శ్యాం నారాయణ్ ది ఎప్పుడూ ‘’రైటాంగిలే’’
డిజిటల్ లైబ్రరీ – శ్యాం నారాయణ కృషి
అతని షాప్ పేరు” రైటాంగిల్”
అతని వృత్తీ ‘’రైటాం గిల్ ‘’తోనే
అతనిప్రవృత్తీ రైటాంగిలే
అతని ఆలోచన లెప్పుడూ రైటాం గిలే
అంటే సమకోణం లోనే ఉంటాయి .
గురుకోణం ,లఘుకోణం ,పరావృతకోణం
అంటే ఏమిటో తెలియని వాడు
సమ మార్గం సమధర్మం అతని చూపు
అతనే రైటాంగిల్ శ్యాం నారాయణ్ .
ఆకృతికి నిజంగా శ్యాం నారాయణుడే
నవ్వుకూ చింతనకూ మాత్రం శ్యాం మనోహరుడే
అతని వద్ద సంగీత సప్త పాదోధులున్నాయి
అతని చెంత సాహిత్య నవనిధులూ
జేగీయమానం గా వెలుగుతున్నాయి
అతను మీట నొక్కితే చాలు
ప్రపంచమంతా దర్శన మిస్తుంది
అదేదో తనకే చెందాలనే ఆరాటం లేని వాడు
తన విజ్ఞాన సర్వస్వాన్ని అడిగిన వాడికి
దానం చేసే మహా దాన కర్ణుడు
కాని అలా ఎప్పుడూ భావించని ఉత్తమ పురుషుడు అతను
ఒక రకం గా మన ముందున్న మరో వి.ఏ.కే.రంగా రావు
ఆయన మాత్రం అందరికి అందేవాడు కాదు
కాని శ్యాం మాత్రం స్నేహ సులభుడు
తాను సంపాదించిన విజ్ఞాన సంపదను
మన స్వంతం చేసే సర్వ సమభావుడు, సరసుడు
అతనితో మాట్లాడటమే ఒక ‘’ఎడ్యుకేషన్ ‘’
అతని చెంత ఉంటె అదో మరో సరస్వతీ మహల్
మరో భువన విజయం ,మరో స్వర్లోక సభ ..
”ప్రపంచ సాహిత్య పాదోధి పయస్కుడైన ముని ”అతడు
మాటలు తక్కువ, చేత, చేతన ఎక్కువైన వాడు .
ఇది శ్యాం నారాయణ్ కు ప్రశంశ కాదు
వాస్తవ చిత్రలేఖనం యదార్ధ దర్శనం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-3-13-ఉయ్యూరు

