బాపని రాయబారం
తన మనసులోని ప్రేమను శ్రీ కృష్ణునికి విన్న వించటానికి పేరు లేని బాపనయ్య ను పిలిపించి కృష్ణుని చేరి తన విషయం తెలియ జేయమని కోరింది .’’రూఢ మేదో విషాలు ,వాచాలు నిన్ను బిల్వ న్వలసే నితకు నా వార్త దేల్ప బుదేన్ద్రా ‘’అన్నది .తన మనసంతా హరి పై చిక్కు కున్నదని సింహముపాలి సొమ్ము గోమాయువు హరిన్చేట్లు గా శిశుపాలుడున్నాడని పోతన శైలిలోనే చెప్పింది కాదు చెప్పించాడు సంజీవ రాయ కవి –
‘’కారము చేయునగ్రాజు వికారము దూరముగా భవచ్చమ –త్కారము జూపి ,నాదగు ప్రకారము శౌరికి విన్న వించి ,స
త్కారము సేయనిన యుపకారము కై ప్రతీకారమే నమ-సకారము నేయు చుండుదు చొ కారాముగా హరి దెచ్చు నంతకున్ ‘’అంటూ ‘’కారం ‘’తో చమత్కారం చేస్తాడు కవి ..
బాపడు ద్వారకా నగరం చేరి అక్కడి పట్టణవిశేషాలన్నీ తిలకిస్తాడు .పుర వర్ణన లో అద్భుత మైన పద్యాలున్నాయి .తన రాక ను ద్వార పాలకుని ద్వారా ద్వారకా కాన్తునికి చెప్పిస్తాడు .ఆయన విని ,’’భీష్మ కరాట నయా ,గతి దెల్పగా వచ్చిన వాడ’’నితెలిసి హృష్ట చిత్తుడౌతాడు కన్నయ్య .అంతటి పరేంగితావగాహి .బ్రాహ్మణునికి ఎదురేగి పూజించి ఉచితాసనం పై కూర్చో బెట్టాడు .ఇక్కడ శ్రీ కృష్ణుని దివ్య సుందర విగ్రహాన్ని చూసి నోరారా ప్రస్తుతిస్తాడు రాయబారి బాపడు .ఎన్ని పద్యాలు చెప్పి వర్ణించినా కవి కౌతుకం తీరలేదు .ఓ దండకం దండ వేసి ,దంచేస్తాడు .అదీ సంతృప్తి నివ్వదు .బహు విధ కందాలలో అర వింద దళాయతేక్షణుడిని వర్ణిస్తాడు .పాద భ్రమర ,క్షురికా బంధ , ఆర్ద భ్రమర ,గుడి ఏకాక్షర ,తల కట్టు ,శ్రుంగ కందాలలో అందాన్ని కలం యేతాముతో తోడేస్తాడు .ఇది చాలక గుణితం లో గుణిస్తాడు .సాప్తిక ,ఆంద్ర సప్తిక విభక్తికం గా భక్త్యంజలి ఘటిస్తాడు ..చక్ర బంధ ,నాగ బంధ అనుప్రాస సీస ,ఆంద్ర గీర్వాణ భాశిక్య పద్యాలతో ఆనంద పులకామ్కితం గా చక్ర వర్ణన చేస్తాడు .రుక్మిణీ సందేశాన్ని అప్పుడు విని పిస్తాడు .అలాగే రుక్మిణి అందాలణు రుక్మిణీ కాన్తునికి విన్న విస్తాడు .ఇదంతా ఒక రసమయ లోకం లా ఉంటుంది .ఇక్కడ ఒక పద్యం హృద్యం గా రాస్తాడు
‘’అభ్ర విభ్రమము మధ్యమమునందే కాదు -పొందిన వేనలి యందు గలదు
హరి మనోహరిత్వ మాస్యమ్బునందే కా—దనిశము పాలకుల యందు గలదు ‘’ అంటూ ‘’ముందు శ్రీత్వంబు భావంబు నందే కాదు –కర్ణముల యందు గలదు ‘’అంటూ ‘’ ఆ వరారోహ యాఖ్య చేత నె కాదు దేహ విభూతి నలరు‘’అని ముక్తాయింపు నిస్తాడు .
ఆమె పలకులు ‘’కున్డంములు పలు కుదురున ,కుండంము లటంచు బల్కు గోన నౌ జేలికిన్ ‘’అని చెప్పుతూ‘’కం దమ్ములు లు ఘన శోభా –కం దమ్ములు మారుని నంత గందమ్ములగున్ ‘’అన్న మాటలు ఆయన కంద పద్యాలకు అన్వ యించ వచ్చని పిస్తుంది .అందమైన కందం ,మా కందం ,మధుర నిష్యందం ,ఆనంద రస నిక్షేపం .
సశేషం మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-12-12-ఉయ్యూ

