తనను ఇక్కడ్నించి కదల మనటం భావ్యం కాదనీ అంది .తాను వెళ్ళను గాక వెళ్ళను అని గట్టిగా చెప్పేసింది .ఇది జరిగి కూడా ఆరేళ్ళయిందని  చెప్పింది .

            ఆమె భర్త -ఆమె స్వభావాన్ని ఎదుర్కొనే మెళకువలు నేర్చు కోలేదు .ఎదుర్కో నంత వరకు ‘’హాయి ‘’అను భవించింది .తన లోనీ అహంకారం ఎదుటి వ్యక్తీ లో చూడటం ఆమె సహించదు .డబ్బు తొ భర్త స్వభావం మారింది .ఆమె తల తిరిగి పోయింది .తన స్వభావానికీ ,తను నమ్మిన హోదాకీ రాజీనామా ఇవ్వటం కంటే భర్తను దూరం దూరం చేసుకోవ టానికే‘’వెయిటేజీ’’ నిచ్చింది ..తాను గడిపిన ‘’హాయి ‘’గుర్తుల రోజుల కంటే ,’’హోదా మార్కు బతుకు మీద వ్యామోహం ఆమెకు మిగిలి పోయింది ‘’అని ఆమె ఆంతర్యాన్ని ఆవిష్కరించాడు రచయిత .ఆమె కు అందరు’’ సబ్ మిసివ్ ‘’గానే ఉండాలి .’’సుపీరియారిటి ‘’ ని ఆమె సహించలేదు .ఆ ‘’కామ్ప్లేక్షనే ‘’ఆమెను ఈస్తితికి తెచ్చింది .అదే ఆనందం అని భావించింది కూడా .దేనికీ తల వంచని మొండి బతుకు ఆమెది .అంతే .పిల్లల్లో మాత్రం ‘’డిమాన్ స్త్రెటర్’’మార్కు కనీ పించింది .ఒక రాజీ గా కుదుర్చు కొన్న భర్త కూడా ఎదురు తిరిగాడు .సత్య భామ మార్కు మనస్తత్వం పిల్లల్లో రానందుకు రచయిత సంతోషించాడు .’’ఇలా ఎంతకాలం ?’’అన్నాడు .’’అది ఆయన నిర్ణ యించు కోవాల్సిన విషయం –నాకేం ?’’అంది యదా లాపం గా .రచయిత ఊర్కో లేక ‘’ఎప్పుడైనా కంచికి వెళ్తే ఉత్తరం రాయి ‘’అన్నాడు వెళ్ళక పోతుందా అన్న ఆశ అతని మాటల్లో ధ్వనించింది .’’రూఢిగా ఆయన తిరిగి వస్తే రాస్తాను ‘’అంది మొండిగా .

                 ఇలా నలభై సంవత్స రాలు పోషింప బడ్డ పాత్రకు ముగింపు లభిస్తుందేమో నని చాలా కాలం ఎదురు చూశాడు .సత్య భామ కంచికి వెళ్ళలేదు .’’’కనుక సత్య భామ జీవితం ఒక ముగింపు లేని నిరంతర ప్రవాహం .తన గర్వం తనకే తెలీకుండా కదిలి పోయే నది ఆమె చరిత్ర .ముగింపు లేని పాత్ర సత్య భామ .అందుకని సత్య భామ కంచికి వెళ్లటం నాకిష్టమే అయినా కంచికి వెళ్ళని కధ గా నే దీన్ని వదిలేయక తప్ప లేదు .’’అని ముగించేస్తాడు రచయిత .ఆమె లోని హోయలూ ,ఒయ్యారాలూ ,వగలు ,పొగలు ,వగరు ,పొగరు  ఠీవి ,దర్పం ,ధన గర్వం అవతలి వాడేప్పుడు తనకు లోకువ గానే ఉండాలన్న విచిత్ర మనస్తత్వం ఆమె వయసునీ లొంగ దీయ లేదు మనసునీ లొంగ దీయ లేదు .ఏ స్తితి లో ఉన్నా ఆ ‘’కోమా ‘’లోనే బతికింది సత్య .ఆ పై మెట్టు మీదే నిలిచి పోయింది

              దదాంపత్య సుఖం కోసం కొంత రాజీ పడింది అప్పుడు మాత్రం ఎవ రైనా ఫర్లేదని పించింది .తన ధనం తొ తన నీడలో తను చెప్పి నట్లు వింటే చాలు .’’భరించ’’క్కర్లేదు .తన గర్వ భారాన్ని మోసే వాడూ,తన భావాలకు ఎదురు చెప్పని వాడూ ,చెప్పు కింద తేలు లాంటి వాడే భర్త కావాలి .అతని లో వ్యక్తిత్వం పెరిగితే ,సహించ లేదు .దాసోహం అనే మంత్రం అంతా పఠి స్తు ,భజన చేయాల్సిందే .అందని చిక్కని విచిత్ర మైన ‘’పజిల్ ‘’సత్య భామ .కొందరి స్వభా వా లంతే .పుర్రెతో  పుట్టిన బుద్ధి పుడకల తోనే సమాప్తి .చాలా విచిత్ర మైన వ్యక్తిని చూసి ఈ కధలో ఇలాంటి వారుంటారా ?ని పిస్తుంది ఈ కదా విపంచిని ఇంతటి తొ నేను మాత్రం కంచికి చేరుస్తున్నాను .ఆ కమ్మని నాదం మన మనసులను ఆనందం తొ ముంచేస్తుందని నమ్ము తున్నాను ..

                మరో కధలో మళ్ళీ కలుద్దాం .

                సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ – 6-12-12-  ఉయ్యూరు     .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.