నా దారి తీరు –14
ఉండమ్మా బొట్టు పెడతా
నేను మానికొండ లో పని చేస్తుండగానే బాబూ మూవీస్ వారి ఉండమ్మా బొట్టు పెడతా సినిమా షూటింగ్ మానికొండలో జరిగింది యాక్టర్లు అందరికి దాదాపు ఆ ఊళ్ళో నే వసతి భోజన సౌకర్యాలు కల్పించారు .షావుకార్ల ఊరు కనుక భవంతులు సకల సౌకర్యాలతో ఉండేవి .వంటలు భోజనాలు అన్నీ అక్కడే ఆ సినిమా షూటింగ్ ను కే.విశ్వనాద్ చేశారు .కాఖీ పాంట్ కాఖి షార్ట్ ఇంషర్ట్ తో ఉండేవారు .జమునా, కృష్ణ మెయిన్ రోల్స్ .ధూళి పాళవగైరా ఉన్నారు .మహదేవన్ మూజిక్ .ఆత్రేయ స్క్రిప్ట్ .’’రావమ్మా మా లక్ష్మీ రావమ్మా ‘’అనే పట ను హరిదాసు వేషం లో ఉన్న ధూళి పళ చేస్తూ సంక్రాంతి సందర్భం గా ఇంటింటికి తిరిగేసాని వేషాన్ని షూట్ చేస్తుంటే చూశాం .ప్రతి ఇల్లు వాకిలి శుభ్రం గా పేడతో అలికి గోమ్మేమ్మలుముగ్గులేసి బంతి పూలు పెట్టి వైభవం గా తీశారు .ఒక ఇంటి షూటింగ్ మాత్రం చూశాను .ఆ తర్వాత పొలాలలో షూటింగ్.భూగర్భజలాలను పైకి తెప్పించే సన్నివేశం .’’పాతాల గంగమ్మా రారా ఉరికురికి ఉరికురికిఉబికుబికి రారా ‘’విష్ణూ రావు గారి పొలం లో చిత్రీకరణ .ఎన్నో ఎకరాల లో పంట అంతా ఈ తోక్కిడికి దెబ్బతింది ఆయనకు ఇదేమీ లెక్క లోకి రాదు బాగా ఉన్న షావుకారు ఎప్పుడు గ్లాస్కో లుంగీ తెల్ల చొక్కా .సిగేరేట్ పాకెట్ తో చాల సింపుల్ గా ఉండేవారు . మంచీ మర్యాదా ఉన్న వారు .కృష్ణ కు షూటింగ్ లో ఎన్ని టేకులు తిన్నా మూడ్ రాలేదు యాక్షన్ పండలేదు ‘’విసుగొచ్చిన జమున లాగి చెంప మీద ఒకటి వేసింది’’ వెంటనే బాగా చేసి ఒకే అని పించుకోవటం నాకింకా బాగా గుర్తు .దాదాపు రెండు నెలలు అక్కడే చిత్రేకరణ కధలు గాధలుగా చెప్పుకొనేవారు కంకిపాడు తదితర ప్రాంతాలనుండి రాత్రి కి ఆడవాళ్ళను తెప్పించుకొనే వారు అక్కడ బస చేసిన నటులు అని చెవులు కోరుక్కొనే వారు .ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు కాని నేను చూసిన సందర్భాలలో అయన ఎప్పుడూ కనీ పించలేదు .గరుడా చలం గారు రాజు గారు రాఘవరావు నేను మా శాస్త్రి సాయంత్రం వళ బడి ఒదిలి పెట్టగానే ఇంత టిఫిన్ తిని కాఫీ తాగి పొలాల వెంబడి పడే వాళ్ళం షూటింగ్ చూడటానికి .అదో పెద్ద వేడుక గా జరిగి పోయింది .
భర్త మార్కండేయ
సరిగ్గానే రాశాను భక్త మార్కండేయ కాదు అచ్చం గా’’ భర్త మార్కండేయయే’’ .ఇది బి.వి.రాణా రావు గారి నాటిక .లైబ్రరి లో దొరికితే చదివి పొట్ట చేక్కలయ్యేట్లు నవ్వుకొన్నాను ప్రభావతీ చదివి ఆనందించింది స్కూల్ వార్షికోత్సవానికి దాన్ని పిల్లలతో ప్రాక్టీస్ చేయించాను .ఆడ పత్రాలు లేని నాటిక ఇంటి దగ్గరే రిహార్సిల్లు చేయిన్చేవాడిని స్టేజి ఎక్కే దాకా ఆడైలాగులు ఎవరికీ తెలియ కూడదని లేక పోతే గొప్పగా పేలవని .నా పేరే ఉన్న గబ్బట దుర్గా ప్రసాద్ బాగా నటించాడు .అతని అన్న గారు సుబ్బయ్య శాస్త్రి గారు నేను చిలుకూరు వారి గూడెం స్కూల్ లో పని చేస్తున్నప్పుడు కొండ పర్వ లో పని చేసే వారు అ తర్వాత హెడ్ మాస్టర్ అయ్యారు .ఏం.పురుషోత్తమా చారి అనే లెక్కల మేస్టారి ద్వారా అక్కడ పరిచయమయ్యారు .దేశభక్తి గీతాలు ప్రాక్టీస్ చేయించి పాడించాను బాగా విజయ వంతమైంది కార్య క్రమం .హెడ్ మేష్టారు ఏం.వి.ఆర్ నా చొరవ కు సంతోష పడ్డారు నా మీద అభిమానం బాగా పెరిగింది .
ఏం.ఎల్.సి.ఎన్నికలు
అప్పుడే ఉపాధ్యాయుల నుండి శాసన సభకు ఎన్నికలు జరిగాయని కొంత జ్ఞాపకం .బందరు హిందూ హైస్కూల్ లో లేక్కలమేస్టారు ,కదా రచయితా ,జాగృతి పత్రిక లో సినిమా సమీక్ష చేసేవారు వెంకయ్య నాయుడుకు గురువు అయిన ఆర్ .ఎస్.కే మూర్తి అంటే రాజనాల శివ రామ కృష్ణ మూర్తి గారు ,ఏం కృష్ణా రావు అనే అవనిగడ్డ హెడ్ మాస్టారు ,మొదలైన వారు మా ఇంటికి వచ్చి కొల్లూరికి సపోర్ట్ చేయటానికి ఒక కారులో ప్రచారం చేస్తూ నన్నూ రమ్మన్నారు వాళ్ళతో తిరిగాను చూడని స్కూళ్ళు అన్నీ చూశాను వేసవిసేలవల్లో . .కొల్లూరి గెలిచారు అప్పటి నుంచి నేను అంటే కొల్లూరికి వీరాభిమానం .మా హెడ్ మాస్టారి గ్రూప్ కు వ్యతిరేకం గా నేను పని చేసినా ఆయన దీన్నేమీ మనసులో ఉంచు కోలేదు అయితే నేను ముందే చెప్పాను నేను కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ మనిషి నని .అయన సంతోషించారు ఎప్పుడూ నాతో ఆవిషయం ముచ్చటించలేదు అదీ సంస్కారం ఏం.వి.ఆర్ గారిది .
నాకోసం తూమాటి
దాదాపు సంవత్సరం అక్కడ పని చేశాను .రెండో ఏడాది మొదట్లో ఒక సారి కుటుంబం తో రిక్షా మీద ఉయ్యూరు బయల్దేరాను .ఇంటికి రాగానే మా అమ్మ చెప్పింది కాటూరు హెడ్ మాస్టారు తూమాటి కోటేశ్వర రావు గారు కారు వేసుకొని మన ఇంటికి వచ్చారని మానికొండలో ఉన్నట్లు చెప్పానని వెంటనే వారు మానికొండ వచ్చారని ,మేము అక్కడ లేక పోతే మళ్ళీ ఉయ్యూరు వచ్చారు .మా కంటే ముందు ఉయ్య్యురు వచ్చారు మేము వచ్చేసరికి మా అమ్మ కాఫీలు అవీ ఇచ్చి మర్యాద చేసింది నేను .కనపడగానే ఆయన ఆనందానికి అవధులు లేవు ‘’ప్రసాద్ గారు ౧ మీ కోసమే వచ్చాం .కాటూరు హైస్కూల్ లో సైన్సు పోస్ట్ ఒకటి వస్తోంది దానిలో మిమ్మల్ని వేయించుకోవాలని నా కోరిక .కమిటీ వారు నాకే చాయిస్ వదిలేశారు మీరు ఎవరిని తెచ్చుకొన్న మాకు సమ్మతమే అన్నారు .మరి నా మాట నిలబడతారా‘/?అని అడిగారు .నాకోసం ఒక మంచి హెడ్ మాస్టారు నామీద అభిమానంతో ఇన్ని సార్లు వచ్చారంటే నాకు ఇంతకన్నా కావలసింది ఏముంది ?ఏమీ ఆలోచించ కుండా సరేనన్నాను .ఆయన చాలా ఆనందపడి ‘’మీ మీద నమ్మకంతో ఇలా వచ్చాను నా మాట నిలబెట్టి నందుకు సంతోషం మీరేమీ శ్రమ పడక్కర లేదు .అన్నీ మేమే చూసుకొంటాం ఆర్డర్లు త్వరలోనే వస్తాయి ‘’అన్నారు సరే అని అన్నాను ఇలా అనుకోకుండా అదృష్టం తలుపు తట్టింది అని పించింది కొటేశ్వర రావు గారి సౌజన్యం జీవితం లో మరిచి పోలేను .సమర్ధత ను ఆయన ఎప్పుడు గౌరవిస్తారు అని మళ్ళీ రుజు వైంది. ఈవిషయాలన్ని మా హెడ్ మాస్టారు వెంకటేశ్వర రాగారికి చెప్పాను ఆయనకు నేను మానికొండ వదిలి వెళ్ళటం ఇష్టం గా లేదు .అయిష్టం గానే ఒప్పుకొన్నారు .మన చేతుల్లో లేని విషయం అని పించింది .ఏడాదిలో మళ్ళీ బదిలీకి సిద్ధమయ్యాను .ఇది రిక్వెస్ట్ అయినా రిక్వెస్ట్ లేని ట్రాన్స్ ఫర్ చేయిస్తామని కోటేశ్వర రావు గారు చెప్పారు దానివల్ల ప్రయాణ ఖర్చులు వస్తాయి
సశేషం – మీ గబ్బిటదుర్గా ప్రసాద్ -ఉయ్యూరు –16-3-13 .

