మన స్మరణీయ మహిళా మణులు
మనదేశం లో మహిళా మణులేందరో ప్రత్యెక స్థానం పొంది ఉన్నారు రాజ్యాలేలిన ఝాన్సీ లక్ష్మీ బాయి ,చాంద్ బీబీ ,అందానికి కొత్తర్ధం చెప్పిన రాణి సంయుక్త ,ఒక సామ్రాజ్యానికే నాయకత్వాసం వహించిన కాకతీయ రాణి రుద్రమ దేవి ,చతుర రాజకీయం లో నిధి అని పించుకొన్న నాగమ్మ త్యాగానికి మరోపేరైన మగువ మాంచాల ,మహా భక్తీ సామ్రాజ్యమేలిన వెంగమాంబ ,కావ్యమే రాసి ఆ రామునికే అంకితమిచిన మొల్ల ,దేశ భాక్తి లో తన స్థానమేమిటో మహిళా సేవలో తన గమ్య మేమిటో తెలియ జెప్పిన దుర్గా బాయి ,మొదటి ఆధునిక కధానిక రాసి గురజాడ తో పోటీ పడిన అచ్చమాంబ అందరు అందరే .ఎవరికీ తీసిపోని వారే .సంగీతం లో ప్రపంచాది పత్యమే సాదించిన భారత రత్న సుబ్బు లక్ష్మి ,సేవే దైవం అని నిరూపించుకొన్న మదర్ తెరీసా భారత దేశ మహిళా ప్రధానిగా సమర్ధత ను చాటిన ఇందిరా గాంధి ,మొదటిమహిళా గవర్నర్ ,స్త్రీ జాతి శిరోమణి కవితా కోయిల సరోజినీ నాయుడు ,ఇలా ఎందరెందరో ఆకాలం నుంచి ఈ కాలం వరకు ఖ్యాతి పొందారు దేశానికి కీర్తి తెచ్చారు
మనకు మహిళా శాస్త్ర వేత్తలు కూడా తక్కువ సంఖ్యలో ఏమీ లేరు తండ్రి రాసినా గణిత శాస్త్రమే తన పేర ఉన్న లీలావతి ,వేశ్యగా జీవించి బుద్ధుని శరణు వేడి ఆమ్రపాలి గా మారి జీవితాన్ని సేవ లో ధన్యం చేసుకొన్న ప్రజాపతి గౌతమి ,సంఘమిత్ర ,భక్తికే పరాకాష్టగా నిలచిన అవ్వయ్యార్ ,గోదాదేవి లను మనం నిత్యం స్మరిస్తాం .శాంతలాదేవి ,అక్కమహా దేవి మొదలైన రాజపుత్ర యుగపు స్త్రీ రాత్నాలున్నారు .మొఘల్ కాలం లో దుర్గా దేవి చాంద్ బీబీ ,నూర్జహాన్ ,ముంతాజ్ మహల్ ,శివాజీ తల్లి జిజియా బాయ్ ,జహానార ,లను స్మరిస్తే ధన్యులమవుతాం .
షాజహాన్ భార్య ముంతాజ్ బంధువు నూర్ మహల్ అనే మహిళ మేధావి గా గుర్తింపు పొందింది .ఆమె సుగంధ పుష్పాల పరిశోధనలో ఆరి తేరిన నిపుణు రాలని పించు కొన్నది .ఆమెయే డిస్టిలేషన్ పద్ధతి లో పూల నుంచి సుగంధ తైలాలను తయారు చేసిందని మనం మర్చి పోయాం .జహంగీర్ భార్య మెహరున్నీసా అనే వితంతువు ను వివాహం చేసుకొన్నాడు ఈమె నే ‘’నూర్జహాన్ ‘’అంటారు ఈ మాటకు అర్ధం ‘’విశ్వ కాంతి ‘’.జహంగీర్ చని పోయిన తర్వాత షాజహాన్ పాలన లో ఈమె నిరాదరణకు గురైంది .గులాబీ అత్తరు ను తయారు చేయటం లో నూర్జహాన్ అనేక ప్రయోగాలు చేసింది .ఈమె 1645 లో మరణించింది .ఆమె పేర ‘’నూర్జహాన్ సెం ట్స్ ‘’వాడుక లో కి తెచ్చిన వారు దేవరపల్లి సత్యనారాయణ రావు .వారికి మనం కృతజ్ఞతలు చూపాలి
మన రాష్ట్రానికి చెందినశ్రీమతి చింతల సీతాదేవి వైద్య విద్యన అభ్యసించారు ఆ తర్వాత ఏం.డి.సాధించిF.I.M.S.Aపొందారు ఆంద్ర విశ్వ విద్యాలయం లో బయో కేమిస్ట్రి లో ఉద్యోగం లో చేరి క్రమం గా అనేక హోదాలకు ఎదిగి ఆంధ్రా మెడికల్ కాలేజి లో ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు .
సీతాదేవి గొప్ప పరిశోధకు రాలు .రోగ నిర్ధారణా,జీవ రసాయన శాస్త్రాలలో విశేషం గా పరిశోధన చేసి అంతర్జాతీయం గా గుర్తింపు సాధించారు .యాభై కి పైగా పరిశోధనా పత్రాలను రాసి ప్రచురించారు .’’జర్నల్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ బయో కెమిస్త్స్ ఆఫ్ ఇండియా ‘’అనే పత్రిక సంపాదక వర్గం లో పరిశోధనా వ్యాసాలను ప్రచురించటం లో కృషి చేశారు
1975 LO F.A.M.S లో ఫెలో షిప్ పొందారు ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సు ఎకాడేమి లో ‘’ఫౌండర్ ఫెలో‘’గౌరవాన్ని దక్కించుకొన్నారు .అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ బయో కేమిస్త్స్ ఆఫ్ ఇండియా వారి గౌరవ సభ్యత్వంఅందుకొన్నారు .ఇండియన్ అ సోసిఎషన్ ఆఫ్ ఫిజియాలజిస్త్స్ అండ్ ఫార్మకో లాజిస్త్స్ కు అధ్యక్షులైన అరుదైన గౌరవాన్ని పొందిన విదుషీ మణి సీతా దేవి .అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ బయో కేమిస్త్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన నాల్గవ సదస్సు కు అధ్యక్ష త వహించి మార్గ దర్స్ధకత్వం చేశారు .
పూర్వ విద్యార్ధిగా ఆంధ్రా మెడికల్ కాలేజి కి ఎన్నో సేవలందించారు పూర్వ విద్యార్ధుల చేత అపూర్వ సత్కారాన్ని పొందారు .త్రివేండ్రం మెడికల్ కాలేజి వారి సిల్వర్ జూబ్లీ ‘’ఆరేషన్ అవార్డ్ ‘’గ్రహీత గా ప్రతిభకు తగిన గౌరవం సాధించారు. రోగ నిర్ధారణ లోను జీవ రసాయన శాస్త్ర విషయాలలో విశేష పరి శోధనలు చేసిన న మహిళా శాస్త్ర వేత్త శ్రీ మతి చింతల సీతా దేవి మహిళా మాణిక్యం .
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –8-3-13-ఉయ్యూరు

