అవీ ఇవీ అన్నీ -2
మండేకాలం –ఎండాకాలం –కవితలు
1-నారాయణ బాబు
‘’ఎండాకాలం ఎండా కాలం –పగళ్ళు నెగళ్లు
మండే రోడ్డు –పన్నెండు గంటలు
2-‘’ప్రకృతి పెట్టిన వేసవి గాన పాఠశాల –
తుమ్మెద తుంబుర శ్రుతి –కోయిల ఒజ్జ’’
3-దాశరధి
‘’నాల్క కింత తడిలేకున్నా –నయనాలకు తడి తగిలించిన
క్షణ క్షణ విజ్రుం భిత తృష్ణ –ఈ మృగ తృష్ణ
4 –నామాడి శ్రీధర్
‘’ఇరుకు గదిలో పసి పిల్ల ఎడతెగని ఏడుపుకి –
ఆరుబయట చెమర్చిన తార్రోడ్డు ‘’
5-తిలక్
‘’కాలం కదలదు –గుహలో పులి పంజా విప్పదు
గాలం తగలదు –చెట్ల నీడ ఆవులు మోరలు దింపవు
నల్లపిల్లి బల్లిని చంపదు ‘’
6-తిలక్
‘’గది అవతల స్టెయిన్ లెస్ స్టీల్ రేకులా ఎండ
చెట్టు మొదలు దాహం తో నోరు తెరచిన తొండ
విరహం లా వేడి గాడ్పు వీస్తోంది
విచిత్రం గా మనసు భ్రమిస్తోంది
7- రంది సోమరాజు
‘’సేప్పుల్లెకుండా రోడ్డేసే ఒల్ని సూసి
తారుతో కరిగి డబ్బా లోంచి సుక్కలు సుక్కలుగా ఏడ్చింది ఎండ ‘’
8—కొలిమి కాడ తిత్తూదే కుర్రోడుసొమ్మసిలి పోనాడు
‘’ అమ్మ ‘’అని కూడా అనలేదు ‘’
9-ఇసుక తిప్పలతో బయట పడ్డ గోదారి
ఎత్తాంటోళ్ళ కైనా తిప్పలు తప్పవన్నట్లుంది ‘’
9-హస్తరేఖాల ను బట్టి జాతకం చెప్పటాన్ని ‘’సముద్రుడు ‘’అనే అయన రాశాడు .అప్పటి నుంచి దానికి ‘’హస్త సాముద్రికం ‘’అనే పేరోచ్చిందిట .
10 -రామ లక్ష్మణుల లక్షణాలు
‘’రామో విళ దంతత్వం –లక్ష్మణే సాద కింకిణీ
సీతాయాం భిన్న రోమాని –తస్మాత్ దుఖ సాహిష్ణుతా ‘’
శ్రీరాముని దంతాలు ఎడం గా ఉండటం వల్ల వనవాసం చేయాల్సి వచ్చింది .లక్ష్మణుని మెటికలు ‘’టకీ ‘’మని శబ్దం రావటం వల్ల అరణ్య వాసం చేయాల్సి వచ్చింది .సీత కు భిన్న రోమాలు ఉండటం వల్ల దుఖాలు ఎక్కువగా అనుభవించాల్సి వచ్చిందని ఒక జ్యోతిష్యుడు చెప్పాడట
11—చదవటానికి ఒక గొప్ప టెక్నిక్ ఉందట అదే -‘’murder technique ‘’.కంగారు పడకండి
M—MOOD (చదవాలి అనే స్తితికి రావటం)
U –understanding (చదివి అర్ధం చేసుకోవటం )
R-RE-READING (మళ్ళీ చదవటం )
D –DETECT –(తెలియనిది తెలుసుకోవటం )
E—EFFECTIVE (చివరి సారి చదవటం )
R—review (మననం చేసుకోవటం )
సేకరణ –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –30-3-13-ఉయ్యూరు

