నమ్మకమే గెలిపిస్తుంది

ఏ హోదాలోనయినా ఉండవచ్చు. ఎన్ని అధికారాలైనా ఉండవచ్చు. కానీ, ఏవైపు ఉండాలనుకుంటున్నాం అన్న విషయంలో ముందే ఒక స్పష్టత ఉండాలి. అదేమీ లేకుండా మధ్యేమార్గంలో వెళ్లాలనుకుంటే అడుగడుగునా రాజీపడాల్సి వస్తుంది. ఆ రాజీలతో జీవితం ఏ తీరమూ చేరద ంటారు నిజాయితీకి, నిర్భీతికీ మారుపేరైన ఐఎఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య. ఎన్నో శాఖల్లో సమర్థంగా పనిచేసిన ఆమె ప్రస్తుతం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కమీషనర్‌గా ఉన్నారు. పాతికేళ్ల ఐఎఎస్ జీవితంలో ఆమె ఎదుర్కొన్న అరుదైన సంఘటనలే ఈ వారం అనుభవం.
జీవితంలో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతాయి. అలాంటివి జరిగినప్పుడు, నాకే ఇలా ఎందుకు జరిగింది? అని విపరీతంగా అంతర్మధనానికి గురవుతాం. కానీ, పైకి అది బాధించే విషయంగానే ఉన్నా దాని లోలోపల కొన్ని అద్భుత విషయాలే ఉండవచ్చు. ఒక్కోసారి చేజారిపోయిన దానికి మించిన గొప్పతనమేదో చేతికందిన దాంట్లో ఉండవచ్చు. గాయపడి విలవిల్లాడుతున్న మనసులోకి ఎవరైనా ఒక పాజిటివ్ దృక్పథాన్ని ప్రవేశపెట్టాలే గానీ, తిరిగి నిలబడే క్రమంలో వారు రెట్టింపు శక్తితో పనిచేస్తారు, అద్భుత విజయాల్ని సాధిస్తారన్నది నా అనుభవంతో నేను నేర్చుకున్న సత్యం.
1990లో ఐఎఎస్ ఆఫీసర్‌గా ఆంధ్రప్రదేశ్ వచ్చాను. తొలి పోస్టింగ్ నాకు భద్రాచలం వేశారు. నేను జాయింట్ కలెక్టర్‌గా గుంటూరుకు వెళ్లినప్పుడు నర్సరావుపేట ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ పార్లమెంట్ నియోజక వర్గం దేశంలోకెల్లా అత్యంత హింసాత్మక నియోజక వర్గాల్లో ఒకటి. పాట్నా త ర్వాత రెండవ స్థాన ం నరసరావుపేటదే. ఎన్నికలు వచ్చాయంటే చాలు, ఈ సారి ఎంత మంది ప్రాణాలు పోతాయోనని ప్రజలంతా వణికిపోయే పరిస్థితులు. జాయింట్ కలెక్టర్‌గా నేను అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్‌ని కూడా.
ఒక మహిళ ఆపని చేయడం కష్టం కదా అనుకున్నారందరూ.ఇక్కడ కష్టం కదా అనుకున్నారు. అక్కడి పరిస్థితుల్ని అవగాహన చేసుకున్న నేను ఎన్నికలకు నాలుగు మాసాల ముందు నుంచే కొన్ని రకాల ఎక్సర్‌సైజులు మొదలుపెట్టాను. ఏ ప్రాంతాల్లో ఈ బాంబుల సంస్కృతి ఉందో ఆ ప్రాంతానికి వెళ్లి ఆ సంస్కృతిని విడనాడండని చెబుతూ ఉండేదాన్ని. రోజూ ప్రజల మధ్యకు వెళ్లడం, హింసాత్మక చర్యల వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి, శాంతియుత మార్గాల్లో వెళ్లడం వల్ల కలిగే ఫలితాల గురించి నిరంతరం చెబుతూ ఉండేదాన్ని. మొత్తానికి ఎన్నికలు శాంతియుతంగా జరిగిపోయాయి.
ఎన్నికలు పూర్తయిన రోజు సాయంత్రం 6 గంటల వేళ నేను ఆఫీసులో ఉన్నప్పుడు కొన్ని వందల మంది ప్రజలు, మా ఆఫీసుకు వస్తున్న విషయాన్ని గమనించి మా ఆఫీసు సిబ్బంది ఎంతో ఆందోళనతో నా వద్దకు వచ్చారు. మేడమ్! 1991లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా జనం ఇలానే వచ్చారు. దౌర్జన్యానికి దిగితే విషయం కాల్పుల దాకా వెళ్లింది. ఇప్పుడేం జరగనుందో అన్నారు. మీరు ఎవరి సీట్లలో వాళ్లు కూర్చోండి. విషయాన్ని నేను చూస్తాను అని చెప్పి, వరండాలోకి వచ్చి నిలుచున్నాను. వందలాది మంది చాలా వేగంగా వచ్చేస్తున్నారు. నా వద్దకు వచ్చేశారు. వచ్చీరావడమే “దండం అమ్మా, ఇంత ప్రశాంతమైన ఎన్నికలు ఇన్నేళ్ల జీవిత కాలంలో మేము ఎన్నడూ చూడలేదు. మా నరసరావుపేట ఎల్లకాలం మీకు రుణపడి ఉంటుంది” అన్నారు. మేము అనుకున్నది ఒకటి జరిగింది వేరొకటి. ఊహించని ఈ పరిణామంతో నా మనసు ఉద్వేగంతో ఊగిపోయింది.
ఆ్రర్దతతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎన్నో దశాబ్దాలుగా వున్న సమస్యను ఎవరైనా హృదయంతో అర్థం చేసుకుని, అంకిత భావనతో, సంకల్పించిన దానిలో పూర్తిగా విలీనమై పనిచేస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆశించిన దానికన్నా అద్భుత ఫలితాలే వస్తాయని నా అనుభవం నేర్పింది. మౌలికంగా ఏ మనిషైనా ఇంటా బయటా శాంతినే కోరుకుంటాడన్నది నా ప్రగాఢ విశ్వాసం. కాకపోతే, ఆ వర్గం హింసాత్మకంగా వ్యవహరించిందని ఈ వర్గం, ఈ వర్గం హింసాత్మకంగా వ్యవహరించిందని ఆ వర్గం ఆవేశంతో ఆక్రోశంతో చేయకూడని పనులు చేస్తుంటారు. ఒక్కసారి శాంతియుత పరిస్థితులు నెలకొనబోతున్నాయన్న భావన కలిగితే మాత్రం దాని వైపే మొగ్గుతారు. అదే నరసరావుపేట నియోజక వర ్గం చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచింది. ఈ అనుభవం నా జీవితంలో కూడా గొప్ప మలుపుగా నిలిచింది.
పారదర్శకంగా…
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఒక సమస్య వచ్చింది. అత్యధిక భూభాగంలో వ్యవసాయం చేసే జిల్లా అది. గోదావరి డెల్టా కావడం వల్ల ఏటా దాదాపు మూడు లక్షల ఎకరాల్లో వరిపంట వేస్తారు. దానికి సంబంధించి నవంబర్‌లో ఇరిగేషన్ బోర్డు మీటింగ్ జరిగింది. మామూలుగానే ఆ ఏడు కూడా నీటి పంపిణీ చేస్తామంటూ హామీ ఇచ్చారు. రైతులు డిసెంబర్‌లో వరినారు పోశారు. నెలరోజుల్లో అవి నాట్లకు వచ్చాయి. కానీ నీళ్లు ఇస్తామన్న అధికారులు, నీరు సరిపడా లేదు కాబట్టి మేము నీళ్లు ఇవ్వలేం.అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. విత్తనాలకు, నారు పెంచడానికి అవసరమైన ఎరువులకు ఎంతో ఖర్చుపెట్టారు. ఇప్పుడు మీరు నీరు ఇవ్వలేమని చెబితే వారంతా ఏమైపోవాలి? అన్నాను. అదేమోగానీ, మేమైతే నీరు ఇవ్వలేం అన్నారు. “తక్కువ నీళ్లతో ఎక్కువ భూమికి నీరందించే విధానం ఉంది కదా! ఆ ప్రయోగం చేస్తే ఎలా ఉంటుంది?” అన్నాను.
“అవన్నీ పుస్తకాల్లో చదువుకోవడానికి బావుంటాయి మేడం” అన్నారు. “అదేం కాదు. మనం ఆ విధానాన్ని అనుసరించాల్సిందే” అన్నాను. కాలువకు గేట్లు ఉంటాయి. ఒకవైపు నీరు వెళ్లే గేటును తెరిచిన ప్పుడు మరోవైపు నీరు వెళ్లే గేటును మూసివేయడం ఈ విధానం. ఇరిగేషన్‌న్అధికారులు “రొటేషన్ విధానంలో మీరు నీరు అందిస్తానంటే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ, మీరు అనుకునే దానికి విరుద్ధంగా ఏమైనా జరిగితే మాత్రం నీటిపారుదల శాఖ దానికి బాధ్యత వహించదు. మీరే పూర్తి భాధ్యత వహించాల్సి ఉంటుంది” అన్నారు. నేను క్షణమైనా ఆలస్యం చేయకుండా, దానికి నేనే బా«ధ్యత వహిస్తానన్నాను. రొటేషన్ విధానం మొదలయ్యింది.
ఒక రోజున నర్సాపురం – పాలకొల్లు రైతుల మధ్య నీరు విడుదల విషయంలో అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ గొడవ మొదలైంది. అర్థరాత్రి పూట అక్కడకు చేరుకున్నాను. “ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా నేను చూస్తాను. రెండు వర్గాల వారూ మీ ఇళ్లకు వెళ్లిపోండి. నా మీద నమ్మకం ఉంచండి” అన్నాను. విచారణ జరపగా అధికారుల తప్పేం లేదని తేలింది. అయినా ఒకసారి ప్రజలకు అనుమానం కలిగిన తరువాత వారింక ఎన్ని చె ప్పినా నమ్మరు. అందుకే ఆ మరుసటి రోజున డిప్యూటీకి విషయం వివరించి మరో సర్కిల్‌కు అతడ్ని మార్చాను. మొత్తానికి వాటర్ రొటేషన్ విధానం పూర్తిగా విజయవంతం అయ్యింది. ఎంత సేపూ అప్పటిదాకా మనముందున్న విధానాలతోనే ప్రతి సమస్యనూ పరిష్కరించాలనుకుంటాం. వాటితో కాదనిపిస్తే అసాధ్యమని తేల్చేస్తాం. అంతే త ప్ప కొత్త మార్గాల కోసం ఆలోచించం.
సమాజం విస్తృతం అవుతున్న కొద్దీ ప్రతి సమస్యా సంక్లిష్టమవుతూ ఉంటుంది. ఈ స్థితిలో వినూత్నంగా ఆలోచించడం తప్పనిసరి. పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, ఇవి రెండే సామాజిక సమస్యలను పరిష్కరించే అద్భుతమైన ఆయుధాలు. పారదర్శకత ఉన్నప్పుడే ప్రజలు భాగస్వాములవుతారు. అప్పుడే ప్రజాప్రతినిధులైనా, అధికార ప్రతినిధులైనా అనుకున్నది సా«ధిస్తారు. ప్రజల విశ్వాసాన్ని పొందడం అంటే, మనకున్న శక్తి వేయింతలు కావడమే. ఆ సమష్టి శక్తే సమాజంలోని అన్ని సమస్యలకూ ఏకైక పరిష్కారమన్నది ఇన్నేళ్ల నా జీవితం నాకు నేర్పిన అతి గొప్ప పాఠం.

