శ్రీ కృష్ణావతార సమాప్తి
ద్వాపర యుగాంతం వచ్చేసి యాదవ కులం లో ముసలం పుట్టింది .అక్కడ హస్తిన లో కురు సంగ్రామం లో రాజాది రాజులు ,ప్రజలులక్షలాదిగా పరి సమాప్తి చెందారు .ఇంకో 48 ఏళ్ళలో కలి ప్రవేశింప బోతున్నాడు .అంతా లయం ,విలయమే కావాలి .ఇదంతా ఆయన ఇచ్చ .,సంకల్పం .ఆ మార్గం గా లోకం కదిలి పోతోంది .తమ అవతార సమాప్తి దగ్గరకు వచ్చిందని పరమాత్మకు తెలుసు .అందుకే అందరు కలిసి గ్రహణ స్నానం కోసం సముద్ర తీరానికి చేరారు .మహర్షు లందరికి శ్రీ రామ కృష్ణుల ను దర్శించాలనే ఇచ్చ కలిగింది .
‘బలవదరాతి మర్దనుల బాన్డునల నిభ ప్రభాగులం
గలిత నిజాననాంబుజ వికాస జితాంచిత పూర్ణ చంద్ర మం
డలుల ,బరేశులన్ ,నర విడంబినులన్ ,గరుణా పయోదులన్
విశాదలంకరిష్ణుల ,నవీన సహిష్ణుల రామ కృష్ణులన్ ‘’
నారద ,సాత్యవతేయ ,గౌతమ ,వ్యాసాదులంతా తరలి వచ్చారు .అర్ఘ్య పాద్యాలు నమస్కృతులు అందుకొన్నారు అప్పుడు శ్రీ కృష్ణుడు వారిని అడిగాడు
‘’సమ్మునీశ్వరు లారా జన్మ భాక్కుల మైన మాకు నిచ్చోట సమ్మతిని దేవ
నికర దుష్ప్రాపులు ,నిరుపమ యోగీన్ద్రులైన మీ దర్శనం బబ్బే గాదె
ధృతి మంద భాగ్యు లింద్రియ పరతంత్రులు నైన మూఢాత్ముల ,కనఘులార
భవదీయ దర్శన ,స్పర్శన ,చింతన ,పాదార్చనలు దుర్లభంబు లయ్యు
నేడు మాకిట సులభమై నెగడే గాదె –జాగృతి పై దీర్ఘ భూతులు ,సాధుమతులు
మిమ్ము దర్శించు టయ చాలు నెమ్మి తోడ –వేర తీర్థంబు లవని పై వెదక నేల ?’’
అని చాలా సద్భక్తి పురస్సరం గా గౌరవం నేరుపుతాడు పరమాత్మ .ఇదీ మర్యాదా పురుష లక్షణం .వారిని దర్శిస్తేనే సర్వ పాపహరం వారు సర్వ తీర్ధ రాజుల కంటే పరమ పవిత్రులు .ఉదకాలతో కూడిన తీర్దాలు ,మ్రుచ్చికతో కూడిన దేవా గణాలు తీర్ధ దేవతా రూపకాలు కావు .అయితే అవన్నీ చిరకాల సేవనార్చనల వల్లనే పవిత్రం అవుతాయి .కాని సత్పురషులున్నారే వీరు మాత్రం దర్శన మాత్రం చేతనే పవిత్రత కల్గిస్తారు .సకలార్ధ గోచర జ్ఞానం గల నారదాది మహర్షులు ముహూర్త మాత్రం చేత పావనం చేయగలరు .ఆత్మబుద్ధి లేనివారికి తీర్ధ స్నానం పుణ్యాన్ని ,పవిత్రతను ఇవ్వలేదు .అని శ్రీ హరి వివరిస్తాడు .దేవముని గణంశ్రీ కృష్ణ ముఖరిత పవిత్ర వాగ్మకరందం చేత ఆనంద పరవశం చెందింది .
‘’నీకంటే పవిత్రులేవరు ?కర్త భోక్త భర్త హర్త నీవు .ఎందరి కోసమో ఎన్నో చేశావు .ఇందులో హింస ఉంది ,వధ ఉంది .బాధ ఉంది .నిఖిల యజ్నశుడవైనా యాగం తో దుష్కర్మఅంతా నశిస్తుంది ఇదే ధర్మం
‘’దేవర్షి పితృ ఋణంబులు –భూవర మఖ వేద పాత పుత్రుల చేతన్
వావిరి నీగని పురుషుడు –పోవునదోలోకమునకు బుణ్య చ్యుతుడై ‘’అంతే కాదు
‘’వర తనయధ్యయనంబుల –ధరియించితి రుణ యుగంబు దడయక ధరణీ
వరదేవ ఋణము సవనా –చరణడవై ఈగుటోప్పు సమ్మతి తోడన్ ‘’
‘’బ్రాహ్మణ ,దేవ ఋణం తీర్చుకోవటానికి యాగం యజ్న కర్తకూ తప్పదు’’ అన్నారు ఇంకేముంది .మహర్షులనే యాజకులు గా చేసి ఆ తీర్ధ ప్రాంతం లోనే అష్టాదశ భార్యా యుతుడై యాగం పూర్తీ చేసి దక్షినాదులతో సంతృప్తి చెందించాడు. సంతుస్తులైన ముని గణం స్వస్థానం చేరింది .
బలభద్రుని ప్రేరేపించటం
శ్రీ కృష్ణుని కుమారుడు సాంబుడు దుర్యోధనుని కూతురు లక్ష్మణ ను ఎత్తుకొచ్చాడు కౌరవులు సామ్బుని చెర బట్టారు .ఈ విషయం నారదుడు హలాయుధ ధారి అయిన బలరాముని చెవిన పడేశాడు .ఆ కోపం తో ఊగిపోయిన కృష్ణుని అన్న నాగ నగరానికి వెళ్ళాడు .అక్కడ కౌరవులు అతన్ని నీచం గా మాట్లాడారు .ఆ కోపం తో నాగలితో హస్తినా పురాన్ని ఎత్తి యమునా నదిలో కలుపబోయాడు భయపడిన కౌరవులు లక్ష్మణ సహిత సామ్బుల్ని అప్పగించారు .ఇలా కరువంశం తో వియ్యమూ జరిపించాడు మహర్షి నారదుడు సుభద్రకూ లక్ష్మణ కుమారునికి జరగాల్సిన వివాహం‘’మాయా బజార్ ‘’తో విచ్చిన్న మైంది .ఇప్పుడు ఒక రకం గా మంచే జరిగింది కొత్త బంధం సంబంధం చేకూరింది నారద మహర్షి ఏది చేసినా ఇలా మంచికే దారి తీస్తుంది..మళ్ళీ వీరి అబ్బాయి వారి అల్లుడైనాడు .ఇదంతా బలరాముని అవక్ర పరాక్రమానికి భయపడే జరిగింది
సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –22-3-13-ఉయ్యూరు

