అవీ ఇవీ అన్నీ -3
1-ఆదిత్య మండలం లో ప్రకాశించే మహిమాన్విత మైన కాంతులే ‘’వేద రుక్కులు .‘’సంధ్యా సమయం లో విరాజిల్లే ప్రభలు ‘’సామ వేద సంహితలు’’ .చండ మార్తాండ మండలం లో మనోహరం గా ప్రవహించేసత్యమైన ఆత్మయే యజుర్వేదం .ఆత్మ కారకుడు ఆదిత్యుడు .ఆరోగ్య ప్రదాత .,అన్నదాత .అని ‘’అరుణం ‘’చెబుతోంది .
2-బ్రహ్మ లోకం లో నాలుగు నక్షత్రాలు చతురస్రం ఆకాశం లో ఉన్నాయి .వాటి కింద ‘’నిబుళ ‘’అనే మేఘం వర్తులాకారం గా తిరుగుతుంది .ఇది వీణా కారం గా ఉంటుంది .ఇదే ‘’శారద ‘’కు ప్రతీక .బ్రహ్మాండం లోని నక్షత్ర మండలం నుంచి ధ్వనులు ఉత్పత్తి అవుతాయి .అవే వేదాలకు ఆధారం .అందుకే వేదాలు అపౌరుషేయాలు .
3-యూరప్ లోని ‘’లార్దేస్ తటాకం ‘’ఒక పవిత్రమైన రోజున స్నానం చేస్తే అన్ని వ్యాధులు నయం చేస్తుంది .’’man the unknown ‘’అనే పుస్తకం రాసిన dr.Elixis carcell అనే నోబెల్ ప్రైజ్ విన్నర్ దీని పై పరిశోధన చేసి డాక్టర్ల బృందం తో వెళ్లి స్నానం చేసిన తర్వాతా ,చెయ్యక ముందు పరీక్షలు చేయించాడు .శారీరక ,మానసిక రోగాలన్నీ తగ్గి పోయి నట్లు వారందరూ నిర్ధారించారు .శరీరం లో ఆర్గానిక్ మార్పులు కూడా గమనించాడు .’’నా కళ్ళ ముందు ప్రత్యక్షం గా కన్పిస్తున్న రుజువు ను నేను ఎలా కాదన గలను ‘’?అన్నాడు ఆయన .
4-19 వ శతాబ్దం చివర భారత దేశం సందర్శించిన ‘’మార్క్ ట్వేన్ ‘’అనే ప్రఖ్యాత అమెరికన్ నవలా కారుడు ,అమెరికా అస్తిత్వాన్ని నిరూపించిన దార్శనికుడు భారత దేశాన్ని సందర్శించాడు .ఇక్కడి మన పవిత్ర గంగా జలం గురించి అద్భుతం గా వర్ణించాడు అతని ‘’more tramps abroad ‘’అనే పుస్తకం లో ఇలా రాశాడు ‘’కలరా బెనారస్ లో సంభవించినా ,చుట్టుపక్కల ప్రదేశాలలో వ్యాపించలేదు .ఆగ్రా లోని గవర్న మెంట్ డాక్టర్ ‘’హానికన్ ‘’గంగ నీటిని పరీక్షించాడు .నదిలోకి మురికి గొట్టాల ద్వారా వచ్చే నీరు కలిసిన చోట పరీక్ష చేశాడు .అందులో లక్షలాది క్రిములున్నాయి .ఆరు గంటల తర్వాత పరీక్షిస్తే అవన్నీ చచ్చి పోయి ఉన్నాయి .నదిలో శవం ఉన్న చోట కూడా నీటిని పరీక్షించాడు .అక్కడా అదే ఫలితం .బావులలోని నీటిని ,పరీక్షించాడు కలరా క్రిములు విపరీతం గా వృద్ధి చెందాయి .కనుక గంగ లో ఎంత కలుషితం వచ్చి కలిసినా కొద్ది కాలం లో యదా స్తితికి వచ్చే గుణం గంగ నీటికి ఉంది .ఈ విషయాన్ని తరతరాలుగా హిందువులు నమ్ముతున్నారు .క్రిమి శాస్త్రం అంత ప్రాచీన కాలం లో కూడా వారికి ఎలా తెలిసిందో ఆశ్చర్యం గా ఉంది .మన పశ్చిమ దేశస్తులు ఆటవిక పధ్ధతి నుంచి బయట పడటానికి చాలా ముందే హిందువులకు మహోన్నత నాగరకత ఉందని స్పస్టం అవుతోంది . ‘’అని రాశాడు మహానుభావుడు మార్క్ ట్వైన్. .గంగా జలాలకు క్రిమి సంహారక స్వభావం ,తనను తాను శుభ్ర పరచుకొనే గుణం ఉన్నట్లు ప్రపంచం లో ఏ నదికీ లేదు
నీలం రాజు లక్ష్మీ ప్రసాద్ –ఆంద్ర ప్రభ -22-3-95
5-బ్రహ్మర్షి రఘుపతి వెంకట రత్నం నాయుడు గారి గురించి శిష్యులు కృష్ణ శాస్త్రి
‘’ఈ జడ జీవితమ్ము పలికించితి నే యమ పంక మందు నం
భోజము మొల్వ జేసితివి అపూర్వము నీదయ ఈ నిశీధి ,నీ
రాజన మెత్తినావు ,విపులమ్మగు నీఎద నిండెనే ,శర
ద్రాజిత చంద్ర కాన్తులంచు తమ్ములు స్వర్గ లతాంత వాసనల్ ‘’
6-పానుగంటి లక్ష్మీ నరసింహా రావు గారు పిఠాపురం రాజా వారి పై చెప్పినతమాషా పద్యం
‘’స్వజనుల నేరీతి బరిపాలన మొనర్తు –నాశ్రితుల నెవ్వాని నాచరింతు
వాదాయమున నెంత యర్దుల కిచ్చెద –వేదేటు చేసిన భ్రుత్యు నెద గణింతు
నవని పాలన నేది యార్జించి నాడవు –కవిత గానంబు నే పగిది విందు
వేట్లుగా బృధుసౌఖ్య మీక్షిం పగా నుంటి –వాత్మ సంస్తుతుల కే మందువయ్య
సరిగ ,ధని ,సగమ ,పనిని ,సరిగ ,గరిమ –మరి మరిగ ,పాపనిగని ,సరి సరి యని
వీణ కాని ‘’మా ‘’వెన్క ‘’నీ’’వీణ వరుస—మీద !’’నీ’’ వెన్క’’మా ‘’సూర్య మేదినీశ .’’
సేకరణ –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-3-13- ఉయ్యూరు

