శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -5(చివరి భాగం )
రుక్మిణీ కృష్ణ పరిణయం
శ్రీ కృష్ణుడు రుక్మిణి సందేశాన్ని విని పోతన గారు ‘’వచ్చెద విదర్భభూమికి ‘’అని చెప్పి నట్లు సంజీవ రాయ కవీ చెప్పాడు .’’వచ్చేద విదర్భ నృప వరాన భీష్మక కుండి నంబు ‘’అని చెప్పాడు .బ్రాహ్మణుడు బయల్దేరాడు .కృష్ణుడు‘’సకలా రాతి చమూ సమూహ కలశా కూపార ,మందానమై ,పటు రుక్మిన్య బాలా వివాహ కలనా ప్రారంభ సందానమై‘’బయల్దేరాడు కుండిన నగరానికి .
చతుర్ధా శ్వాసం లో రుక్మిణి తాను పంపిన రాయ బారి కోసం ఎదురు చూడటం వెళ్ళాడో లేదో నని సందేహించటం తన సందేశం చెప్పాడో లేదో నని పోతన గారి రుక్మిణి లా సందేహించటం ఇక్కడా ఉంది.తర్వాత విరహం ,ఉప చర్యలు ‘’చక్కని దాన నంచు నేల జవ్వని నంచు సఖీ జనావళి ‘’అన్న పద్యం ముక్కు తిమ్మన గారి సత్య భామ పద్యం లా ఉంటుంది .ఆమె విరహాన్ని భరించలేక ‘’భైరవ కామ సుమాస్త్ర వేదనా శాలినిజంగ జాల గని హస్తాద్రికి చేరాడు .చంద్రోదయ వర్ణన కూడా సందర్భోచితం గా చేశాడు .’’ఆగ మిష్య త్శ్రిత య యామినీ నిటలాగ్ర దీపిత చందన తిలక మనగ ‘’లా ఉన్నాడు చంద్రుడు .రుక్మిణి పూర్ణ చంద్రుని పూజించి ‘’సిత భాసురాయ పూత వివిధ సుపరవిక పుణ్య దాయ దివ్య తారక మూర్తయే తే నమోస్తు ‘’అని సంస్కృత పదభూయిష్ట్సం గా స్తుతిస్తుంది .తర్వాత‘’పాపి ‘’అనే అదే రేంజి లో తెలుగు లో తిట్టి పోయింది .
తర్వాత భానూదయం –‘’రుక్మిణీ కన్యకా వివాహ పూర్వ పరి ప్రేష్య వర చిరతర దీప్య మాన రత్నాకార దీపమనగా ‘’అన్నట్లు సూర్యుడు ఉదయించాడు .శ్రీ కృష్ణ భాగవానుడూ ఉదయించాడు .బ్రాహ్మణ ,సుదర్శన యోగమూ కలిగింది .వివరాలు తెలుసుకొని సంబర పడింది .గుండె దిటవు చేసుకొన్నది ..ప్రత్యుపకారం గా ‘’అంజలి ‘’ఘటించటం తప్ప ఏమీ చేయలేని అశక్తు రాలనని చెప్పి దీవన పొందింది .
శ్రీ కృష్ణుడు ఒంటరి గానే బయల్దేరాడు .తర్వాత ససైన్యం గా అన్న బలరాముడు వచ్చాడు .పోతన గారి లాగానే ‘’జతయా చక్రి విదర్భ రాజ సుతకున్ ,సత్యంబు వైదర్భియున్ జత ఈ చక్రికి నింత లెస్స యగునే ‘’అని పుర జానులనుకొన్నారు .భవానీ దేవిని దర్శించి ‘’మతి లో నమ్మితి నేసనాతనుల నమ్మా ,మిమ్ము బ్రోచిన దంపతులుగా ‘’అని పోతన గారి రుక్మిణి ‘’నమ్మితి ణా మనంబున సనాతనులైన ఉమా మహేశులన్ ‘’అన్న పద్యాన్ని ప్రేరణ గా చెప్పాడు సంజీవ కవి .రుక్మిణిని అశ్వం పై చేర్చిన కృష్ణుడు ద్వారకకు చేరటం శిశుపాలుడు ఎదిర్చినా ఫలితం లేక పోవటం రుక్మి ఎదిరించి శ్రుంగ భంగ మవటం మనకు తెలిసిందే
ద్వారక లో గార్గ పురోహితుడు శుభ లగ్నం లో వివాహం జరిపించాడు .’’వృష రాశి జాత ,యాదవ వ్రుషభుడు రుక్మినీంద్రు తులయన్మిష చేత భార్గవి యయ్యెను ద్రుశానే కాది పతయ మేసంగే నుభయతన్ ‘’అని చెప్పి కవి తన జ్యోతిష పాండిత్యాన్ని చక్క గా జోడించాడు .తులా వృష భాలకు రాశి నాయకుడు ఒక్కడే అవటం భార్గవుడైన హరికి ,భార్గవి అయిన రుక్మిణి అని చమత్కరించాడు .’’హరి పతి యగు చుండగా మరి ,హరిణీ నామము ఘటిల్లి నది‘’అన్నాడు .హరి ది గోరాశి .రుక్మిణిది తుల .షష్టా ష్టకం .న్యాయం గా పనికి రాదు పొత్తు కుదరదు .కాని ‘’ఉభయైక స్వామికత్వం ‘’వల్ల దోషం లేదని తేల్చాడు .మానుష రూపం దాల్చిన కృష్ణుడు మాయి మూర్తి .మాయ లేనిది రుక్మిణి జగన్మాత .వారిద్దరి పరిణయం చేయటం తనకు పూర్వ పుణ్య ఫలమని గర్గుడు భావించాడు .వివాహం మన పద్ధతి లోనే జరిపించాడు .’’జానక్యః కమలాంజలి ‘’అన్న ప్రసిద్ధ శ్లోకం లోనీ భావాన్ని ‘’రుక్మిణి పోసే ముత్యాలు కెంపు లై హరి శిరం పై పడి శుద్దాలై శరీరం నుండి జారుతూ నీలాలై తలంబ్రాలు శోభించాయట .వధూ వరులు పేర్లు చెప్పుకోవటం ,పరమాన్నం తినటం పానుపు మీద తాంబూలాలు కొరకటం ,నాక బలి వగైరాలు పూర్తీ చేశారు .తర్వాతా గర్భా దానమూ చేయించాడు కవి .రుక్మిణీ కళ్యాణం ఈ విధం గా ఫలప్రదం అయింది .ఈ కధ వ్రాసినా ,విన్నా ,చెప్పినా శ్రీ కైవల్యం తప్పదని సంజీవ రాయ కవి భరోసా ఇచ్చాడు .ఇలా పోతన గారి పోకడా ,భట్టు మూర్తి అల్లికా ,వేంకటకవి చాతుర్యం త్రివేణీ సంగమం గా వర్ధిల్లిన కావ్యం ఇది .కవి సంజీవ రాయలకు ,మనకు ఈ దివ్య సంజీవినిని అందించిన వారి వారసుడు స్వర్గీయ గంధం వేంకా స్వామి శర్మ గారికి అంజలి ఘటిస్తున్నాను .రుక్మిణీ పరిణయ కావ్యం భవ్యం దివ్యం–శుభం భూయాత్
సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-12-12-ఉయ్యూరు

