గొల్ల పూడి కధా మారుతం –14

    గొల్ల పూడి కధా మారుతం –14

                                                                         అందమైన జీవితం-3-(చివరి భాగం )

    ‘’జీవిత భారాన్ని మోసిన అలసట తొ కళ్ళల్లో నీడల్ని చూశాడు ‘’కమల లో రచయిత .తెచ్చి పెట్టుకొన్న ఉత్సాహం తప్పిస్తే ,మనిషి నీరసించింది .ఇంట్లో పిల్లల అలికిడి నిపించ లేదు .కమల జీవితం లోను ,మనస్సు లోను ఒంటరిదేమో ‘’అని పించింది .మర్నాడు తాజ్ మహల్ చూడాలను కొన్నాడు రచయిత .భార్యా , కమలా ఆమె భర్త తొ సహా .’’ఆయనకు తీరిక ఉండదు .’’అన్నా ఉత్సాహం గా అన్ని ఏర్పాట్లు చేస్తోంది .అయినా అతడిని అడిగాడు ‘’నేనూ అంటే కమల వస్తుందా? ’’అని అడిగాడాయన .తనకు తెలీని రహస్య మేదో తెలిసి పోతోందన్న వ్యధ అతనిలో కన్పించి బిత్తర పోయాడు మన వాడు .’’తాజ్ మహాచరిత్ర కు గుర్తు –మనకేమీ కాదు నేను కళా కారుణ్ణి కాను .Iam not interested ‘’అన్నాడు .ఖచ్చిత మైన అభిప్రాయం ఆయనకున్నాయని ,వాటిని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదని అని పించింది .తెల్ల వారి లేస్తూనే కమల తానూ రావటం లేదని చెప్పింది .’’ఇంతలోనే నీ మనసు మారి పోయిన్డెం ?’’అన్నాడు‘’నీకేం తెలుస్తుంది బాబూ !నువ్వు మగాడివి .ఆ ప్రశ్న మీ ఆవిడ అడిగిందేమో చూడు నేను చూడ క పోతే ఏం ముని గింది ?’’అంది నిర్లిప్తం గా .ఉత్సాహం నీరుకారి పోయింది వీరిద్దరికి .అయినా వెళ్లి చూసోచ్చారు .ఆ రాత్రి చాలా పొద్దు పోయిన తర్వాతా తిరిగి వచ్చారు .కామలలో  మార్పేదో కన్పించింది మొదటి సారి ఆమె లో కోపం చూశాడు .పొద్దున్న కమలకూ ఈపూట కమలకూ తేడా ఉంది .అర్ధ రాత్రి బాత్ రూం లో ఏదో ఏడుపు విని పిస్తే అక్కడికి వెళ్లాడు .ఆమె నుదిటి పై రక్తం ఉంది ‘’కమలా ‘’అని ఆశ్చర్య పడ్డాడు ‘’మెల్లగా మాట్లాడు .ఆయన ‘’ఒళ్ళు మరిచి ‘’నిద్ర పోతున్నారు ..’’అంది .రక్తానికి కారణం అడిగాడు ‘’ఎంత బ్రాందీ సీసా అయితే మాత్రం అంత గట్టివి ఎందుకు బాబూ ?’’అంది తల తిరిగి పోయిన్దితనికి తాగి సీసా తొ కొట్టాడా అని అడిగితే ‘’ఏం కొట్టదానికి అధికారం లేదా భర్తకి ?’’అని ఆమె అడిగితే తెల్ల బోయాడు .సహనానికి భూదేవి హద్దు .,ఆశయం కదా మనకి అందులో భారత నారీ మణి కి .అందులో అర్దాన్గికి‘’ఎందుకూ ?’’అని అడిగాడు కారణమన్నా తెలుసు కొందామని ‘’కారణం ఏ ఆడదీ చెప్పదు బాబీ .నువ్వడుగా కూడదు .నువ్వు మెలకువ గా ఉన్నావు కనుక నీకు దొరికి పోయాను .ఎవరి తోను అనద్దు ‘’అని ఆంక్ష పెట్టింది .రాఘ వెండ్ర రావు మీద కసీ ,కమల పై జాలీ కలుగు తున్నట్లనైపించంది .’’నువ్వూ మీ ఆవిణ్ణి కొడతావా ?’’అని అడిగింది ఉదాసీనం గా అన్నాడు ‘’నాకు అందం లేదుగా ?పెళ్ళాన్ని కొట్టే అర్హత లేదు ‘’ఆ మాట చెళ్ళున తగి లి నట్లు గా నిర్ఘాంత పోయి చూసిందామె .వెళ్ళే ముందు సీతను చీరా సారే తొ సత్కరించింది .’’త్వరగా అబ్బాయిని ఎత్తుకో ‘’అని సలహా ఇచ్చింది .’’మంచి పిల్ల జాగ్రత్త గా చూసుకో .’’అని అతనికీ చెప్పింది హెచ్చరింపు గా ఆమె మాటలున్నాయని పించింది ‘’మంచి దయితేనేం అందగత్తే కాదుగా ‘’అన్నాడు ఉడికిమ్పుగా .కోపం గా .’ఆమె ‘’అందానికేం చిలక లాంటి పిల్ల ‘’అన్నది .అందం లో రాజీకి ఓ మెట్టు కిందికి దిగింది అని పించింది రచయితకు 

                ఆ తర్వాత నాలుగేళ్ళకు కమల హైదరాబాద్ లో కని పించింది .ఇంటికి రమ్మంది .చాలా చిత్రాలు చూపిస్తా నంది తన చేయి పట్టుకొని బీచ్ లో ఆడుతూ పాడుతూ చూసిన కమలకీ ,నిండిన పరి పూర్ణత సాధించిన ఈమాత్రు మూర్తి  కమలకీ పోలికలు వెదికే లోపే వెళ్లి పోయింది .భార్యా భర్తలు ఒక ఆదివారం కమలా వాళ్ళింటికి వెళ్లారు .వసారా లో కూర్చున్న వ్యక్తిని కాని ,అతని ముందు కూర్చున్న మూడేళ్ళ కుర్రాడిని కాని పోల్చుకో లేక పోయాడు .రాఘ వెంద్ర రావే  అతను .అతనే గుర్తు పట్టి పలక రించాడు .కుడి కన్ను దగ్గర్నుంచి చెవి దాకా చీరుకు పోయి నట్లు పెద్ద మచ్చ .కంటి దృష్టీ తప్పింది ఎడమ చెయ్యి వంకరయింది .సరిగా పని చేయటం లేదు శరీరం బాగా లావై నెత్తి మీద ఒకవెంట్రుక ముక్క కూడా లేదు గాంభీర్యం తగ్గి, ఇప్పుడు నవ్వుతున్నాడు .కష్టసుఖాలు,ఓటమి వల్ల మనిషి మెత్త బడ్డాడు .ఊహించని పెను మార్పే ఇది .తెల్ల బోయి చూస్తున్న తనను ‘’మాట్లాడ వద్దు ‘’అని సంజ్ఞచేసింది కమల .భర్తనే వివరం అడిగితే ‘’మూడేళ్ళ క్రితం ఆక్సి డెంట్ లో ఇలా జరిగింది .తల పగిలేదే .కొద్ది లో తప్పింది ,నాల్గు నెలలు హాస్పిటల్ లో ఉన్నారు .ఇప్పుడే ఇక్కడికి ట్రాన్స్ ఫర్ అయారు ‘’అని కమలే చెప్పింది .ఎక్కడా అశం తృప్తీ , దుఖం ఆమె కంఠంలో కానీ పించలేదు .ఉండ బట్టలేక ‘’ఎలా బతుకు తున్నావు ఈ కురూపి తొ ?’’అన్నాడు .తెలివి తక్కువ వాడిని క్షమించి నట్లు చూసి ‘ఫకాల్న నవ్వి ‘’నోర్ముయ్ !మీ ఆవిడ వింటుంది వింటే  ఆయన తొ బ్రతకటం నిజం గా నే నాకిష్టం లేదేమో నను కొంటుంది కూడా ‘’అన్నది .ఎంత నిబ్బరం వచ్చిన్దామెకు ?తరతరాల సంస్కృతీ వార సత్వమా ?రాజీ పడిన ఊరటా ?పిల్లాడిని చూపించింది .సన్నగా ,పీల గా ప్రాణం లేనట్లున్నాడు వాడికింకా మాటలు రాలేదు ‘’వాడికి మీ ఇద్దరి పోలికా రాలేదు ‘’అన్నాడు ‘’ఏమైనా ఆయన పోలిక రాలేదు అదే అదృష్టం ‘’అంది .అనుభవానికి తగిన మాట అది .వేదన లోంచి ధ్వనించిన మాట .’’చిన్నప్పటి గర్వం ,తిరుగు బాటు కన్నా ఈ దయా ,ప్రేమతో ఇంకా అందం గా కని పించింది కమల లేక అందం మారలేదేమో /అందాన్ని చూసే దృష్టి లో ఆర్పేమో ‘’అని వితర్కిన్చుకొన్నాడు

                   ‘’’ భర్త అందం చెరిగి పోయినా కమల ఆలోచనల్లో మొదటిఅందం ముద్ర చెడి పోలేదు .నా అందం లో మార్పు లేక పోయినా నా అందాన్ని గురించి ఆమె అభి ప్రాయం లో మార్పు తెచ్చుకోంది .సీత లో అందం లేక పోయినా ఆమె స్వభావం లో ,బ్రదకడం లో ఉన్న అందం తొ సరి పెట్టుకుంది .మరి పసి వాడిలో ?తండ్రి పోలిక లేని కారణం గ ఆ గుణాల్ని పుణికి పుచ్చుకొ లేదన్న ఆశ ,అంతకు మించి తన కొడుకు అన్న ఆప్యాయత లోనిఅందమేమో అది ‘’అని చాలా అందం గాకధను  ముగిస్తాడు మారుతీ రావు..అందం అంత రంగానికి సంబంధించిందే .అది బాహ్యం గా ఉన్న దాని కంటే లోపల ఉంటె నిండుదనం గౌరవం ,అనురాగం ,ప్రేమ కన్పిస్తాయి భయం ఉండి తప్పటడుగులు వేస్తె జీవితం అధః పతనమే .అప్పుడు అంతు లేని విచారమే .అంతస్సౌన్దర్యం అంత విలు వైనది .అది ఉన్న ప్రతి వ్యక్తీ ఆరాధనీయుడే .ఏ మహర్షిచేప్పినా ,ప్రవక్త చెప్పినా ,అవతార పురుషుడు ప్రవచించిన దానిని సాధించేందుకే .ఆ ఆనందం ఉంటె జగత్తంతా మనో హారం గా ,ముగ్ధంగా ,పర వశం గా కన్పిస్తుంది .  ఆ చూపు లేక పోతే ప్రకృతి అంతా వికృతి గా ,ఉంటుంది .ఆకృతి నిరాక్రుతి అవుతుంది .ఆ చూపు నిన్డుదనాన్నిస్తుంది తృప్తినీ ఆత్మ సంతృప్తినీ అందించి ,జీవితానికి పరి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది ‘’అందం తన విశ్వ రూపాన్ని కమలలో ప్రదర్శించింది ‘’అని మహా వాక్యం తొ ‘’అందమైన జీవితం ‘’కధ ను అంత అందం గా నూ ముగిస్తాడు రచయిత గొల్ల పూడి .అందమే ఆనందం గా ,ఆనందమే జీవిత మకరందం గా .,ఆనంద రస నిష్యందం గా .కమల ఓ సగటు భారతీయ మహిళా మూర్తి స్వరూపం .తర తరాల ఆదర్శ స్వరూపానికి దర్పణం .అందానికే అందం కమల జీవితం అని పిస్తుంది .అందమైన కధానిక తొ మరింత మైన సుందర కధనం ;;అందమైన జీవితం ‘’.జీవితం లోనీ పలు మార్పుల అందమైన అనుభవ పూర్వక మైన  నిశిత పరిశీలనం ,పరి పక్వం, పరి పూర్ణం ..

                మరో కధ తొ మళ్ళీ మీ ముందుకు

              సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –9-12-12-ఉయ్యూరు 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.