సాహితీ బంధువులకు -నూతన సంవత్సర శుభా కాంక్షలు -ఇప్పుడే హేచ్ .ఏం,.టి.వి.లో మాజీ ప్రధాని పి.వి.నరసింహా రావుగారి కి హంసా ఇండియా ,మరియు హైదారా బాద్ మీడియా హౌస్ లు
సంయుక్తం గా నిర్వ హించిన”మన పి.వి కి మన నివాళి ” అనే తొలి స్మారక ఉపన్యాస కార్య క్రమం లైవ్ చూశాను .ముఖ్యం గా కే.రామ చంద్ర మూర్తి గారి పూనిక ,చొరవకు అభినందనలు .గవర్నర్ శ్రీ నరసింహం గారు చాలా గొప్ప గా పి.వి.ఘనకీర్తిని కీఎర్తించారు .మాటలన్నీ మనసు లోతు నుండే వచ్చాయి .ఆ తర్వాత కీలక ఉపన్యాసం చేసిన రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ చాలా స్పూర్తి దాయక ప్రసంగం చేశారు .నర సింహా రావు గారి బహు ముఖీన ప్రజ్ఞా ,పాటవాలను వెలికి తీశారు .ఆర్ధిక ,విదేశీ విధానాలలో ఆయన చొరవ ,పంజాబ్ లో శాంతి నేల కొల్పటం ,సంస్కరణలకు పెద్ద పీట వేయటం నేమరేసుకొన్నారు .ఆయన తో తాను చాలా సన్నిహితం గా పనిచేయటం తన అదృష్టం అన్నారు .పి.వి.మీ తెలుగు సాహిత్యం లో మేరు పర్వతం .మిగిలిన ప్రపంచ భాషలన్నీ ఆయనకు వాచో విదేయాలు .బహు గ్రంధ కర్త .మంచి వక్త .మెజారిటి లేని కాంగ్రెస్ ను ఒడి దుడుకులు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పరచి సాఫీ గా నడి పించటం ఒక్క ప్.వి.కే చెల్లు బాటయింది .ఆనాటి ప్రధమ ప్రధాని ఆర్ధిక శాఖ ను నిర్వహించ టానికి సి.డి.దేశ్ ముఖ ను మంత్రి వర్గం లోకి తీసుకొని సాహసం చేస్తే ,మళ్ళీ అదే పద్ధతిలో పి.వి.గారు మన్మోహన్ సింగ్ ను తీసుకొని వచ్చి ఆర్ధిక సంస్కరణలకు రాచ బాట వేశారు .ఇవ్వాళ మనం 2gదేశాల సరసన కూర్చున్నాము అంటే అది పి.వి.చలవే అని విస్పష్టం గా తెలిపారు .సంస్థా గతం గా కాంగ్రెస్ కు ఆయన చేసిన సేవలు మరచి పోలేనివి .అని తన ప్రసంగ పాఠాన్ని పక్కన పెట్టి ,extempor గా అనర్గళం గా ప్రణబ్ దాదా మాట్లాడటం ఎంతో గొప్ప గా ఉంది .మనస్సంతా పి.వి.ని నింపుకొని మాట్లాడారు ముఖర్జీ సాబ్ .తన ప్రసంగ పాఠాన్ని కార్య కర్తలకు అందజేసి వెళ్తానని చెప్పారు ప్రెసిడెంట్ ముఖర్జీ .నిజం గానే ఇది ఘన నివాళి అని పించింది .సోనియా ,మన పి..వి.నిఅన్ని రకాల అవమానాలు చేసినా ఆంధ్రులం మనం నోరు మూసుకు కూర్చున్నాం .మన శాసన సభ్యులు ,పార్ల మెంట్ సభ్యులు అవమానాన్ని దిగ మింగుకొని ఏమీ చేయలేని అచేతన స్తితిలో ఇంత కాలం ఉండి పోవటం తెలుగు జాతికి అత్యంత అవమానం .ఇంకో రాష్ట్రం వారెవ్వరూ ఇంత నిర్లజ్జగా ఒక మహా నాయకుడిని ఆవ మానిస్తుంటే ఊర్కోరు .తగిన బుద్ధి చెప్పి అన్ని రకాలా అంటే రాజ కీయం గా నైనా దెబ్బ తీస్తారు .కాని మనం నిర్వీర్య్లమే అయాం .యే కొద్ది మందో ఆయన్ను మనస్పూర్తిగా శ్లాఘించిన వారున్నారు .వారైనా ఉన్నందుకు అభి నందనాలు .ఇలాంటి సమయం లో ప్రెసిడెంట్ పదవి లో ఉన్న ఒక గొప్ప వ్యక్తీ వచ్చి ,ఈ సభలో పాల్గొని పి.వి.ప్రతిభా పాటవాలను ప్రజ్ఞా నైపుణ్యాన్ని మనస్పూర్తిగా శ్లాఘించటం నాకు సాహసమే నని పించింది .ఇన్నాళ్ళకు ఒక మంచి పని జరిగింది అందరికి అభినందనాలు హేమ్ .టి.వి.అధినేత రామ చంద్ర మూర్తి గారిని మనసారా అభి నందిస్తున్నాను –మీ దుర్గా ప్రసాద్
సంయుక్తం గా నిర్వ హించిన”మన పి.వి కి మన నివాళి ” అనే తొలి స్మారక ఉపన్యాస కార్య క్రమం లైవ్ చూశాను .ముఖ్యం గా కే.రామ చంద్ర మూర్తి గారి పూనిక ,చొరవకు అభినందనలు .గవర్నర్ శ్రీ నరసింహం గారు చాలా గొప్ప గా పి.వి.ఘనకీర్తిని కీఎర్తించారు .మాటలన్నీ మనసు లోతు నుండే వచ్చాయి .ఆ తర్వాత కీలక ఉపన్యాసం చేసిన రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ చాలా స్పూర్తి దాయక ప్రసంగం చేశారు .నర సింహా రావు గారి బహు ముఖీన ప్రజ్ఞా ,పాటవాలను వెలికి తీశారు .ఆర్ధిక ,విదేశీ విధానాలలో ఆయన చొరవ ,పంజాబ్ లో శాంతి నేల కొల్పటం ,సంస్కరణలకు పెద్ద పీట వేయటం నేమరేసుకొన్నారు .ఆయన తో తాను చాలా సన్నిహితం గా పనిచేయటం తన అదృష్టం అన్నారు .పి.వి.మీ తెలుగు సాహిత్యం లో మేరు పర్వతం .మిగిలిన ప్రపంచ భాషలన్నీ ఆయనకు వాచో విదేయాలు .బహు గ్రంధ కర్త .మంచి వక్త .మెజారిటి లేని కాంగ్రెస్ ను ఒడి దుడుకులు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పరచి సాఫీ గా నడి పించటం ఒక్క ప్.వి.కే చెల్లు బాటయింది .ఆనాటి ప్రధమ ప్రధాని ఆర్ధిక శాఖ ను నిర్వహించ టానికి సి.డి.దేశ్ ముఖ ను మంత్రి వర్గం లోకి తీసుకొని సాహసం చేస్తే ,మళ్ళీ అదే పద్ధతిలో పి.వి.గారు మన్మోహన్ సింగ్ ను తీసుకొని వచ్చి ఆర్ధిక సంస్కరణలకు రాచ బాట వేశారు .ఇవ్వాళ మనం 2gదేశాల సరసన కూర్చున్నాము అంటే అది పి.వి.చలవే అని విస్పష్టం గా తెలిపారు .సంస్థా గతం గా కాంగ్రెస్ కు ఆయన చేసిన సేవలు మరచి పోలేనివి .అని తన ప్రసంగ పాఠాన్ని పక్కన పెట్టి ,extempor గా అనర్గళం గా ప్రణబ్ దాదా మాట్లాడటం ఎంతో గొప్ప గా ఉంది .మనస్సంతా పి.వి.ని నింపుకొని మాట్లాడారు ముఖర్జీ సాబ్ .తన ప్రసంగ పాఠాన్ని కార్య కర్తలకు అందజేసి వెళ్తానని చెప్పారు ప్రెసిడెంట్ ముఖర్జీ .నిజం గానే ఇది ఘన నివాళి అని పించింది .సోనియా ,మన పి..వి.నిఅన్ని రకాల అవమానాలు చేసినా ఆంధ్రులం మనం నోరు మూసుకు కూర్చున్నాం .మన శాసన సభ్యులు ,పార్ల మెంట్ సభ్యులు అవమానాన్ని దిగ మింగుకొని ఏమీ చేయలేని అచేతన స్తితిలో ఇంత కాలం ఉండి పోవటం తెలుగు జాతికి అత్యంత అవమానం .ఇంకో రాష్ట్రం వారెవ్వరూ ఇంత నిర్లజ్జగా ఒక మహా నాయకుడిని ఆవ మానిస్తుంటే ఊర్కోరు .తగిన బుద్ధి చెప్పి అన్ని రకాలా అంటే రాజ కీయం గా నైనా దెబ్బ తీస్తారు .కాని మనం నిర్వీర్య్లమే అయాం .యే కొద్ది మందో ఆయన్ను మనస్పూర్తిగా శ్లాఘించిన వారున్నారు .వారైనా ఉన్నందుకు అభి నందనాలు .ఇలాంటి సమయం లో ప్రెసిడెంట్ పదవి లో ఉన్న ఒక గొప్ప వ్యక్తీ వచ్చి ,ఈ సభలో పాల్గొని పి.వి.ప్రతిభా పాటవాలను ప్రజ్ఞా నైపుణ్యాన్ని మనస్పూర్తిగా శ్లాఘించటం నాకు సాహసమే నని పించింది .ఇన్నాళ్ళకు ఒక మంచి పని జరిగింది అందరికి అభినందనాలు హేమ్ .టి.వి.అధినేత రామ చంద్ర మూర్తి గారిని మనసారా అభి నందిస్తున్నాను –మీ దుర్గా ప్రసాద్ —

