జ్ఞానదుడు మహర్షి నారదుడు -16
ధర్మ రాజు రాజ సూయం లో నారదుని మార్గ దర్శ కత్వం
ధరిత్రి లో ధర్మ హాని జరుగుతోందని మాట విన బడ్డా ,మనసులో కదిలినా ధర్మ రక్షణార్ధం తగిన వారిని పురమాయించి ఆ పని నేర వేర్చటం నారదుని అలవాటు .ఒక రోజు శ్రీ కృష్ణ స్వామి ద్వారకలో కొలువై ఉన్న సమయం లో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి తన మొర విని పించాడు .జరాసంధుడు బల మద గర్వం తో ‘’తనకు మొక్కని రాజులను ‘’20,000మందిని గిరివ్రజ పట్టణం లో బందీలుగా చేశాడని ,వారందరి పంపున తాను వచ్చానని ఆ ఘోర రాక్షసుని బారి నుండి భూమిని ,భూదేవుల్ని ,భూ పాలకులను సంరక్షించ మని విన్న విస్తూంటాడు ఇంతలో అకస్మాత్తుగా నారద మహర్షి అక్కడ ప్రత్యక్షం .
‘’శారద చంద్రికా సారంగు రుచి తోడ ,జడముడి కెంపు చే జరచి ,నవ్య
శరదంబు దావ్రుత సౌదామనీ లతా శోభ ,గాంచన కటి సూత్ర మలర
లలిత పూర్ణేందు మండలకము గతి ,మృదు మ్రుగాజిన రుచి మించు చూప
గల్ప శాఖాగ్ర సంగత పుష్ప గుచ్చంబు లీల ,గేలను నక్షమాల యమర
భూరి పుణ్య నదీ తోయ పూణమున –దాగు కమడలునోక్క హస్తమున తనర
వెల్ల జన్నిదమ రుత శోభిల్ల వచ్చే –నారదుండు వివేక విశారడుండు ‘’
యదా ప్రకారం శ్రీ కృష్ణుడు మహర్షికి గౌరవం గా అతిధి మర్యాదలు చేశాడు వినయం తో నారదుని తో‘’ఇప్పు దేన్డుండి వచ్చితి విన్డులకును –నఖిల లోకైక సంచారి వగుచు
నీ యెరుంగని యర్ధంబునిఖిల మందు –నరయ లేదండ్రు మిమ్మొకడడుగా వలయు ‘’
ద్రుష్టి పాండవుల మీదికి పోయింది యదు వంశ మౌలికి .వారి యోగ క్షేమాలు తెలుసుకోవాలని పించింది
‘’పాండు నందను లిప్పుడేపగిది నెచట –నున్న వారలో ఎరిగింపు మన్న
మౌని కర సరోజాతములు మోడ్చి –కడక తోడ బలికె –గమలాక్షు జూచి సద్భక్తి మెరసి ‘’
పరమాత్ముడైన వాసుదేవునికి తెలియని విశేషాలేముంటాయి అయినా అడిగాడు కనుక చెప్పుతున్నాడు ..ధర్మ రాజు రాజ సూయ యాగం చేస్తున్నాడని తన ఆత్మ బందుడైన భక్త వత్సలుడైన పరమ పూరుషుడైన ,యజ్న రక్షకుడైన, యజ్న భోక్త అయిన శ్రీ కృష్ణుని ఆహ్వానించి తీసుకొని రమ్మన్నాడని ఆ యాగాన్ని రక్షించే భారం స్వీకరిచమని కోరాడని తెలియ జేశాడు .అంటే బావ శిశు పాలుని వధకు సిద్ధం కావలసింది అని భావం .ఆయన పేరు విన్నా తలచినా పాపాలు హరిస్తాయి అలాంటి యజ్న నారాయణ మూర్తి ని అవమానించినా , అపహసిన్చినా వాడి చావు మూడిందేదే .నన్న ఆంతర్యం నారద వచనాలలో స్పష్టమవుతుంది .
‘’నీపేరు వినిన ,నొడివిన బాపంబులు దూలి పోవు పద్మాక్ష ,జగ
ద్దీపక ,నీ దర్శనమున –నేపారవె భక్త జనుల కిహ పర సుఖముల్ ‘’
‘’భావదీయోజ్వల కీర్తి దిగ్వితతుల్ భాసిల్లు యుష్మత్పదో
ద్భవ నైర్మల్య జలంబు లుత్కలిక బతాళంబులంబునన్ బారు భో
గవతీ నామ మునం దనర్చి ధరణి గంగా నదీ రూపమై
దివి మందాకినీ యై ,జగత్రయమునం దీపించు గా దే హరీ ‘’
‘’ ఆ మఖ వళ సమస్త ధ –రా మండలిల్గు మేటి రాజులు మౌని
స్తోమంబును భవదీయ మ –హా మహిమము జూచి సత్క్రుతార్ధత బొందన్ కలరు ‘’
అని చెప్పాడు .ఎల నవ్వు మొగం తో ఉద్దవుని ఆలోచించి ,ధర్మ రాజు రాజ సూయ యాగానికి తరలి వెళ్ళాడు యదు వంశ విభుడు .ఇలా లోక రక్షకునికి కూడా ప్రేరేపణ కల్గించాల్సిన సమయం లో తన వంతు ధర్మాన్ని నెర వేర్చి ,అధర్మ పద గాముల పీచాన్ని అడంచ టానికి ముందుకు వచ్చే ధర్మ పద దర్శనుడు మార్గ దర్శీ మహర్షి నారదుడు .అంతటి మాయావీ మహర్షి చెప్పిన మాటలు విని శిశు పాలుని ద్రుంచి ,జరా సంధుని చీల్పించి లోక రక్షణ చేశాడు
సశేషం –మీ –గబ్బట దుర్గా ప్రసాద్ -21-3-13-ఉయ్యూరు

