గొల్ల పూడి కదా మారుతం –13
అందమైన జీవితం –2
కమల భర్త తొ డార్జి లింగ్ వెళ్లి పోయింది .వెళ్ళే రోజు ఆమె కార్చిన కన్నీటిలో ఒక్క బొట్టైనా తన మీద జాలి తొ అయి ఉంటుందని ఊహించాడు .పదేళ్ళ తర్వాత తిరు పతి లో కలిశాడు ‘’ఈ ప్రపంచం లో అప్పుడే కళ్ళు తెరచిన గుడ్డి పువ్వు లా ఉండి‘’అన్నాడు ఆమెను చూసి .’’బాబీ ! అని ఆమె గుర్తు పట్టి పలక రించింది .అతని చుట్టూ కేరింతలు కొట్టే మిత్రులున్నారు .’’ఆడ పిల్లల్ని ఏడి పించేటప్పుడు ఎప్పు డైనా నేను జ్ఞాపకం వస్తానా బాబీ ?’’అని అడిగింది చీరలో ఉన్న అందం ఈ డ్రెస్ లో లేదని పించింది అతనికి .’’ఒళ్ళు చేశాను కదూ !అవును ఇంకేం చేయాలో తెలీక’’అంది .రచయిత ఆలోచనలను గ్రహించి నట్లుంది .పంజాబీ డ్రెస్ ఆయన కిష్టమని ఆయనతో తానూ టూర్ కు వెళ్లటం నేర్చుకోన్నానని చెప్పింది .’’ఎప్పుడూ కొంగు పట్టుకొని తిరిగే వాడివి కదా !అలా పిరికి గా ఉన్నా వేమిటి ? అని ప్రశ్నించింది .’’కొంగే లేదుగా ఇప్పుడు ‘’అని అంటే తను మరి పోయానని ఆ అలంకారాలు తనకి కిష్టం లేనట్లుగా ఉందని అనుకొన్నది .సెలవల్లో ఇంటికి రమ్మంది .చాలా మాట్లాడాలని ఉందని కూడా చెప్పింది .తిరుపతి లో ఎక్కడ బస చేశారో చెప్పమని తానే వస్తానని అన్నాడు .’’నువ్వా ! అమ్మో ! వద్దు .నేనే ఆయన్ను తీసుకు వస్తాలే నీ దగ్గరికి ‘’అని అడ్రెస్ మాత్రం తీసుకొని వెళ్ళింది .’’ఆమె ముఖం లో కనీ పించేదంతా నవ్వు ,తృప్తి, ఆనందం కాదు అని ‘’అని తెలిసి పోయింది .అంత తేలిగ్గా ఆమె భావాలను గ్రహించే శాడు face is the index of the mind ‘’అన్నారుగా .ఆమె తిరుపతి లో మళ్ళీ కనిపించలేదు .
ఆరేళ్ళ తర్వాత రచయితకు పెళ్లి అయింది .సీత అందమైన పిల్ల కాదు కాని మంచి పిల్ల .అది కూడా అదృష్ట వశాత్తు నేమో ?అనుకుంటాడు .కమలా వాళ్ళు ధిల్లీ లో ఉన్నారు ఇతడు ట్రైనింగ్ కు అక్కడికే వెళ్లాడు .ఉత్తరం రాస్తే భార్య తొ సహా రమ్మనమని రాసింది .సీతను చూడ గానే ఆప్యాయం గా చేతుల్లోకి తీసుకొని ‘’ఆయన స్నానం చేస్తున్నారు .ఈ లోగా కాఫీలు త్రాగండి ‘’అని ,మంచి పిల్లనే చేసుకోన్నావె దొంగా !’’అన్నది .తనకేమో ఉక్కిరి బిక్కిరి గా ఉంది .ఏం చెప్ప లేక ప్పోతున్నాడు .రాఘ వెంద్ర రావు వచ్చాడు .బట్టతల అయింది .బుగ్గ లుబ్బి పెదిమలు లావుగా ఎర్రటి కళ్ళ తొ కొంచెం భయంకరం గా ఉన్నాడని పించింది .’’బాబీ అండీ .మన పెళ్ళికి పదేళ్ళ వాడు ‘’అనిపరిచయం చేసింది .’’మీ ఆయన గడుసు వాడమ్మా !ఆ రోజుల్లోనే నన్ను పెళ్లి చేసుకోమని వెంట పడే వాడు ‘’అని ,గుక్క తిప్పుకో కుండా నవ్వింది .ఈ సంభాషణ భర్తకు నచ్చి నట్లు లేదు .ఆఫీసుకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లి పోయాడు .నవ్వే కమల పిల్లి అయి పోయింది .’’మేష్టారి పెం బెత్తం రుచి తెలిసిన విద్యార్ధి లాగా అతని తొ గదిలోకి వెళ్లి పోయింది ‘’అతను వెళ్ళే వరకు బయటికి రాలేదు
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –8-12-12-ఉయ్యూరు

