అవీ ఇవీ అన్నీ -1
1-ఓటు –నాడు మనసారా ఇచ్చేది –నేడు మనసారా తో ఇస్తున్నారు
2-మరణం –జీవించి నందుకు లభించే బహుమతి
3-జనం –ఓట్ల చెట్లు
4-కుండ –మనసు ను చల్ల బరచు కొనేందుకు నిప్పుల కొలిమి లో ఒళ్లంతా కాల్చుకునేది
5-సారీ-తప్పిదాల మన్నించగల ఇంగ్లీష్ వారి పంచాక్షరీ మంత్రం
6-సానుభూతి –ఎదుటి వారి హృదయాలను తెరిచే బంగారు తాళం చెవి
7-నవ్వు లేకుండా నువ్వు లేవు (ఆర్.కే.లక్ష్మణ్ )
8 –లేడీస్ ఫింగర్స్ –కొండేపూడి నిర్మల
‘’ ఎలాగైతేనేం –ఎన్ని గోళాలు తలక్రిందు లయితేనేం
సగం సగం తెగిన మనమంతా –ఒక అర్ధ వంత మైన వాక్యం గా అల్లుకు పోయాం కదా /
గడ్డ కట్ట టానికే పుట్టిన అలల్ని –చురక లేసి పరిగెత్తించాం కదా
నాటకం ఆడక ముందు డైలాగ్సే ఉంటాయి –ఒట్టి డై –లాగ్స్
డైలాగ్ ని ముక్కున కరచుకొనే దాక –రెక్కలవసరం తెలీని మానం
పగలు చాలు –రాత్రిచాలు –వంట వేల దాటిందనే స్పృహ చాలు
తుప్పు పట్టిన కత్తిమీద –కసకసా తెగుతున్న
ఉత్సాహపు వేళ్ళతో మగ్గుతున్న –లే—డీ—స్—ఫింగర్స్ ‘’
10-యువ రుక్కులు
సూర్యుడు –పగలు రేయి సృష్టికర్త
ప్రేయసి –ప్రేమిస్తే గులాబి ,ద్వేషిస్తే గులాబి ముళ్ళు
నవ్వు –హృదయం మాట్లాడే లిపి లేని భాష
గుండె –దేహాలయం లో నిరంతరం మోగే గంటలు
సూర్యుడు –లోడ్ షెడ్డింగుగు లేని పెద్ద విద్యుత్ కేంద్రం
సారా –తాగితే బతుకు కరువు –మానితే బతుకు తెరువు
చీర –నేడు శరీరానికి కట్టుబడి –రేపు స్టీలు సామాను కు పెట్టుబడి
డబ్బు –సృష్టించిన వాడినే –ఆడించే తుంటరి .
11-ఉపాధ్యాయినీ –అంటే ‘’ఉపాధ్యాయులు ఉన్నది’’ అనే అర్ధం అట .తిరుమల రామ చంద్ర చెప్పారు –‘’ఉపాధ్యాయా‘’అనాలట లేడీ టీచర్ ని
12 –కవుల దీపావళి
జే.బాపు రెడ్డి
‘’దీపము నార్పు చీకట్ల రూపు గాంచి –బెదిరి పోయిన కాంతులె చెదరి పోయి
గుట్టుగా వచ్చి తమ గుండె గూటి లోన ఊహలుగా –ఒదిగి నాయి ‘’
దాశరధి
‘’గాదంద కార స్తంభాగ్రం లోని కాంతి కళీక –కర్కోతకులపై విరుచుకు పడే క్రాంతి కాళిక
సుధామ
‘’మానవ అజ్ఞాన తమస్సు పై మహోన్నత విద్యోరేఖగా –భాషా భేషజాల రంగ స్థలిపై
జాన పద శైలూషిలా –అంధకార మదాన్ద్హత పై నిజాయిథేఎ కొరడా మెరుపు
చీకటి కాళింది పై చిన్ని కృష్ణుని లీలగా ‘’
ఆచార్య తిరుమల
‘’అసెంబ్లీ లో ప్రశ్నల తారాజువ్వలూ ,చప్పట్ల టపాసులూ
ప్రతిపాదనల చిచ్చు బుడ్లూ ,ప్రజల వినతి పత్రాల విష్ణు చక్రాలూ
వాగ్దానాల కాకర పువ్వోత్తులు ,చివరికి కొత్త పన్నుల లక్ష్మీ బాంబులు
ప్రభుతకు దీపావళి –ప్రజలకు అమావాస్య
రస రాజు
‘’ఇప్పుడా స్త్రేఎ శక్తియే కన్నులేర్రజేసి పాడునురా
సురుని ద్రుంచ బయలు దేరే –అబల అనుకోకు స్త్రీ మూర్తి
తిమిరమును చీల్చ గల్గిన దీప మహిళ
కే.వి.శేషా చార్యులు
‘’ఒక దీప కలికతో వెలుగు పది దీపాలు –ఒక మంచి మనసు తో సుఖ పడు లోకాలు
14 –నాలుక –రుచుల డిటెక్టర్ –మాటల డిక్టేటర్
15 –పువ్వు –పుట్టి ,నవ్వుల సువాసనలతో మరణించేది
16 -వీరేశ లింగం గారి పై విశ్వనాధ
‘’చీకటి పడి పోతుంటే –ఆకటితో చని పోతుంటే
దూరపు వెలుగులు తెచ్చినదేవరో –తీరని ఆకలి తీర్చిన దదేవరో
రామ మోహనుడు రాచిన దారులు –కొమలాత్ములు కొలిచిన దారులు
ప్రేమ మ్రుదాత్ములు విల్చిన దారులు –తెరచిన దేవరో, తీసినదే వరో (కేదార గౌళ –ఆంద్ర ప్రభ -10-4-95 )
17- నండూరి కృష్ణ మాచార్య (పద్య శిల్పం )
‘’యతి ప్రాస లేని సూక్తులు గొంగళి పురుగులు –యతి ప్రాసలున్న సామెతలు సీతాకోక చిలుకలు ‘’
. సేకరణ –మీ గబ్బిత దుర్గా ప్రసాద్ –29-3-13-ఉయ్యూరు

