గొల్ల పూడి కధా మారుతం –15 ఏడవకధ –పరకీయ -1

       గొల్ల పూడి కధా మారుతం –15

                                            ఏడవకధ –పరకీయ -1

 ఇదోవిచిత్ర మైన కధ .హార్సిలీ హిల్స్ లో గవర్నర్ ప్రోగ్రాం లో పాల్గొన టానికి వెళ్లాడు రచయిత .అతని తొ బాటు అదే ఆఫీసు లో పని చేస్తున్న బలరాం కూడా ఉన్నాడు .అందమైన ప్రదేశం కనుక వారి భార్యలకూ ఆ అందాన్ని చూపించ వచ్చు నని భావించి ఓ వారం తర్వాత వారిని రప్పించు కొన్నారు ..ఎదురెదురు ఇళ్ళల్లో ఉంటున్నారు .బలరాం కొడుకు రోజూ వీల్లింటికి వచ్చి ఆడుకొంటాడు .ఒక రోజు రచయిత భార్య తన భర్త ఫోటో ఫ్రేం తొ ఆడుకొంటున్న ఆ కుర్రాణ్ణి చూసింది .వాడు ఆమెకి తెలీకుండా దాన్ని ఇంటికి తీసుకు పోయాడు .తర్వాతా ఫ్రేం మాత్రమె తిరిగి వచ్చింది .ఫోటో లేదు .వాళ్ళబ్బాయి చిమ్పెశాడట .అందుకని ఆవిడ ఇది మాత్రమె ఇచ్చి పంపిందని రచయిత భార్య చెప్పింది .ఇతనికి అనుమానం వచ్చిఅడిగితే ఫ్రేము ఆవిడే తెచ్చి ఇచ్చిందని అర్ధమైంది .కావాలనే తీసి కెళ్ళిందేమో అన్నాడు .’’మీ ఫోటో ఆవిడెం చేసుకొంటుంది ?’’అని ప్రశ్నించింది భర్తను .అక్కడి తొ ఆ ఆలోచన లకు బ్రేక్ పడింది .

           మర్నాడు రాత్రి ఆఫీసు నుండి తిరిగి వస్తుంటే ,ఎదు రింటామే చీకటి లో ఓ కుర్రాణ్ణి ఎత్తు కొని ఓ చెట్టు నీడన ఉండి .తనను చూసి నవ్వింది .’’పోల్చు కొ లేదా ?’’అంది .నాలుగేళ్ల కితం విన్న గొంతు .గుర్తు పట్టాడు .’’అప్పట్లో తన జీవితాన్ని రెప రెప లాడించిన వ్యక్తీ –వసంత ‘’అని తెల్సుకున్నాడు .’’మొన్న నీ ఫోటో చూసే వరకు నువ్వని తెలీదు .నేనే కొట్టేశా నను కొన్నావా ఫోటోని ?’’అనినవ్వింది .’’ఆ నవ్వు వల్లే మోస పోయాను ‘’మళ్ళీ అదే ఆయుధం ప్రయోగిస్తుంది అను  కొన్నాడు ‘’నిన్ను బాధ పెట్టన్లె ‘’అంది .ఏదో అడగాలని అతనికి ఉండి .అడగ లేక పోతున్నాడు .’’ఈ ఇద్దరు కుర్రాళ్ళ లో ఎవ రైనా “’అని అడగ బోయిన ప్రశ్న ను ఆమె అడిగేస్తే మింగ లేక పోయాడు .ఆమె ఊహకు జోహార్లర్పించాడు .’’అవును ‘’అన్నాడు .’’చెప్పుకో చూద్దాం ‘’అని సవాల్ విసిరింది .తన పోలిక ఆపిల్లల్లో కని పించలేదు విసుగేసింది .’’నాకు పిల్లల్లేరు సుఖం గా ఉన్నా .మళ్ళీ నన్ను కదపకు ‘’అని వచ్చే శాడు .మనసు లో ఏదో మూల అందులో ఒకడు తన కొడుకే నని గాఢ మైన భావం ఉంది .

          పాత కధ గుర్తొచ్చింది .నాలుగేళ్ల క్రితం తాను హాయిగా బ్రహ్మ చారి జీవితం గడుపు తున్నాడు .ఓ రోజు రూము లో ఉంటె ,చిన్న సంచీతో ,ఓ ఉత్తరం తొ వసంత గది లోకి వచ్చింది .ఆ ఉత్తరం వేణు రాసిచ్చాడు .వసంత తన చెల్లెలని,నమ్మి ఎవరితోనో మద్రాస్ వెళ్లి పోయి ,వాడు మాయ మైతే ,జబ్బు తొ ఉన్న తండ్రికి తెలిస్తే గుండె ఆగి పోతుందని ,అందుకే ఇంటికి రావద్దన్నానని ,చదూ కుంది కనుక తానే ఏదో దారి చూపిస్తాడనే ఆశతో పంపానని రాశాడు .ఆమె వయస్సు అతన్ని ఇబ్బంది పెట్టింది .ఏంచేయాలో ఆమె కే తెలీదు .వేరే చోట గది కుదిర్చి ప్రైవేట్లు ఏర్పాటు చేశాడు .ఓ నెలకు ఆమె కూడా కుదుట బడింది .ఆమె లో గతం ఉన్నట్లు కన్పించలేదు .’’గతం తొ రాజీ పడటం మనసు విధించే పెద్ద శిక్ష .ఉద్రేకాలకు అనుభ వాలను మనసు లో దాచుకొ లేని వ్యక్తీ ప్రపంచం పై వాటిని రుద్దేస్తాడు .మనసు లోనే దాచు కుంటే ప్రపంచాన్ని తన అవసరాలకు లేకుండా చేసుకొంటాడు .అందుకే సమన్వయము అవసరం .పాత అనుభవాలు మత్తు మందుల్లాంటివి. వాటిని పూర్తిగా వదులు కొ కూడదు .’’అంటాడు ఆమె రాజీ పరిస్తితి ని అర్ధం చేసుకొని .

             వీలైనప్పుడు వెళ్లి యోగ క్షేమాలను తెల్సు కుంటున్నాడు .కళ్ళ నిండా కృతజ్ఞత తొ పలక రించేది .తెలివైన్దికదాఎలా మోసపోయిందో నని అడిగాడు .’’ఏ తెలివీ కోరికను జయించ లేదండి .నేను ఆడ దాన్ని ‘’అంది ‘’మీకు కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలి ?’’అన్నట్లుఉండేవివి ఆమె చూపులు .’’మీ కళ్ళల్లో అంత బలం లేక పోతే మీకింకా సహాయం చేసే వాడిని ‘’అన్నాడు .’’ఏం ?పెళ్లి చేసుకొనే వారా ?’’అంది .నవ్వేసి వచ్చేశాడు .ఆ తర్వాత ఎక్కడికో వెళ్లి ,వర్షం వస్తే అటు వైపు వెళ్లి ఆమె రూం చేరాడు .’’ఆర్నెల్ల క్రితం మీ దగ్గరకు వచ్చే ముందు నాకే సమస్యా లేదు .ఒక్క చావు తప్పించి .ఇప్పుడు చాలా పెద్ద సమస్య వచ్చి పడింది ‘’అంది .ఏమిటని అడిగితే బతకటం అంది సింపుల్ గా .చలికి శాలువా ఇచ్చింది .’’మద్రాస్ వెళ్లి ఏ తప్పు చేశానో –మీ సహాయం పొంది అంత నేరమూ చేశానని పిస్తోంది .నా అంతట నేను బతకటం ఎంత సుఖం ?’’అంది .దిగ్భ్రమ చెందాడు .’’ఏం అనుకో కండి .మీ సహాయానికి ఏదో రూపం లో కృతజ్ఞత చెప్పుకొంటాను ‘’అన్నది .వర్షం వెలిస్తే ఇంటికి చేరాడు .

                ‘’చేత కాని తనాన్ని కప్పి పుచ్చి ,కోరికను ముందుకు తోసే సాధనమే కృతజ్ఞత ‘’అంటాడు మారుతీ రావు .అతని కి మలేరియా వస్తే ఆమె ఎంతో సేవ చేసింది .ఆమె లోనీ మాతృత్వం ,సహనం ,ఔదార్యం తెలిశాయి .ఆమె ను వదిలి పోయిన వ్యక్తీ ఎంత దౌర్భాగ్యుడో అనుకొన్నాడు .పదిరోజు లయింది .కోలుకొన్నాడు .ఆమె నలిగి పోయింది చాకిరీతో .’’మిమ్మల్ని కష్ట పెట్టటం చూస్తె ,నా జ్వరం ఎప్పటికీ తగ్గదు ‘’అనే వాడు .ఆమె నవ్వేది .’’మీకేం కావాలో మీకు తెలీదు .మీ శరీరానికేం కష్టం లేనప్పుడు మీ మనసులో ఏదో భాగం పాడైంది పెళ్లి చేసుకోండి త్వరగా ‘’అంది .నిర్ఘాంత పోయాడు ఆమె పరిశీలనకు ,’’రెమిడీ’’ కి ..ఆ సాయంత్రం చలి గాలికి వళ్ళంతా జ్వరం వచ్చి నట్లని పించింది .శరీరపు అలసట కంటే ,మనస్సు అలసట వణి కిస్తోంది .ఆ రోజే చివరి రోజు అని పించింది .అర్ధ రాత్రి కళ్ళు విప్పితే ఆమె అక్కడే కూర్చుని వుంది .’’నువ్వు చెప్పిన మందు పుచ్చు కొ కుండానే చచ్చి పోయేట్టున్నాను ‘’అన్నాడు .’’ఏమిటది ?’’అన్నది .’’నా మనస్సుకు దగ్గర పడ్డ వ్యక్తిని ‘’అని ఆమె పూర్వం అన్న మాట జ్ఞాపకం చేశాడు .

                ఆమె కళ్ళల్లో జాలి ,కన్నీటి మెరుపు ఆశ్చర్యం కల్గించాయి .ఏడ్చేసి అతన్ని కావలించు కొంది .అలాంటి ఆలోచనలు వద్దన్నది .ఇద్దరు ఒకటై పోయారు .ఆ రోజు అనుభ వానికి తన జీవితం అంతా ‘’అరణం ‘’ఇచ్చినా చాలదనుకొన్నాడు .ఆర్నెల్ల తర్వాతా తను మద్రాస్ ట్రైనింగ్ కు వెళ్తున్నాని చెబితే భయం లేదు వెళ్లి రమ్మని భరోసా ఇచ్చింది .ఆ తర్వాత ఎనిమిది నెలలకి తాను తల్లి కాబోతున్నట్లు జాబు రాసింది .దిమ్మెర పోయాడు .’’అనుభవం కంటే జ్ఞాపకం విధించే శిక్ష క ఠిన మైంది ;;అంటాడు గొల్ల పూడి .’’ఏం చేయ దల్చుకోన్నావు ?’’అని ఇతను రాస్తే ‘’మీ ఉత్తరానికి నవ్వొచ్చింది ,భయ పడ్డట్టున్నారు .నాకేం భయం లేదు .మర్చి పొండి‘’అని రాసింది .అంత తెగింపూ ,ధైర్యం ఎలా సాధ్యమొ ఆశ్చర్యం కలిగింది .తనని వేళా కోళంచేస్తోందను కొన్నాడు .స్త్రీ నిఅర్ధం చేసుకోవటం చాలా కష్టం అని తెలిసింది .

               సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 11-12-12- ఉయ్యూరు 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.