కాశీ ఖండం -34 పుణ్య కీర్తి అవతారం

  కాశీ ఖండం -34

                                 పుణ్య కీర్తి అవతారం

‘’వామాన్గా ధ్రువ తొ విష్ణుహ్’’అనే ప్రమాణం వల్ల అర్ధ నారీశ్వర స్వరూప మానుడైన పరమాత్మ సగుణా నికి సాకారం లో ఉండి ఎడమ భాగం నుండి ప్రకృతి స్వరూప మైన శక్తి తత్వాన్ని మూర్తీభావించుకొని ఇంకొక అద్భుత రూపాన్ని వెలయ జేశాడు .ఆ శక్తి పరమేశ్వరానుగ్రహం తొ దుష్ట శిక్షణ చేసే విష్ణు రూపం అయింది అమృత మధనం లో ఆవిర్భవించిన సౌందర్య రాశి లక్ష్మిని వివాహం చేసుకొన్నాడు .ఆమె హిమాలయాల్లో పార్ధివ లింగ పూజా నియమాన్ని స్వీకరించి రోజు వెయ్యి మామిడి పళ్ళ తొ‘’వేద సార శివ సహస్ర నామా వల ‘’ని పఠిస్తూ శివార్పణం చేస్తోంది ఆమె తీవ్ర తపస్సులో తన రెండు స్తనాలను కత్తితో కోసుకొని శివ లింగం పై ఉంచి అర్చించింది ,దానితో ఆమె శరీరాకృతి ఇది వర కంటే ద్విగుణీకృత సౌందర్యం తొ విరాజిల్లింది .తన తపస్సు ఫలితాన్ని శివునికే అర్పించింది ఆ సంకల్ప జలం నాలుగు దిక్కులకు వెద జల్లింది .ఆ బిందువులు పడిన చోట్ల వృక్షాలు మొలిచాయి .  

         శివుడు సంతోషించి ‘’విష్ణు పత్నీ !నువ్వు ఇప్పటి నుండి ఐశ్వర్య శక్తికి దేవతవవుతావు .పూర్వం నీ భర్త విష్ణువు నన్ను కమలాల తొ అర్చించి చివరకు నీ లాగానే తన కళ్ళను పెకలించి పూజించి నాకు ప్రీతీ పాత్రుడయాడు అప్పుడు నేను అతనికి‘’చక్రం ‘’అనే అతి గొప్ప ఆయుధాన్ని ప్రదానం చేశాను .నీ సహస్ర ఫల పూజా ఫలితం గా వృక్ష సంతతి అభి వృద్ధి చెందింది .అంతే కాక నీ పూజా ఫలితం బిల్వ వృక్షం గా ప్రసిద్ధి పొందుతుంది .అది నాకు చాలా ప్రీతికరం . అభిషేకం, భస్మం తొ పాటు బిల్వ దళం కూడా ఇక నుంచి మాకు ప్రీతికరమవుతుంది .జగన్మాత యొక్క హిరణ్మయీ శక్తి ని నీలో నిక్షిప్తం చేస్తున్నాను .శ్రీ సూక్తం నీ పూజలో ముఖ్య భాగం అవుతుంది .దీని పఠనం విశేష ఫలప్రదం .బిల్వార్చన ,శివ పూ జల్లో శ్రీ సూక్త పఠనం అత్యంత కైవల్య దాయకం .యజ్ఞాలలో శ్రీ సూక్తం చెబుతూ బిల్వ దళాలను పంచాక్షరి మంత్ర యుతం గా సమర్పించే వారు ఆఖండడ ఐశ్వర్యం పొందుతారు .’’వ్రుక్షోజ బిల్వః తస్య ఫలాని తపసాను దంతి మయాతరసయాస్చ బాహ్యా అ లక్ష్మీహ్’’తన భార్య లక్ష్మీ దేవి శివుడిని మెప్పించి నందుకు విష్ణు మూర్తి పొంగి పోతాడు .

           లక్ష్మీ నారాయనులిద్దరు ఆ తర్వాత కైలాసం చేరి శివుని ముందునిలబడి నమస్కరిస్తారు ‘’హరీ ! నా మాట ప్రకారం గణేశుడు కాశీ చేరి డుమ్ది రూపం పొంది అనుకున్న కార్యాన్ని దివ్యం గా నేర వేర్చాడు దివోదాసు మోక్ష ప్రాప్తికి సమయం దగ్గర పడింది .సకల దేవతా గణం తొ మీరందరూ వారణాసికి తరలి వెళ్ళండి .’’అని ఆదేశించాడు .శ్రీ దేవి జ్ఞాన బోధకు రాలిన తపశ్విని వేషం లో ‘’విజ్ఞాన కౌముది ‘’అనే పేరుతో అక్కడ అవతరించింది .గరుత్మంతుడు సాదు వేషం లో వినయ కీర్తి అనే శిష్యుడు అయాడు వీరి గురువు ధర్మా చార్యులు పుణ్య కీ ర్తి పేరుతో శ్రీ మహా విష్ణువు కాశీ చేరాడు . ఈ బృందం అనేక మహిమలను ప్రదర్శిస్తూ అందరిని ఆకర్షించింది .పద్దేనిమీదో రోజున పుణ్య కీ ర్తి దివోదాస చక్ర వర్తి దగ్గరకు చేర తాడు ఆయన అర్ఘ్య పాద్యాదుల తొ సత్కరించాడు స్వామితో చక్ర వర్తి తనకు ఆరోజు మహా పవిత్ర మైనదని అదే తగిన ముహూర్తం అని పూర్వం డుంధీ చెప్పిన విషయం  జ్ఞాపకం చేసుకొన్నాడు .స్వామితో తన మనసులోని మాటలు చెప్పుకొన్నాడు ‘’దైవీ శక్తిని కాదని నేను ఇంత వరకు స్వతంత్రించి పాలించాను స్వార్ధ రహిత ధర్మ శక్తి గొప్పది అని రుజువు చేయటానికే ఇంత పని చేశాను ఇక ఈ జీవితం పై విరక్తి కల్గింది వేరే మార్గామేమితో సెలవివ్వండి ‘’అని విన్న వించాడు .

        అప్పుడు పుణ్య కీ ర్తి రూపం లో ఉన్న విష్ణువు ‘మా ఉపదేశాలకు తాగి నట్లే మీరు నడుచుకొన్నారు .మా దృష్టిలో నాలుగు దానాలు  ముఖ్య మైనవి  .అవి భయం తొ ఉన్న వారి భయం పో గొట్టి అభయ హస్తాన్ని చ్చి ఆదువటం మొదటిది .రెండోది –రోగం తొ బాధ పడే వారికి తగిన సమయం లో మందులు అందించి ఆదు కోవటం మూడవది విద్యార్ధులకు విద్య కు ఆటంకం కలుగ కుండా శక్తికొలది విద్య నేర్పించి సాయపడటం నాల్గవది ఆకలి తొ ఉన్న వారికి కడుపు నిండా అన్నాన్ని పెట్టించటం అన్ని ధర్మాలలో ‘’అహింసా పరమో ధర్మః ‘’అనేది ఉత్రుష్టమైనది .నా మాటలను జాగ్రత్త గా అర్ధం చేసుకొని వెంటనే ఆచరణ లో పెట్టండి .సృష్టిలో ఎవరి హద్దు వారికి ఉంటుంది .మీ ఆలోచన మీ అంత రాత్మ వరకు పరమ సత్యమే .కాని పరమాత్మ దృష్టిలో మీరు దోషులు .సృష్టి నియమాలకు అతీతం గా మీరు వ్యవహరించారు .అందుకే ‘’నేను ఎందుకిక్కడ ?నా కేమి పని ఉంది ?’’అని విశ్వేశ్వరుడు కాశీ వదిలి మందరాచలం వెళ్లి పోయాడు ఆయన లేని కాశి నిర్వీర్యమైంది .పరమాత్మ దృష్టిలో మీరు చేసింది మహా పరాధం .ఆ పాప శాంతికి ఒక ఉపాయం ఉంది అదే ‘’లింగ ప్రతిష్ట ‘ఒక లింగ ప్రతిష్ట తొ ప్రపంచ ప్రతిష్ట కలుగుతుంది .ఈ రోజు నుంచి మొదలు పెట్టి ఏడు రోజుల్లో ప్రతిష్ట పూర్తీ అవ్వాలి .ఇది శివాజ్న ‘’అని చెప్పి పుణ్య కీ ర్తి రూపం లోనీ విష్ణు మూర్తి అంతర్ధానమయ్యాడు .

            సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21-12-12-ఉయ్యూరు 

 
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.