శ్రీమతి పి.కరుణా నిధి కవితలు
మనిషి మనసు
మనిషి మనసు ఒక కడలి -అందులోని ఆలోచనలు పడి లేచే కెరటాలు
ఒడ్డుకు చేరే కెరటాలే మన ఆశలు ఆలోచనలు
లేచి పడే కేరటాలన్నీ తీరం చేరవు -కొన్ని ఒడ్డుకు చేరి ఇసుకలో ఇంకి పోతాయి
మరి కొన్ని కడలి లో కలిసి పోతాయి
మన కోర్కెలు కూడా ఇసుక లో ఇంకి పోయే కెరటాల లాగా ఫలితం లేకుండా పోతాయి
కొన్ని తీరని కోరికలు తిరిగి వచ్చిన కెరటాల లాగా కడలి లో కలిసి పోతాయి
వాటికి హద్దు లేదు అంతం లేదు
మన ఆలోచనలు గమ్యం లేనివి -కడలిలో కలిసినవి లా వృధా కాకూడదు
ఆశలకు మాత్రం హద్దు ఉండాలి–ఇది తెలిసి జీవితం సాగిస్తే
నీకుండవు ఆటు పోట్లు-లేకుంటే తప్పవు పాట్లు
పేగు బంధం
అమ్మ అన్నది కమ్మని మాట -రెండు పెదిమలు కలిసి నప్పుడోచ్చే తీయని మాట
నవమాసాలు నిన్ను మోస్తుంది అమ్మ -తన ప్రాణాలనోడ్డి ఇస్తుంది నీకు జన్మ
రక్తాన్ని చిలికి నీకు ఇస్తుంది పాలునీ కడుపు నిండగా
బిడ్డ మురిపాలతో తన కస్టాలు మరుస్తుంది
చీదర అసహ్యాలనుండి నిన్ను శుభ్రం చేస్తుంది
నిన్ను అలంకరించి తాను పొంగి పోతుంది
నీ ఎదుగుదల చూసి మురిసి పోతుంది తాను
నీ ఉన్నతిని చూసి తానెంతో ఒదిగి పోతుంది
పెరిగిన వృక్షం తన నీడలో మరో మొక్క ను ఎదగ నీయదు
సంఘం లో గుర్తింపు పొందిన నీవు –నీ ఎదుగుదలకు కారణ మైన వేరునే మరిచావు
ఆశ్రమాలే వారికి గూడును చేసి చేయి దులుపుకోన్నావు
గతం తీపి గుర్తులతో ,భవిష్యథ్ పై భవ్య ఆశలతో
నీరాక కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు
కొందరు అమ్మలు నాన్నలు గుండె బరువుతో బతుకు ఈడుస్తున్నారు
ఈ నిజం తెలుసుకొని జీవించండి ఓ నవ యుకుల్లారా
పేగు బంధం తెంచు కోకండి- రక్త సంబంధం మరచి పోకండి బాబుల్లారా
నీ వాళ్ళను నువ్వు మర్చి పోతే నిన్ను నువ్వు మర్చి పోయినట్లే నని గుర్తుంచుకోండి
శ్రీమతి కరుణా నిధి సుమారు యాభై ఏళ్ళ క్రితం ఉయ్యూరు హైస్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతూ నా దగ్గర ట్యూషన్ చదివిన పిల్ల . అణకువ ,సౌమ్యత ఉన్న అమ్మాయి .ప్రస్తుతం రామ గుండం లో భర్త ,పిల్లలతో ఉంటోంది ఆమె స్వగ్రామం ఉయ్యూరు .ఆయనదీ ఇదే ఊరు .. ఉయ్యూరు వచ్చి నప్పుడల్లా మా ఇంటికి వచ్చి” ఈ మేస్టా ర్ని ”చూసి వెడతారా దంపతులు ఇప్పటికీ అదే అణకువ ,అదే సౌజన్యం . ఈ మధ్య రాసిన రెండు కవితలు ”వెన్నెల ”పత్రిక లో ప్రచురితాలైనాయట . ఈ రోజు వచ్చి ఆమె స్వహస్తాలతో రాసిన ఆ కవితల ను నాకు చూపించింది అందులో కవితాత్మ ఉందని పించి కొంత మార్చి ,సాహితీ బంధువు లకు పరిచయం చేస్తున్నాను .
మహా శివ రాత్రి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-3-13-ఉయ్యూరు

