గొల్ల పూడి కధా మారుతం –21
కీర్తి శేషుడు -2
చివరికి భార్య రాజమ్మను కనుక్కొని వివరం గా నాగులు చావు సంగతి చెప్పాడు .ఆమె లో సతీత్వపు గుర్తు ఆమె ను అంద గత్తే ను చేసింది ..చావు కబురు విని ‘’చెడి పోయిన కుర్రాడు తప్పి పోతే వాడిలో మంచి తనాన్ని గుర్తు చేసుకొని ఏడ్చే తల్లిలా ఏడ్చి గోల పెట్టింది’’ట .నాగులు పై కోపం లేదా అని అడిగితే ‘’ఆడు మంచోడే బాబూ !మా అమ్మకీ అన్నకీ ఆడు నన్ను సరిగ్గా ఎలుకోలేదని గుర్రు .మా బాధ ఆళ్ళకి తెలీదు నాకు పిల్లల్లేక పోతే నేనేడ వాలి ఆడేందు కేడవాల ? ముత్తమ్మను చేరాడు మగాడు ఆల్లకు ఎదురు సెప్పి బతగ్గలమా ‘’అంది .ఆ ‘’లంపెన్ ‘’సొసైటీ లో మగాళ్ళంతా అంతే కదా .వాళ్ళతో సర్దుకు పోతేనే జీవితం ,నిండుతనం .చీటికి మాటికి తగాదాలాడుతూ కాపురం చేయలేరు వాళ్ళు .ముత్తమ్మ దగ్గర కెళ్ళటం ఇష్టం లేక పోయినా ఆగుతాడా? సోసీ సూడ నట్టు సర్దుకు పోవాల ‘’అనే జీవిత సత్యం తెలిసి బతుకు తోంది రాజాలు
వాడి చేతి రవ్వల ఉంగరం గుర్తు చేస్తే తానే అది చేయించి ఇచ్చానని ,పెట్టుకొని వారం కూడా కాలేదని బాధ పడింది .తానేం సంపాదిన్చక్కర్లేదని అన్న ఇంటిని సూత్తాడు తన డబ్బంతా నాగులుకు ఇస్తున్నందుకు తిడతాడు అని చెప్పింది ఇది సతీత్వం పై ఆమె ఏర్పరచుకొన్న నమ్మకం .,విశ్వాసం .అవి ఆమె మాటల్లో కన్పించాయట రచయితకు .’’నాగులు పట్ల దూషణ ను కనీసం ఆమె మనస్సు లో నైనా కాపాడుకొంది‘’అని తృప్తి పడతాడు .నాగులు చని పోతు ఉంగరాన్నే కాదు మరో అందమైన గుర్తు ను కూడా వదిలి పోయాడు అది ఆమె మనసుకే ప్రత్యేకం తీపి ముద్ర అది చేరిపినా చేరగానిది ,తరగని గని .
‘’నాగులు ఏ రాజకీయ నాయకుడో సాహితీ వేత్త ,సంగీత విద్వాంసుడోధన వంతుడో కాదు యజమాని దృష్టిలో .,పిల్ల నిచ్చిన వాళ్ళ దృష్టిలో సుఖాన్నిచ్చిన వాళ్ళ దృష్టిలో వాడొక అసమర్ధుడు చేతకాని వాడు .కాని కట్టుకొన్న పెళ్ళాం దృష్టిలో మాత్రం వాడొక కమ్మని కల ‘’అంత మాత్రం చేత లోకం వాడిని గుర్తుంచుకో వాల్సిన అవసరం లేదని సమాప్తం చేస్తాడు .నాగులు కీర్తి శేషుడే అందరి దృష్టిలో అయితే ఆ కీర్తి భార్యకే దక్కింది .అది ఆమె స్వంతం .మిగిలిన వారందరి దృష్టిలో వాడొక మృత జీవుడే .ఆమె దృష్టిలో జీవన్మృతుడు .కట్టుకొన్న వాడు కొట్టినా తిట్టినా సహించడమే కాక ‘’,పైమేత ‘’అలవాటు పడ్డా అర్ధం చేసుకోగల సగటు ఆడ మనిషి ఆమె .అందుకే లోపల ఎంత బాధ ఉన్నా ,తట్టు కొని నిల ఆడింది .
ఆ ఊళ్లోనే తన కంటి ఎదుటే భర్త అలా ప్రవర్తిస్తున్నా ,అతనిలో మంచినే చూసింది పిల్లలు పుట్టాక పోవటం తన తప్పు గానే అనుకోంది .ముత్తమ్మ వ్యవహారం లో వాడి తప్పేం లేదని ఊరడించుకోంది .పురుషాధిక్య లోకం లో ప్రతి ఆడదీ ప్రవర్తించి నట్లే రాజమ్మా ప్రవర్తించింది .తన మనో రాజ్యం లో ‘’నాగ ప్రతిష్ట ‘’చేసుకోంది .వాడేక్కడున్నా ,సుఖం గా ఉండాలని కోరుకోంది .వాడు పోతే కట్టలు తెగిన దుఖం తొ రోదించింది ఆమె ఒక్కతే .సతీత్వపు గుర్తు ఆమెనిలా చేయించింది .మూడు ముళ్ళ బంధం ఎంత గట్టిదో అతి సామాన్యులలోను ఆ పవిత్రత ను కాపాడు కొనే పద్ధతిని ఎలా అవలంబిస్తారో రాజమ్మ లో చూపించాడు మారుతీ రావు .’’నీ సుఖమే నే కోరుతున్నా –అందుకే నేనుంటున్నా ‘’అని పాడి నట్లు గా జీవించింది రాజమ్మ .అతన్ని కీర్తి శేషుని చేసిన రాజమ్మ ఆంతర్యం దొడ్డది .ఆ కీర్తి ఆమెది .,ఆమెకే స్వంతం .ఆమె వల్లనే అతడు చరిత్ర కెక్కాడు .కధా నాయకుడయ్యాడు .లేకుంటే మామూలు ‘’నాగులు గాడే ‘’ఆయె వాడు .తన మనో శిఖరం పై అతనికో గొప్ప ఉన్నత సింహాసనంవేసి కీర్తి కిరీటం పెట్టింది .సతీత్వపు బావుటా ఎగుర వేసి, కధా నాయిక అయింది రాజమ్మ .
మరో కధలో కలుద్దాం
సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ – 19-12-12- ఉయ్యూరు

