శ్రీ పరమాచార్య పరమ పద పీయూషం -3
శ్రీ పరమా చార్య ద్రావిడ దేశం లో నే మహాద్భుతశైవ భక్తురాలైన అవ్వయ్యార్ ను మహా గణపతి ని ఉద్దేశించి పరమానంద భరిత కధను ‘’విపరీత మైన అవ్వ –విచిత్ర శిశువు ‘’పేరచెప్పారు .వారిద్దరి మధ్య ఉన్న భక్తీ, ఆరాధనను కళ్ళకుకట్టించారు ..ఆమెను ఊరూరా తిరిగే మనిషిగా ఆయన్ను ఒక చోటి నుండి కదలని బొద్దు ఏనుగు గున్న గా వర్ణించారు .
ద్రావిడ భాషలో ‘’పిళ్ళై ‘’అంటే బిడ్డ .దీనికి శ్రేష్ట వాచకం ‘’యార్ ‘’చేరిస్తే ‘’పిల్లైయార్ అవుతుంది .అంటే ‘’శిశువు గారు‘’అని అర్ధం .‘ .ద్రావిడ దేశం లో వినాయకుడిని అదేపేరుతో ముద్దుగా పిలుచుకొంటారు ..ఎప్పుడూ కదలకు కూర్చుని తినే వాణ్ని తమిళులు ‘’నువ్వేమైనా పిల్లైయార్ వా ?’’అని ఎద్దేవా చేస్తారట .అంటే రాతి విగ్రహం లా కదలవెం ?’’అని భావం .పార్వతీ పరమేశ్వరుల జ్యేష్ట పుత్రుడు కనుక ఆపేరు వచ్చింది అను ను కోవటం తప్పు .’’జ్యేష్ట రాజం బ్రహ్మనంబ్రహ్ణస్పథిహ్ ‘’అన్న గణపతిని గూర్చి చెప్పిన వైదిక మంత్రమే దీనికి ఆధారంఅన్నారు స్వామి .భూతాది పతి గణపతి ఆయనకు మించిన నాయకుడు లేడు .అందుకే వి అనే విశేషం చేర్చి వినాయకుడు అన్నారు .’’మొక్కు వారి పనుల చక్కజేసేది సామి –గరిక పూల మెచ్చు గబ్బి వేల్పు ‘’.పనులు చేసినా ,చెడగొట్టినా ఆయనే .ఈయనే ‘’యం నత్వా కృత క్రుత్యాస్యుహ్ తం నమామి గజాననం ‘’అని మంచి పనులు ప్రారంభించేటప్పుడు మొక్కు కుంటాం .
ఇంతకీ వినాయకుడి దేహ విభవం చూస్తె నవ్వు పుట్టిస్తుంది కాని అందులో పరమార్ధం ఉంది .ఆయనది ఎనుగుముఖం .ఏనుగుకు దేహ బలం ఎక్కువ .ఎంత బలం ఉన్నా జంతు హింస చేయని సాధు జంతువు .అలానే మన‘’పిళ్ళారి ‘’అధిక శక్తి వంతుడైనా కావాలని ఎవరికీ అపకారం చేయడు .ఉపకారం అయన నైజం.గణపతి జ్ఞాన స్వరూపుడు .నిర్మల నిర్వికల్ప గునాతీత సాన్ద్రానంద పరబ్రాహ్మ స్వరూపమే గణపతి ..ఏనుగు నడకలో రాజసం ఠీవీ ఉన్నాయి .ఆ హొయలు ఇతర జంతువులకు దేనికీ లేదు అందుకే ఏనుగు నడక తో ఆడవారి నడకను పోలుస్తూ గజ గమన అంటారు .తొండం విసరటం చెవుల్ని హఠాత్తుగా రెపరెప లాడించటం ,తినటానికేడైనా అందిస్తే అమాంతం లాక్కొని గుటకాయస్వాహా చేయటం దానికే తగింది .ఏనుగును ఎంత సేపు చూసినా తనివి తీరదు .ఏనుగు ముఖం శాంతికి చిహ్నం .దర్శనీయ మృగం ఏనుగు కంటే వేరేదీ లేదని పరమాచార్య నిశ్చితాభిప్రాయం .
మన’’ పిళ్ళారి’’ ఏనుగుకు ఏనుగు ,బిడ్డకు బిడ్డా అంటారు తమాషాగా స్వామి .శిశువు లాగా సారళ్యంఏనుగుకున్న బలం ,చురుకుదనం పరమ సుందర మంగళ స్వరూపం జ్ఞానం, ఆనందం ,అందం, శాంతి ఒక్క చోట మూర్తీభవించి నట్లు ఉన్న రూపమే వినాయక స్వామి .ఎన్నో విరుద్ధమైన విషయాలు ఒక చోట ఉన్న విచిత్ర మైన స్వామి గణపతి .ఆయన ముఖం మృగ వర్గానికి చెందింది .దేహం మానవ వర్గానికి చెందింది .రూపమేమో శిశువు .నిజానికి ఆయన మ్రుగమూ కాదు మనిషీ కాదు దేవ వర్గానికి చెందినా వాడు .ఒక చేతిలో విరిగిన దంతం ,మరో చేతిలో మధుర మైన మోదకం అంటే ఉండ్రాయి .పూర్ణ మైన వస్తువూ అసంపూర్ణ దంతం .’’పూర్ణమదః పూర్నమిదం –పూర్ణాత్ పూర్ణం ‘’అని ప్రకటించిన పరబ్రహ్మమే వినాయకుడు .ఈ మాట వింటే మనకు ఎంతో ‘’మొదకరం ‘’గా లేదా అంటారు పరమాచార్య ..పిళ్ళారి బ్రహ్మ చారి అయినా అందరికి పెళ్ళిళ్ళు చేస్తాడు ఏనుగు రూపము లో వచ్చి వల్లి అనే ఆటవిక కన్యను తమ్ముడు సుబ్రహ్మణ్య స్వామికి జతచేసి పెళ్లి చేయించిన వాడు అన్న గణపతియే .పెళ్ళికాని పిల్లలు మంచి వరుడిని చూసి పెట్తమై గణపతినే ప్రార్ధిస్తారు .వీరి ఆశలను తీర్చి మోక్షకాముల్ని చేద్దామనే సంకల్పమేమో నంటారు స్వామి .
adhiyaman and avvaiyyaar
దక్షిణ దేశం లో పరమ భక్తురాలు ‘’అవ్వైయ్యార్ ‘’ఈమెను కైలాసం చేర్చిన వాడూ గణపతియే నని తమిళ దేశం లో ఒక కద బాగా ప్రచారం లో ఉంది .తమిళ దేశం లో ఎక్కడ చూసినా గణపతి విగ్రహాలే కనీ పిస్తాయి .ఆయన అనుగ్రహించిన అవ్వ అవ్వయ్యార్ దేశమంతా క్షణం తీరిక లేకుండా తిరిగి తత్వ బోధ చేసి జనాలను చైతన్యం చేసింది .ఆయన ఉన్న చోటు నుండి ఒక్క అడుగైనా కదలడు .ఈమె ఒక్క చోట కూడా నిలవకుండా ఊరూరా తిరిగేది .ఆ అవ్వ ఆవైయ్యార్ ఈ బిడ్డ పిల్లైయ్యార్ అంటూ ముగిస్తారు కంచి పెద్ద స్వామి .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-3-13-ఉయ్యూరు

